...

Whatsapp Latest Features-2024 | ఇకపై వాట్సాప్‌లో బ్లూటూత్ ఫీచర్.. ఎలాంటి ఫైల్స్ అయినా వేగంగా షేర్ చేసుకోవచ్చు!!!

Written by lsrupdates.com

Published on:

Whatsapp Latest Features-2024 | ఇకపై వాట్సాప్‌లో బ్లూటూత్ ఫీచర్.. ఎలాంటి ఫైల్స్ అయినా వేగంగా షేర్ చేసుకోవచ్చు!!!

Whatsapp Latest Features-2024: వాట్సాప్ తమ యూజర్ల కోసం మరికొన్ని ప్రత్యేక ఫీచర్లను తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా మీ ఫోన్ నుంచి ఫైల్స్‌ను అత్యంత వేగంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఇంకా ఏయే ఫీచర్లు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…

Whatsapp latest features మెటా ఆధ్వర్యంలోని ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో తీసుకురానున్న కొత్త ఫీచర్‌తో మీ ఫోన్‌లో ఉండే ఫైల్స్‌ను ఇతర డివైజ్‌లోకి తక్షణమే సెండ్ చేయొచ్చు. మెసెజింగ్ యాప్ బ్లూటూత్ సహాయంతో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు వాట్సాప్‌లో పెద్ద ఫైల్స్ ట్రాన్స్ ఫర్ చేసుకోవడంలో అన్ని ఇబ్బందులను అధిగమించొచ్చు. మీ చుట్టూ ఉన్న వారి డివైజ్‌లోకి పెద్ద ఫైల్స్‌ను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అంతేకాదు ఆండ్రాయిడ్ యూజర్ల డేటా కూడా పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. దీనికి సంబంధించి Wabetainfo ఇటీవలే ఆ ఫీచర్ గురించి వివరించింది.

https://x.com/WABetaInfo/status/1749227934840201218?s=20

Whatsapp Latest Features-2024 | ఇకపై వాట్సాప్‌లో బ్లూటూత్ ఫీచర్.. ఎలాంటి ఫైల్స్ అయినా వేగంగా షేర్ చేసుకోవచ్చు!!!
Whatsapp Latest Features-2024 | ఇకపై వాట్సాప్‌లో బ్లూటూత్ ఫీచర్.. ఎలాంటి ఫైల్స్ అయినా వేగంగా షేర్ చేసుకోవచ్చు!!!

వాట్సాప్‌లో కొత్త ఫీచర్..

టెక్ రిపోర్ట్ ప్రకారం, ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు సమీపంలోని ఇతర వాట్సాప్ యూజర్లకు ఫైల్స్‌ను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. దీని కోసం యాప్‌కి ‘people nearby’ అనే ఆప్షన్ కనిపించనుంది.

బ్లూటూత్ ఆన్ చేయడం ద్వారా మీరు సమీపంలోని వాట్సాప్ యూజర్లకు ఫైల్స్ ను సులభంగా పంపొచ్చు. అయితే మీరు పండానికి ముందు అవతలి వైపు వ్యక్తి మీకు యాక్సెస్ ఇవ్వాలి. అప్పుడు ఫైల్ FTPకి బదిలీ చేయబడుతుంది. ఈ ఫీచర్ పూర్తిగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది. అంటే, యూజర్లు సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకునేలా ఈ ఫీచర్ పని చేస్తుంది.

ప్రస్తుతానికి టెస్టింగ్ స్టేజీలో..

Apple AirDrop, Android Nearby షేర్ ఫీచర్ people nearbyలాగా పని చేస్తుంది. అయితే ప్రస్తుతం ఇంకా ఈ ఈచర్ అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతానికి ఇది టెస్టింగ్ స్టేజీలో ఉంది. ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలుసుకోవడానికి మీ వాట్సాప్ యాప్‌ని అప్‌డేట్ చేయండి.

ఇలా ఎలా పని చేస్తుందంటే..

ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకునే వారు ముందుగా సెండర్, రిసీవర్ ఇద్దరూ ఈ ఫీచర్ ఆన్ చేసి ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ ఫీచర్ పని చేస్తుంది. షేర్ చేయడానికి ఫైల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిసీవర్‌కి రిక్వస్ట్ పంపి యాక్సెప్ట్ చేస్తే చాలు ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ ప్రారంభమవుతాయి.

అలా మీకెప్పుడు కావాలంటే అప్పుడు మీ ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఈ ఫీచర్ ద్వారా మీరు ఒకేసారి 2GB డేటా ఫైల్స్‌ను పంపొచ్చు. అంతేకాదు వీటితో పాటు మరికొన్ని ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి. అవి కూడా త్వరలో యూజర్లందరికీ అందుబాటులోకి రానున్నాయి.

Whatsapp Latest Features-2024 | ఇకపై వాట్సాప్‌లో బ్లూటూత్ ఫీచర్.. ఎలాంటి ఫైల్స్ అయినా వేగంగా షేర్ చేసుకోవచ్చు!!!
                     WhatsApp Latest Features-2024

గత కొన్ని నెలలుగా వాట్సాప్‌లో అనేక కొత్త ఫీచర్లు వచ్చాయి. అయితే ఈ ఏడాది 2024లో ఫైల్ ట్రాన్స్‌‌ఫర్ అనే కొత్త ఫీచర్‌తో ప్రారంభం కానుంది. ఇది టెస్టింగ్ స్టేజీ పూర్తయిన వెంటనే యూజర్ల ఫోన్లకు అందుబాటులోకి రానుంది.

Also Read: History of Ayodhya ram mandir in Telugu-2024| తెలియని కొన్ని (lsrupdates.com)

Loksabha Polls on April 16th-2024 | ఏప్రిల్ 16 వ తేదీన (lsrupdates.com)

Zee Entertainment share price down 30 Percentage after Sony? (lsrupdates.com)

Ayodhya Ram Mandir Pics-2024

Brisk Technovision IPO Details Date, Price, Allotment, GMP- 2024

Features of Ayodhya Ram Mandir-Telugu: 392 పిల్లర్లు, 5 మండపాలు, 44 తలుపులు.. అయోధ్య రామ మందిరం విశేషాలు ఇవే!

6 thoughts on “Whatsapp Latest Features-2024 | ఇకపై వాట్సాప్‌లో బ్లూటూత్ ఫీచర్.. ఎలాంటి ఫైల్స్ అయినా వేగంగా షేర్ చేసుకోవచ్చు!!!”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.