Using Artificial Intelligence in Sammakka Sarakka Medaram Jatara-2024 | సమ్మక్క సారక్క మేడారం జాతరలో కృత్రిమ మేధ..!

Written by lsrupdates.com

Published on:

Using Artificial intelligence in sammakka sarakka medaram jatara-2024 | సమ్మక్క సారక్క మేడారం జాతరలో కృత్రిమ మేధ..!

Using Artificial Intelligence in Sammakka Sarakka Medaram Jatara-2024: వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చేవారికి సకల సౌకర్యాలు కల్పించేందుకు జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. జాతరలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మెరుగైన సేవలందించేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోంది.

జయశంకర్ భూపాలపల్లి: వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చేవారికి సకల సౌకర్యాలు కల్పించేందుకు జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. జాతరలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మెరుగైన సేవలందించేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోంది. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను వినియోగించనున్నారు. సాంకేతికతో సమయం వృథా కాకుండా, ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు.

రద్దీ నియంత్రణ..

రద్దీ నియంత్రణకు కృత్రిమ మేధను ఉపయోగించనున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ న్ను కెమెరాల్లో ఇన్స్టాలేషన్ చేసి అమర్చుతారు. వాటిని కంట్రోల్రూము అనుసంధానం చేస్తారు. చదరపు మీటరులో నలుగురు కంటే ఎక్కువగా ఉంటే కంట్రోల్రూంకు సమాచారం వస్తుంది. వెంటనే కంట్రోల్ రూమ్ నుంచి సిబ్బందిని అప్రమత్తం చేసి అక్కడ రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకుంటారు.

Using Artificial intelligence in sammakka sarakka medaram jatara-2024 | సమ్మక్క సారక్క మేడారం జాతరలో కృత్రిమ మేధ..!
Using Artificial intelligence in sammakka sarakka medaram jatara-2024 | సమ్మక్క సారక్క మేడారం జాతరలో కృత్రిమ మేధ..!

అలాగే క్రౌడ్ కౌంటింగ్ కెమెరాలు అమర్చి ఎంతమంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. జాతరకు వచ్చే వాహనాల సంఖ్యను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా అటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్(ఏఎన్పీఆర్) కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. పార్కింగ్ ప్రదేశాల్లో వీటిని అమర్చుతారు.

మూడో కన్నుతో నిఘా..

పోలీసు శాఖ ఆధ్వర్యంలో ములుగు పట్టణ శివారు గట్టమ్మ ఆలయం నుంచి పస్రా మీదుగా మేడారం వరకు.. జాతర పరిసరాలు, ప్రధాన కూడళ్లు, గద్దెల ప్రాంగణం, రద్దీ ప్రదేశాలు, పార్కింగ్ స్థలాల్లో మొత్తం 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 24 గంటలు వీటిద్వారా పర్యవేక్షించేందుకు మేడారంలో కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. జాతర పరిసరాల్లో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ట్రాఫిక్, దొంగతనాలు, ఘర్షణలు. ప్రమాదాలు ఏం జరిగినా వెంటనే తక్షణ చర్యలు చేపట్టవచ్చు.

డ్రోన్ కెమెరాలు..

గగనతలం నుంచి జాతర పరిస్థితులను అంచనా వేసేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగించనున్నారు. ఇప్పటికే 5 డ్రోన్లను అందుబాటులోకి తెచ్చారు. వాటిని ప్రత్యేక సిబ్బందితో జాతరలో ఎగురవేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.

ఎల్ఈడి తెరలపై ప్రత్యక్ష ప్రసారం

మేడారం జాతర వివరాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. భారీ ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేసి జాతర విశేషాలను ప్రసారం చేస్తారు. జాతర సమయంలో విపరీతమైన రద్దీతో చిన్నపిల్లలు. వృద్ధులు తప్పిపోతుంటారు. అలా తప్పిపోయిన వారి ఫొటోలను కూడా ప్రసారం చేస్తారు. భక్తుల కోసం జాతర పరిసరాల్లో 33 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు. 1400 ఎకరాల్లో ఇవి విస్తరించి ఉంటాయి. దాదాపు 5 లక్షల వరకు వాహనాలు వస్తాయని అంచనా. ఈసారి ఆర్టీసీ 6 వేల బస్సులను నడపాలని నిర్ణయించింది. 70 ఎకరాల్లో ప్రత్యేక ప్రయాణ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు.

ప్రత్యేక గైడ్ యాప్..

మేడారం జాతర గైడ్ యాప్ను కూడా అందుబాటులోకి తేనున్నారు. జాతరకు సంబంధించిన వివరాలు పార్కింగ్ స్థలాలు, మరుగుదొడ్లు, తాగునీరు, వైద్య శిబిరాలు, స్నానఘట్టాలు, ఆర్టీసీ బస్టాండు, వసతులు ఎక్కడెక్కడ ఉన్నాయి? అక్కడికి ఎలా చేరుకోవాలి? రూట్ వివరాలు, హెల్ప్ లైన్, ట్రాపిక్, తదితర సమాచారం ఉంటుంది. త్వరలోనే ఈ యాప్ను విడుదల చేయనున్నారు. జాతర విజయవంతానికి సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో దోహదపడనుంది.

గత జాతరలో 18 లక్షల మందిని మేడారానికి చేరవేసిన ఆర్టీసీ ఈసారి మహాలక్ష్మి పథకాన్ని దృష్టిలో పెట్టుకుని 40 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తోంది.

Using Artificial intelligence in sammakka sarakka medaram jatara-2024 | సమ్మక్క సారక్క మేడారం జాతరలో కృత్రిమ మేధ..!
Using Artificial intelligence in sammakka sarakka medaram jatara-2024 | సమ్మక్క సారక్క మేడారం జాతరలో కృత్రిమ మేధ..!

మేడారం మహా జాతరకు లక్షలాది మందిని తరలించే ఆర్టీసీ పాత్ర ఈసారి మరింత కీలకంగా మారింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మేడారం వచ్చి పరిశీలించారు. ఈ నెల 16న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తోపాటు, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు మేడారంలో బస్టాండును ప్రారంభించనున్నారు. ఆ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లకు ఆర్టీసీ జోనల్ స్టాఫ్ శిక్షణ కళాశాలలో విడతల వారీగా నిపుణులతో శిక్షణ ఇస్తున్నారు.

50 ఎకరాల్లో బస్టాండు

  • మేడారంలో మొత్తం 50 ఎకరాల స్థలంలో 20 ఎకరాల్లో తాత్కాలిక బస్టాండును నిర్మిస్తున్నారు. మరో 20 ఎకరాలు పార్కింగ్ స్థలం కోసం ఉంచారు.
  • మొత్తం 14 వేల మంది సిబ్బంది జాతరలో సేవలు అందించనున్నారు. 760 విశ్రాంతి గదులు, పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ గది ఏర్పాటు చేస్తున్నారు.
  • ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే తాడ్వాయి వద్ద మరో ఆరు ఎకరాలు తీసుకున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండి స్థలం సరిపోకపోతే కామారం ప్రాంతంలో మరో 15 ఎకరాలు సిద్ధంగా ఉంచారు.
  • మేడారం ప్రయాణ ప్రాంగణంలో 47 క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు.
  • నర్సంపేటలో నేటి నుంచి అందుబాటులోకి…
  • నర్సంపేట: ముందస్తు మొక్కుల కోసం వెళ్లే భక్తుల కోసం బుధవారం నుంచి బస్సు సర్వీసు నడపనున్నట్లు ఆర్టీసీ డీఎం ప్రసూనలక్ష్మి తెలిపారు. మేడారం బస్టాండ్లో ఏర్పాటు చేసిన క్యూ లైన్లు.

Also Read:

Devotees Can Offer Jaggery To The Medaram Sammakka Saralamma Jatara Through Online-2024 | మేడారం భక్తులకు గుడ్ న్యూస్

Using Artificial Intelligence in Sammakka Sarakka Medaram Jatara-2024

‘మహాలక్ష్మి’ రాకతో..

గతంలో 4 వేల బస్సులను వినియోగించారు. ప్రస్తుతం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండటంతో.. ఈసారి 6 వేల బస్సులు నడపాలని సంస్థ నిర్ణయించింది ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ రీజియన్లలో 51 బస్ పాయింట్లను సిద్ధం చేశారు. మహారాష్ట్ర సిరోంచ నుంచి కూడా బస్సులను నడిపిస్తున్నారు. ఛత్తీస్ గఢ్ నుంచి అంతర్రాష్ట్ర సర్వీసులను నడపనున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి ఏసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. వీటిలో ఆన్లైన్ రిజర్వేషన్ సదుపాయం కల్పించడం లేదు.

సీసీ కెమెరాలు, అంతర్రాష్ట్ర సర్వీసులు

బస్టాండు ప్రాంగణం, పార్కింగ్ ప్రదేశాల్లో మొత్తం 70 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. మరో 10 పీటీజెడ్ కెమెరాలు ఉంటాయి. ప్రాంగణం మొత్తం 5 డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తారు. 90 వైర్ లెస్ సెట్లు అందుబాటులో ఉంచారు. బస్సులు మొరాయిస్తే వెంటనే మరమ్మతులు చేయడానికి మేడారం, తాడ్వాయి, పస్రా, గట్టమ్మ వద్ద స్టేషనరీ క్యాంపులు అందుబాటులో ఉంచారు. అక్కడే మెకానిక్ లు ఉండి తమ సేవలను అందిస్తారు. 15 మొబైల్ బృందాలు ఉంటాయి. తాడ్వాయి నుంచి మేడారం వరకు ఇద్దరు మెకానిక్లు నిత్యం ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ బస్సులు కండిషన్లను పరిశీలిస్తారు. బస్సులు మధ్యలో ఆగిపోతే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాటిని పక్కకు నెట్టడానికి రెండు క్రేన్లు, 25 ట్రాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ జె శ్రీలత తెలిపారు.

Using Artificial Intelligence in Sammakka Sarakka Medaram Jatara-2024

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

TS Congress Government Announced That Krishna Projects Not Handed Over To KRMB-2024 | జలదోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి: అసెంబ్లీలో ఉత్తమ్ పీపీటీ

As per Minister Komatireddy That Regional Ring Road Will Be A Super Game Changer For Telangana-2024 ?

Using Artificial Intelligence in Sammakka Sarakka Medaram Jatara-2024 #Using Artificial Intelligence in Sammakka Sarakka Medaram Jatara-2024

3 thoughts on “Using Artificial Intelligence in Sammakka Sarakka Medaram Jatara-2024 | సమ్మక్క సారక్క మేడారం జాతరలో కృత్రిమ మేధ..!”

Leave a Comment