Union Budget 2024 Live Updates: బడ్జెట్ 2024 ప్రధానాంశాలు
Union budget 2024 Live Updates: 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్ ను (Union budget 2024) ప్రవేశపెట్టారు.
తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రూ.5,071 కోట్లు: రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్
- తెలంగాణలో 100శాతం విద్యుదీకరణ పూర్తయింది.
- రాష్ట్రంలో రైల్వేపై పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి.
- ఖాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీకి పీఎం శంకుస్థాపన చేశారు.
- ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి.
విశాఖ రైల్వేజోన్కు ఏపీ ప్రభుత్వం భూమి అప్పగించలేదు: అశ్వినీ వైష్ణవ్
- విశాఖ రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాం.
- ఇంకా ఏపీ ప్రభుత్వం నుంచి ఇంకా భూమి అప్పగించలేదు.
- రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు భూమి ఇస్తే.. అప్పుడు పనులు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం.
- జోన్ ఏర్పాటు కోసం డీఎపీఆర్ సిద్ధమైంది.
ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9138 కోట్లు: రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
- 2009 నుంచి 2014 వరకు రూ.886 కోట్లు కేటాయించారు.
- ప్రస్తుత బడ్జెట్లో ఆంధ్రప్రదేశకు రూ.9138 కోట్లు కేటాయించారు.
- ఇది 10 శాతం రెట్టింపు.
- ఏడాదికి 240 కి.మీ ట్రాక్ పనులు జరుగుతున్నాయి.
- ఏపీలో 98 శాతం విద్యుద్దీకరణ పూర్తి అయింది.
ఇది సమ్మిళిత, సృజనాత్మక బడ్జెట్: మోదీ
- మధ్యంతర బడ్జెట్పై ప్రధాని మోదీ హర్షం.
- దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్నిచ్చిందన్న ప్రధాని.
- వికసిత్ భారత్కు మూల స్తంభాలైన పేదలు, యువత, మహిళలు, అన్నదాతల సాధికారతకు ఈ బడ్జెట్ కృషి చేస్తుంది.
- 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు ఈ బడ్జెట్ ఓ గ్యారెంటీ.
Market update: ఫ్లాట్గానే సూచీలు..
స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. తాత్కాలిక బడ్జెట్లో కీలక ప్రకటనలేవీ లేకపోవడంతో మార్కెట్లు పెద్దగా స్పందించలేదు. మధ్యాహ్నం 12.31 సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 8 పాయింట్ల లాభంతో 71,760 వద్ద, నిఫ్టీ 1 పాయింట్ లాభంతో 21,727 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్లో వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయింపులు
- గ్రామీణ ఉపాధి హామీ పథకం: రూ.86 వేల కోట్లు.
- ఆయుష్మాన్ భారత్: రూ.7,500 కోట్లు .
- పారిశ్రామిక ప్రోత్సాహకాలు: రూ.6,200 కోట్లు .
- సెమీ కండక్టర్స్, డిస్ప్లే ఎకో వ్యవస్థల తయారీ: రూ.6,903 కోట్లు.
- సోలార్ విద్యుత్ గ్రిడ్: రూ.8,500 కోట్లు.
- గ్రీన్ హైడ్రోజన్ మిషన్: రూ.600 కోట్లు.
కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా..
- రక్షణ: రూ 6.2 లక్షల కోట్లు.
- ఉపరితల రవాణా, జాతీయ రహదారులు: రూ.2.78 లక్షల కోట్లు.
- రైల్వే: రూ.2.55 లక్షల కోట్లు.
- వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ: రూ.2.13 లక్షల కోట్లు
- హోం శాఖకు రూ.2.03 లక్షల కోట్లు.
- గ్రామీణాభివృద్ధి: రూ. 1.77 లక్షల కోట్లు.
- రసాయనాలు, ఎరువులు: రూ.1.68 లక్షల కోట్లు.
- కమ్యూనికేషన్లు: రూ. 1.37 లక్షల కోట్లు.
- వ్యవసాయం, రైతు సంక్షేమం: రూ.1.27 లక్షల కోట్లు.
విమానయాన రంగంలో 2,3 తరగతి నగరాలకు కొత్త విమాన సర్వీసులు
- రైలు మార్గాల్లో హైట్రాఫిక్, హైడెన్సిటీ కారిడార్లలో నూతన మౌలిక సదుపాయాలు ఏర్పాటు.
- రైలు బోగీలన్నింటినీ వందే భారత్ ప్రమాణాలతో మార్పు.
- మన విమానయాన సంస్థలు.. వెయ్యి విమానాలకు పైగా ఆర్డర్ చేశాయి.
రక్షణ రంగంలో స్వయం సమృద్ధి కోసం కొత్త మిషన్
- జైవిజ్ఞాన్, జైకిసాన్, జైఅనుంధాన్ అన్నది ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
- కొత్త పరిజ్ఞానం, మార్కెట్ వ్యవస్థ అనుసంధానంతో సాగు రంగాలకు కొత్త ఆదాయ మార్గాలు
- సమీకృత సాంకేతిక అభివృద్ధి దిశగా రక్షణ రంగానికి ఊతం
సాగు ఉత్పత్తుల కోసం గిడ్డంగులు, ప్రాసెసింగ్ కోసం ఆర్థిక సాయం
- నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కోసం కొత్త పథకం
- పాడి అభివృద్ధి కోసం రైతులకు ఆర్థిక సాయం
- రాష్ట్రీయ డెయిరీ ప్రాసెసింగ్ గోకుల మిషన్ ద్వారా ఆర్థికసాయం
- పన్ను రేట్ల హేతుబద్ధతతో పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గించాం.
ఫేస్స్ విధానంతో పారదర్శకత, సత్వర రిటర్న్ చెల్లింపులు
- సరాసరి నెలవారీ జీఎస్టీ ఆదాయం రూ.1.66కోట్లకు చేరింది.
- జీఎస్టీ ముందున్న విధానం కన్నా ప్రస్తుత ఆదాయం రెట్టింపు
- అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త సంస్కరణలు
- జల, వాయు మార్గాల్లో కొత్త కంటెయినిరిటీ పోల్ ఏర్పాటు చేస్తున్నాం
- వికసిత భారత్ కోసం రాష్ట్రాలకు 50ఏళ్ల వ్యవధితో రూ.75వేల కోట్ల రుణాలు
- సాగు ఉత్పత్తుల విలువ జోడింపుతో రైతులకు అధిక ఆదాయం సమకూర్చే పథకాలు
ముగిసిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం
2024-25 సంవత్సరానికిగానూ ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాదాపు గంట పాటు ఆమె ప్రసంగం సాగింది.
ఎఫ్ఐ అంటే ఫస్ట్ డెవలప్ ఇండియా
- ఎఫ్ఐ పెట్టుబడులు పెరిగాయి. విదేశీ పెట్టుబడులకు ఇది స్వర్ణయుగం.
- పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో రాష్ట్రాలకు తోడ్పాటు అందిస్తాం.
- సంస్కరణలు అమలుకు రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు రూ.75వేల కోట్ల వడ్డీలేని రుణాలు .
ఆదాయపన్ను వర్గాలకు లభించని ఊరట
- త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో ఆదాయ పన్ను వర్గాలకు ఊరట కల్పించేలా ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ నిర్ణయం తీసుకుంటారని భావించిన వారికి నిరాశే ఎదురైంది.
- గతేడాది ప్రతిపాదించిన కొత్త పన్ను విధానాన్నే ఈసారీ కొనసాగించారు. రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్ను భారం లేకుండా రిబేటు ఉంటుందని తెలిపారు.
- ఇందుకు ఎలాంటి పొదుపు, పెట్టుబడులతో పని ఉండదు. అంతకుమించి ఆదాయం కలిగిన వారికి శ్లాబుల ప్రకారం పన్ను వర్తిస్తుంది.
- పలు సెక్షన్ల కింద మినహాయింపులను అనుమతించే పాత పన్నుల విధానంలో మాత్రం ఎలాంటి మార్పులనూ ప్రతిపాదించలేదు.
- పలు సెక్షన్ల కింద మినహాయింపులను అనుమతించే పాత పన్నుల విధానంలో మాత్రం ఎలాంటి మార్పులనూ ప్రతిపాదించలేదు.
- కొత్త పన్ను విధానంలో మినహాయింపును రూ.3 లక్షలకు పెంచగా, ఈసారి దాన్నే కొనసాగించారు. పాత పన్ను విధానంలో ఆదాయ పరిమితి రూ.2,50,000 గానే ఉంటుంది.
- పాత పన్ను విధానంలోనూ పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్నప్పుడు ఎలాంటి భారం ఉండదు.
పిల్లల ఆరోగ్యం కోసం ఇంద్రధనుస్సు కార్యక్రమం
- భారత్ నుంచి మధ్య ప్రాచ్యం మీదుగా యూరప్ నకు ప్రత్యేక కారికాడర్
- మౌలిక వసతుల రంగానికి రూ.11.11 లక్షల కోట్లు కేటాయింపు
దేశ తూర్పు ప్రాంతాన్ని నూతన అభివృద్ధి రథంగా మారుస్తున్నాం
- డెమోగ్రఫీ, డెమోక్రసీ, డైవర్సిటీ మూల సూత్రాలుగా భారత్ ముందడుగు వేస్తోంది.
- 2047 నాటికి ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నాం.
- అవకాశాల సృష్టితో ఆకాశమే హద్దుగా భారత్ ముందడుగు వేస్తోంది.
- కొత్త ప్రపంచంతో అనుసంధానమవుతూ భారత్ దిక్సూచిగా నిలబడుతోంది.
- విద్యుత్ బిల్లుల నుంచి విముక్తికి కొత్త సోలార్ పథకం ప్రకటించాం.
దేశంలో కొత్తగా ఐదు సమీకృత ఆక్వా పార్కులు
- పాడి రైతుల ప్రోత్సాహానికి ప్రత్యేక సమగ్ర కార్యక్రమం.
- నానో యూరియా తర్వాత పంటలకు నానో డీఏపీ కింద ఎరువులు అందిస్తాం.
- ఆయిల్ సీడ్స్ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తాం.
- స్వయం సహాయక బృందాల్లో కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారు.
- లక్ పతీ దీదీ టార్గెట్ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంచుతున్నాం.
- పరిశోధన, సృజనాత్మకతకు రూ. లక్షల కోట్ల నిధి ఏర్పాటు చేస్తాం.
- మౌలిక వసతుల రంగం 11.1శాతం వృద్ధితో రూ.11లక్షల 11 వేల 111 కోట్ల కేటాయింపు.
ఆశాలు, అంగన్వాడీలకు ఆయుష్మాన్ పథకం వర్తింపు
- 9-18 ఏళ్ల బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా చర్యలు.
- మరిన్ని మెడికల్ కాలేజీల కోసం కమిటీలు ఏర్పాటు చేస్తాం.
- మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం.
- జిల్లాలు, బ్లాక్ ల అభివృద్ధి కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నాం.
- రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్.
- బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంత ఇంటి కలను నిజం చేస్తాం.
- వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద 2కోట్ల ఇళ్ల నిర్మాణం.
జీడీపీకి ఈ ప్రభుత్వం కొత్త అర్థం చెప్పింది
- స్టార్టప్ ఇండియా ద్వారా యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేశాం.
- గ్రామీణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన ఇళ్లలో 70శాతం మహిళల పేరుపైనే ఇచ్చాం.
- జీడీపీ అంటే గవర్నెన్స్. డెవలప్మెంట్, పెర్ఫార్మెన్స్ అని కొత్త అర్థం ఇచ్చాం.
- ఈ పదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని సమతుల్యంగా ఉంచాం.
ప్రజల ఆదాయం 50శాతం పెరిగింది
- ప్రపంచదేశాలు ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.
- భారత్ మాత్రం వాటికి అతీతంగా అభివృద్ధి పథంలో పయనిస్తోంది.
- అన్ని రంగాల్లో ఆర్థికవృద్ధి కనబడుతోంది.
- ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధమని ప్రకటించాం.
యువతకు ముద్రా యోజనతో రూ.25లక్షల కోట్లు రుణాలుగా ఇచ్చాం.
- జీఎస్టి వంటి ట్యాక్స్ సంస్కరణలు ట్యాక్స్ పరిధిని పెంచాయి.
- క్రీడల్లో సాధించిన పతకాలు యువతలో ఆత్మ స్థైర్యాన్ని నింపుతున్నాయి.
- ఈ సారి క్రీడలు, యువజన శాఖకు రూ.3442 కోట్లు కేటాయింపు.
- మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించాం.
4.50 కోట్ల మందికి బీమా సౌకర్యం
- 11.8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించాం.
- వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతికతతో విలువ జోడించే విధానాలు తెచ్చాం.
- స్కిన్ఇండియా మిషన్తో కోటి 40 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించాం.
4 కోట్ల మంది రైతులకు ఫసల్ బీమా యోజన కింద పంట బీమా అందజేస్తున్నాం
- గత పదేళ్లలో 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్లు, 390 యూనివర్సిటీలు ఏర్పాటు చేశాం.
- 10 ఏళ్లలో ఉన్నత విద్య చదివే అమ్మాయిల సంఖ్య 28శాతం పెరిగింది.
పేదరికం నిర్మూలనకు బహుముఖీయ విధానాలతో ప్రభుత్వం పనిచేసింది
- పేదలకు జనధన్ ఖాతాల ద్వారా రూ.34లక్షల కోట్లు అందించింది.
- 78లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థికసాయం అందించాం.
- రూ.2.20లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలు అందించాం.
మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం నాలుగు వర్గాలకు ప్రాధాన్యమిచ్చింది
- పేదలు, మహిళలు, యువత, అన్నదాతలను శక్తిమంతం చేసింది.
- కుల, మత ఆర్థిక బేధాలు లేకుండా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నాం.
- 2047నాటికి అసమానత, పేదరికం కనబడకుండా చేయాలన్నదే లక్ష్యం.
- 047 నాటికి అభివృద్ధి చెందిన భారత్గా అవతరించేందుకు కృషి చేస్తున్నాం.
- అన్నదాతలకు కనీస మద్దతు ధరను దశల వారీగా పెంచాం.
- నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారు.
- ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యారు
- దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడింది.
- సమ్మిళిత. సంతులిత ఆర్థిక విధానాలతో చిట్టచివరి వ్యక్తికీ ప్రగతి ఫలాలు అందాయి.
- ఇంటింటికీ విద్యుత్, ఉపాధి, తాగునీరు సమ్మిళిత అభివృద్ధికి నినాదాలు.
- కునారిల్లుతున్న వ్యవసాయ రంగానికి మా ప్రభుత్వం కొత్త ఊపిరి ఊదింది.
- మద్దతు ధరలు, పెట్టుబడి రాయితీలతో రైతులకు ప్రయోజనాలు కల్పించాం.
పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఉచ్ఛస్థితికి చేరుకుంది: నిర్మలా సీతారామన్
- బ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం భారత ఆర్థిక మూలాలను పటిష్టం చేసింది.
- పదేళ్లలో మోదీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేశాయి.
- బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్ధిక వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ
- సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రవేశపెట్టారు.
- గురువారం ఉదయం 11 గంటలకు లోక్సభలో కేంద్ర పద్దును ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు.
- అంతకుముందు బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం
- కేంద్ర బడ్జెట్ 2024కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- మరికాసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
కేంద్ర బడ్జెట్.. ప్రారంభమైన కేబినెట్ భేటీ
- బడ్జెట్కు ముందు కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది.
- బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
బడ్జెట్ వేళ.. ఐదేళ్లలో నాలుగుసార్లు లాభాలే..
- గత ఐదేళ్లలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ నాలుగుసార్లు లాభాలతో ముగిసింది
- ఒక్క 2020లో మాత్రమే 2.42 శాతం నష్టపోయింది.
- 2023, 2022, 2021, 2019లో సానుకూలంగా ముగిసింది.
రాష్ట్రపతిని కలిసి.. పార్లమెంట్కు చేరుకున్న నిర్మలమ్మ
- బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి భవన్కు వెళ్లిన ఆర్థిక మంత్రి నిర్మలమ్మ.
- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకున్న ఆర్థిక మంత్రి.
- రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్కు చేరుకున్న సీతారామన్.
కేంద్ర బడ్జెట్ను ఇక్కడ చూడొచ్చు..
- బడ్జెట్ను డిజిటల్ రూపంలో అందుబాటులోకి తెచ్చిన కేంద్రం.
- ఆర్థిక మంత్రి ప్రసంగం తర్వాత.. యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ లో బడ్జెట్ పూర్తి కాపీని చూడొచ్చు.
- www. indiabudget gov. in పోర్టల్లోను లభిస్తుంది.
తెలంగాణకు నిధుల కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు
- కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసిన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
- రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులపై వినతిపత్రం అందజేత.
- వీటిలో కొన్నింటికి గత బడ్జెట్లో కేంద్రం నిధులేమీ కేటాయించనందున కొత్త బడ్జెట్లోనైనా చోటు దక్కుతుందా అని రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూపులు.
పార్లమెంట్కు చేరుకున్న బడ్జెట్ ప్రతులు
- మరికాసేపట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
- సభ్యులకు అందజేసేందుకు పార్లమెంట్కు చేరుకున్న బడ్జెట్ ప్రతులు.
బడ్జెట్ వేళ స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
- కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market).
- ఉదయం 9:17 గంటల సమయంలో 48 పాయింట్లు లాభపడి 71,800 వద్ద ట్రేడవుతున్న సెన్సెక్స్.
- 14 పాయింట్లు పెరిగి 21,739 దగ్గర కొనసాగుతోన్న నిఫ్టీ.
- డాలరుతో రూపాయి మారకం విలువ రూ.83.02 వద్ద ప్రారంభం.
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. రాష్ట్రపతి ఏం మాట్లాడారు?
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. నూతన భవనంలో ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. కొత్త పార్లమెంట్లో ఇదే తన తొలి ప్రసంగం అని తెలిపారు.
ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సీతారామన్..
మొరార్జీ దేశాయ్ తర్వాత ఈమే! భారత మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్ధికమంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పనున్నారు. ఇప్పటికే ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లు సమర్పించిన ఆమె.. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా ఐదు కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టింది వీరే..
బడ్జెట్లో ఇంటికి ఏ మేరకు దన్ను?
కేంద్ర బడ్జెట్ వస్తుందంటే గృహ కొనుగోలుదారుల దగ్గర్నుంచి.. నిర్మాణ రంగం వరకు ఎన్నో ఆశలు.. ఎన్నికల ఏడాది కావడంతో సర్కారు నుంచి గృహ నిర్మాణ రంగానికి భారీగా ప్రోత్సాహకాలు ఉంటాయని ఆశిస్తున్నారు. ఆదాయ పన్నులో రాయితీలు, జీఎస్ట తగ్గింపు, సరసమైన గృహాల విస్తీర్ణం పెంపు వంటి ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రికి కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) అందజేసింది. ఇంతకీ నిర్మాణ రంగం బడ్జెట్ నుంచి ఏం కోరుతోంది?
తాత్కాలిక బడ్జెట్పైనా ఆశలు ఇందుకే
బడ్జెట్లో ‘అద్భుత ప్రకటనలు’ ఉండకపోవచ్చంటూ ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని రోజుల ముందు కీలక ప్రకటన చేశారు. నిర్మలమ్మ చెప్పినట్లు సాధారణంగా తాత్కాలిక బడ్జెట్లో కొత్త పథకాలు, స్కీములు, పన్నుల్లో మార్పులు వంటివి పెద్దగా ఉండవు. ఎన్నికల అనంతరం కొలువుదీరే కొత్త ప్రభుత్వానిదే వాటి బాధ్యత. కానీ, ఈ సంప్రదాయానికి ఎప్పుడో తెరపడింది. ఎన్నికల ముందు వచ్చే తాత్కాలిక బడ్జెట్లోనూ కీలక ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. గత అనుభవాలు ఏం చెప్తున్నాయ్?
మధ్యంతర పద్దు మురిపిస్తుందా?
సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఊరిస్తున్నవేళ ఈ పద్దులో మోదీ సర్కారు జనాకర్షక నిర్ణయాలేవైనా ప్రకటిస్తుందా..? వాటి జోలికి వెళ్లకుండా మూలధన వ్యయం పెంపు ద్వారా ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకే ప్రాధాన్యమిస్తుందా..? లేదంటే సంక్షేమం, అభివృద్ధి అంశాల్లో సమతుల్యత పాటిస్తుందా?
నేడే కేంద్ర బడ్జెట్.. ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- నేడు ఉదయం 11 గంటలకు తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
- ఈసారీ డిజిటల్ రూపంలోనే బడ్జెట్ కాపీని అందుబాటులోకి తీసుకురానున్న కేంద్ర ఆర్థిక శాఖ.
- ఉదయం 9 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్కు వెళ్లనున్న నిర్మలా సీతారామన్ .
- ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకోనున్న కేంద్ర ఆర్థిక మంత్రి.
- ఉదయం 10 గంటలకు పార్లమెంటుకు చేరుకోనున్న నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, ఆర్థిక శాఖ ముఖ్య అధికారులు .
- బడ్జెట్ సమర్పణకు ముందు ఉదయం 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలో భేటీ కానున్న కేంద్ర కేబినెట్.
- మధ్యంతర బడ్జెట్కు ఆమోదం తెలపనున్న కేబినెట్.
- ఉదయం 11 గంటల నుంచి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్.
Union Budget 2024 Live Updates | బడ్జెట్ 2024 ప్రధానాంశాలు Union Budget 2024 Live Updates
Union Budget 2024 Live Updates | బడ్జెట్ 2024 ప్రధానాంశాలు Union Budget 2024 Live Updates
Union Budget 2024 Live Updates Union Budget 2024 Live Updates
Union Budget 2024 Live Updates Union Budget 2024 Live Updates
1 thought on “Union Budget 2024 Live Updates | బడ్జెట్ 2024 ప్రధానాంశాలు”