...

UBI Specialist Officer(SO) Recruitment 2024 Notification-దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇవే

Written by lsrupdates.com

Published on:

UBI Specialist Officer(SO) Recruitment 2024 Notification: యూనియన్ బ్యాంకులో 606 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు – దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇవే

UBI Specialist Officer(SO) Recruitment 2024 Notification: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (Specialist Officers) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 606 ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 3 నుంచి 23 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.

UBI Specialist Officer(SO) Recruitment 2024 Notification-ఖాళీల పూర్తి వివరాలు:

స్పెషలిస్ట్ ఆఫీసర్స్(Specialist Officers) పోస్టులు

ఖాళీల సంఖ్య: 606.

పోస్టుల కేటాయింపు: జనరల్ (యూఆర్)-253, ఈడబ్ల్యూఎస్-59, ఓబీసీ-161, ఎస్టీ-44, ఎస్సీ-89.

1) చీఫ్ మేనేజర్ (ఐటీ): 05 పోస్టులు

2) సీనియర్ మేనేజర్ (ఐటీ): 42 పోస్టులు

3) మేనేజర్ (ఐటీ): 04 పోస్టులు

4) మేనేజర్ (రిస్క్): 27 పోస్టులు

5) మేనేజర్ (క్రెడిట్): 371 పోస్టులు

6) మేనేజర్ (లా): 25 పోస్టులు

7) మేనేజర్ (ఇంటిగ్రేటెడ్ ట్రెజరీ ఆఫీసర్): 05 పోస్టులు

8) మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్): 19 పోస్టులు

9) అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజినీర్): 02 పోస్టులు

10) అసిస్టెంట్ మేనేజర్ (సివిల్ ఇంజినీర్): 02 పోస్టులు

11) అసిస్టెంట్ మేనేజర్ (ఆర్కిటెక్ట్): 01 పోస్టు 

12) అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్): 30 పోస్టులు

13) అసిస్టెంట్ మేనేజర్ (ఫోరెక్స్): 73 పోస్టులు

UBI Specialist Officer(SO) Recruitment 2024 Notification-దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇవే
                          UBI Specialist Officer(SO) Recruitment 2024 Notification-దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇవే

UBI Specialist Officer(SO) Recruitment 2024 Notification-విద్యార్హతలు:

  • చీఫ్ మేనేజర్(ఐటీ), సీనియర్ మేనేజర్(ఐటీ) & సీనియర్ మేనేజర్(రిస్క్/సీఏ:
    అభ్యర్థులు B.E/B.Tech / B.Sc / M.Tech. / M.Sc. / MCA పూర్తి చేసి ఉండాలి.
  • మేనేజర్ (ఐటీ/క్రెడిట్/ఐటీవో/టీవో) & అసిస్టెంట్ మేనేజర్: అభ్యర్థులు B.E/B.Tech / B.Sc / M.Tech. / M.Sc. / MCA /MBA / PGDBA / PGDBM / PGPM / PGDM పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి:

1. చీఫ్ మేనేజర్(ఐటీ) పోస్టులకు 30 – 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. సీనియర్ మేనేజర్(ఐటీ) పోస్టులకు 28 – 38 సంవత్సరాల మధ్య ఉండాలి.

3. సీనియర్ మేనేజర్(రిస్క్/సీఏ) పోస్టులకు 25 – 35  సంవత్సరాల మధ్య ఉండాలి.

4. మేనేజర్ (ఐటీ/క్రెడిట్/ఐటీవో/టీవో) పోస్టులకు 25 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

5. మేనేజర్ (రిస్క్/లా) పోస్టులకు 25 – 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

6. అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజినీర్/సివిల్ ఇంజినీర్/ఆర్కిటెక్ట్/టెక్నికల్/ఫోరెక్స్) పోస్టులకు 20 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

7. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, 1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు చెందినవారికి  5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: 

ఫీజు చెల్లింపు చివరి తేదీ లేదా అంతకు ముందు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి చెల్లింపు చేయవచ్చు.

GEN / EWS & OBC కోసం:రూ.850. మరియు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: 

ఆన్‌లైన్ ద్వారా కింద సూచించిన విధంగా:

  1. అధికారిక వెబ్‌సైట్ www.unionbankofindia.co.inని సందర్శించండి.
  2. క్లిక్ చేయండి -> రిక్రూట్‌మెంట్ -> యూనియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ ప్రాజెక్ట్ 2024-25 (స్పెషలిస్ట్ ఆఫీసర్లు) -> దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
  3. కొత్త వినియోగదారులు క్లిక్ చేయండి -> కొత్త నమోదు.
  4. వారి క్రియాశీల ఇమెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌ని ఉపయోగించి నమోదు చేసుకోండి
  5. నమోదు చేసుకున్న తర్వాత, రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి.
  6. దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన అన్ని వివరాలను సరిగ్గా పూరించండి.
  7. సూచించిన ఫార్మాట్‌లో అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.
  8. దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించండి.
  9. భవిష్యత్తు సూచన కోసం దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ చేయండి.

ఎంపిక విధానం: 

దరఖాస్తుల పరిశీలన, ఆన్‌లైన్ రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

పరీక్ష విధానం:

  • మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 120 నిమిషాలు.
  • అయితే అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-25 ప్రశ్నలు-25 మార్కులు, రీజనింగ్- 50 ప్రశ్నలు-50 మార్కులు, అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 50 ప్రశ్నలు-100 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్- 25 ప్రశ్నలు-25 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు.
  • పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున మార్కులు కోత విధిస్తారు.

పర్సనల్ ఇంటర్వ్యూ:

రాతపరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మొత్తం 50 మార్కులు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో అర్హత మార్కులను జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 25గా నిర్ణయించారు. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 22.5గా నిర్ణయించారు. నిర్ణీత అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్లో 1: 3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు.

గ్రూప్ డిస్కషన్: 

మొత్తం 50 మార్కులకు గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత మార్కులను జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 25గా నిర్ణయించారు. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 22.5గా నిర్ణయించారు.

పరీక్ష కేంద్రాలు:

ఢిల్లీ ఎన్‌సీఆర్, హైదరాబాద్, చండీగఢ్/మొహాలీ, బెంగళూరు, లక్నో, చెన్నై, కోల్‌కతా, భోపాల్, పాట్నా, ముంబయి/నేవీ ముంబయి/గ్రేటర్ ముంబయి/థానే, భువనేశ్వర్, అహ్మదాబాద్/గాంధీనగర్.

జీత భత్యాలు(Salary Allowances):

1. చీఫ్ మేనేజర్ పోస్టులకు రూ.76,010-రూ.89,890 వరకు ఉంటుంది.

2. సీనియర్ మేనేజర్ పోస్టులకు రూ.63840-రూ.78,230 వరకు ఉంటుంది.

3. మేనేజర్ పోస్టులకు రూ.48,170-రూ.69,810 వరకు ఉంటుంది.

4. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రూ.36,000-రూ.63,840 వరకు ఉంటుంది.

UBI Specialist Officer(SO) Recruitment 2024 Notification-ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.02.2024.
  •  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 23.02.2024 (24:00 Hrs).

FAQ for UBI Specialist Officer(SO) Recruitment 2024 Notification: 

యూనియన్ బ్యాంకు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులకు దరఖాస్తు ఎలా చేసుకోవాలి ?

ఆన్‌లైన్ ద్వారా అధికారిక వెబ్‌సైట్ www.unionbankofindia.co.inని సందర్శించండి.

యూనియన్ బ్యాంకు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు?

ఆన్‌లైన్ రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

యూనియన్ బ్యాంకు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది ఎప్పుడు?

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 23.02.2024 (24:00 Hrs).

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ కి అప్లికేషన్ ఫీజు-ఎంత?

ఫీజు చెల్లింపు చివరి తేదీ లేదా అంతకు ముందు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి చెల్లింపు చేయవచ్చు.

GEN / EWS & OBC కోసం:రూ.850. మరియు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.

మరిన్ని జాబ్స్ లింక్స్ కోసం క్లిక్ చేయండి

PNB Recruitment 2024 Notification for 1025 SO Posts – Lsrallinonenews.com

APPSC Jobs 2024 Notification for 240 Lecturer Posts – Lsrallinonenews.com

TSRTC Apprentice Recruitment-2024 for 150 Posts | 150 పోస్టులకు TSRTC అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్-2024 – Lsrallinonenews.com

AP DME Assistant Professor Recruitment 2024 – Lsrallinonenews.com

NIACL Mumbai Notification for 300 Assistant Posts-2024 – Lsrallinonenews.com

Apply for TSRJC CET 2024 Notification (lsrallinonenews.com)

AP DSC Notification 2024 Updates | AP ప్రభుత్వం 6,100+ పోస్టులకు నోటిఫికేషన్ జారీ – Lsrallinonenews.com

RRB ALP Recruitment 2024 Notification, Eligibility, Salary (lsrallinonenews.com)

AP High Court Jobs 2024 Notification for 39 Posts | Apply Online

PNB Recruitment 2024 Notification for 1025 SO Posts Apply Online

PNB Recruitment 2024 Notification for 1025 SO Posts Apply Online

Union Bank of India Recruitment 2024 Notification For 606 SO Posts

 

1 thought on “UBI Specialist Officer(SO) Recruitment 2024 Notification-దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇవే”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.