TSRTC Plans To Change Metro Train Model Seating In Buses To Increase Occupancy | బస్సుల్లో రద్దీ తగ్గించేందుకు టీఎస్‌ఆర్టీసీ నయా ప్లాన్..
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో రద్దీ తగ్గించే దిశగా సరికొత్త ప్లాన్‌తో సిద్ధమైంది. సిటీ బస్సుల్లో ప్రస్తుతం 44 సీట్లున్నాయి. 63 మంది ప్రయాణిస్తే 100శాతం ఆక్యుపెన్సీగా ఆర్టీసీ భావిస్తోంది. మహాలక్ష్మి అమలైనప్పటి నుంచి మహిళా ప్రయాణికులు రెండింతలయ్యారు. దీంతో ఇబ్బందులు ఎదురవతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం సీటింగ్ వ్యవస్థను మార్చడమే అని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.
ముఖ్యాంశాలు:
- తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
- బస్సుల్లో సీటింగ్ మార్చేస్తోంది
- రద్దీ తగ్గించేందుకు ఈ విధానం
TSRTC Plans To Change Metro Train Model Seating In Buses To Increase Occupancy: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో బస్సుల్లో మెట్రో తరహా సీటింగ్‌పై ఫోకస్ పెట్టింది. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. ఒకప్పుడు రోజుకు 11లక్షల మంది ప్రయాణిస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 18-20లక్షల వరకూ పెరిగింది. ఉదయం, సాయంత్రం.. ఆఫీసులు, కాలేజీలకు వెళ్లేవారితో సిటీ బస్సుల్లో రద్దీ కనిపిస్తోంది. సోమ, బుధవారం మరింత రద్దీగా మారిపోతున్నాయి. బస్సులన్నీ జనాలతో నిండిపోతున్నాయి. అదే బస్సులో ఎక్కువ సీట్లుంటే ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలుగా ఉంటుందని ఆర్టీసీ భావిస్తోంది.
ఈ క్రమంలో ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని సీట్లు తొలగిస్తే మరింత మందికి చోటు దొరికే అవకాశం ఉంటుంది అంటున్నారు అధికారులు. అందుకే బస్సు మధ్యలో ఉన్న ఆరు సీట్లు తొలగించి.. అదే స్థానంలో ఇరువైపులా మెట్రో రైలులో ఉన్నట్లుగా సీటింగ్‌ను ఏర్పాటు చేస్తే మధ్యలో ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉంటుందని ఆర్టీసీ ఆలోచన చేస్తోంది. ఈ మేరకు ప్రయోగాత్మకంగా కొన్ని మార్గాల్లోని బస్సుల సీటింగ్ మార్చేసింది.
ఈ నూతన విధానం చూస్తే..
మెట్రోలా ఎక్కువ మంది..
మహాలక్ష్మి పథకం అమలు తర్వాత తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. ముఖ్యంగా మహిళలకు ఉచిత ప్రయాణం కావడంతో ఎక్కువమంది ఆర్టీసీలో ప్రయాణిస్తున్నారు. దీంతో మిగిలిని ప్రయాణికులు కొంత ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.. ఈ రద్దీని వీలైనంత మేర తగ్గించే దిశగా ఆలోచనలు చేస్తోంది.
TSRTC Plans To Change Metro Train Model Seating In Buses To Increase Occupancy
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....