...

TSPSC గ్రూప్​ 1​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్​​ విత్​ కీ | TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-1

Written by lsrupdates.com

Updated on:

TSPSC గ్రూప్​ 1​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్​​ విత్​ కీ | TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-1

TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers part-1 in Telugu: TSPSC గ్రూప్-1 ప్రిలిమినరీ టెస్ట్-2023 జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలు సమాధానాలతో పార్ట్-1 తెలుగులో
ఈ పోస్టులో గ్రూప్-1 ప్రిలిమినరీ టెస్ట్-2023 జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ - అవార్డులు, 
ముఖ్యమైన తేదీలు, క్రీడలు, వ్యక్తులు, సైన్స్ & టెక్నాలజీ, ఎకానమీ,ఇంటర్నేషనల్ 
మరియు నేషనల్ విషయాల Etc..గురించి తెలుసుకుందాం.
1. 2021 – 23 సంవత్సరానికి పంచాయితీలకు సంబంధించి 4. 2023 లో ఇవ్వబడిన 46 జాతీయ పంచాయతి అవార్డులలో తెలంగాణా రాష్ట్రం 13 అవార్డులను గెలుచుకున్నది. ఈ కింది గ్రామలను వాటి అవార్డు వర్గంతో జతపరచండి .
   గ్రామం మరియు జిల్లా                                        అవార్డు వర్గం
A. గౌతంపూర్, భద్రాద్రి -కొత్తగూడెం                 I నీటి సుస్థిరత పంచాయతి
B. నెల్లుట్ల, జనగామ                                        II మహిళా స్నేహపూర్వక పంచాయతి
C. కొంగట్వల్లి, మహబుబ్ నగర్                      III. ఆరోగ్యవంతమైన పంచాయతి
D. ఏపూర్, సూర్యాపేట                                   IV. క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతి
                                                                      V. సామాజిక భద్రత కలిగిన పంచాయతి
సరైన సమాధానాన్ని ఎంచుకొనుము:
(1) А-II; В-II; C-IV; D-I
(2) A-III; B-I: C-V D-II
(3) A-IV: B-II; C-I; D-III
(4) A-V; B-II; C-I: D-III
Answer : 2
2. జనవరి 2023 లో విడుదలైన RBI వర్కింగ్ పేపర్ “భారత దేశంలో మార్కెట్ రుణాలపై రాష్ట్రాల ఆర్ధిక పనితీరు మరియు దిగుబడి వ్యాప్తి” నకు సంబంధించి ఈ కింది వ్యాఖ్యలను పరిగణించండి:
A. 2014-15 నుంచి 2018-19 వరకు తెలంగాణ స్థూల రాష్ట దేశీయోత్పత్తి (GSDP) కి సగటు అప్పు 16.1 శాతం గా వుంది.
B. మొత్తం రెవెన్యూ రాబడుల్లో రాష్ట్ర సొంత ఆదాయ రాబడి శాతం వేగంగా క్షీణిస్తున్నది.
పై వ్యాఖ్యలలో ఏవి సరైనది/వి?
(1) A మాత్రమే
(2) B మాత్రమే
(3) A మరియు B రెండూ
(4) A మరియు B రెండూ కావు
Answer : 1
3. రాష్ట్ర రవాణా శాఖ మార్చి 2023 గణాంకాల ప్రకారం, తెలంగాణాలో 1-53 కోట్ల వాహనాలు ఉన్నాయి. కింది వాహనాలను వాటి సంఖ్య ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి :
A. ఆటో రిక్షాలు
B. మోటారు కార్లు
C. గూడ్స్ క్యారేజు వాహనాలు
D. ట్రాక్టర్లు మరియు ట్రైలర్లు
సరైన క్రమాన్ని ఎంచుకొనుము :
(1) D, A, B, C
(2) B, D, A, C
(3) A, B, D, C
(4) A, C, D, B
Answer : 4
4. 2022-23 లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL) పనితీరుకు సంబంధించి కింది వాటిని పరిగణించండి :
A. గత ఆర్థిక సంవత్సరం కంటే ఎక్కువ బొగ్గును ఉత్పత్తి చేసింది.
B. దాని స్వంత థర్మల్ పవర్ స్టేషన్ కోసం అంతర్గత వినియోగం కారణంగా గత ఆర్ధిక సంవత్సరం కంటే కొంచెం తక్కువ బొగ్గును రవాణా చేసింది.
C. బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్, భూగర్భ గనులు, ఎక్కువ భాగం 100% లక్ష్యాలను సాధించాయి.
పై ప్రకటనలు ఏవి సరైనది/వి?
(1) A మరియు B మాత్రమే
(2) A, B మరియు C
(3) A మరియు C మాత్రమే
(4) C మాత్రమే
Answer : 4
5. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్ (NOTTO) ప్రకారం మరణించిన దాతల నుండి సేకరించిన అవయవ మార్పిడిలో కింది రాష్ట్రాలు 2022 లో మొదటి నాలుగు స్థానాలలో నిలిచినాయి. వీటిని. అవరోహణ క్రమంలో అమర్చండి
A. తమిళ నాడు
B. మహారాష్ట్ర
C. తెలంగాణ
D. కర్ణాటక
సరైన క్రమాన్ని ఎందుకొనుము:
(1) B, C, A, D
(2) C, A, B, D
(3) C. D. B. A
(4) D, B, C, A
Answer : 4
6. భారత దేశం G-20 ప్రెసిడెన్సిలో స్టార్టప్ 20 ఎంగేజ్ మెంట్ గ్రూప్ రెండవ సమావేశం మర్చి 2023 లో గాంగ్టాక్ లో జరిగింది.దీనికి సంబంధించి కింది వాటిని పరిగణించండి:
A. మార్గదర్శకత్వం, మార్కెట్ యాక్సెస్, నిధులు,స్టార్టవ్ కు కీలకమైన అంశాలుగా గుర్తించబడ్డాయి.
B. G-20 దేశాలలో నిధులు, విజ్ఞాన భాగస్నామ్మన్నిసులభతరం చేయడానికి సింగిల్ విండో ఫ్లాట్ ఫారమ్ ఆవశ్యక్యత హైలైట్ చేయబడింది.
C. చైనా చొరవతో షాంఘైలో, ఉమ్మడి స్టార్టప్ 20 ని స్థాపించాలని నిర్ణయం తీసుకున్నారు.
పై ప్రకటనలు ఏవి సరైనది/వి?
(1) A మాత్రమే
(2) A మరియు B మాత్రమే
(C) A,B మరియు C
(4) A మరియు C మాత్రమే
Answer : 2
7. పాల కల్తీని 30 సెకన్లలో గుర్తించేందుకు పాకెట్-ఫ్రెండ్లీ పరికరాన్నిఅభివృద్ధి చేసిన పరిశోధనా సంస్థ ఏది ?
(1) IIT మద్రాస్
(2) IICT హైదరాబాద్
(3) నేషనల్ డైరీ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NDRI), కర్నాల్,హర్యానా
(4) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరీ సైన్స్ మరియు టెక్నాలజీ (NIDST),లూథియానా, పంజాబ్
Answer : 1
8. PM మిత్రా మెగా టెక్స్టైల్ పార్కులను ఈ కింది రాష్ట్రాలలో ఏర్పాటు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది :
పరికరాన్ని
A. తమిళ నాడు.
B. గుజరాత్
C. త్రిపుర
D. తెలంగాణ
సరైన జవాబును ఎంచుకొనుము :
(1) B మరియు C మాత్రమే
(2) A, B, C మరియు D
(3) A, C మరియు D మాత్రమే
(4) A, B మరియు D మాత్రమే
Answer : 4
9. వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ (WSIS) బహుమతులు 2023 ను గెలుచుకున్నది ఈ కింది వాటిలో ఏది ?
(1) ఆడిట్ ఆన్లైన్ – ఇది పంచాయతి రాజ్ సంస్థలలో ఆన్లైన్ ఆడిట్లను సులభతరం చేస్తుంది.
(2) ఇండియాఆడిట్ – ఇది GST విభాగాలలో ఆన్లైన్ ఆడిట్లను సులభతరం చేస్తుంది.
(3) ఇండియా ఆన్లైన్ – ఇది ఆన్లైన్ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని సులభతరం చేస్తుంది.
(4) ఇండియా ఇన్వెస్ట్మెంట్  – ఇది స్టార్ట్ అప్ లకు ఆన్లైన్ పెట్టుబడులను సులభతరం చేస్తుంది.
Answer : 1
10. అస్కార్ అవార్డ్ 2023 బహుమతిని గెలుచుకున్న ‘ది’ ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ గురించి ఈ కింది వ్యాఖ్యలు పరిగణించండి:
A. ఈ డాక్యుమెంటర్ బొమ్మన్, బెల్లీ అనే స్థానిక జంట ఒక అనాధ పిల్ల ఏనుగును సంరక్షిస్తున్న కథను చెబుతుంది.
B. ఈ డాక్యుమెంటరీని కర్ణాటకలోని కొడగులో గల నాగరహోల్ నేషనల్ పార్కులో చిత్రీకరించారు.
పై ప్రకటనలు ఏవి సరైనవి/ది ?
(1) A మాత్రమే
(2) B మాత్రమే
(3) A మరియు B రెండూ.
(4) A మరియు B రెండు కావు
Answer : 1
11. నిసార్ (NISAR) గురించి కింది వ్యాఖ్యలలో సరైనవి ఏవి ?
A. ఇది నాస మరియు ఇస్రా సంయుక్తంగా అభివృద్ది చేసిన ఒక భూ- పరిశీలన ఉపగ్రహం.
B. ఎనిమిదేళ్ళ క్రితం 2014 లో నాసా మరియు ఇస్రా కలిపి దీనిని రు-పొందించడానికి తలపెట్టినాయి.
C. 2024 జనవరిలో సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుండి దీనిని ప్రయోగించాలని అనుకున్నారు.
D. ఇది హై ఎర్త్ ఆర్బిట్(HEO)  అబ్జర్వేటరీ, ఇది కనీసం పదేళ్ళపాటు పనిచేస్తుంది.
సరైన సమాధానాన్ని ఎందుకొనుము:
(1) A మరియు B మాత్రమే
(2) A, B మరియు C మాత్రమే
(3) Α. Β, C మరియు D
(4) A మరియు D మాత్రమే
Answer : 2
12. సౌల్హాటువోనువో క్రూసె గురించి కింది వాటిలో సరైనవి ఏది/ఏవి ?
A. 60 మంది సభ్యులున్న నాగాలాండ్ అసెంబ్లీకి ఎన్నికైన తొలి మహిళలలో ఆమె ఒకరు.
B. నాగాలాండ్ తొలి మహిళా మంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు.
C. ఆమెకు విద్యా మంత్రిత్వ శాఖను కేటాయించారు.
సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
(1) A, B మరియు C
(2) A మరియు B మాత్రమే.
(3) A మాత్రమే
(4) B మరియు C మాత్రమే
Answer : 2
13. కేరళ షిప్పింగ్ మరియు ఇస్లాండ్ నావిగేషన్ కార్పోరేషన్ (KSINC) ఏప్రిల్ 2023 లో రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రొత్సాహించడం కోసం మొదట సౌరశక్తి తో నడిచే, డబుల్-డెక్ట్, హైబ్రీడ్ బోటును ప్రవేశపెట్టింది. ఆ పడవ పేరు ఏమిటి ?
(1) సూర్య రథం
(2) సూర్యాంషు
(3) సూర్య నక్షత్ర
(4) సూర్యోదయం
Answer : 2
14. నేషనల్ ఇనిస్టిట్యుట్ ఆఫ్ మౌంటెనీరింగ్ మరియు అడ్వంచర్ స్పోర్ట్స్ (NIMAS) బృందంచే జనవరి నుండి మార్చి 2023 వరకు ‘సిక్స్ నేషన్ సైక్లింగ్ ఎక్స్పెడిషన్ 2023’ నిర్వహించినారు. ఈ సైక్లింగ్ యత్రలో కింది ఏ దేశాలు భాగంగా ఉండినాయి?
A. వియత్నాం
B. బంగ్లాదేశ్
C. కంబోడియా
D. థాయిలాండ్
E. శ్రీలంక
సరైన సమాధానాన్ని ఎందుకొనుము:
(1) A, B మరియు C మాత్రమే
(2) A, C మరియు D మాత్రమే
(3) A, C D మరియు E మాత్రమే
(4) A, B, C మరియు E మాత్రమే
Answer : 2
15. కింది వ్యాఖ్యలను పరిగణించండి:
A. మునుపు మార్బర్గ్ హెమరేజిక్ షీవర్ అని పిలిచే మార్బర్గ్ వైరస్ వ్యాధి (MVD) WHO ప్రకారం, తీవ్రమైనది, తరచుగా ప్రాణాంతక రక్తస్రావ జ్వరంనకు దారితీస్తుంది.
B. టాంజానియా ప్రభుత్వం తన వాయువ్య కగేరా ప్రాంతంలో మార్చి 2023 లో MVD వ్యాప్తిని నివేదించింది.
పై ప్రకటనలు ఏవి సరైనది/వి?
(1) A మాత్రమే
(2) B మాత్రమే
(3) A మరియు B రెండూ
(4) A మరియు B రెండూ కావు
Answer : 3
16. బ్రిక్స్ (BRICS) ఏర్పాటు చేసిన బహుపాక్షిక ఆర్ధిక సంస్థ అయిన న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ (NDB) కి అధిపతిగా 2023 లో కింది వారిలో ఎవరు ఎన్నికయ్యారు?
(1) బ్రెజిల్ మాజీ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్
(2) వైనా మాజీ ఆర్థిక మంత్రి లియూ కున్
(3) ఆంటోన్ బెర్మనోవిచ్ సిలువనోవ్, రష్యా మాజీ ఆర్థిక మంత్రి
(4) జ్ఞాహన గెరార్డ్స్ ఫ్రెడమ్, దక్షిణ ఆఫ్రిక మాజీ ప్రధాన మంత్రి
Answer : 1
17. ‘ఒల్కిలువోటో-3’ రియాక్టర్ గురించి కింది వాటిలో సరైనవి ఏవి?
A. ఇది ఐరోపాలోని అత్యంత శక్తివంతమైన అణు రియాక్టర్.
B. ఇది ప్రాన్స్ కి చెంది న ఆరేవా, జర్మనీ చెందిన సీమెన్స్ ల ఉమ్మడి వెంచర్ అభివృద్ధి చేయబడింది.
C.  ‘ఒల్కిలువోటో-3’ నిర్మాణం 2005 లో ప్రారంభమై, అసలు ప్రణాళిక నుండి 14 సంవత్సరాల ఆలస్యం తర్వాత ఇప్పుడు సిద్ధంగా వుంది.
D. యూరోపియన్ దేశాలు రష్యా నుండి చమురు, గ్యాస్, ఇతర విద్యుత్ సరఫరాలను నిలిపివేసిన తరుణంలో ఇంధన భద్రతను సాధించడానికి బెల్జియంకు ఇది సహాయ పడుతుంది.
సరైన సమ-ధానాన్ని ఎంచుకొనుము:
(1) A మరియు B మాత్రమే
(2) A, B మరియు మత్రమే:
(3) A, B, C మరియు D
(4) B, C మరియు D మాత్రమే
Answer : 2
18. మార్చి 2033 లో నేపాల్లోని ఖట్మాండులో ఐక్యరాజ్యసమితి ఒక ప్రాంతీయ కార్యశాలను నిర్వహించింది. ఈ కార్యశాల థీమ్ ఏమిటి ?
(1) ఇంటర్ నేషనల్ టూరిజం: బూస్టింగ్ ఎకానమీస్ ఆఫ్ ఆసియా పసిఫిక్
(2) మెజరింగ్ టూరిజం:  బెటర్   డాటా ఫర్ బెటర్ టూరిజం ఇన్ ఆసియా అండ్ ది పసిఫిక్
(3) ఇకోటూరిజం ఇన్ ఆసియా పసిఫిక్: ప్రమోటింగ్ సస్ స్టేనబుల్ టూరిజం
(4) సస్టేనబుల్  టూరిజం ఇన్ ఆసియ అండ్ ది పసిఫిక్: ప్రమోటింగ్ హెల్త్ ప్రాక్టీసెస్
Answer : 2
19. వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ (WHR), 2023 లో వాటి ర్యాంకుల ఆధారంగా ఈ కింది దేశాలను జతచేయండి.
        దేశం                                           ర్యాంక్
 A. ఐస్ లాండ్                           I మొదటి ర్యాంక్
 B. ఇజ్రాయల్                           II. రెండవ ర్యాంక్
 C. ఫిన్లాండ్                              III. మూడవ ర్యాంక్
 D. డెన్మార్క్                             IV. నాల్గవ ర్యాంక్
                                                V. ఐదవ ర్యాంక్
సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
(1) A-IV, B-II; C-III; D-V
(2) A-II; B-I; C-IV; D-V
(3) A-II: B-III; C-I; D-IV
(4) A-III; B-IV; C-I; D-II
Answer : 4
20. కింది వ్యాఖ్యలను పరిగణించండి:
A. ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాల కోసం బ్యాటరీలో కీలకమైన లిథియం పెద్ద నిక్షేపాన్ని కనుగొన్నట్లు ఇరాక్ మార్చి 2023 లో ప్రకటించింది.
B. 2022 లో ప్రచురించబడిన యునైటెడ్ స్టేట్స్, బియలాజికల్ సర్వే (USGS) నివేదిక ప్రకారం, ఆస్ట్రేలియా, చిలీ, అర్జెంటీనా మరియు చైనా ప్రధాన ఉత్పత్తి దారులుగా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 89 మిలియన్ టన్నుల లిథియం గుర్తించ బడింది.
పై ప్రకటనలు ఏవి సరైనది/వి?
(1) A మాత్రమే
(2) B మాత్రమే
(3) A మరియు B రెండూ
(4) A మరియు B రెండూ కావు
Answer : 2
21. కింది రెండవా ప్రపంచ యుద్ధ సంఘటనలను కాలక్రమానుసారం అమర్చండి:
A. పశ్చిమ ప్రాన్స్ లో నార్మాండి దండయాత్ర
B. జర్మన్ – సోవియట్ నాన్ అగ్రెషన్ ఒప్పందం
C. హీరోషిమా మరియు నాగసాకిలపై అణుబాంబు దాడి.
D. పెర్ల్ హార్బరుపై జపాన్ దాడి
E. స్టాలిన్ గ్రాడ్ యుద్ధం
సరైన క్రమాన్ని ఎంపిక చేయండి:
(1) D, C, A, E, В
(2) A, D, C, E, B
(3) E, B, D, A, C
(4) B, D, E, A, C
Answer : 4
22. టిబెట్ సమస్యకు సంబంధించి ఈ కింది అంశాలను పరిగణించండి :
A. టిబెట్ ను  అక్రమించుకుంటామని చైనా ప్రకటించినపుడు టిబెట్ సమస్యపై చర్చలు ప్రతిపాదిస్తు భారతదేశం నిరసన లేఖను పంపింది..
B. 1954 లో, చైనా-భారతదేశం శాంతియుత సహజీవనం ఐదు సూత్రాలపై ఒప్పందంలో భాగంగా టిబెట్ లో చైనా పాలనను భారతదేశం అంగీకరించింది   .
పై వ్యాఖ్యలలో ఏవి సరైనది/వి?
(1) A మాత్రమే
(2) B మాత్రమే
(3) A మరియు B రెండూ
(4) A మరియు B రెండూ కావు
Answer : 3
23. G-20 కి సంబంధించి కింది వాటిని పరిగణించండి.
A. ఆర్థిక మంత్రుల మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల వేద్కీగా 1999 లో G-20 స్థాపించబడింది.
B. G-20 రాజ్య/ప్రభుత్వ అధిపతుల స్థాయికి 2010 లో ఆప్ గ్రేడ్ చేయబడింది.
C. G-20 విస్తరించబడిన ఎజండాలో వాణిజ్యం స్థిరమైన అభివృద్ధి, ఆరోగ్యం, వ్యవసాయం ఇంధనం, పర్యావరణం, వాతవరణ మార్పు, అవినీతి నిర్మూలన వంటి అంశాలు ఉన్నాయి.
పైన ఇవ్వబడిన ప్రకటనలలో ఏవి సరైనవి ?
(1) A మరియు B మాత్రమే
(2) A, B, మరియు C
(3) B మరియు C మాత్రమే
(4) A మరియు C మాత్రమే
Answer : 4
24. కింది బితలలో ఏవి సరిగా జతపరచబడినాయి ?
A. ASEAN సచివాలయం : బ్యాంకాక్, థాయిలాండ్
B. SAARC సచివాలయం : ఖాట్మాండు, నేపాల్
C. యూరోపియన్ యూనియన్ (EU): బ్రసెల్స్, బెల్జియం
D. ఆఫ్రికన్ యూనియన్(AU) : అడిస్ ఆబాబా,ఇథియోపియా
సరైన సమాధానాన్ని ఎందుకొనుము:
(1) A, B, మరియు C మాత్రమే
(2) A, B, C మరియు D
(3) B, C మరియు D మాత్రమే
(4) A మరియు B మాత్రమే
Answer : 3
25. ఈ కింది ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ఎజెన్సీలను వాటి ప్రధాన కార్యాలయాలతో జతపరచండి:
ఎజెన్సీ ప్రధాన కార్యాలయం
A. FAO I న్యూయార్క్
B. UNIDO II. చెనివా
C. ILO III. రోమ్
D. UNESCO IV. పారిస్
V. వియన్నా
సరైన సమాధానాన్ని ఎంచుకొనుము:
(1) A-IV; B-III; C-II; D-I
(2) A-II; B-I; C-IV: D-V
(3) A-V; B-IV; C-I; D-II
(4) A-III; B-V; C-II; D-IV
Answer : 4
26. ఈ కిందిది యునైటెడ్ స్టేట్స్ మరియు సోవియట్ యూనియనలను యుద్ధానికి సమీపంగా తీసుకువచ్చిన ప్రధాన ఘర్షణ:
(1) కాంగో సంక్షోభం
(2) సూయజ్ కాలువ సంక్షోభం
(3) క్యూబా క్షిపణుల సంక్షోభం
(4) అంగోలా అంతర్యుద్ధం
Answer : 3
27. సెమి కండక్టర్ క్రిస్టల్ (స్ఫటికం) పై ఇంటిగ్రేటెడ్ చిప్ను ఉత్పత్తి చేసే వద్ధతి:
(1) ఎంబెడింగ్
(2) ఫొటోలిథోగ్రఫీ
(3) టోమి-గ్రఫీ
(4) క్రిప్టోగ్రఫీ
Answer : 2
28. వేప చెట్టులో డైబ్యాక్ వ్యాధికి కారణము :
(1) ఇనుము లోపము
(2) వైరస్
(3) శిలీముద్రం
(4) శైవలాలూ
Answer : 3
29. మానవుని దేహ ఉష్ణొగ్రతను నియంత్రించనది:
(1) హైపోథాలమస్
(2) చర్మం
(3) చిన్నమెదడు
(4) కండరములు
Answer : 1
30. వాహనములలోని ఎయిర్ బ్యాగులలో ఏ రసాయనము ప్రమాద సమయంలో నైట్రోజన్ విడుదల చేసి బెలూనులు విచ్చుకొనునట్లు చేయును ?
(1) సోడియం అజైడ్
(2) సోడియం నైట్రైట్
(3) సిల్వర్ వైబ్రేట్
(4) పొటాషియం నైట్రేట్
Answer : 1
31. ఆకాష్ క్షిపణి అభివృద్ధి మరియు ఉత్పత్తి చేసినది
(1) డి. ఆర్. డి. ఓ.  మరియు బి. డి.ఎల్.
(2) ఎన్. ఎఫ్. సి.  మరియు బి. ఎ. ఆర్. సి.
(3) ఇస్రో మరియు డి. ఇ.  ఆర్. ఎల్.
(4) రష్యా మరియు డి. ఇ. ఆర్. ఎల్.
Answer : 1
32. 2022 సం.నికి గాను నోబెల్ బహుమతి గ్రహీతలు, వారి పనిని జతచేయండి:
A. అలెస్ బియా-లా టిస్కీ:  నానో పదార్థాలు, వాటి అనువర్తనాలు
B. స్వాంటే పాటో : అంతరించి పోయిన హోమినిన్ల జీనోము మరియు మానవ పరిణామం
C. అలెస్ యాస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసర్, యాంటౌన్ జీలింగర్ : ఫోటాన్ల క్వాంటం ఎంటాంగ్ ్మంట్, సమాచార శాస్త్రము మరియు క్రిప్టోగ్రఫీ
D.కారోలిన్ ఆర్ బార్టోజ్జి, మోర్టెన్ మెల్డాల్ , కె. బారి షార్ప్లస్ : క్లిక్ రసాయన శాస్త్రం,బయో ఆర్థోగోనల్ రసాయన శాస్త్రం
సరైన జత/జతలను ఎంపిక చేయుము :-
(1) A మాత్రమే
(2) D మాత్రమే
(3) A, B మరియు C మాత్రమే
(4) B, C మరియు D మాత్రమే
Answer : 4
33. లోతు నుండి ఉపరితలం వరకు భూమి యొక్క భౌగోళిక కూర్పు క్రమం:
(1) క్రస్ట్ → మాంటిల్→ ఇన్నర్ కోర్ →ఔటర్ కోర్
(2) మాంటిల్ → క్రస్ట్ → ఇన్నర్ కోర్→ బాటర్ కోర్
(3) ఔటర్ కోర్→ ఇన్నర్ కోర్→ క్రస్ట్→ మాంటిల్
(4) ఇన్నర్ కోర్ →ఔటర్ కోర్→ మంటిల్ →క్రస్ట్
Answer : 4
34. క్రింది వాటిని జతచేయండి
A. మలేరియా                           I. ప్లాస్మోడియం
B. ఎలిఫెంటియా-సిస్             II. ఫైలేరియా
C. టైఫాయిడ్                          III. క్లాస్ట్రీడియం
D. టెటానస్                            IV. ఉఖరేరియా
                                               V. సాల్మొనల్లా
సరైన సమాధానాన్ని ఎంచుకొనుము:
(1) A-I: B-II; C-III: D-V
(2) A-I, B-III; C-V, D-IV
(3) A-I; B-IV; C-III; D-II
(4) A-I; B-IV; C-V; D-III
Answer : 4
35. క్రింది వాటిని జతచేయండి:
A. కాల్షిఫెరోల్                              I.బెరిబెరి
B. థయమైన్                               II.రికెట్స్
C. సయనోకోబాలమిన్                 III స్కర్వీ
D. ఆస్కార్బిక్ ఆమ్లము                IV. పెరినీసియస్ రక్తహీనత
                                                    V. గాయిటర్
సరైన సమాధానాన్ని ఎందుకొనుము :
(1) A-II; B-I; C-IV; D-III
(2) A-II; B-IV; C-III: D-V
(3) A-IV, B-I; C-III; D-II
(4) A-V: B-III; C-I: D-IV
Answer : 1
36. మునవునిలో మూత్రం ఏర్పడడానికి సంబంధించి కింది వాటిని క్రమానుగతిలో అమర్చండి:
A. కేంద్రీకృత మూత్రం ఏర్పడడం.
B. గొట్టపు పునఃశోషణం
C. గ్లోమెరులర్ వడపొత
D. గొట్టవు స్రావం
సరైన క్రమాన్ని ఎంచుకొనుము :
(1) A, C, B, D
(3) C, B, D, A
(3) B. A, D, C
(4) A, D, B, C
Answer : 2
TSPSC గ్రూప్​ 1​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్​​ విత్​ కీ | TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-1

2 thoughts on “TSPSC గ్రూప్​ 1​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్​​ విత్​ కీ | TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-1”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.