TSPSC Group 1 Notification 2024 Released For 563 Posts | తెలంగాణ గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ విడుదల.. విభాగాల వారీగా పోస్టులు, ముఖ్యమైన తేదీలివే!
TSPSC Group 1 Notification 2024 Released For 563 Posts: తెలంగాణ గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల వచ్చేసింది. టీఎస్‌పీఎస్సీ తాజాగా సోమవారం (ఫిబ్రవరి 19) గ్రూప్-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 563 పోస్టులతో గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఈ పోస్టులకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఇక.. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది.
మార్చి 14వ తేదీని దరఖాస్తులకు చివరి తేదీగా ప్రకటించారు. వయోపరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచారు. దరఖాస్తుల సవరణకు మార్చి 23 నుంచి మార్చి 27 వరకు అవకాశం కల్పించారు. అనంతరం మే లేదా జూన్ నెలలో పిలిమ్స్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఇక మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఉండొచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలను https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
ఫీజు నుంచి మినహాయింపు..
అప్లికేషన్ ప్రాసెస్ ఫీజును రూ.200గా నిర్ణయించారు. ఎగ్జామినేషన్ ఫీజు రూ.120గా నిర్ణయించారు. అయితే నిరుద్యోగులకు ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే.. కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడంతో అభ్యర్థులు పలు విషయాల్లో ఆందోళనకు గురవుతున్నారు. పరీక్ష ఫీజు మళ్లీ చెల్లించాలా? అనే సందేహం ఉంది. దీనిపై కూడా టీఎస్‌పీఎస్సీ కమిషన్ క్లారిటీ ఇచ్చింది. పాత నోటిఫికేషన్‌లో అప్లయ్ చేసుకున్న వాళ్లు మళ్లీ అప్లయ్ చేసుకోవాల్సిందేనని.. అయితే.. గతంలో ఫీజు చెల్లించిన వాళ్లు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 33 జిల్లా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహించనున్నారు.
పోస్టులు, వయో పరిమితి (జులై 1, 2024 నాటికి), పే స్కేలు వివరాలివే…
TSPSC Group 1 Notification 2024 Released For 563 Posts: Details of posts, age limit (as on July 1, 2024) and pay scale as shown below .
- డిప్యూటీ కలెక్టర్లు (45 పోస్టులు): వయస్సు 18 నుంచి 46 ఏళ్లు మరియు వేతనం రూ.58,850 – రూ.1,37,050.
- డీఎస్పీ (115 పోస్టులు): వయస్సు 21 నుంచి 35 ఏళ్లు మరియు వేతనం రూ.58,850 – రూ.1,37,050.
- సీటీవో(48 పోస్టులు): వయస్సు 18 నుంచి 48 ఏళ్లు మరియు వేతనం రూ.58,850 – రూ.1,37,050.
- ఆర్టీవో (4 పోస్టులు): వయస్సు 21 నుంచి 46 ఏళ్లు మరియు వేతనం రూ.54,220 – రూ.1,33,630.
- జిల్లా పంచాయతీ అధికారి (7 పోస్టులు): 18 46 ఏళ్లు మరియు వేతనం రూ.54,220 -రూ.1,33,630.
- జిల్లా రిజిస్ట్రార్ (6 పోస్టులు): 18 నుంచి 46 ఏళ్లు మరియు వేతనం రూ.54,220-రూ.1,33,630.
- జైళ్ల శాఖలో డీఎస్పీ (5 పోస్టులు): 18 నుంచి 35 ఏళ్లు మరియు వేతనం రూ.54,220 -రూ.1,33,630.
- సహాయ కార్మిక అధికారి (8 పోస్టులు): 18 నుంచి 46 ఏళ్లు మరియు వేతనం రూ.54, 220-రూ.1,33,630.
- అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (30 పోస్టులు): 21 నుంచి 35 ఏళ్లు మరియు వేతనం రూ.51,320 -రూ.1,27,310.
- గ్రేడ్ -2 మున్సిపల్ కమిషనర్ (41 పోస్టులు): 18 నుంచి 46 ఏళ్లు మరియు వేతనం రూ.51,320-రూ.1,27,310
- సాంఘిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు/ జిల్లా అధికారులు (3 పోస్టులు): 18 నుంచి 46 ఏళ్లు మరియు వేతనం రూ.54, 220 – రూ.1,33,630.
- జిల్లా బీసీ అభివృద్ధి అధికారి (5 పోస్టులు): 18 నుంచి 46 ఏళ్లు మరియు వేతనం రూ.54,220 -రూ.1,33,630.
- జిల్లా గిరిజన సంక్షేమ అధికారి (2 పోస్టులు): 18 నుంచి 46 ఏళ్లు మరియు వేతనం రూ.54,220 -రూ.1,33,630.
- జిల్లా ఉపాధి కల్పన అధికారి (5 పోస్టులు): 18 నుంచి 46 ఏళ్లు మరియు వేతనం రూ.51,320 -రూ.1,27,310.
- ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (20 పోస్టులు): 18 నుంచి 46 ఏళ్లు మరియు వేతనం రూ.51,320 -రూ. 1,27,310.
- అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ (38 పోస్టులు): 18 నుంచి 46 ఏళ్లు మరియు వేతనం రూ.51,320 -రూ.1,27,310.
- అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (41 పోస్టులు): 18 నుంచి 46 ఏళ్లు మరియు వేతనం రూ.51,320 -రూ.1,27,310.
- ఎంపీడీవో (140 పోస్టులు): 18 నుంచి 46 ఏళ్లు మరియు వేతనం రూ.51,320-రూ.1,27,310.
గత ప్రభుత్వ హయాంలో..
గత ప్రభుత్వ హయాంలో 2022 ఏప్రిల్‌లో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 503 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన జారీ చేశారు. 2022 అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూడటంతో పరీక్షను టీఎస్‌పీఎస్సీ కమిషన్ రద్దు చేసింది. ఆ తర్వాత మరోసారి పరీక్షను నిర్వహించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇందులో భాగంగా… 2023 జూన్ 11 రెండోసారి పరీక్షను నిర్వహించారు. 2023 జూన్‌లో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 2.33 లక్షల మంది ప్రిలిమ్స్ పరీక్ష రాశారు.
అయితే..
పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని.. అభ్యర్థుల బయో మెట్రిక్ తీసుకోలేదని.. ప్రిలిమినరీ పరీక్ష రోజున వెల్లడించిన విద్యార్ధుల సంఖ్యకు.. తుది కీ విడుదల సమయంలో వెల్లడించిన హాజరు సంఖ్యకు పొంతన లేదంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు న్యాయస్థానం పరీక్ష రద్దు చేసి మరోసారి నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా రద్దు చేయాలని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. గతేడాది అక్టోబరు నుంచి విచారణ జరగలేదు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో.. తాజాగా టీఎస్‌పీఎస్సీ కమిషన్ పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
TSPSC Group 1 Notification 2024 Released For 563 Posts
UBI Specialist Officer(SO) Recruitment 2024 Notification-దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇవే
TSPSC Group 1 Notification 2024 Released For 563 Posts
2 thoughts on “TSPSC Group 1 Notification 2024 Released For 563 Posts | తెలంగాణ గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ విడుదల.. విభాగాల వారీగా పోస్టులు, ముఖ్యమైన తేదీలివే!”