TS PolyCET 2024 Notification, Application Form, Eligibility, Fee, Apply Online | టీఎస్ పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే
TS PolyCET 2024 Notification: తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘టీఎస్ పాలిసెట్-2024’ నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 22 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
TS PolyCET 2024 Notification Details | టీఎస్ పాలిసెట్ (PolyCET) 2024 నోటిఫికేషన్ వివరాలు
తెలంగాణలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 15న వెలువడింది. వచ్చే విద్యాసంవత్సరానికి టీఎస్ పాలిసెట్ ప్రవేశ పరీక్ష మే 17న నిర్వహించనున్నారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. . విద్యార్థులు ఫిబ్రవరి 15 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే రూ.100 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. పరీక్ష నిర్వహించిన 12 రోజుల్లో ఫలితాలు వెల్లడించనున్నట్లు అధికారులు ప్రకటించారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే ఈమెయిల్: polycet-te@telangana.gov.in లేదా 040 -23222192 ఫోన్ నెంబరులో సంప్రదించాలని సూచించారు.
పాలిసెట్-2024 ద్వారా రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు, అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హత – Eligibility:
ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదోతరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంపార్ట్‌మెంటల్ పద్ధతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు – Application Fee:
ఈ టీఎస్ పాలిసెట్-2024 నోటిఫికేషన్ కి రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం – Application Procedure:
ఆన్‌లైన్ ద్వారా, దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి అభ్యర్థులు క్రింది విధానాలను అనుసరించాలి:
- అధికారిక TS PolyCET వెబ్‌సైట్‌ను సందర్శించండి – PolyCET.sbtet.telangana.gov.in.
- TS పాలిటెక్నిక్ రిజిస్ట్రేషన్ 2024 కోసం అందించిన లింక్‌పై క్లిక్ చేయండి.
- వ్యక్తిగత వివరాలను ఉపయోగించి నమోదును పూర్తి చేయండి.
- లాగిన్ చేయడానికి సెల్‌ఫోన్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించండి.
- విద్యా నేపథ్యం, ఇష్టపడే సంప్రదింపు పద్ధతి, పరీక్ష కేంద్రం మరియు ఇతర సంబంధిత వాస్తవాలతో సహా అవసరమైన అన్ని ఫీల్డ్‌లను పూర్తి చేయండి.
- పేర్కొన్న మార్గదర్శకాలను అనుసరించి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
- దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించండి.
- మీరు ఫారమ్‌ను సమర్పించే ముందు, మీరు మొత్తం సమాచారాన్ని పరిశీలించారని నిర్ధారించుకోండి.
పరీక్ష విధానం – Test Procedure:
- మొత్తం 120 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పెన్ అండ్ పేపర్(ఆఫ్‌లైన్) విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో 150 ప్రశ్నలుంటాయి.
- మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి.. మ్యాథ్స్–60, ఫిజిక్స్–30, కెమిస్ట్రీ–30, బయాలజీ నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. రెండున్నర గంటలు పరీక్ష సమయం ఉంటుంది. పదోతరగతి స్థాయి సిలబస్ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
- ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ (పీజేటీఎస్‌యూ), పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, వీటి అనుబంధ సంస్థల్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు మాత్రమే బయాలజీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.
వేర్వేరు ర్యాంకులు – Different Ranks:
- పాలిసెట్ ప్రవేశాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను జనరేట్ చేస్తారు. టెక్నికల్ పాలిటెక్నిక్, అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ డిప్లొమాగా ర్యాంకుల జాబితాను రూపొందించి ప్రవేశాలను కల్పిస్తారు.
- పాలిటెక్నిక్ (టెక్నికల్): ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారి మార్కులు విధానం 120గా ఉంటుంది. ఇందులో మ్యాథ్స్–60, ఫిజిక్స్–30,కెమిస్ట్రీ–30 గా ఉంటాయి
- అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ: అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ డిప్లొమా కోర్సులకు మార్కుల విధానం కూడా 120గా ఉంటుంది. ఇందులో మ్యాథ్స్–(60/2=30)–30, ఫిజిక్స్–30, కెమిస్ట్రీ–30, బయాలజీలో 30 మార్కులుగా ఉంటాయి.
అర్హత మార్కులు – Eligibility Marks:
- పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి) అంటే 36 మార్కులు.
- వ్యవసాయ పాలిటెక్నిక్స్, వెటర్నరీ పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం (60/2), బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిసి) అంటే, 36 మార్కులు తప్పనిసరిగా స్కోర్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు – Important dates:
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 15.02.2024.
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 22.04.2023.
- రూ.100 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 24.04.2023.
- పాలిసెట్ పరీక్ష తేది: 17.05.2024.
- ఫలితాల వెల్లడి: పరీక్ష తర్వాత 12 రోజుల్లో ఫలితాల వెల్లడి.
FAQs for TS PolyCET 2024 Notification:
Q1.TS POLYCET-2024 లో అర్హత సాధించడానికి కనీస మార్కులు ఏమిటి?
SBTET ద్వారా పాలిటెక్నిక్ కోర్సుల అధికారికి అర్హత మార్కులు 120 మార్కులలో 30% అంటే,
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కలిపి 36 మార్కులు.
Q2.TS POLYCET-2024లో ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి?
- TS పాలీసెట్-2024 రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్: 500/- ST/SC: 250/-.
- అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 35000 (సుమారు) .
- అధికారిక వెబ్‌సైట్ www.polycet.sbtet.telangana.gov.in
Q3.TS POLYCETకి ఆలస్య రుసుము ఎంత?
- TS POLYCET 2024 ఆలస్యమైన INR 100 దరఖాస్తు రుసుము ఉంది,ఇది నిర్ణీత రుసుముతో పాటు చెల్లించాలి.
- ఆలస్య రుసుముతో TS POLYCET 2024 దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 2024 రెండవ వారం.
- TS POLYCET 2024 దరఖాస్తు రుసుము జనరల్ కేటగిరీకి INR 500 మరియు SC/ST వర్గాలకు INR 250.
Q4.నేను TS పాలిటెక్నిక్‌లో నా సీటు కేటాయింపును ఎలా తనిఖీ చేయగలను?
- అధికారిక TS POLYCET కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- సీట్ల కేటాయింపు ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి లాగిన్ పోర్టల్ తెరవబడుతుంది.
- హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ మరియు పాస్‌వర్డ్ వంటి లాగిన్ వివరాలను ఇక్కడ నమోదు చేయండి.
- సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా సీట్ల కేటాయింపు ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేయండి.
- సీటు కేటాయింపు ఆర్డర్‌ను ప్రింట్ చేయండి.
Q5.పాలీసెట్‌కు నెగెటివ్ మార్కులు ఉన్నాయా? తప్పు ప్రతిస్పందనలకు నెగెటివ్ మార్కింగ్ ఉండదు.
Q6.TS POLYCET-2024కి వయోపరిమితి ఎంత? TS POLYCET-2024 ద్వారా డిప్లొమా స్ట్రీమ్‌లలో ప్రవేశానికి వయోపరిమితి ప్రమాణాలు లేవు.
2 thoughts on “TS PolyCET 2024 Notification, Application Form, Eligibility, Fee, Apply Online | టీఎస్ పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే”