...

వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్లు..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు | 5 % Reservation for Disabled Persons in Education and Job Opportunities

Written by lsrupdates.com

Published on:

వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్లు..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు | 5 % Reservation for Disabled Persons in Education and Job Opportunities

TS Govt Issued Orders To Implement 5 % Reservation for Disabled Persons in Education and Job Opportunities:  

అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానం అమల్లోకి తేనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. చిన్నారులు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. దివ్యాంగులకు విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల అమలు చేస్తామని.. ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ప్రత్యేక విధానం తీసుకొస్తామన్నారు.

అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్-Biometrics In Anganwadi Centers

అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌష్టికాహార లోపం, రక్తహీనతతో రాష్ట్రంలో గర్బిణులు, బాలింతలు, చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నట్లు గణాంకాలు వెలువడటం ఆందోళనకరంగా ఉందని అన్నారు. ఆరోగ్య ప్రమాణాలు పెరగాల్సింది పోయి, దిగజారటం సరైంది కాదని సీఎం అన్నారు. అందుకే అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్ఠికాహారం అసలైన లబ్ధిదారులకు అందుతుందా.. లేదా అనేది అధికారులు పక్కగా పర్యవేక్షించాలని సీఎం సూచించారు.

వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్లు..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు | 5 % Reservation for Disabled Persons in Education and Job Opportunities
వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్లు..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు | 5 % Reservation for Disabled Persons in Education and Job Opportunities

కేవలం రికార్డుల్లో రాసుకొని పౌష్ఠికాహారం దుర్వినియోగం జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బయో మెట్రిక్ అమలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న 35 వేల అంగన్ వాడీ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు, వాటి పరిధిలో బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయాలన్నారు. ఆడిటింగ్ వీలుండేలా అన్ని రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచాలని చెప్పారు.

పైలెట్ ప్రాజెక్టుగా..

జీహెచ్ఎంసీ పరిధిలో జనాభాకు సరిపడే అంగన్వాడీ కేంద్రాలు లేనందున.., మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే చర్చ జరిగింది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సీఎం సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆరు నెలలకోసారి ప్రత్యేక వారోత్సవం నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో శానిటరీ నాప్కిన్స్ తయారీ చేయించాలని, అందుకు అవసరమైన యూనిట్లు నెలకొల్పాలని ఆదేశించారు. విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు.

అంగన్వాడీ భవన నిర్మాణాలు..

రాష్ట్రంలో ఉన్న వాటిలో ఇప్పటికే 12,315 అంగన్ వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయని.. వీటికి సొంత భవనాలను నిర్మించే ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం నిధులను జోడించి మొదటి ప్రాధాన్యతగా అంగన్వాడీ భవన నిర్మాణాలు చేపడుతామని చెప్పారు. రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా ఒకే డిజైన్‌తో అంగన్వాడీ కేంద్రాల బ్రాండింగ్ ఉండాలని సీఎం పలు సూచనలు చేశారు. చూడగానే ఆకర్షించేలా అంగన్వాడీ కేంద్రాల భవనాలన్నింటికీ ప్రత్యేకంగా డిజైన్ చేయాలని చెప్పారు.

వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్లు..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు | 5 % Reservation for Disabled Persons in Education and Job Opportunities
వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్లు..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు | 5 % Reservation for Disabled Persons in Education and Job Opportunities

మాతా, శిశు సంక్షేమం ఉట్టిపడే చిత్రాలు, ఆకర్షించే రంగులతో ఈ కేంద్రాలను అందంగా తీర్చిదిద్దాలని చెప్పారు. అవసరమైతే ఆరేండ్ల లోపు చిన్నారులకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ను అంగన్వాడీ కేంద్రాల్లోనే అందించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం సూచించారు.

5% దివ్యాంగులకు విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను..5 Percent  Reservation for Disabled Persons in Education and Job Opportunities

వికలాంగులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. చట్ట ప్రకారం ఉద్యోగాల్లో 4 శాతం, విద్యావకాశాల్లో 5 శాతం, అన్ని పథకాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఫైలు సిద్ధం చేసి పంపించాలని సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలో మరిన్ని వృద్ధాశ్రమాల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. ట్రాన్స్‌జెండర్లకు వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్లోనే వారికి చికిత్సలు చేస్తున్నారనే చర్చ జరిగింది. మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్ అన్నిట్లో ట్రాన్స్ జెండర్లకు వైద్య చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వ పథకాలన్నీ వారికి వర్తించేలా, వారికి సరైన అవకాశాలు కల్పించేందుకు, సంక్షేమానికి వీలుగా ప్రత్యేక విధానాన్ని తయారు చేయాల్సి ఉందని సీఎం అన్నారు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

5 % Reservation for Disabled Persons in Education and Job Opportunities

9 మందితో బీజేపీ తొలి జాబితా.. పంతం నెగ్గించుకున్న ఈటల రాజేందర్..| BJP Released Telangana MP Candidates First List With 9 Names For Lok Sabha Elections 2024

ఈ రాశి వారికి వారం మధ్యలో శుభవార్త, ఆకస్మిక ధనలాభం.. | Weekly Horoscope In Telugu 03/03/2024 to 09/03/2024

5 % Reservation for Disabled Persons in Education and Job Opportunities

నేటి నుంచే TS ధరణి స్పెషల్ డ్రైవ్..! | TS Govt Special Drive on Dharani Pending Applications Till March-9th 2024

దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు.. and To Set Up Biometrics In Anganwadi Centers

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.