చాప్టర్-3 తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం 1991-2014 | Telangana Movement Between 1991 to 2014 Part-3

Written by lsrupdates.com

Published on:

చాప్టర్-3 తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం 1991-2014 | Telangana Movement Between 1991 to 2014 Part-3

Telangana Movement Between 1991 to 2014 Part-3: ఈ పేజీలో తెలంగాణ ఉద్యమం లోని కొన్ని టాపిక్స్ i.e. ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏర్పాటు 2005, రోశయ్య కమిటీ, కేసీఆర్ రాజీనామా, జె ఎమ్ గిర్ గ్లాని కమిటీ, 2009 ఎన్నికలు పార్టీలు, కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష, తెలంగాణ ఉద్యమం విద్యార్థులు, శ్రీ కృష్ణ కమిటీ, తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ, మలిదశలో తెలంగాణ కోసం ఆత్మహత్యలు, తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం,కవులు, రచయితలు, గాయకులు, కళాకారుల పాత్ర గురించి తెలుసుకుందాం.

Telangana State Formation – మలిదశ ఉద్యమంలో వివిధ వర్గాల పాత్ర

ఉద్యోగులు

  • 2009 అక్టోబర్ 10న హైదరాబాద్ ఫ్రీజోన్ పై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా టీఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో టీఎన్జీవో భవన్ నుంచి ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం చేపట్టారు
  • 2009 నవంబర్ 21న మెదక్ జిల్లా సిద్దిపేటలో ‘ఉద్యోగ గర్జన’ చేపట్టారు
  • 2009 నవంబర్ 29న కేసీఆర్ నిరాహార దీక్ష ప్రారంభించిన 30న తెలంగాణ ఉద్యోగులు ‘పెన్ డౌన్’ కార్యక్రమం చేపట్టారు
  • ఫిబ్రవరి 17, 2011 నుండి మార్చి 3, 2011 వరకు తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులు సహాయ నిరాకరణ చేపట్టారు
  • జూన్ 19, 2011 న ‘హైదరాబాద్ కుక్స్ ఆన్ రోడ్స్’ అనే కార్యక్రమాన్ని ఉద్యోగ జేఏసీ విజయవంతం చేసింది
  • 13 సెప్టెంబర్ 2011 నుంచి అక్టోబర్ 24, 2011 వరకు సకల జనుల సమ్మెలో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి
  • సకల జనుల సమ్మెలో భాగంగా 11 అక్టోబర్ 2011న ఉద్యోగుల మహా ధర్నా నిర్వహించాయి
  • కరీంనగర్ లో 11 అక్టోబర్ 2011న నిర్వహించిన ‘ఉపాధ్యాయ మహా గర్జన’ ను విజయవంతం చేశారు
  • మార్చి 10, 2012 న నిర్వహించిన ‘మిలియన్ మార్చ్’ ను విజయవంతం చేశారు

జర్నలిస్టులు

  • మే 31, 2001 న బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో  తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పడింది
  • 2010 ఏప్రిల్ 28న ‘తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు’ అనే నినాదంతో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు
  • 2010 అక్టోబర్ 4న తెలంగాణ జర్నలిస్టుల ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ‘మీడియా మార్చ్’ నిర్వహించాయి
  • 2010 డిసెంబర్ 5న ఆర్టీసీ కళాభవన్ లో తెలంగాణ పాత్రికేయుల మహా సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్రీయ లోక్ దళ్ నేత అజిత్ సింగ్ హాజరయ్యారు
  • 2011 మే 19న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ ఆధ్వర్యంలో ‘ఒక చేత్తో కలం మరో చేత్తో ఉద్యమం’ అనే నినాదంతో ధర్నా నిర్వహించారు
  • 2012 అక్టోబర్ 16న V6, హెచ్ఎంటీవీ, టీ న్యూస్, నమస్తే తెలంగాణ వంటి మీడియా సంస్థలపై సీమాంధ్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాయి

న్యాయవాదులు

  • డిసెంబర్ 8, 2009న సుందరయ్య భవన్ లో న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది. దీనికి కన్వీనర్ గా రాజేందర్ రెడ్డి ఎన్నుకోబడ్డారు
  • ఫిబ్రవరి 22, 2010 న డిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద న్యాయవాదుల ధర్నా నిర్వహించారు
  • ఫిబ్రవరి 17, 2011 న సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా తెలంగాణలోని అన్ని కోర్టులను బహిష్కరించారు
  • ఫిబ్రవరి 20, 2011న చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చారు
  • జూన్ 19, 2011 L.B. నగర్ లోని రంగారెడ్డి కోర్టు వద్ద వంటావార్పు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గద్దర్, నాగం జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు
  • జూలై  5, 2011 న తెలంగాణ రాజకీయ జేఏసీ ఇచ్చిన 48 గంటల బంద్ కు మద్దతుగా కోర్టును బహిష్కరించారు
  • అక్టోబర్ 15-16, 2011 లో జరిగిన రైల్ రోకో కార్యక్రమం
  • సెప్టెంబర్ 30, 2011 న సాగరహారం
  • ఏప్రిల్ 29-30, 2010 లో ఢిల్లీలో జరిగిన సంసద్ యాత్రలో పాల్గొన్నారు.
  • 29 జూన్ 2013 న ప్రజాకోర్టులో చలో అసెంబ్లీ నిర్వహించారు
  • జూన్ 29, 2013న మాసాబ్ ట్యాంక్ లోని  వెటర్నరీ భవన్ లో ప్రజాకోర్టు నిర్వహించారు

మహిళలు

  • 1969 తొలి దశ ఉద్యమంలో టి.ఎన్.సదాలక్ష్మి ఈశ్వరీబాయి, సంగం లక్ష్మీబాయి లాంటి వారు పాల్గొన్నారు
  • మలిదశ తెలంగాణ ఉద్యమంలో బెల్లీ లలిత, విమలక్క, సంధ్య, జాగృతి కవిత, సూరేపల్లి సుజాత, అల్లం పద్మ, జ్యోతి కిరణ్, విజయశాంతి, పద్మాదేవేందర్ రెడ్డి, వనం ఝాన్సీ, రత్నమాల లాంటివారు చురుకైన పాత్ర పోషించారు
చాప్టర్-3 తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం 1991-2014 | Telangana Movement Between 1991 to 2014 Part-3
చాప్టర్-3 తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం 1991-2014 | Telangana Movement Between 1991 to 2014 Part-3
  • 2009లో ఏర్పడిన తెలంగాణ మహిళా ఐక్యకార్యాచరణ సమితి, 2010 జనవరి 31న రాష్ట్ర స్థాయి మహిళా సదస్సులను నిర్వహించింది
  • 2013 మార్చి 3న హైదరాబాద్ లోని ధర్నా చౌక్ (చిందు ఎల్లమ్మ వేదిక) లో మహిళా జెఏసి ధూం దాం నిర్వహించింది
  • దీనిని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, పీవోడబ్ల్యూ, స్త్రీ విముక్తి తెలంగాణ మహిళా జేఏసీలు సంయుక్తంగా నిర్వహించాయి

Telangana State Formation-ప్రవాస భారతీయు

తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(Telangana Development Forum)

  • 1999లో అమెరికాలో మొదటిసారిగా అందుకే రెడ్డి ప్రారంభించారు.
  • ఇది తెలంగాణ డాట్ కాం (www.telangana.com) అనే వెబ్ సైట్ ను ఏర్పాటు చేసింది.
  • 18 డిసెంబర్ 2011న తెలంగాణ డెవలప్ మెంట్  ఫోరం ఇండియా ఆధ్వర్యంలో కరీంనగర్ లోని రెవెన్యూ గార్డెన్ లో నాలుగో ప్రవాసీ తెలంగాణ దివస్ ను నిర్వహించింది.

తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్(Telangana NRI Association)

  • ఇది 2007లో ఏర్పడింది. దీనికి చైర్మన్ గా నారాయణస్వామి వెంకటయ్యలు, అధ్యక్షుడిగా వెంకట్ మారోజు నియమించబడ్డారు.
  • ఇది సకల జనుల సమ్మెకు మద్దతుగా అమెరికాలోని వాషింగ్టన్ లో 2011 అక్టోబర్ 15న ‘తెలంగాణ ప్రవాస్’ పేరిట భారీ ప్రదర్శనను నిర్వహించింది.

వైద్యులు(Doctors)

  • తెలంగాణ డాక్టర్స్ ఫోరం ను ఏర్పాటు చేసి దీనికి ఏ గోపాల్ కిషన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
  • తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డాక్టర్ రమేష్ నాయకత్వంలో పని చేయగా, డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పేరుతో డాక్టర్ల జెఎసి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో పనిచేసింది.
  • జనవరి 22, 2010 న తెలంగాణ వైద్య గర్జన పేరుతో ఉస్మానియా మెడికల్ కాలేజీలో సభ నిర్వహించారు.
  • 2011 మార్చి 1న పల్లెపల్లెకు పట్టాలపై కార్యక్రమంలో భాగంగా వైద్యులు పట్టాలపైన పాలీ క్లినిక్ పేరుతో వైద్య సేవలను అందించారు.
  • మే 15, 2013 వైద్యుల శంఖారావం పేరుతో రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో సభను నిర్వహించారు.

సంఘటిత – అసంఘటిత రంగాల పాత్ర(Low Category Employees)

  • ఇందులో సింగరేణి, రోడ్డు రవాణా సంస్థ, సిమెంట్ కంపెనీ, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న సంఘటిత వర్గాలు పాల్గొన్నాయి.
  • 2011 ఫిబ్రవరి 17 నుండి రాజకీయ జేఏసీ పిలుపు నిచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమంలో, సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించారు.
  • సింగరేణి కార్మికులు సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 17 వరకు, ఆర్టీసీ కార్మికులు సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 16 వరకు సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు.
  • 2010 మే 23న ప్రవేట్ సెక్టార్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన సదస్సు జరిగింది.
  • 19 జూలై 2012న ‘భూమిపుత్రుల పాదయాత్ర’ పేరుతో యాత్ర నిర్వహించారు.

సింగరేణి యాత్ర(Singareni Yaatra)

  • తెలంగాణ జెఏసి 2011 నవంబర్ 9న సింగరేణి యాత్ర చేపట్టాలని నిర్ణయించింది దీనికి మూడు బృందాలను ఏర్పాటు చేసింది.
  1. కోదండరాం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని కోల్ బెల్ట్  ప్రాంతాన్ని సందర్శించారు.
  2. టీ-జేఏసీ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రాంతంలో సందర్శించారు.
  3. టీ- జేఏసీ కో ఆర్డినేటర్ పిట్టల రవీందర్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో కోల్ బెల్ట్ ప్రాంతాన్ని సందర్శించారు.

Role of Internet in Telangana State Formation-తెలంగాణ ఉద్యమం ఇంటర్నెట్ పాత్ర

తెలంగాణ గప్ చుప్

  • దీనిని 2007లో తిరుపతిరావు అనే వ్యక్తి రూపొందించారు
  • దీని ద్వారా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన తాజా సమాచారాన్ని అందించబడుతుంది

తెలంగాణ నెటిజన్స్ ఫోరం

దీనిని 2011 అక్టోబర్ 9న దాసరి శ్రీనివాస్, వేణు రాంప్రసాద్, ప్రసన్న లు సంయుక్తంగా ప్రారంభించారు

మిషన్ తెలంగాణ

  • కొణతం దిలీప్ ఆధ్వర్యంలో మిషన్ తెలంగాణ వెబ్ సైట్ ను ప్రారంభించారు
  • పరకాల ప్రభాకర్ రచించిన ‘తెలంగాణ 101 అబద్ధాలు’ అనే పుస్తకంలోని విషయాలకు ఏ రీబల్టాల్ టూ విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగండ పేరుతో 101 వివరణలతో తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం సహకారంతో పుస్తకం రచించారు
చాప్టర్-3 తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం 1991-2014 | Telangana Movement Between 1991 to 2014 Part-3
చాప్టర్-3 తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం 1991-2014 | Telangana Movement Between 1991 to 2014 Part-3

తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్

  • దీనిని మక్తాల సందీప్ కుమార్ అధ్యక్షుడిగా స్థాపించారు
  • ఇది తెలంగాణ డిజిదాన్ కార్యక్రమం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా అనేక మందికి డిజిటల్ అక్షరాస్యతను అందించింది

డిస్కవర్ తెలంగాణ

2008 సెప్టెంబర్ 15న డిస్కవర్ తెలంగాణ ఇన్ కార్పొరేటెడ్ అనే సంస్థను అమెరికాలో ప్రారంభించడం జరిగింది డిస్కవర్ తెలంగాణ అనే వెబ్ సైటును  రూపొందించింది – జయప్రకాష్

Role of Castes and Social Issues in Telangana State Formation-కులాలు సామాజిక వర్గాల పాత్ర

వాల్మీకి బోయ యువజన సంక్షేమ సంఘం కావలి సత్య రాజ్
పిచ్చకుంట్ల హక్కుల పోరాట సమితి ఆశయా వంశరాజ్
గౌడ జన హక్కుల పోరాట సమితి-మోకు దెబ్బ విజయ్ కుమార్ గౌడ్ (కన్వీనర్)
పద్మశాలి హక్కుల పోరాట సమితి నేతమోత బోనగిరి శ్రీను
మున్నూరు కాపు హక్కుల పోరాట సమితి భత్తుల సిద్దేశ్వర (కన్వీనర్)
పూసలి హక్కుల పోరాట సమితి-పూసలి కేక పి వేదాంతం (అధ్యక్షులు)
కోలీయ దాసరి సంక్షేమ సంఘం చెన్నంశెట్టి దశరథం
తెలంగాణ మాదిగ ఆత్మగౌరవ పోరాట సమితి సిహెచ్ యాదగిరి మాదిగ (అధ్యక్షులు)
బుడి జంగాల హక్కుల పోరాట సమితి -తుంబూర కిన్నెరమోత రామచంద్రు, సిరి గిరి మన్యం
బుడబుడకల హక్కుల పోరాట సమితి రాములు
ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ దబ్బగట్ల నరసింగరావు (కన్వీనర్), పట్టం నారాయణ
లంబాడీ హక్కుల పోరాట సమితి తేజావత్ బెల్లయ్యనాయక్ (వ్యవస్థాపక అధ్యక్షులు)
ఎరుకల హక్కుల పోరాట సమితి- కుర్రు వలిగి ప్రభాకర్ (కన్వీనర్)
కుమ్మరి హక్కుల పోరాట సమితి-సల్ప దెబ్బ సిలివేరు పరుశురాములు
మాల సమరభేరి-మాలగృత దెబ్బ శంకర్ మాల (కన్వీనర్)
వడ్డెర హక్కుల పోరాట సమితి-గన్ను దెబ్బ తన్నీరు ధర్మరాజు (కన్వీనర్)
చాకలి హక్కుల పోరాట సమితి-చాకిరేవు దెబ్బ పూసవెల్లి సైదులు (కన్వీనర్)
బోయ హక్కుల పోరాట సమితి మానవ గోపి బోయ (అధ్యక్షులు)
ఆడ జన హక్కుల పోరాట సమితి పద్మ
గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి-డోల్ దెబ్బ బెల్లి కృష్ణ (కన్వీనర్)

Telangana Movement Between 1991 to 2014 Part-3

Important Incidents in Telangana State Formation-కొన్ని ముఖ్యమైన సంఘటనలు

జై తెలంగాణ పార్టీ

  • 1997లో పట్లోళ్ల ఇంద్రారెడ్డి జై తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు
  • ఇతను ఎవరి మాటలు వినకుండా తన అనుచరులను అన్ని పదవిలో నియమించడం వల్ల అతనికి సహకరించిన వారందరూ దూరమయ్యారు
    దీంతో ఇతను అప్పటి పీసీసీ అధ్యక్షుడు అయిన డాక్టర్ వైఎస్ఆర్ ఆధ్వర్యంలో జై తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు

ఫోరం ఫర్ ఫ్రీడం ఎక్సప్రెషన్ సభ

  • మొహాంజాహి మార్కెట్ దగ్గరలో గల అశోక్ థియేటర్ లో 1997లో ఫ్రీడమ్ ఎక్సప్రెషన్ పేరుతో సభను నిర్వహించారు.
  • ప్రముఖ జర్నలిస్ట్ అయిన గులాం రసూల్ ఖాన్ ఎన్ కౌంటర్ ను ఖండించడానికి కవులు, కళాకారులు ఈ సమావేశాన్ని నిర్వహించారు.
  • గద్దర్ రాసిన ‘అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా’ అనే పాటను మొదటి సారిగా ఈ సభలోనే పాడారు.
  • గాదె ఇన్నయ్య ముద్రించిన ‘దగాపడ్డ తెలంగాణ’ అనే పుస్తకాన్ని ఈ సభలోనే ఆవిష్కరించారు.

తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్.

  • తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ 1998 అక్టోబర్ లో ఏర్పడింది
  • ఈ సంస్థ అస్సాంలోని ‘అస్సాం గణపరిష’త్ వలె పోరాటాల ద్వారా మాత్రమే ప్రత్యేక తెలంగాణ సాధించగలమని ప్రజలకు విద్యార్థులకు బోధించారు

తెలంగాణ ఫోరం

  • కన్వీనర్ జానారెడ్డి
  • ఈ ఫోరం ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి వర్గం తెలంగాణకు జరిగిన అన్యాయాలపై 1992 సెప్టెంబర్ లో ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి  కి వినతి పత్రాలు సమర్పించారు
  • నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తరువాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో జానారెడ్డి కి మంత్రి పదవి లభించడంతో ఉద్యమం నుంచి తప్పుకున్నారు

Telangana State Formation-అఖిలపక్ష సమావేశం 2012

డిసెంబర్ 28, 2012 డిసెంబర్ 28న కేంద్ర హోమ్ శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్యపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి రాష్ట్రంలో ఉన్న ఎనిమిది రాజకీయ పార్టీలు హాజరయ్యాయి

1. కాంగ్రెస్(ఐ)

2. తెలుగుదేశం పార్టీ

3. తెలంగాణ రాష్ట్ర సమితి

4. భారతీయ జనతా పార్టీ

5. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా

6. సి పి ఐ(ఎం)

7. మజ్లీస్

8. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ

అఖిలపక్ష భేటీకి హాజరైన పార్టీల ప్రతినిధులు(Representative who attended the all party accord)

  1. TRS (టిఆర్ఎస్) కెసిఆర్, నాయిని నర్సింహారెడ్డి
  2. TDP (టిడిపి) యనమల రామకృష్ణుడు, కడియం శ్రీహరి
  3. YCP (వైసిపి) మైసూరారెడ్డి, కేకే మహేందర్రెడ్డి
  4. BJP (బిజెపి) కిషన్ రెడ్డి హరిబాబు
  5. CPI (సిపిఐ) నారాయణ, గుండా మల్లేష్
  6. CPM (సిపిఎం) రాఘవులు, జూలకంటి రంగారెడ్డి
  7. MIM (ఎంఐఎం) అక్బరుద్దీన్, అసదుద్దీన్
  8. CONGRESS కాంగ్రెస్ కె.ఆర్.సురేష్ రెడ్డి, గాదె వెంకటరెడ్డి

Andhra Pradesh Reorganization Process ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ

  • సీడబ్ల్యూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) ప్రకటన (CWC Statement on Telangana State Formation)
  • 2013 జూలై 30న హైదరాబాద్ తో కూడిన 10 జిల్లాల తెలంగాణ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించింది.
  • రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.
  • పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలని సీడబ్ల్యూసీ తీర్మానం యొక్క సారాంశం.
  • 2013 ఆగస్టు 5న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని పార్లమెంటులో చిదంబరం ప్రకటించారు.
ఆంటోనీ కమిటీ(Anthony Committee on Telangana State Formation)
  • 2013 ఆగస్టు 6న ఏకే.ఆంటోనీ అధ్యక్షుడిగా విభజన కమిటీ ఏర్పాటు చేశారు

కమిటీ సభ్యులు 

1. దిగ్విజయ్ సింగ్

2. వీరప్పమెయిలీ

3. అహ్మద్ పటేల్

  • 2013 అక్టోబర్ 3న కేంద్ర హోంశాఖ రూపొందించిన తెలంగాణ నోట్ ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది
  • సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పులు లేకుండా ఆమోదం తెలిపింది

జీవోఎం( గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) ఏర్పాటు(GOM on Telangana State Formation)

  • 2013 అక్టోబర్ 8న రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ చైర్మన్గ గా కేంద్ర మంత్రుల జీవోఎం ఏర్పాటు అయింది.

కమిటీ చైర్మన్ ఏకే ఆంటోనీ (రక్షణ మంత్రి)

కమిటీ సభ్యులు 

  1. సుశీల్ కుమార్ షిండే (హోం మంత్రి)
  2. చిదంబరం (ఆర్థిక మంత్రి)
  3.  వీరప్పమెయిలీ (పెట్రోలియం శాఖ మంత్రి)
  4.  జైరాం రమేష్ (గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి)
  5.  గులాం నబీ ఆజాద్ (ఆరోగ్య శాఖ మంత్రి)

ప్రత్యేక ఆహ్వానితుడు వి నారాయణ స్వామి 

  • రాష్ట్ర విభజన మీద సూచనలు సలహాలు ఇవ్వాలని మంత్రుల బృందం రాష్ట్ర పార్టీలను కోరింది.
  • కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, సీపీఐ, ఎంఐఎం లు తమ సూచనలతో నివేదికలు ఇచ్చాయి. మిగతా పార్టీలైన టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, సిపిఎం లు నివేదికలు ఇవ్వలేదు.

తెలంగాణపై పార్లమెంటరీ ప్రొసీడింగ్స్(Parliamentary Proceedings on Telangana) 

Telangana Movement Between 1991 to 2014 Part-3

  • 2013 నవంబర్ 11-12 తేదీల్లో అఖిలపక్షం ఏర్పాటు చేసింది.
  • 2013 డిసెంబర్ 5న పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాయి.
  • 2013 డిసెంబర్ 5న తెలంగాణ ముసాయిదా బిల్లు-2013ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
  • 10 జిల్లాలతో కూడిన తెలంగాణకు కేంద్రం ఆమోదం తెలిపింది తెలంగాణ లో సంతోషం వెల్లివిరిసింది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు (Telangana State Formation Bill in Andhra Pradesh Assembly)

  • 2013 డిసెంబర్ 12న బిల్లు రాష్ట్రానికి చేరింది
  • బిల్లుపై అభిప్రాయం చెప్పడానికి రాష్ట్రపతి ఇచ్చిన సమయం 6 వారాలు
  • 2013 డిసెంబర్ 16న బిల్లుపై డిప్యూటీ స్పీకర్ ‘మల్లు భట్టి విక్రమార్క’ చర్చను ప్రారంభించారు
  • సభలో గందరగోళం పరిస్థితి ఏర్పడటంతో సభ వాయిదా పడింది
  • ముఖ్యమంత్రి మాత్రం బిల్లుపై చర్చ మొదలు కాలేదని పేర్కొన్నారు
  • డిసెంబర్ 16న అసెంబ్లీలో బిల్లుపై చర్చ ప్రారంభమైందని శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు
  • 2013 డిసెంబర్ 19న తొలి విడత సమావేశాలు వాయిదా పడ్డాయి
  • 2013 డిసెంబర్ 31 న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబును శాసన సభ వ్యవహారాల శాఖ బాధ్యతల నుంచి తొలగించి మరొక మంత్రి శైలజానాథ్ కు  ఆ శాఖ బాధ్యతలు అప్పగించడం జరిగింది
  • సీఎం చర్యలకు నిరసనగా 2014 జనవరి 2న శ్రీధర్ బాబు మంత్రి పదవికి రాజీనామా చేశాడు
  • 2014 జనవరి 3న శాసనసభ మలివిడత సమావేశాలు మొదలయ్యాయి
  • 2014 జనవరి 6న అక్బరుద్దీన్ (ఎంఐఎం) అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రారంభమైనట్లు ప్రకటించాడు
  • 2014 జనవరి 8న బిల్లుపై రాష్ట్ర శాసనసభలో తొలి ప్రసంగం చేసిన వ్యక్తి మంత్రి – వట్టి వసంత కుమార్
  • 2014 జనవరి 10న టిఆర్ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ బిల్లుపై ప్రసంగించారు
  • 2014 జనవరి 22న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర పునర్విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నానని ప్రసంగించాడు.
  • 2014 జనవరి 23న ఒక వారం గడువు పెంచమని రాష్ట్రపతికి లేఖ పంపారు.
  • 2014 జనవరి 22న ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా బిల్లుపై ప్రసంగించాడు
  • ముఖ్యమంత్రి రూల్ 77 కింద బిల్లును వెనక్కి పంపాలని స్పీకర్ కు తీర్మానం నోటీసు ఇచ్చారు
  • రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పంపిన బిల్లుపై శాసనసభ అభిప్రాయాలు మాత్రమే చెప్పాలి
  • బిల్లును తిరస్కరించి, వెనక్కి పంపే అధికారం అసెంబ్లీకి లేదు ఓటింగ్ కు  కూడా అవకాశం లేదు
  • 2014 జనవరి 30న సభలో 87 మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. మిగిలిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను రాతపూర్వకంగా ఇచ్చారు. దీంతో సభ్యులు అభిప్రాయం రికార్డు అయ్యింది. బిల్లుపై చర్చ ముగిసిందని స్పీకర్ ప్రకటించారు.
  • ఈ ప్రకటన అనంతరం రూల్ 77 కింద ముఖ్యమంత్రి ఇచ్చిన తీర్మానం లో సభలో ఓటింగ్ కు తీసుకుంటున్నాను అని స్పీకర్ ప్రకటించాడు.
  • ఈ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును తిప్పి పంపుట కొరకు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదించారు.
  • 2014 ఫిబ్రవరి 4న రాష్ట్ర అసెంబ్లీ పంపిన అభిప్రాయాలకు జివోఎం ఆమోదం తెలిపింది
  • 2014 ఫిబ్రవరి 7న తెలంగాణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది
  • 2014 ఫిబ్రవరి 9న బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరుకుంది.
  • పార్లమెంటు సమావేశాలు మొదలైన తర్వాత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన కాంగ్రెస్ ఎంపీలు
  1. లగడపాటి రాజగోపాల్
  2. రాయపాటి సాంబశివరావు
  3. హర్ష కుమార్
  4. సబ్బం హరి
  5. సాయి ప్రతాప్
  6. ఉండవల్లి అరుణ్ కుమార్
  • 2014 ఫిబ్రవరి 11న అవిశ్వాసం పెట్టిన ఎంపీలను కాంగ్రెస్ అధిష్టానం పార్టీ నుండి సస్పెండ్ చేసింది

Telangana Bill in Parliament-పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు

  • 2014 ఫిబ్రవరి 14న హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ‘రాష్ట్ర పునర్విభజన బిల్లు’ను లోక్ సభలో ప్రవేశపెట్టారు.
  • బిల్లు ప్రవేశ పెడుతున్నట్లు షిండే ప్రకటిస్తున్న సమయంలో ఆంధ్ర ఎంపీలు గొడవ చేశారు.
  • ఈలోపు స్పీకర్ మీరాకుమార్ సభలో బిల్లును ప్రవేశ పెట్టినట్లు ప్రకటించారు.
  • 2014 ఫిబ్రవరి 14న ఎంపీ లగడపాటి రాజగోపాల్ లోక్ సభలో  పెప్పర్ స్ప్రే తో దాడి చేశాడు.
  • ఈ పెప్పర్ స్ప్రే వలన తీవ్ర అనారోగ్యమునకు గురైన ఎంపీ పొన్నం ప్రభాకర్ (కరీంనగర్ ఎంపీ).
  • ఈ సభలో గందరగోళానికి కారణమైన 16 మంది ఎంపీలను స్పీకర్ ఐదు రోజుల పాటు సస్పెండ్ చేశారు.
  • ఈ సస్పెండ్ అయిన వారిలో తెలంగాణ ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి.
  • 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ బిల్లుపై చర్చ మొదలైంది.
  • బిల్లుపై హోంమంత్రి షిండే మాట్లాడారు. లోక్ సభలో ప్రత్యక్ష ప్రసారాలు నిలిపి వేసి మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును 2014 ఫిబ్రవరి 18న ఆమోదించినట్లు స్పీకర్ మీరా కుమార్ తెలిపారు.
  • ఫిబ్రవరి 19, 2014 ఏపీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రం పై నిరసన వ్యక్తం చేస్తూ తన సీఎం పదవికి రాజీనామా చేశాడు.
  • లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బిజెపి పార్టీ ఫ్లోర్ లీడర్ సుష్మా స్వరాజ్ పరిపూర్ణ మద్దతు ఇవ్వడంతో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది.
  • 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో హోంమంత్రి షిండే బిల్లును ప్రవేశపెట్టారు.
  • రాజ్యసభలో బిజెపి ఫ్లోర్ లీడర్ అరుణ్ జైట్లీ తెలంగాణకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
  • విశాలాంధ్రను కోరుకుంటున్నామని సభ నుంచి సిపిఎం ఎంపీలు బైకాట్ చేశారు.
  • ‘ది బిల్ ఈస్ పాస్డ్’ అని డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ విభజించబడింది.
తెలంగాణ బిల్లు ఆమోదం(Approval of Telangana Bill in Parliament)
  • లోక్ సభలో ఆమోదం 2014 ఫిబ్రవరి 18
  • రాజ్యసభలో ఆమోదం 2014 ఫిబ్రవరి 20
  • రాష్ట్రపతి సంతకం 2014 మార్చి 1
  • కేంద్ర ప్రభుత్వం గెజిట్ 2014 మార్చి 2
  • 2014 మార్చి 2న కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ బిల్లు  చట్టబద్ధమైంది.
  • భారత దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది
  • 2014 మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం 2014 జూన్ 2 అని కేంద్రం ప్రకటించింది.

నోట్: రాష్ట్రంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన 1973 జనవరి 1 నుండి డిసెంబర్ 10 వరకు విధించారు

J M Girglani Commission-జె.ఎమ్. గిర్ గ్లాని కమిటీ

  • జూన్ 25, 2001న 610 జీవో అమలును పరిశీలించడానికి జె ఎమ్ గిర్ గ్లాని కమిటీ ఏర్పాటు చేసింది-నారా చంద్రబాబునాయుడు
  • ఇది ఏకసభ్య విచారణ కమిటీ
  • ఈ కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం గడువు పెట్టింది
  • ఈ కమిటీ విచారణకు ప్రభుత్వం సహకారం లేకపోవడంతో 25% ఉద్యోగుల జాబితాతో తొలి నివేదికను 2001 అక్టోబర్ లో ప్రభుత్వానికి సమర్పించింది
  • మొదటి మధ్యంతర నివేదికలో 25% ఉద్యోగుల తొలి జాబితా తయారు చేయబడింది

సూచనలు 

  • ఈ కమిషన్ రాష్ట్రపతి ఉత్తర్వులు 610 జీవో అమలు కోసం తాత్కాలికమైన, శాశ్వతమైన చర్యలను సూచించింది
  • సర్వీసు పుస్తకాలలో స్థానికత నమోదు జరగాలి
  • ఉల్లంఘలను సరిచేసిన తరువాత కొత్త నియమాకాలు, పదోన్నతులు చేపట్టాలి
  • రాష్ట్రపతి ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి
  • రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 అమలుపై శాశ్వత సభా కమిటీని చేయాలి
  • రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 అమలుపై శాశ్వత మంత్రుల కమిటీని చేయాలి
  • రాష్ట్రపతి ఉత్తర్వుల్లో 1975 అమలుపై శాశ్వత అధికారుల కమిటీని శాశ్వతంగా నియమించాలి
  • సాధారణ పరిపాలన శాఖ చూసే సర్వీసు నిబంధనల విభాగం బలోపేతం చేయాలి
  • జీవో 610 అమలులో ఉల్లంఘనలను అధ్యయనం చేయటానికి రాష్ట్ర శాసనసభ హౌస్ కమిటీని నియమించింది

Telangana Movement Between 1991 to 2014 Part-3

జీవో 610 పై హౌస్ కమిటీ 

  • జూన్ 15, 2001న ఆరు సూత్రాల పథకం అమలు పైన 5, 6 జోన్లలో జీవో నెంబర్ 610 అమలు పైన ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది
  • తెలంగాణ శాసనసభ్యులు డిసెంబర్ 29, 2001న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉద్యోగ నియామకాలలో స్థానికులకు జరిగిన అన్యాయాల గురించి ప్రశ్నించారు
  • దీనితో శాసనసభ హౌస్ కమిటీ నియమించబడింది.
  • ఈ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాష్ (టిడిపి ఎమ్మెల్యే)

610 జీవో అమలుకు ఉత్తమ్ కుమార్ కమిటీ 

  • 2006 డిసెంబర్ 6న 610 జీవో అమలు కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు
  • ఈ కమిటీ సభ్యుల లో ఉన్న సీమాంధ్ర ఎమ్మెల్యేలు కొంతమంది రాజీనామా చేయడంతో 610 జీవో అమలు కాలేదు

ప్రతాప్ కిషోర్ ఢిల్లీ పాదయాత్ర 

  • జర్నలిస్ట్ ప్రతాప్ కిషోర్ ప్రత్యేక తెలంగాణ అంశంనకు దేశవ్యాప్త మద్దతు కోసం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 1987 జూన్ 6న తన పాదయాత్రను చార్మినార్ నుండి ప్రారంభించారు
  • వీరు ఢిల్లీకి చేరుకుని ప్రధానమంత్రికి, కేంద్ర మంత్రులకు తెలంగాణ ఆవశ్యకతపై వినతి పత్రాలు సమర్పించారు
  • ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన అనంతరం వీరు తెలంగాణ ప్రజా సమితిని 1987లో పునరుద్ధరించారు దీనికి అధ్యక్షుడుగా భూపతి కృష్ణమూర్తి ఎన్నికయ్యారు

వెలిచాల జగపతిరావు నివేదిక 

  • 1991,1992 ప్రాంతంలో తెలంగాణ ప్రముఖ రాజకీయ నాయకుడు జగపతిరావు నీటిపారుదల రంగం పై నివేదికను ప్రచురించారు
  • ముఖ్యాంశాలు
  • కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతంలో తెలంగాణకు 1400 టిఎంసిల నీరు రావాలి. కానీ ఆంధ్రా పాలకులు తెలంగాణకు కేవలం 1170 టీఎంసీల నీరు పై హక్కు ఉన్నట్లు మాత్రమే చూపించారు
  • శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, జూరాల, సింగూరు, శ్రీశైలం ఎడమగట్టు కాలువ పూర్తయితే తెలంగాణలో 30 లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. కానీ ఆంధ్రా పాలకులు వీటిని పూర్తి చేయడం లేదు
  • తెలంగాణలో ప్రాముఖ్యత గల నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి సాంకేతిక, పరిపాలన మరియు ఆర్థిక కారణాలు చూపిస్తూ దశాబ్దాలుగా వీటిని పూర్తి చేయడం లేదు.

Main Temples in Telangana-తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలు

S.NO
దేవాలయం పేరు
జిల్లా
1 జైనథ్ దేవాలయం (లక్ష్మీనరసింహస్వామి) ఆదిలాబాద్
2 నాగోబా దేవాలయం(సేహంగా నాగదేవత) అదిలాబాద్ (కేస్లాపూర్)
3 జ్ఞాన సరస్వతి దేవాలయం నిర్మల్ (బాసర)
4 కంఠేశ్వర దేవాలయం నిజామాబాద్ (రెండో శాతకర్ణి నిర్మించబడింది)
5 హనుమాన్ దేవాలయం నిజామాబాద్ (సారంగాపూర్)
6 నవనాథ సిద్దేశ్వర దేవాలయం నిజామాబాద్ (ఆర్మూర్)
7 శ్రీ రఘునాథ ఆలయం నిజామాబాద్
8 శ్రీ రామాలయం నిజామాబాద్ (డిచ్ పల్లి)
9 శ్రీ రాజరాజేశ్వర దేవాలయం రాజన్న సిరిసిల్ల (వేములవాడ)
10 భీమేశ్వర స్వామి దేవాలయం రాజన్న సిరిసిల్ల (వేములవాడ)
11 శ్రీబద్ది పోచమ్మ దేవాలయం రాజన్న సిరిసిల్ల (వేములవాడ)
12 శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం జగిత్యాల (ధర్మపురి)
13 శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం జగిత్యాల (కొండగట్టు)
14 కేశవనంత స్వామి దేవాలయం జగిత్యాల (రాయికల్)
15 రుద్రేశ్వర ఆలయం (వేయి స్తంభాల గుడి) వరంగల్
16 ముక్తేశ్వర స్వామి ఆలయం జయశంకర్ భూపాలపల్లి (కాలేశ్వరం)
17 భధ్రకాళి దేవాలయం వరంగల్
18 రామప్ప దేవాలయం జయశంకర్ భూపాలపల్లి (వెంకటాపురం)
19 ఐనవోలు మల్లన్న దేవాలయం వరంగల్ రూరల్
20 కోటిలింగేశ్వర స్వామి దేవాలయం సిద్దిపేట
21 వనదుర్గ భవాని దేవాలయం మెదక్ (ఏడుపాయల)
22 శ్రీ కాశి విశ్వేశ్వర దేవాలయం సంగారెడ్డి(కలాబ్ గుర్ గ్రామం)
23 నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సిద్దిపేట (గజ్వేల్)
24 కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం సంగారెడ్డి (ఝరా సంఘం)
25 జోగులాంబ దేవాలయం జోగులాంబ గద్వాల్ (ఆలంపూర్)
26 నవబ్రహ్మ దేవాలయం జోగులాంబ గద్వాల్ (ఆలంపూర్)
27 బాల బ్రహ్మ దేవాలయం జోగులాంబ గద్వాల్ (ఆలంపూర్)
28 సోమేశ్వర స్వామి దేవాలయం నాగర్ కర్నూల్ (సోమశిల)
29 శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం యాదాద్రి (భువనగిరి)
30 పిల్లలమర్రి దేవాలయం (చెన్నకేశవస్వామి) సూర్యాపేట
31 పచ్చల సోమేశ్వర, ఛాయా సోమేశ్వర ఆలయం నల్గొండ (పాన్ గల్)
32 శ్రీ మీనాక్షి అగస్తేశ్వర దేవాలయం వాడపల్లి
33 శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం భద్రాచలం
34 గొల్ల గట్టు లింగమంతుల స్వామి దేవాలయం సూర్యాపేట (దురాజ్ పల్లి)
35 దుబ్బరాజన్న ఆలయం జగిత్యాల (పెంబట్ల-కోనాపూర్)
36 శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం పెద్దపల్లి (ఓదెల)
37 అంబ అగస్తేశ్వర ఆలయం కొమరం భీం ఆసిఫాబాద్ (చెన్నూరు)
38 బిర్లా మందిర్ హైదరాబాద్
39 చిలుకూరి బాలాజీ దేవాలయం రంగారెడ్డి
40 కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయం మేడ్చల్ మల్కాజిగిరి (కీసర)
41 కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయం సిద్దిపేట
42 శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయం జగిత్యాల (కోటిలింగాల)
43 ఉజ్జయిని మహంకాళి దేవస్థానం హైదరాబాద్
44 బల్కంపేట ఎల్లమ్మ హైదరాబాద్ (బల్కంపేట)
45 పెద్దమ్మ తల్లి దేవస్థానం హైదరాబాద్ (జూబ్లీహిల్స్)
46 శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం జయశంకర్ భూపాలపల్లి (మల్లూరు)

Telangana Movement Between 1991 to 2014 Part-3

Also Read 👇👇

Telangana Movement Between 1991 to 2014 Part-3

తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం 1991-2014 | Telangana Movement Between 1991 to 2014 Part-1

Telangana Movement Between 1991 to 2014 Part-3

చాప్టర్-2 తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం 1991-2014 | Telangana Movement Between 1991 to 2014 Part-2

Telangana Movement Between 1991 to 2014 Part-3

భారత రాజ్యాంగం – పరిణామ క్రమం – Evolution of Indian Constitution Quiz in Telugu – Part 1

 

Current Affairs Multiple Choice Questions (Quiz) – March 2024 Part-1

Telangana Movement Between 1991 to 2014 Part-3 Telangana Movement Between 1991 to 2014 Part-3 Telangana Movement Between 1991 to 2014 Part-3Telangana Movement Between 1991 to 2014 Part-3 # Telangana Movement Between 1991 to 2014 Part-3  #Telangana Movement Between 1991 to 2014 Part-3  #Telangana Movement Between 1991 to 2014 Part-3

Telangana Movement Between 1991 to 2014 Part-3 ##Telangana Movement Between 1991 to 2014 Part-3 #Telangana Movement Between 1991 to 2014 Part-3

Telangana Movement Between 1991 to 2014 Part-3 Telangana Movement Between 1991 to 2014 Part-3 Telangana Movement Between 1991 to 2014 Part-3Telangana Movement Between 1991 to 2014 Part-3 # Telangana Movement Between 1991 to 2014 Part-3  #Telangana Movement Between 1991 to 2014 Part-3  #Telangana Movement Between 1991 to 2014 Part-3

Telangana Movement Between 1991 to 2014 Part-3 ##Telangana Movement Between 1991 to 2014 Part-3 #Telangana Movement Between 1991 to 2014 Part-3

1 thought on “చాప్టర్-3 తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం 1991-2014 | Telangana Movement Between 1991 to 2014 Part-3”

  1. Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?

    Reply

Leave a Comment