చాప్టర్-2 తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం 1991-2014 | Telangana Movement Between 1991 to 2014 Part-2
Telangana Movement Between 1991 to 2014 Part-2: ఈ పేజీలో తెలంగాణ ఉద్యమం లోని కొన్ని టాపిక్స్ i.e. ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏర్పాటు 2005, రోశయ్య కమిటీ, కేసీఆర్ రాజీనామా, జె ఎమ్ గిర్ గ్లాని కమిటీ, 2009 ఎన్నికలు పార్టీలు, కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష, తెలంగాణ ఉద్యమం విద్యార్థులు, శ్రీ కృష్ణ కమిటీ, తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ, మలిదశలో తెలంగాణ కోసం ఆత్మహత్యలు, తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం,కవులు, రచయితలు, గాయకులు, కళాకారుల పాత్ర గురించి తెలుసుకుందాం.
Telangana State Formation Pranab Mukherjee Committee: ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏర్పాటు 2005
అధ్యక్షుడు: ప్రణబ్ ముఖర్జీ
సభ్యులు: దయానిధి మారన్, రఘు వంశ ప్రసాద్ సింగ్ .
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ‘విస్తృత అంగీకారం‘ కోసం ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన 2005లో ఒక ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తెలంగాణపై తమ అభిప్రాయం తెలపవలసిందిగా అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది.
కె సి ఆర్, నరేంద్ర, ఆచార్య జయశంకర్, టీఆర్ఎస్ ఎంపీలు స్వయంగా పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించే అన్ని రాజకీయ పార్టీల నేతలను కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వివరించారు.
ఈ కమిటీ యొక్క గడువు 8 వారాలు.
ఈ కమిటీకి 36 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రతిపాదనకు అనుకూలం
మాజీ ప్రధానమంత్రులు
దేవెగౌడ, చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్ పేయి, ఐ.కె.గుజ్రాల్ తెలంగాణకు అనుకూలం అని ప్రకటించారు.
- యూపీఏ కూటమిలోని 13 పార్టీలలో 11 పార్టీలు .
- యూపీఏ ప్రభుత్వాన్ని బయటనుండి సమర్థిస్తున్నారు 6 పార్టీలు.
- ప్రతిపక్షమైన ఎన్డీయే కూటమిలోని 8 పార్టీలు.
- కొంతమంది స్వతంత్ర సభ్యులు స్పష్టంగా తన సమ్మతిని తెలియజేస్తూ రాతపూర్వకంగా తెలిపారు.
వామపక్షాలు
ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సభ్యులు 3 అనుకూలం.
తటస్థం
- సమాజ్ వాద్ పార్టీ తెలంగాణ పై ఏ విధంగానూ స్పందించలేదు.
- 2008 అక్టోబర్ లో టిడిపి తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి నివేదిక ఇచ్చింది.
- యూపీఏ కూటమిలోని కాంగ్రెస్ పార్టీ ఈ ప్రక్రియ అంతా తమ ఆధ్వర్యంలోనే జరుగుతున్నందున తమ సమ్మతిని ప్రత్యేకంగా రాసి ఇవ్వవలసిన అవసరం లేదని తెలిపింది.
- 2006 సెప్టెంబర్ 12న ఎం.సత్యనారాయణ చేసిన సవాలును స్వీకరించిన కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి అక్టోబర్ 8న సిద్దిపేట సమర శంఖారావం పేరుతో సభను నిర్వహించారు.
- 2006 డిసెంబరు 4న కేసీఆర్ రాజీనామా చేసిన పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు నిర్వహించగా ఆ ఎన్నికల్లో కేసిఆర్ రెండు లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొంది డిసెంబర్ 22న నల్గొండ పట్టణంలో తెలంగాణ ఆత్మగౌరవ సభను నిర్వహించారు .
- నల్గొండ నగారా పేరుతో 2007 ఏప్రిల్ 6-12 వరకు ఫ్లోరైడ్ పీడిత గ్రామాలలో కేసీఆర్ పర్యటించాడు .
- 2007 జూలై 15న మైనారిటీ సంక్షేమం కోసం ఇందిరాపార్క్ వద్ద కేసీఆర్ ఒక్కరోజు నిరాహార దీక్ష చేశాడు .
- 2007 నవంబర్ 15న పసునూరు దయాకర్ రావు డిజైన్ చేసిన ‘తెలంగాణ తల్లి విగ్రహాన్ని’ తెలంగాణ భవన్ లో కేసీఆర్ ప్రతిష్టించాడు.
- 2008 మార్చి 2న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేసీఆర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించబడింది .
- 2008 జూన్ 1న ఉప ఎన్నికల ఫలితాలలో టిఆర్ఎస్ పార్టీ రెండు లోక్ సభ స్థానాలు (కరీంనగర్, హనుమకొండ) మరియు ఏడు అసెంబ్లీ స్థానాల్లో(సిద్దిపేట, దొమ్మాట, కమలాపూర్, హుజూరాబాద్, మేడారం, చేర్యాల, ఆలేరు) గెలుపొందింది .
- 2009 అక్టోబరు 21న మెదక్ జిల్లాలోని సిద్దిపేట లో ఉద్యోగ గర్జన నిర్వహించారు .
Telangana State Formation Rosaiah Committee-రోశయ్య కమిటీ
ఫిబ్రవరి 12, 2009 న ఆర్థిక మంత్రి రోశయ్య నేతృత్వంలో ఉభయ సభ సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు .
ఈ కమిటీకి చైర్మన్: రోశయ్య
సభ్యులు:
1) కొణతాల రామకృష్ణ
2) గీతారెడ్డి
3) ఉత్తమ్ కుమార్ రెడ్డి
4) శ్రీధర్ బాబు
5) పద్మరాజు
6) షేక్ హుస్సేన్
7) అక్బరుద్దీన్ ఓవైసీ
గిర్ గ్లాని కమిషన్
- 2001 జూన్ 25న తెలంగాణ ప్రజలను సంతృప్తిపరచడానికి 610 జీవో అమలు కొరకు గిర్ గ్లాని కమిషన్ ను ఏర్పాటు చేశారు .
- 2001 అక్టోబర్ 6న గిర్ గ్లాని కమిషన్ తన తొలి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది .
- 2004 సెప్టెంబర్ 30న గిర్ గ్లాని కమిషన్ తన తుది నివేదికను అందించింది .
- ఈ కమిషన్ 1975-2001 మధ్యకాలంలో అనేక ఉల్లంఘనలు జరిగాయని పేర్కొంది.
జె ఎమ్ గిర్ గ్లాని కమిటీ (J M Girglani Committee)
- జూన్ 25, 2001న 610 జీవో అమలును పరిశీలించడానికి జె ఎమ్ గిర్ గ్లాని కమిటీ ఏర్పాటు చేసింది-నారా చంద్రబాబునాయుడు .
- ఇది ఏకసభ్య విచారణ కమిటీ .
- ఈ కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం గడువు పెట్టింది .
- ఈ కమిటీ విచారణకు ప్రభుత్వం సహకారం లేకపోవడంతో 25% ఉద్యోగుల జాబితాతో తొలి నివేదికను 2001 అక్టోబర్ లో ప్రభుత్వానికి సమర్పించింది .
- మొదటి మధ్యంతర నివేదికలో 25% ఉద్యోగుల తొలి జాబితా తయారు చేయబడింది.
సూచనలు
- ఈ కమిషన్ రాష్ట్రపతి ఉత్తర్వులు 610 జీవో అమలు కోసం తాత్కాలికమైన, శాశ్వతమైన చర్యలను సూచించింది.
- సర్వీసు పుస్తకాలలో స్థానికత నమోదు జరగాలి .
- ఉల్లంఘలను సరిచేసిన తరువాత కొత్త నియమాకాలు, పదోన్నతులు చేపట్టాలి .
- రాష్ట్రపతి ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి .
- రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 అమలుపై శాశ్వత సభా కమిటీని చేయాలి .
- రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 అమలుపై శాశ్వత మంత్రుల కమిటీని చేయాలి .
- రాష్ట్రపతి ఉత్తర్వుల్లో 1975 అమలుపై శాశ్వత అధికారుల కమిటీని శాశ్వతంగా నియమించాలి .
- సాధారణ పరిపాలన శాఖ చూసే సర్వీసు నిబంధనల విభాగం బలోపేతం చేయాలి .
- జీవో 610 అమలులో ఉల్లంఘనలను అధ్యయనం చేయటానికి రాష్ట్ర శాసనసభ హౌస్ కమిటీని నియమించింది.
జీవో 610 పై హౌస్ కమిటీ
- జూన్ 15, 2001న ఆరు సూత్రాల పథకం అమలు పైన 5, 6 జోన్లలో జీవో నెంబర్ 610 అమలు పైన ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది .
- తెలంగాణ శాసనసభ్యులు డిసెంబర్ 29, 2001న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉద్యోగ నియామకాలలో స్థానికులకు జరిగిన అన్యాయాల గురించి ప్రశ్నించారు.
- దీనితో శాసనసభ హౌస్ కమిటీ నియమించబడింది.
- ఈ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాష్ (టిడిపి ఎమ్మెల్యే).
610 జీవో అమలుకు ఉత్తమ్ కుమార్ కమిటీ
- 2006 డిసెంబర్ 6న 610 జీవో అమలు కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు .
- ఈ కమిటీ సభ్యుల లో ఉన్న సీమాంధ్ర ఎమ్మెల్యేలు కొంతమంది రాజీనామా చేయడంతో 610 జీవో అమలు కాలేదు.
ప్రతాప్ కిషోర్ ఢిల్లీ పాదయాత్ర
- జర్నలిస్ట్ ప్రతాప్ కిషోర్ ప్రత్యేక తెలంగాణ అంశంనకు దేశవ్యాప్త మద్దతు కోసం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 1987 జూన్ 6న తన పాదయాత్రను చార్మినార్ నుండి ప్రారంభించారు .
- వీరు ఢిల్లీకి చేరుకుని ప్రధానమంత్రికి, కేంద్ర మంత్రులకు తెలంగాణ ఆవశ్యకతపై వినతి పత్రాలు సమర్పించారు.
- ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన అనంతరం వీరు తెలంగాణ ప్రజా సమితిని 1987లో పునరుద్ధరించారు దీనికి అధ్యక్షుడుగా భూపతి కృష్ణమూర్తి ఎన్నికయ్యారు.
వెలిచాల జగపతిరావు నివేదిక
- 1991,1992 ప్రాంతంలో తెలంగాణ ప్రముఖ రాజకీయ నాయకుడు జగపతిరావు నీటిపారుదల రంగం పై నివేదికను ప్రచురించారు .
- ముఖ్యాంశాలు .
- కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతంలో తెలంగాణకు 1400 టిఎంసిల నీరు రావాలి. కానీ ఆంధ్రా పాలకులు తెలంగాణకు కేవలం 1170 టీఎంసీల నీరు పై హక్కు ఉన్నట్లు మాత్రమే చూపించారు .
- శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, జూరాల, సింగూరు, శ్రీశైలం ఎడమగట్టు కాలువ పూర్తయితే తెలంగాణలో 30 లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. కానీ ఆంధ్రా పాలకులు వీటిని పూర్తి చేయడం లేదు .
- తెలంగాణలో ప్రాముఖ్యత గల నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి సాంకేతిక, పరిపాలన మరియు ఆర్థిక కారణాలు చూపిస్తూ దశాబ్దాలుగా వీటిని పూర్తి చేయడం లేదు..
Telangana State Formation-2009 ఎన్నికలు పార్టీలు పొత్తులు
- రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. సామాజిక న్యాయం పేరుతో నటుడు చిరంజీవి 2008 ఆగస్టు 26న ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు. సామాజిక తెలంగాణకు తాను కట్టుబడి ఉన్నానని ప్రకటించాడు .
- 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ వామపక్ష కూటమి కలిసి పోటీ చేసింది.
- అనంతర పరిస్థితుల్లో సిపిఎం, సిపిఐ, టిఆర్ఎస్ లు కాంగ్రెస్ కు దూరం అయ్యాయి .
- 2009 జనవరి 16న ‘తల్లి తెలంగాణ పార్టీ’ ని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు విజయశాంతి ప్రకటించారు .
- 2009 జనవరి 31న టిడిపి, టిఆర్ఎస్, సిపిఎం, సిపిఐ పార్టీల మధ్య పొత్తు కుదిరింది .
- ఉమ్మడిగా ‘మహాకూటమి’ పేరుతో ఎన్నికల బరిలోకి దిగాలని పార్టీలు నిర్ణయించాయి. ఈ పొత్తులో జయశంకర్ సార్ కీలకంగా వ్యవహరించారు .
- తెలంగాణకు తాను అనుకూలమని తెలంగాణపై సంయుక్త సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు 2009 ఫిబ్రవరి 12న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హడావిడిగా ప్రకటించాడు .
- తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్ కు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ 2009 ఫిబ్రవరి 28న సికింద్రాబాద్ లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించారు .
ఎన్నికల మేనిఫెస్టోలు
- టిడిపి తమ ఎన్నికల మేనిఫెస్టోలో తొలిసారిగా తెలంగాణ అంశాన్ని చేర్చింది .
- బిజెపి మరోసారి చిన్న రాష్ట్రాల ఏర్పాటు గురించి ప్రస్తావించింది .
- సిపిఐ జాతీయ విధానం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటును సమర్థించక పోయిన తెలంగాణకు సంబంధించినంత వరకు జాతీయ కార్యవర్గం మినహాయింపునిచ్చింది .
- సిపిఎం రాష్ట్రాల విభజనకు తమ పార్టీ వ్యతిరేకం అని మేనిఫెస్టోలో ప్రకటించింది .
- బి.ఎస్.పి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాము సుముఖుతమని మేనిఫెస్టోలో ప్రకటించింది .
- ప్రజారాజ్యం ‘సామాజిక తెలంగాణకు’ తాము కట్టుబడి ఉన్నట్లు తన మ్యానిఫెస్టోలో పేర్కొంది .
ఎన్నికలలో కాంగ్రెస్ విజయం
- ఏప్రిల్ 16న తెలంగాణలో మొదటి దశలో ఎన్నికలు పూర్తి అయ్యాయి .
- ఆ తరువాత ఆంధ్ర ప్రాంతంలో వైఎస్ఆర్ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చ గొడుతూ ప్రసంగించాడు.
- 2009లో కాంగ్రెస్ పార్టీ 152 సీట్లు గెలుచుకుని తిరిగి అధికారంలోకి వచ్చింది .
- టిఆర్ఎస్ కు రెండు ఎంపి స్థానాలు, పది అసెంబ్లీ స్థానాలు వచ్చాయి.
KCR Hunger Strike for Telangana – కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమని కేసీఆర్ ప్రకటించి నవంబర్ 29, 2009 నుండి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నాడు .
- కెసిఆర్ దీక్ష స్థలం -రంగదాంపల్లి (సిద్దిపేట).
- నవంబర్ 29న కేసీఆర్ కరీంనగర్ నుండి రంగదాంపల్లి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు .
- కెసిఆర్ ఖమ్మం జైలులోనే దీక్ష ప్రారంభించారు .
- ఈ పరిణామాల వల్ల “శ్రీకాంతాచారి” అనే యువకుడు ఎల్బీనగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
- 2009 డిసెంబర్ 4న శ్రీకాంతాచారి అమరుడయ్యిండు .
- ఈ ఉద్యమ తీవ్రతను గ్రహించిన ముఖ్యమంత్రి రోశయ్య 2009 డిసెంబర్ 7న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశాడు.
- ఈ సమావేశానికి తొమ్మిది రాజకీయ పార్టీలు హాజరయ్యాయి .
- డిసెంబర్ 7న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు మద్దతు పలికాడు .
- మొదటి నుండి సమైక్యాంధ్రకు అనుకూల మైన ఎంఐఎం, సీపీఐ(ఎం) తప్ప మిగిలిన పార్టీలు అన్ని తెలంగాణకు మద్దతు ఇచ్చాయి .
- 2009 డిసెంబర్ 8న నీమ్స్ సూపరిండెంట్ ప్రసాదరావు కేసీఆర్ దీక్ష విరమించకపోతే జీవితం ప్రమాదంలో పడుతుందని ప్రకటన విడుదల చేశాడు .
- డిసెంబర్ 9 నాడు ప్రధానమంత్రి రష్యాలో, ప్రణబ్ ముఖర్జీ విదేశీ పర్యటనలో ఉన్నారు.
- దాంతో 2009 డిసెంబర్ 9 నాడు కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రకటన ఏవిధంగా ఉండాలి అనే విషయంపై ప్రొఫెసర్ జయశంకర్ సార్ తో చర్చించాడు .
- అనంతరం 2009 డిసెంబర్ 9 రాత్రి 11:30 గంటలకు హోం మంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటుపై ఈ క్రింది విధంగా ప్రకటన జారీ చేశాడు.
- మొదటి ప్రకటన – “తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెడతారు” అని చిదంబరం పేర్కొన్నారు.
- తెలంగాణ ఏర్పాటుపై చిదంబర ప్రకటన అనంతరం కేసీఆర్ తో ప్రొఫెసర్ జయశంకర్ సార్ నిరాహార దీక్ష విరమింపజేసినాడు.
- తరువాత ఆంధ్రా లో జరిగిన సంఘటనల ఫలితంగా తిరిగి కేంద్ర హోం మంత్రి చిదంబరం డిసెంబర్ 23న మరొక ప్రకటనలు జారీ చేశారు .
- రెండవ ప్రకటన – “అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాం”.
Students Role in Telangana Movement – తెలంగాణ ఉద్యమం – విద్యార్థులు
- 1952లో చేపట్టిన గైర్ ముల్కీ ఉద్యమంలో, 1969లో చేసినా తెలంగాణ తొలి దశ ఉద్యమంలో, 1996 అనంతరం చేపట్టిన మలిదశ ఉద్యమంలో అనేక విద్యార్థి సంఘాలు పోరాడి 2014 జూన్ 2 న తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు విద్యార్థులు కీలకపాత్ర పోషించారు
- 2009 నవంబరు 1న తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు ‘తెలంగాణ విద్రోహదినం’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు
- కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన తరువాత ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం పూర్తిగా విద్యార్థుల చేతుల్లోకి వెళ్లింది
- 2009 డిసెంబర్ 10న ‘చలో అసెంబ్లీ’ కి పిలుపునిచ్చారు. కానీ 2009 డిసెంబర్ 9 అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ప్రకటించడంతో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు
విద్యార్థుల ఆమరణ దీక్ష
- 2009 డిసెంబర్ 24న ఓయూ లోని ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో 18 మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.
ఓయూ విద్యార్థి గర్జన
- రాజకీయంగా రెండు పరస్పర విరుద్ధ ప్రకటనలు రావటంతో రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు 2010 జనవరి 3న విద్యార్థి జేఏసీ ఓయూలో విద్యార్థి గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది .
- 2010 జనవరి 8న తెలుగు విశ్వవిద్యాలయంలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు.
విద్యార్థుల రణభేరి
- 2010 జనవరి 23న నిజాం కాలేజి గ్రౌండ్ లో ఏబీవీపీ విద్యార్థి రణభేరి పేరుతో సభను నిర్వహించారు.
- ఈ సభకు ముఖ్య అతిథిగా సుష్మాస్వరాజ్ హాజరయ్యారు.
విద్యార్థి పొలికేక సభ
- తెలంగాణ ప్రజలను చైతన్యం చేయడం కోసం విద్యార్థులు చేపట్టిన పాదయాత్ర వరంగల్ లో 2010 ఫిబ్రవరి 7న ముగింపు సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో ‘విద్యార్థి పొలికేక’ సభ జరిగింది .
- ఓయూ విద్యార్థి ఐకాస 2010 ఫిబ్రవరి 21న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది.
- తెలంగాణ రాజకీయ జేఏసీ రెండు విడతలుగా బస్సు యాత్రను నిర్వహించింది.
- మొదటి విడతగా 2010 మార్చి 21 నుండి 23 వరకు గన్ పార్క్ నుండి హనుమకొండ వరకు సాగింది .
- రెండో విడత కొమరవెల్లి నుంచి మంచిర్యాల వరకు 2017 ఏప్రిల్ 9 నుండి 12 వరకు నిర్వహించింది .
- 2010 మే 28న వరంగల్ జిల్లాలోని మానుకోట వద్ద జగన్ నిర్వహించిన ఓదార్పు యాత్రను తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకున్నారు .
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 2011 జూలై 11న ఓయూలో విద్యార్థుల సామూహిక నిరాహార దీక్షలు ప్రారంభించారు.
- 2013 జనవరి 24న కాకతీయ యూనివర్సిటీ లో తెలంగాణ విద్యార్థి బహిరంగ సభను నిర్వహించారు.
- 2013 జూన్ 14న నిర్వహించబడిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమంలో విద్యార్థులే అసెంబ్లీకి చేరి తెలంగాణ నినాదాలు చేశారు.
Sri Krishna Committee on Telangana State Formation-శ్రీ కృష్ణ కమిటీ
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితిగతుల పరిశీలనకు జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ ఫిబ్రవరి 3, 2010 లో ఏర్పడింది .
- కమిటీ చైర్మన్ – జస్టిస్ శ్రీ కృష్ణ రిటైర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి .
- కమిటీ సభ్యులు .
- ప్రొఫెసర్ రణబీర్ సింగ్ – వైస్ ఛాన్సలర్, జాతీయ న్యాయ కళాశాల, ఢిల్లీ .
- డాక్టర్ అబుసలే షరీఫ్- సీనియర్ ఫెలో, జాతీయ అనువర్తిత ఆర్థిక పరిశోధనా సంస్థ, ఢిల్లీ .
- ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ కౌర్ – సాంఘిక శాస్త్ర విభాగం, ఐఐటీ, ఢిల్లీ .
- కమిటీ కార్యదర్శి – వినోద్ కుమార్ దుగ్గల్ (రిటైర్డ్ ఐఏఎస్) .
- ఈ కమిటీ తన నివేదికను 2010 డిసెంబర్ 31 లోపు అందించాలని కేంద్రం నిర్దేశించింది .
- ఈ కమిటీ తన నివేదికను 2010 డిసెంబర్ 30న కేంద్రానికి అందజేసింది.
కమిటీ ప్రతిపాదనలు(Recommendations of Sri Krishna Committee)
- ఈ కమిటీ తన మొదటి సమావేశం ఫిబ్రవరి 13, 2010 న ఢిల్లీలో జరిగింది .
- శ్రీకృష్ణ కమిటీ నివేదికలో 505 పేజీలు 9 చాప్టర్లు ఉన్నాయి.
- ఉద్యమాన్ని సాధారణ శాంతిభద్రతల పరిస్థితిగా పరిగణించి కేంద్రం సాధారణ మద్దతు తీసుకుంటూ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవడం
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం .
- హైదరాబాద్ రాజధానిగా రాయలసీమ, తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు .
- ప్రత్యేక తెలంగాణ, పెద్ద కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు గుంటూరు, కర్నూలు, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని మండలాలను కలుపుకొని హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం .
- హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ప్రతి.
- ప్రధాన సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ తెలంగాణ ప్రాంతానికి రాజ్యాంగబద్ధ రక్షణ కల్పించడం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం.
- ఈ కమిటీ 6వ అంశాన్ని తమ తొలి ప్రాధాన్యత అంశంగా పేర్కొంది. అంటే పరోక్షంగా సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించింది
- ఒకవేళ 6వ అంశం అమలు చేయడం సాధ్యం కాకపోతే రెండవ ప్రాధాన్యత 5వ అంశం అని పేర్కొంది
- 8వ అధ్యాయం ను రహస్యంగా ఉంచి హోంమంత్రికి సమర్పించింది
- 8వ అధ్యాయం బహిర్గతంపై కోర్టులో తెలంగాణ వాది అయిన నిజామాబాద్ మాజీ ఎంపీ కేసు వేశారు
- 2011 మార్చి 23న హైకోర్టు న్యాయమూర్తి ఎల్.నరసింహారెడ్డి 8వ అధ్యాయం లోని కొన్ని అంశాలను కోడ్ చేస్తూ తీవ్ర విమర్శలతో కూడిన తీర్పు ఇచ్చాడు
- కానీ ఈ తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది
ప్రముఖుల నిరాహారదీక్షలు
- కొండా లక్ష్మణ్ బాపూజీ సత్యాగ్రహ దీక్ష .
2011 నవంబర్ 1 నుండి 2011 నవంబర్ 7 వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు .
- కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆమరణ దీక్ష .
2011 నవంబరు 1న నల్గొండలోని క్లాక్ టవర్ వద్ద దీక్ష చేపట్టారు .
- శ్రీమతి రాయబారపు నళిని (డిఎస్పి) నిరాహారదీక్ష .
2011 డిసెంబర్ 9 నుంచి 16 వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షను చేపట్టారు.
Telangana Political Joint Action Committee – తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ
తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) 2009 డిసెంబరు 24న ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా, పార్టీలకతీతంగా తెలంగాణ రాజకీయ కార్యాచరణ కమిటీ ఏర్పడింది.
- దీనికి కన్వీనర్ – ప్రొఫెసర్ కోదండరాం
- కో-కన్వీనర్ – మల్లేపల్లి లక్ష్మయ్య
జె ఏ సి లో చేరిన పార్టీలు
- టీఆర్ఎస్, కాంగ్రెస్, తెలంగాణ టిడిపి ఫోరం, బిజెపి, సిపిఐ, న్యూ డెమోక్రసీ.
- డిసెంబర్ 25, 2009న బంజారాహిల్స్ లోని రావి నారాయణరెడ్డి హాలులో జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది.
- 2010 ఫిబ్రవరి 18న జేఏసీ నుండి కాంగ్రెస్ తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
- తరువాత కాలంలో తెలంగాణ టిడిపి ఫోరం కూడా జేఏసీ నుంచి తప్పుకుంది.
తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక నిరసన కార్యక్రమాలను చేపట్టింది
ప్రజా ఉద్యమాలు నిరసన రూపాలు
- ఫిబ్రవరి 12, 2011 న తెలంగాణ రాజకీయ జేఏసీ సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా ప్రణాళికను ప్రకటించింది.
- 13 ఫిబ్రవరి 2011న గ్రామ గ్రామాన చాటింపులు, దీక్షా కంకణం .
- 14 ఫిబ్రవరి 2011న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు .
- 15 ఫిబ్రవరి 2011న జైల్ భరో కార్యక్రమం .
- 16 ఫిబ్రవరి 2011 న తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్, టీడీపీల ఎంపీ మరియు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నా .
- 17 ఫిబ్రవరి 2011న సహాయ నిరాకరణ కార్యక్రమం మొదలు దీనిలో భాగంగా ఉద్యోగులకు సంఘీభావ ర్యాలీలు .
- 18 ఫిబ్రవరి 2011న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు పికెటింగ్ .
- 19 ఫిబ్రవరి 2011న రాస్తారోకోలు, నేషనల్ హైవే-9 దిగ్బంధం, పట్టణాల్లో వాక్ ఫర్ తెలంగాణ, గ్రామాల్లో ప్రభాతభేరి .
- 20 ఫిబ్రవరి 2011న సార్వత్రిక సమ్మె , బంద్ ప్రారంభం.
తెలంగాణ జెఎసి నిరసన కార్యక్రమాలు
- 2010లో మానవహారం ఆదిలాబాద్ నుండి ఆలంపూర్ వరకు మరియు హైదరాబాద్ నుండి కోదాడ వరకు .
- 2011 జనవరి 10-11 కలెక్టరేట్ల ముట్టడి .
- 2011 జనవరి 19 న వంటావార్పు .
- 2011 ఫిబ్రవరి 17 నుండి మార్చి 4 వరకు సహాయనిరాకరణ .
- 2011 మార్చి 1న పల్లెపల్లె పట్టాలపైకి.
- 2011 మార్చి 10న మిలియన్ మార్చ్ .
- 2011 సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 24 వరకు సకలజనుల సమ్మె .
- 2012 సెప్టెంబర్ 30 న తెలంగాణ మార్చ్ / సాగరహారం .
- 2013 మార్చి 21 న సడక్ బంద్ .
- 2013 ఏప్రిల్ 29-30 న సంసద్ యాత్ర.
Suicides for Telangana-మలిదశలో తెలంగాణ కోసం ఆత్మహత్యలు
తెలంగాణాలో ఆత్మహత్యలపై ప్రచురించబడిన పుస్తకం – తెలంగాణ మూవ్ మెంట్ సుసైడ్స్, సాక్రిఫైసిస్, మార్టర్స్
- నిజామాబాద్ జిల్లా బిక్ నూర్ మండలంలోని శివాయిపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ కిష్టయ్య 2009 డిసెంబర్ 1న తన యొక్క సర్వీస్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు
- 2009 నవంబర్ 29న కేసీఆర్ అరెస్టుతో మనస్తాపానికి గురైన శ్రీకాంతాచారి అనే విద్యార్థి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మబలిదానానికి సిద్ధమయ్యారు ఇతను డిసెంబర్ 3వ తేదీన అంతిమ శ్వాస విడిచాడు. ఇతను నల్గొండ జిల్లాలోని మోత్కురు గ్రామానికి చెందిన వ్యక్తి. .
- 2010 జనవరి 19న ఓయూ విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నాడు
- తెలంగాణ ఉద్యమ తీవ్రత గురించి ఢిల్లీకి తెలియజేయాలని ఢిల్లీలో పార్లమెంటు ముందు ఆత్మహత్య చేసుకున్న యువకుడు యాదిరెడ్డి. ఇతను రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మంగళారం గ్రామానికి చెందిన వ్యక్తి.
- 2010 ఫిబ్రవరి 20న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం సమయంలో సిరిపురం యాదయ్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను రంగారెడ్డి జిల్లా మహేశ్వరపురం మండలం నాగారం గ్రామానికి చెందిన వ్యక్తి
- అసెంబ్లీ ముట్టడి సమయంలో యాదయ్య అనే విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ ఎన్.సి.సి గేటు వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు
- 2010 జనవరి 26 న అడ్వకేట్ దేవేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు
- 2010 జూలైలో ఉప ఎన్నికల ఫలితాల్లో డిఎస్ ఓడిపోవడంతో తన కోరిక నెరవేరిందని ఇషాన్ రెడ్డి ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఇతను మెదక్ జిల్లా న్యాలకల్ మండలం బసంతపురం గ్రామానికి చెందిన వ్యక్తి
- 2012 మార్చిలో సిరిపురం శ్రీకాంత్ అనే విద్యార్థి హైదరాబాదులో మరణించాడు
- లూనావత్ భోజ్యానాయక్ (వరంగల్ జిల్లా) అనే అతను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జరుగుతున్న జాప్యం, స్థానిక టిడిపి కాంగ్రెస్ నేతల తీరుపై కలతచెంది ‘ఐ వాంట్ తెలంగాణ జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేస్తూ హనుమకొండలోని సుబేదారి వద్ద 2012 మార్చి 23న పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు
Revivalism of Telangana Culture-తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం
తెలంగాణ అమరవీరుల స్థూపం (Telangana Martyr Statue)
- 1969 తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి స్మృత్యర్థం(In Memory) గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మించారు
- ఈ స్తూపాన్ని చెక్కిన శిల్పి- ఎక్కా యాదగిరి
- అమరవీరుల స్తూపం అడుగుభాగం నల్ల రాయి తో తయారు చేశారు
- నాలుగు వైపులా తొమ్మిది చొప్పున చిన్న రంధ్రాలు ఉన్నాయి. ఇది అమరవీరుల శరీరంలో దూసుకుపోయిన బుల్లెట్స్
- స్థూపాన్ని ఎరుపు రాయి తో నిర్మించారు. ఇది త్యాగానికి, సాహసానికి నిదర్శనం
- స్థూపం మధ్య భాగంలో ఒక స్థంభం ఉంటుంది. ఏ వైపు చూసినా దానిపై 9 గీతలు కనిపిస్తాయి. ఇది తొమ్మిది జిల్లాలకు నిదర్శనం
- పై భాగంలో అశోకుని ధర్మచక్రం ఉంటుంది. ఇది ధర్మం, శాంతి, సహనానికి గుర్తు.
తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Talli Statue)
- తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించడంలో ముఖ్య పాత్ర పోషించిన వారు బి ఎన్ రాములు, బి.వి.ఆర్ చారి, ప్రొఫెసర్ గంగాధర్
- పసునూరి దయాకర్ తయారుచేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ భవన్ లో 2007 నవంబర్ 15న కేసీఆర్ ఆవిష్కరించారు
ఈ విగ్రహం ప్రత్యేకతలు
- కిరీటంలో, వడ్డానం లో ప్రసిద్ధి చెందిన కోహినూరు, జాకబ్ వజ్రాలను పోలి ఉంటాయి
- పట్టుచీర – పోచంపల్లి, గద్వాల చీరలకు గుర్తుగా
- కాలి మెట్టెలు – ముత్తయిదువుకు చిహ్నంగా
- వెండి మెట్టలు – కరీంనగర్ ఫిలిగ్రీ ఆభరణాలకు చిహ్నంగా
- చేతిలో మొక్కజొన్న – తెలంగాణ మెట్ట ప్రాంతాలకు గుర్తుగా
- ఇంకో చేతిలో బతుకమ్మ – తెలంగాణ పండుగకు గుర్తుగా
- తెలంగాణ ప్రాంతంలోని సంస్కృతి, కళా రూపాల, జానపదులు, సాహిత్యం, తెలంగాణ ప్రాంతం మాండలికం మొదలైనవి పరిరక్షించడానికి తెలంగాణ జాగృతి సాంఘిక-సాంస్కృతిక సంస్థ 2008 జూన్ లో ఏర్పడింది
- దీనిని కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసింది.
- పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించడానికి తెలంగాణ జాగృతి బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది
- తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాల్లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించి, వాటికి విశిష్ట ముగింపుగా హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ పై లక్షలాది మంది ప్రజలతో బతుకమ్మ పండుగ జరిపి సాంస్కృతిక కవాతు నిర్వహిస్తారు.
Revivalism of Telangana Culture – కవులు రచయితలు గాయకులు కళాకారుల పాత్ర
- సింగిడి తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో దిమ్మిస అనే కవితా సంకలనం వెలువరించారు. ఇది మిలియన్ మార్చ్ లో విగ్రహాల విధ్వంసం నేపథ్యంగా వచ్చింది
- సుంకర రమేష్ 2006 నుంచి మొదలుకొని 2010 వరకు వరుసగా ఐదు తెలంగాణ కవితా సంకలనాలను తీసుకువచ్చారు
- జయ శిఖరం పేరిట వేముగంటి మురళీకృష్ణ సంపాదకత్వంలో తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్ స్మృతి కవిత సంకలనం వెలువడింది
- ముత్తడి సంకలనాన్ని అంబటి సురేందర్ రాజు, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి తీసుకువచ్చారు
- పొక్కిలి కవితాసంకలనాన్ని 2002లో జూలూరి గౌరీశంకర్ తీసుకువచ్చారు
- 1969-1973 తెలంగాణ ఉద్యమ కవిత్వం సంకలనాన్ని సంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి తీసుకువచ్చారు
- ముండ్ల గర్ర జూలూరి గౌరీశంకర్ “నది పుట్టు బడి, ఇక్కడి చెట్ల గాలి”ని డాక్టర్ నందిని సిద్ధారెడ్డి, “చెట్టును దాటుకుంటూ” ను జూకంటి జగన్నాథం, పొద్దుపొడుపు, “పొక్కిలి వాళ్ళ పులకింత” ను అన్నవరం దేవేందర్, జఖ్ము ఆవాబ్ ను స్కైబాబు వెలువరించారు.
ఇతరాలు
- లడాయి – డా. పసునూరి రవీందర్
- ఎర్ర మట్టి బండి – తదల అంజయ్య
- పిడికిలి – బిళ్ళ మహేందర్
- ముల్కీ – వేముల ఎల్లయ్య
- యాళ్లయింది – డా. ఉదారి నారాయణ
- నెగడు – చింతల ప్రవీణ్
- జంగ్ – దానక్క ఉదయభాను
- జాగో జాగావో, క్విట్ తెలంగాణ, రజ్మియా, జఖ్ము నవాబ్ – స్కైబాబా
- మనం – 2012 సంవత్సరంలో వేముగంటి మురళీకృష్ణ
- మల్లు బండ – అన్నవరం దేవేందర్
- మశాల్ – దీర్ఘకవిత – వనపట్ల సుబ్బయ్య
- జిగర్ – డా. కె లావణ్య, అనిశెట్టి రజిత
- కావడి కుండలు – డా. కోయి కోటేశ్వరరావు
వ్యాస సంకలనాలు
- సంభాషణ – డా. కె శ్రీనివాస్
- గనుమ – డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి
- ముద్దెర – డా. ముదిగంటి సుజాతారెడ్డి
- ప్రాణహిత – అల్లం నారాయణ
- ఆవర్తనం – నందిని సిద్ధారెడ్డి
కథలు
- తెలంగాణ చౌక్ – కర్ర ఎల్లారెడ్డి, బి.వి.ఎన్ స్వామి
- మా పంతులు – డా. బి యశోదారెడ్డి
- యుద్ధ నాదం – పెద్దింటి అశోక్ కుమార్
- కొత్త రంగులు అద్దుకున్న కళ – బెజ్జారపు రవీందర్
- నాలుగు కోట్ల పిడికిళ్ళు – వెల్దండి శ్రీధర్
- తెలంగానం – ఓదుల వెంకటేశ్వర్లు
నవలలు
- సలాం హైదరాబాద్ – పురావస్తు లోకేశ్వర్
- ముళ్ళ పొదలు – అంపశయ్య నవీన్
- లోచూపు – బి.ఎస్.రాములు
పాటలు
- అమ్మ తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద – గద్దర్
- అయ్యోనివా నువ్వు అవ్వోనివా – గూడ అంజయ్య
- జయ జయహే తెలంగాణ, జై బోలో తెలంగాణ, బొమ్మ చెక్కితే బొమ్మ మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు -అందెశ్రీ
- నాగేటి సాళ్లల్లో నా తెలంగాణ – నందిని సిద్ధారెడ్డి
- పల్లే కన్నీరు పెడుతుందో, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా – గోరటి వెంకన్న
- వీరులారా వందనం – దరువు ఎల్లన్న
- రాతి బొమ్మల్లోనా – మిట్టపల్లి సురేందర్
- చినుకు చినుకు కురిసిన నేత చిత్రమూన వాసన, ఆడుదాం డప్పుల్లా దరువు, ఎందుకు రాలిపోతావురా నువ్వు ఎందుకు కాలిపోతావు – మిత్ర
- జై కొట్టు తెలంగాణ – డా.పసునూరి రవీందర్
- ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణం – అభినయ శ్రీనివాస్
- పల్లెటూరి పిల్లగాడో – సుద్దాల హనుమంతు
- బండి వెనక బండి కట్టి నైజం సర్కరోడా – బండి యాదగిరి
- నోట్: తెలంగాణ రచయితల వేదిక “విరుగుడు” అనే వ్యాస సంకలనాన్ని 13 ఏప్రిల్ 2013న ట్యాంక్ బండ పై గల పోతన విగ్రహం వద్ద ఆవిష్కరించారు.
తెలంగాణలోని చిత్రకారులు
కాపు రాజయ్య, తోట వైకుంఠం, కే లక్ష్మణ్ గౌడ్, ఏలె లక్ష్మణ్.
తెలంగాణలోని సినీ రంగ ప్రముఖులు
పైడి జయరాజ్, శ్యాంబెనగల్, బి.నరసింగరావు, ప్రభాకర్ రెడ్డి, కాంతారావు, శంకర్ (జై బోలో తెలంగాణ), రోశం బాలు, కందికొండ యాదగిరి, శ్రీనాథ్, చంద్రబోస్, రఫీ .
జానపద కళాకారులు
మిద్దె రాములు (ఒగ్గు కథ), చిందే ఎల్లమ్మ (చిందు యక్షగానం), దర్శనం మొగులయ్య (12 మెట్లకిన్నెర).
తెలంగాణలోని శిల్పకారులు
ఎక్క యాదగిరి (అమరవీరుల స్తూపం నిర్మాత), బి వి ఆర్ చారి (తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త), రమణ.
Also Read 👇👇
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.