...

తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం 1991-2014 | Telangana Movement Between 1991 to 2014 Part-1

Written by lsrupdates.com

Published on:

తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం 1991-2014 | Telangana Movement Between 1991 to 2014 Part-1

Telangana Movement Between 1991 to 2014 Part-1: ఈ పేజీలో తెలంగాణ ఉద్యమం లోని కొన్ని టాపిక్స్ i.e. 1970 నుంచి 2000 వరకు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ నిర్మాణ పూర్వదశ 1984-2014, రాజకీయ ప్రక్రియ దశ 2001 నుంచి, తెలంగాణ ఉద్యోగుల సంఘాలు, తెలంగాణ సాంస్కృతిక రచయిత సంఘాలు, తెలంగాణ విద్యార్థి సంఘాలు, మలిదశ ఉద్యమం, 2004 ఎన్నికల పొత్తులు గురించి తెలుసుకుందాం.

Telangana Movement Between 1991 to 2014 Part-1

1970 నుంచి 2000 వరకు తెలంగాణ ఉద్యమం 

1973 నుంచి 1983 మధ్య కాలంలో ఒక దశాబ్ద కాలం పాటు తెలంగాణ ఉద్యమకారులు స్తబ్దంగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ప్రత్యేక తెలంగాణ వాదుల్లో కదలికలు వచ్చింది
1984 నుండి ప్రారంభమైన మలిదశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని అధ్యయనం చేయడానికి మూడు దశలుగా విభజించవచ్చు.

  • నిర్మాణ పూర్వదశ 1984-1996
  • నిర్మాణ దశ 1996-2001
  • రాజకీయ ప్రక్రియ దశ 2001-2014

1983లో జరిగిన హిమాయత్ నగర్ ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి అయిన ఉపేంద్ర బిజెపి అభ్యర్థి అయిన అలె నరేంద్ర తెలంగాణ వారి మద్దతుతో విజయం సాధించారు. ఉపేంద్ర ఓటమితో తెలంగాణవాదుల్లో కొత్త ఉత్సాహం ఏర్పడింది.

నిర్మాణ పూర్వదశ 1984-1996

తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్(Telangana Democratic Front) 
హిమాయత్ నగర్ ఎన్నికల్లో పి ఉపేంద్ర ఓటమి పొందడంతో సంతోషించిన తెలంగాణవాదులు వై.ఎం.సి.ఎ  హాలులో ఈ సదస్సును  నిర్వహించారు.
దీనికి కన్వీనర్ సత్యనారాయణ

తెలంగాణ పార్టీ 1984వ సంవత్సరంలో దేవా నంద స్వామి వరంగల్ లో తెలంగాణ పార్టీని స్థాపించారు.

తెలంగాణ జనసభ ఇది కూడా సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పడింది.
తెలంగాణ జనసభ 1985 ఫిబ్రవరి 17న ఆంధ్ర సారస్వత పరిషత్ హాలులో పెద్ద సదస్సును నిర్వహించింది.
తెలంగాణ జనసభ నాయకులు కొత్తగూడెం, వరంగల్ పట్టణాల్లో సభలు నిర్వహించారు.
ఈ సభలోని నాయకులు ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి, హోంమంత్రి వై వి చవాన్ కు వినతి పత్రాలు సమర్పించారు.

ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ
ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో ప్రొఫెసర్ లక్ష్మణ్ అధ్యక్షతన సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వారికి జరుగుతున్న నష్టాల గురించి చర్చించేందుకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా దాశరథి కృష్ణమాచార్యులు.
ఈ సదస్సులో ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ అనే ప్రజా సంఘం ఏర్పడింది. దీనికి అధ్యక్షులుగా ప్రొఫెసర్ జి లక్ష్మణ్ ఎంపికయ్యారు.
ఇది నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ మ్యాప్ తో కూడిన మా తెలంగాణ గ్రీటింగ్స్ ను పంపిణీ చేసింది.
ఇది తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తో కలిసి కాళోజీ చేతుల మీదుగా తెలంగాణ పొలిటికల్ మ్యాప్ ను విడుదల చేసింది.
ఈ ఫోరం సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తి దినంగా, నవంబర్ 01ని తెలంగాణ విద్రోహ దినంగా పాటిస్తూ కొన్ని సంవత్సరాలపాటు ఉస్మానియా యూనివర్సిటీలో అవగాహన సదస్సులు నిర్వహించింది.

తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ 

టీ ప్రభాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ 1988 జూలై 14 న ఏర్పడింది
దీనిలోని సభ్యులు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, ప్రొఫెసర్ జయశంకర్ సార్, ప్రభాకర్ రావు, హరినాథ్.

దీని యొక్క లక్ష్యాలు 

1) తెలంగాణ అన్యాయాలపై పరిశోధన
2) ఈ అన్యాయాలకు సంబంధించిన ప్రచురణలు ముద్రించడం
ఈ ట్రస్ట్ కు సంబంధించిన పత్రిక మా తెలంగాణ పత్రిక. దీనిని 1989 ఆగస్టు 13న కాచిగూడలోని బసంత్ టాకీస్ లో ఆవిష్కరించారు.
మా తెలంగాణ ఈ పత్రిక యొక్క ప్రత్యేక సంచికలు (Special Issues of Maa Telangana)
1) 1989లో కల్వకుర్తి ఎన్నికల్లో ఎన్టీఆర్ పోటీ చేసినప్పుడు
2) 1997లో మలిదశ ఉద్యమం ప్రారంభమైనప్పుడు
3) 2001లో టిఆర్ఎస్ ఏర్పడినప్పుడు
తెలంగాణలో జరుగుతున్న దోపిడీపై 1988 లో ముద్రించిన పుస్తకం పర్స్పెక్టివ్ తెలంగాణ(Perspective on Telangana)

తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ 

దీనిని 1992లో ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడు మనోహర్ రెడ్డి.
ఈ ఆర్గనైజేషన్ ఉస్మానియా యూనివర్సిటీ, దాని అనుబంధ కాలేజీలలో స్థానిక స్థానికేతర రిజర్వేషన్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమించారు.
వీరు కళాశాలలో సీట్ల కోసం ఉద్యమం ప్రారంభించిన తరువాత క్రమక్రమంగా తెలంగాణ వారు ఎదుర్కొంటున్న అన్యాయాలను వెలికి తీసింది.
దీనిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన వారు మేచినేని కిషన్ రావు, పురుషోత్తం రెడ్డి, మదన్ మోహన్, సిహెచ్ లక్ష్మయ్య.

నిర్మాణ దశ 1996-2001 

నిజామాబాద్ సభ(Nizamabad Sabha) 
  • 1996 అక్టోబర్ 27న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ ప్రజాసంఘాల నాయకులు నిజామాబాద్ లో సభను నిర్వహించారు
  • ఈ సభలో పాల్గొన్న ముఖ్యనాయకులు కాళోజీ రావు, ప్రొ. జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, భూపతి కృష్ణమూర్తి, గద్దర్, రఘువీరారావు.
  • ఈ సభ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తెలంగాణ ప్రాంత సమస్యలకు ఏకైక పరిష్కారం అని తీర్మానించింది.

భువనగిరి సభ(Bhuvanagiri Sabha)

  • 1997 మార్చి 8, 9 తేదీలలో ఈ సభ జరిగింది
  • ఈ సదస్సు ప్రాంగణానికి “నిజాం వ్యతిరేక పోరాటాలు అమరవీరుల ప్రాంగణం”గా నామకరణం చేశారు
  • ఈ సభకు “దగాపడ్డ తెలంగాణ” గా నామకరణం చేశారు
  • ఈ సభను కాళోజీ నారాయణ రావు ప్రారంభించారు
  • మార్చి 9వ తేదీన జరిగిన సభకు నాగారం అంజయ్య అధ్యక్షత వహించారు
  • ఈ సభలో వివిధ మేధావులు ప్రసంగించిన భిన్న అంశాలు
  • విద్య వైద్య రంగం ప్రొఫెసర్- జయశంకర్ సార్
  • తెలంగాణ వనరులు పారిశ్రామిక కాలుష్యం- ప్రొఫెసర్ జాదవ్ సార్
  • వలసీకరణ ఉద్యోగాలు- ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు
  • తెలంగాణ ఉద్యమం అవగాహన-గద్దర్, వెంకటేశ్వర్లు
  • భాషా సంస్కృతి మీడియా-నందిని సిద్ధారెడ్డి
  • సాంఘిక సంక్షేమ రంగం-ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
  • రిజర్వేషన్లు వర్గీకరణ-డాక్టర్ ముత్తయ్య
  • ఆదివాసి సమస్యలు-ప్రొఫెసర్ బాల జనార్ధనరావు
  • ఈ రెండు రోజుల సమావేశంలో తన ఉద్యమ పాటలతో బెల్లి లలిత తెలంగాణవాదులు ఉద్యమంలో పాల్గొనే విధంగా ప్రేరేపించింది

తెలంగాణ మహాసభ(Telangana Mahasabha) 

  • 1997 ఆగస్టు లో తెలంగాణ మహాసభ ఏర్పడింది దీని లో కీలక పాత్ర పోషించింది మారోజు వీరన్న
  • 1997 ఆగస్టు 11న సూర్యాపేటలో “ధోఖాతిన్న తెలంగాణ” పేరుతో సదస్సు జరిగింది
  • ఈ సదస్సుకు అధ్యక్షత వహించింది – డా. చెరుకు సుధాకర్
  • ఈ సభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వారు -వి ప్రకాష్
  • 17 డిమాండ్లతో “సూర్యాపేట డిక్లరేషన్” ను డాక్టర్ చెరుకు సుధాకర్ ప్రతిపాదించారు
  • ఈ సంస్థ ఆధ్వర్యంలో మారోజు వీరన్న తెలంగాణ ఉద్యమంలోకి దళిత, బహుజనులను పెద్ద మొత్తంలో సమీకరించారు
  • తరువాత కాలంలో మారోజు వీరన్న ఎన్ కౌంటర్ లో మరణించారు
  • తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తెలంగాణ మహాసభ మాస పత్రికను వి ప్రకాష్ వెలువరించారు

ఉద్యమ వేదికలు 

సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్(Center for Telangana Studies): 
  • దీనిని 1997 లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్థాపించారు.
  • దీనికి అధ్యక్షులు: ప్రొఫెసర్ జయశంకర్
  • ఇది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వివరాలు సేకరించి ప్రచురించి ప్రభుత్వం ప్రజల దృష్టికి తీసుకెళ్లింది
తెలంగాణ స్టడీస్ ఫోరం(Telangana Studies Forum) :
  • దీన్ని 1998లో ఏర్పాటు చేశారు.
  • దీనికి అధ్యక్షుడు గాదె ఇన్నయ్య
  • ఈ ఫోరం తెలంగాణ సమస్యలపై కరపత్రాలు పుస్తకాలను ముద్రించి ప్రజల్లో అవగాహన చేపట్టింది
తెలంగాణ ఐక్యవేదిక(Telangana Ikya Vedika): 
  • 1997 ఆగస్టు 16న జయశంకర్ సార్ నేతృత్వంలో తెలంగాణ ఐక్యవేదిక ఏర్పడింది
  • మొదట్లో ఈ ఐక్యవేదిక కాచిగూడలోని సుప్రభాత కాంప్లెక్స్ లో ఉండేది
  • తరువాత కాలంలో ఐక్యవేదిక కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమయిన జలదృశ్యంలోకి మార్చబడింది
  • ఈ ఐక్యవేదిక కార్యాలయం 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం గా మారింది
  • తెలంగాణ ఐక్యవేదిక అనేక సదస్సులు సమావేశాలు పెట్టినప్పటికీ తెలంగాణ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చలేకపోయింది
  • తర్వాత కాలంలో కేసీఆర్ తెలంగాణ విషయంలో శ్రద్ధ వహించడం తో తెలంగాణ ఐక్యవేదిక నాయకులైన జయశంకర్ సార్, వి ప్రకాష్ రావు, కేసీఆర్ కు తెలంగాణ ఉద్యమ నాయకత్వ బాధ్యతలు అప్పగించడంతో క్రియాశీలక పాత్ర పోషించారు.

తెలంగాణ జనసభ(Talangana Janasabha): 

  • ఉపాధ్యాయులు, లాయర్లు, జర్నలిస్టులు కలిసి తెలంగాణ జన సభను 1998 జూలైలో హైదరాబాదులోని రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేశారు
  • ఈ సభలోనే “జనతెలంగాణ మాస పత్రిక” ను(Jana Telangana Monthly Magazine) కాళోజీ నారాయణరావు ఆవిష్కరించారు
  • తెలంగాణ జనసభ అనుబంధంగా జహంగీర్ కన్వీనర్ గా  తెలంగాణ కళా సమితి ఏర్పడింది
  • తెలంగాణ కళాసమితికి కో కన్వీనర్ గా ఉన్న బెల్లి లలితను కొంతమంది దుండగులు 1999 మే లో భువనగిరిలో హత్య చేశారు
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(Telangana Development Forum) 
  • ప్రొఫెసర్ జయశంకర్ సలహాపై 1999లో తెలంగాణ ప్రవాస భారతీయులు దీనిని ప్రారంభించారు
  • దీనికి అధ్యక్షుడు మధు కె రెడ్డి
  • చైర్మన్ డి పి  రెడ్డి

రాజకీయ ప్రక్రియ దశ 2001 నుంచి 

ప్రజా సంఘాలు
తెలంగాణ విద్యావంతుల వేదిక
  • ఇది 2004 మార్చి లో ఏర్పడింది.
  • దీనికి అద్యక్షుడుగా కోదండరాం పని చేశారు
తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రచురించిన పుస్తకాలు 
  • తెలంగాణ అభివృద్ధి మీడియా – వాస్తవం
  • తెలంగాణలో చదువు
  • కమ్యూనిజమా ? కోస్తావాదమా ?
  • తెలంగాణ మిలియన్ మార్చ్
  • తెలంగాణ మార్చ్ (సాగరహారం)
  • నీళ్లు-నిజాలు
  • తెలంగాణ రాజకీయ ఆర్థిక సామాజిక వ్యాసాలు
  • ఫ్లోరోసిస్
  • భూమిపుండు
  • చెదిరిన చెరువు
తెలంగాణ హిస్టరీ సొసైటీ 
  • 2006 జూన్ 6 న హైదరాబాద్ లోని ఫతే మైదాన్ క్లబ్ లో ఒక సమావేశం జరిగింది ఇందులోనే తెలంగాణ హిస్టరీ సొసైటీ ఆవిర్భవించింది
  • దీనికి కన్వీనర్ గా తడకమళ్ల వివేక్ నియమించబడ్డారు
  • ప్రచురించిన పుస్తకాలు
  • ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు-విద్రోహ చరిత్ర
  • 1949 ఉద్యమం-చారిత్రిక పత్రాలు
  • 17 సెప్టెంబర్ 1948 భిన్న దృక్పోణాలు
  • తెలంగాణ చరిత్ర-పునర్నిర్మాణం
  • 1857 పోరాట తిరుగుబాటు
తెలంగాణ జన పరిషత్ 
  • దీనినే ప్రజా సంఘాల నాయకులు కేశవరావు జాదవ్ నాయకత్వంలో స్థాపించారు
  • నినాదం “ఒకే ఆలోచన, ఒక ఎజెండా ఒకే జెండా”
  • తెలంగాణ జన పరిషత్ 18 భాగస్వామ్య సంస్థలతో కలిసి పనిచేసింది
తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి  
  • సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో 2006 ఆగస్టులో ఇది ఆవిర్భవించింది
  • ఇది పాశం యాదగిరి, హనుమాన్లు, చిక్కుడు ప్రభాకర్, ఆకుల భూమయ్య ల ఆధ్వర్యంలో ఆవిర్భవించింది
  • 32 తెలంగాణ ప్రజాసంఘాల ఉద్యమ సంస్థలు దీనిలో భాగస్వామ్యం అయ్యారు
తెలంగాణ సంఘర్షణ సమితి 
  • సెప్టెంబర్ 28, 2006 లో ఆవిర్భవించింది
  • దీనికి అధ్యక్షులు:బెల్లయ్యనాయక్
  • ఉపాధ్యక్షుడు-మహమ్మద్ ఇక్బాల్
  • ప్రధాన కార్యదర్శి యోగానంద గౌడ్
  • ఇది ‘భౌగోళిక కాదు సామాజిక తెలంగాణ కావాలి’ అనే నినాదంతో ఆవిర్భవించింది
  • దీని ఆధ్వర్యంలో పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్తూపం వరకు మహా పాదయాత్ర చేపట్టింది
పీపుల్స్ తెలంగాణ ఫౌండేషన్ 
  • దీనిని 2007 మే నెలలో స్థాపించారు
  • స్థాపనలో ముఖ్యులు – సింహాద్రి విశ్వేశ్వరరావు, డాక్టర్ ఎస్ మల్లేష్, డాక్టర్ వై తిరుమల, ప్రొఫెసర్ సత్యనారాయణ తదితరులు
  • దీనికి కన్వీనర్ – ప్రొఫెసర్ సింహాద్రి
  • కో కన్వీనర్ – భంగ్య భూక్య
తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ 
  • ఇది 2008 మార్చి 1, 2 తేదీలలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆవిర్భవించింది
  • దీనికి అధ్యక్షుడు – ప్రొఫెసర్ జి వెంకటరాజు
  • ఉపాధ్యక్షుడు – ప్రొఫెసర్ సయ్యద్ ఆయబ్ అలీ, ప్రొఫెసర్ సుధారాణి
  • జనరల్ సెక్రటరీగా మీ సదానందం ఎంపికయ్యారు
  • ఇది తెలంగాణకు సంబంధించిన పండుగలు, ఉత్సవాలు, మరుగున పడుతున్న విషయాలను తిరిగి ప్రచురించాలనే ఉద్దేశంతో పని చేశాయి
తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్ 
  • దీనిని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అక్టోబర్ 18, 2008 లో ఏర్పాటు చేశారు
  • ఇది కే శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో ఆవిర్భవించింది
  • ఇది నిజాం కాలేజీ గ్రౌండ్స్లో ఫిబ్రవరి 1, 2009న బహిరంగ సభ నిర్వహించింది
  • దీనికి ముఖ్య అతిధులుగా ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ రామబ్రహ్మం, చిత్తారి రాఘవులు హాజరయ్యారు
తెలంగాణ విశ్వవిద్యాలయం అధ్యాపకుల వేదిక 
  • దీనిని నవంబర్ 26, 2008న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఐ పి యస్ ఆర్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేశారు
  • దీనికి అధ్యక్షులుగా ఆ రమేష్ రెడ్డి ఎంపికయ్యారు

తెలంగాణ ఉద్యోగుల సంఘాలు 

తెలంగాణ ఎన్జీవో సంఘం 
  • ఇది 1946 లో నిజాం స్టేట్ లో ములాజిం యూనియన్ పేరుతో స్థాపితమైంది
  • ఈ సంఘానికి ప్రథమ అధ్యక్షులు అబ్దుల్ గఫ్ఫార్ హుస్సేన్
  • ఇది 1967లో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ గా మార్చబడింది
  • 1969 ఉద్యమంలో కేఆర్ ఆమోస్, స్వామినాథన్ ఆధ్వర్యంలో కీలక పాత్ర పోషించింది
  • 2009 అక్టోబరు 21న సిద్దిపేటలో లక్షలాది ఉద్యోగుల గర్జన నిర్వహించింది
తెలంగాణ ఉద్యోగుల సంఘం 
  • 2001 జూలై 25న ఆవిర్భవించింది
  • దీనికి అధ్యక్షుడుగా విఠల్ ఎన్నికయ్యారు
  • ఇది 2004 నుంచి తెలంగాణ డైరీని ఆవిష్కరిస్తుంది
  • 2006లో ‘క్విట్ తెలంగాణ ఉద్యమాన్ని’ నిర్వహించింది
  • దీనికి 2002 నుంచి 2005 వరకు ఎ కృష్ణా రెడ్డి అధ్యక్షులు ఆ తరువాత డి సుధాకర్, స్వామిగౌడ్, దేవీప్రసాద్ అధ్యక్షులు గా కొనసాగారు. ప్రస్తుతం కారం రవీందర్రెడ్డి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు

తెలంగాణ జర్నలిస్టుల ఫోరం 

  • 2004 మే 31న బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో అల్లం నారాయణ నాయకత్వంలో స్థాపించబడింది
  • తెలంగాణ పాత్రికేయులు రాసిన వ్యాసాలన్నిటిని అల్లం నారాయణ, కందుకూరి రమేష్ సంపాదకత్వంలో 2001 మే లో ‘మే 31’ అనే పేరుతో పుస్తకరూపంలో తీసుకువచ్చారు

తెలంగాణ టీచర్స్ ఫోరం 

  • సెప్టెంబర్ 20, 2006న సెయింట్ పీటర్స్ హై స్కూల్ లో ఇది స్థాపించబడింది
  • జి శ్రీధర్ కన్వీనర్ గా తెలంగాణ టీచర్స్ ఫోరం తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించబడ్డారు

తెలంగాణ ఐటీ ఫోరం 

  • ఆర్ట్స్ కాలేజీలో 2006లో దీనిని స్థాపించారు
  • ఇది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించడంతో పాటు విప్రో, సత్యం, హైటెక్ సిటీలలో స్థానికులకు రిజర్వేషన్లు సాధించడం కోసం కృషి చేసింది

తెలంగాణ లెక్చరర్స్ ఫోరం 

  • ప్రభుత్వ ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాల అధ్యాపకులకు 2007 జూలై 8న ఆవిర్భవించింది
  • దీనికి అధ్యక్షులుగా మురళీమనోహర్ ఉపాధ్యక్షుడిగా చంద్రశేఖర్, షబ్బర్ అలీ, కృష్ణ కుమార్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కత్తి వెంకటస్వామి ఎన్నికయ్యారు
  • ప్రస్తుతం తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడుగా కత్తి వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శిగా యు.సిద్దేశ్వర్ కొనసాగుతున్నారు

తెలంగాణ ప్రైవేటు రంగ ఎంప్లాయీస్ అసోసియేషన్ 

  • జూన్ 15, 2008న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేయబడింది
  • ఇది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 80% ప్రైవేట్ ఉద్యోగాలు, జిల్లా స్థాయిలో ఏర్పడిన ప్రైవేట్ సంస్థలలో 100% ఉద్యోగాలు స్థానికులకే కేటాయించేందుకు కృషి చేస్తుంది.

తెలంగాణ సాంస్కృతిక రచయిత సంఘాలు 

తెలంగాణ సాంస్కృతిక వేదిక 

  • 1998 నవంబర్ 1న బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో స్థాపించబడింది ఇందులో సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, అంబటి సురేంద్రరాజు, నందిని సిద్ధారెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి, కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ రచయితల వేదిక 

  • దీనిని 2001 అక్టోబర్ 14న సిద్ధిపేట లో స్థాపించారు
  • దీనికి మొదటి అధ్యక్షుడిగా నందిని సిద్ధారెడ్డి, కార్యదర్శిగా వేణు సంకోజు నియమితులయ్యారు
  • ఇది తెలంగాణ సాహిత్య అస్తిత్వాన్ని పునరుద్ధరించడం కోసం ‘సోయి’ అనే పత్రికను స్థాపించింది
ధూమ్ దాం

  • మలిదశ ఉద్యమంలో తెలంగాణ అన్యాయాలను ప్రజలకు తెలియచెప్పడానికి ఏర్పాటుచేసిన సాంస్కృతిక వేదిక తెలంగాణ ధూమ్ ధామ్
  • దీని యొక్క తొలి ప్రదర్శన సెప్టెంబరు 30, 2002 కామారెడ్డి లో జరిగింది
  • రసమయి బాలకిషన్, అంద శ్రీ, వరంగల్ శంకర్, గోరటి వెంకన్న, విమలక్క, గూడా అంజయ్య తమ ఆట పాటలతో అలరించారు
  • ధూమ్ దాం దశాబ్ది ఉత్సవాలు డిసెంబర్ 22, 2012న హైదరాబాదులో ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగాయి

తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య  

  • దీనిని గూడ అంజయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, వి ఎస్ రావు తదితరులు 2007 లో స్థాపించారు
  • దీనికి అధ్యక్షులుగా గూడ అంజయ్య, గౌరవ అధ్యక్షులుగా గద్దర్, సలహాదారులుగా బి.ఎస్.రాములు, పాశం యాదగిరి నియమించబడ్డారు
తెలంగాణ సింగిడి రచయితల సంఘం 

  • సింగిడి అనగా హరివిల్లు, ఇంద్రధనస్సు అని అర్థం
  • ఇది సెప్టెంబర్ 21, 2008న స్థాపించబడింది

తెలంగాణ విద్యార్థి సంఘాలు 

తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ 
  • ఇది 1998 అక్టోబర్ 14న స్థాపించబడింది
  • ఇది తెలంగాణ జనసభ అనుబంధ సంస్థ
తెలంగాణ విద్యార్థి సంఘం 
  • 2006 ఆగస్టు 8న స్థాపించబడింది
  • ఇది 2006 ఆగస్టులో 10 వేల మంది విద్యార్థులతో భారీ బహిరంగ సభ నిర్వహించింది
  • దీనికి ముఖ్య అతిధులుగా జార్జ్ ఫెర్నాండేజ్, గద్దర్, రసమయి, సింహాద్రి వంటి నాయకులు హాజరయ్యారు
  • 2007లో గద్దర్ నాయకత్వంలో జరిగిన మహా సాంస్కృతిక శాంతియాత్ర లో ఈ సంఘం ఖమ్మం జిల్లా మణుగూరు నుంచి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి వరకు యాత్ర నిర్వహించింది
తెలంగాణ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ 
  • 2006 సెప్టెంబర్ లో ప్రొఫెసర్ కోదండరాం సూచన మేరకు పి శంకర్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ లో స్థాపించారు
  • ఇది 2007 సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్ట్స్ కాలేజీ నుంచి భారీ బహిరంగ సభ నిర్వహించింది
తెలంగాణ విద్యార్థి వేదిక 
  • 2006 అక్టోబర్ 27న ఆవిర్భవించింది. దీనికి అధ్యక్షుడుగా ఉన్న జంజర్ల రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శిగా శివకుమార్ నియమించబడ్డారు
  • ఇది 2006 నవంబర్ 1న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ విద్రోహదినం నిర్వహించింది
  • ఫిబ్రవరి 28, 2008న ఐక్య కార్యాచరణ కమిటీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాలో ఇది పాల్గొన్నది
తెలంగాణ ఐక్య విద్యార్థి సంఘం 
  • ఇది 2008 జనవరిలో వీరగోని చైతన్య గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పడింది
  • ఫిబ్రవరి 2, 2008 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని ఠాకూర్ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్రం వెంటనే ప్రకటించాలని ఒక సదస్సు నిర్వహించింది
ఇతర అంశాలు 
చర్చా  పత్రిక 
  • దీనిని పిట్టల రవీందర్ 2001లో గోదావరి ఖని నుండి ప్రారంభించారు
  • ఇది ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం నుండి నాలుగు సంవత్సరాలపాటు దినపత్రిక ప్రచురించబడింది
తెలంగాణ టైమ్స్ 
  • దీనిని 2006 జనవరి నుంచి ప్రచురించడం జరిగింది
  • దీనికి వర్కింగ్ఎడిటర్ గా నాగోబా, గౌరవ సంపాదకులుగామల్లేపల్లి లక్ష్మయ్య పనిచేశారు
  • ఇది మూడు ప్రత్యేక సంచికలను ప్రచురించింది
  • అవి 2006 లో
  • 1) మహిళల ప్రత్యేక సంచిక 2) 2006 జూన్ లో ‘1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సంచిక’  3) 2007 అక్టోబర్ నవంబర్ లో ‘పాలమూరు ప్రత్యేక సంచిక’
సహచర బుక్ హౌస్ 
  • దీనిని 1995లో పి.శంకర్ బాగ్ లింగంపల్లిలో స్థాపించారు
  • ఇది తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు, సీడీలు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సమగ్రమైన చరిత్ర, సాహిత్యాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర పోషించింది.

తెలంగాణ మలిదశ ఉద్యమం 

తెలంగాణ రాష్ట్ర సమితి(Telangana Rastra Samithi T.R.S) 

  • తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉండటంతో ‘2001 ఏప్రిల్ 27’న కేసీఆర్ హైదరాబాద్ లోని జలదృశ్యం(కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం)లో తెలంగాణ రాష్ట్ర సమితి ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు
  • ఇది 2001 మే 15న కరీంనగర్ లో ‘సింహగర్జన’ పేరుతో సభ జరిపింది. దీనికి జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు శిబుసొరేన్ తెలంగాణకు మద్దతు తెలిపారు
  • జూన్ 1, 2001 న పాలమూరులో, జూన్ 2న నల్గొండ, జూన్ 4న నిజామాబాద్, జూన్ 5న నిర్మల్, జూన్ 21న వరంగల్ లో భారీ సభలు నిర్వహించారు
  • 2001 జూలై లో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ నాగలి గుర్తుపై పోటీ చేసి కరీంనగర్(రాజేశ్వరరావు), నిజామాబాద్ (సంతోష్ కుమార్) జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను గెలుచుకుంది
  • ఇది 1000 ఎంపీటీసీ స్థానాలను, 87 జెడ్పిటిసి స్థానాలు, 84 ఎంపిపి స్థానాల్లో గెలిచింది
  • 2001 నవంబర్ 17న ప్రజా గర్జన సభను ఖమ్మంలో నిర్వహించింది
  • 2002 మార్చి 27న రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో శంఖారావ సభ నిర్వహించారు
  • 2002 ఏప్రిల్ 27న టిఆర్ఎస్ ప్రథమ వార్షికోత్సవ సభను నల్గొండలో నిర్వహించింది. ఈ సభకు శిబుసొరేన్, అజిత్ సింగ్, భీమ్ సింగ్ హాజరయ్యారు.

టిఆర్ఎస్ కార్యక్రమాలు(Programmed by T.R.S)

  • టిఆర్ఎస్ పార్టీ 2002 సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 7 వరకు పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించింది
  • నవంబర్ 25, 2002 – జనవరి 6, 2003 వరకు జలసాధన కార్యక్రమాన్ని నిర్వహించింది
  • జనవరి 6, 2003న హైదరాబాద్ నగరంలోని జింఖానా గ్రౌండ్స్ లో ‘తెలంగాణ గర్జన’ పేరుతో ఒక మహాసభను నిర్వహించింది
  • ఏప్రిల్ 27, 2003 న వరంగల్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర సమితి ద్వితీయ వార్షికోత్సవ సభలు జరిగాయి. ఈ సభకు టిఆర్ఎస్ పార్టీ వరంగల్ జైత్రయాత్ర అనే నామకరణం చేసింది
  • రాజోలిబండ డైవర్షన్ పథకం సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేసీఆర్ 2003 మే 20-25 వరకు మహబూబ్ నగర్ లోని ఆలంపూర్ నుండి గద్వాల్ వరకు పాదయాత్ర చేశారు
  • 2003 ఆగస్టులో మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ లో కోలాహలం సభ, నాగర్ కర్నూలులో నగారా సభ(2003 సెప్టెంబర్) నిర్వహించారు
  • నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో కేసీఆర్ 2003 ఆగస్టు 25-30 వరకు కోదాడ నుండి హాలియా వరకు పాదయాత్ర చేశారు
  • టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదనను ఢిల్లీకి చేరవేయడానికి 2003 మార్చి 27న హైదరాబాద్ పలక్ నమా ప్యాలెస్ నుండి ఢిల్లీకి కారు ర్యాలీ చేపట్టారు
  • 2003 సెప్టెంబర్ 9న మౌలంకార్ హోటల్ లో వివిధ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేతలు సభ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రత్యేక రాష్ట్రాల జాతీయ కన్వీనర్ గా కేసీఆర్ ను ఎన్నుకున్నారు
  • కాకినాడ తీర్మానం అమలు చేయక పోయేసరికి ఆలే నరేంద్ర బిజెపి నుండి బయటకు వచ్చి ‘తెలంగాణ సాధన సమితి’ అనే పార్టీని స్థాపించారు
  • కేసీఆర్ తో సంప్రదింపుల అనంతరం తెలంగాణ కోసం ఐక్యంగా పోరాడాలని నిర్వహించి 2002 ఆగస్టు 11న టిఆర్ఎస్ లో తెలంగాణ సాధన సమితి విలీనమైంది
  • సెప్టెంబర్ 17, 2003న ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ముందు భారీ బహిరంగ సభను విద్యార్థులను ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకునేలా దోహదం చేసింది
  • 2003 నవంబరు 19న మెదక్ జిల్లాలో ‘సింగూరు సింహగర్జన’ అనే పేరుతో బహిరంగ సభ
  • 2003 నవంబర్ 21న మహబూబ్ నగర్ జిల్లాలో ‘పాలమూరు సింహ గర్జన’
  • 2003 డిసెంబర్ 3న నిజామాబాద్ లో ‘ఇందూరు సింహ గర్జన’
  • 2003 డిసెంబర్ 5న వరంగల్ లో ‘ఓరుగల్లు సింహ గర్జన’
  • 2003 డిసెంబర్ 16న సిరిసిల్లలో ‘కరీంనగర్ కథనభేరి’ నిర్వహించారు.

2004 ఎన్నికల పొత్తులు 

టిఆర్ఎస్ పార్టీ 

  • ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తో పొత్తుకు అంగీకరించింది.
  • 2004 మార్చి 12న కరీంనగర్ లో నిర్వహించిన సభలో సోనియా గాంధీ తెలంగాణ ప్రజల మనోభావాలు మాకు తెలుసు, వాటిని మేము గౌరవిస్తాం వారి కోరికను తీర్చేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించారు.
  • ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన ప్రణబ్ ముఖర్జీ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీకి 42 స్థానాలు ఇవ్వడానికి అంగీకారం కుదిరింది
  • 2004 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 26 శాసనసభ సీట్లను 5 లోక్ సభ  సీట్లు గెలిచింది.
  • కేంద్రంలో యూపీఏ కూటమి అధికారంలోకి రావడంతో టిఆర్ఎస్ కేంద్ర మంత్రివర్గంలో చేరింది
  • దీనిలో కె.చంద్రశేఖరరావుకు ఓడలరేవు మంత్రిత్వశాఖ, ఆలె నరేంద్రకు గ్రామీణాభివృద్ధిశాఖ లభించింది

రాష్ట్ర మంత్రివర్గంలో చేరిన టిఆర్ఎస్ శాసన సభ్యులు 

  • యస్ సంతోష్ రెడ్డి
  • విజయరామారావు,
  • ఎ చంద్రశేఖర్,
  • హరీష్ రావు,
  • నాయిని నరసింహారెడ్డి,
  • శ్రీ లక్ష్మీ కాంతారావు
     

కాకినాడ తీర్మానం(1998) 

జాతీయ పార్టీ అయినా బిజెపి కాకినాడలో చిన్న రాష్ట్రాలకు అనుకూలమని తీర్మానం చేసింది. దీని యొక్క నినాదం ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు.

  • 2004 మే 26న యూపీఏ ప్రభుత్వం తన కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ లో తెలంగాణ అంశాన్ని చేర్చింది
  • 2004 జూన్ 7న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంలో అవసరమైన సంప్రదింపుల ద్వారా సరైన సమయంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అంశాన్ని చేపడుతుందని పేర్కొన్నారు
  • టిఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో 2004 డిసెంబర్ 1న సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించారు
  • తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ జాగరణ పేరుతో అనేక మంది కార్యకర్తలకు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఆరు వందల మందికి పైగా కార్యకర్తలను ఎంపిక చేసి హైదరాబాదులోని నోమ ఫంక్షన్ హాల్ లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది.
  • 2006 ఫిబ్రవరి 12న పోలవరం ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తున్న గిరిజనులకు మద్దతు తెలుపుతూ పోలవరం గర్జన పేరుతో భద్రాచలంలో బహిరంగ సభ నిర్వహించింది
  • 2006 ఆగస్టు 23న కేసీఆర్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించాడు.
  • 2006 ఆగస్టు 25న యూపీఏ పై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు కెసిఆర్ ఆమరణ దీక్ష చేపట్టాడు. తదనంతరం అదే రోజు రాత్రి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవర్ కేసీఆర్ కు పండ్ల రసం ఇచ్చి దీక్ష విరమింపజేశాడు.

Telangana Movement Between 1991 to 2014 Part-1

Also Read 👇👇

Telangana Movement Between 1991 to 2014 Part-1

#Telangana Movement Between 1991 to 2014 Part-1  #Telangana Movement Between 1991 to 2014 Part-1

తెలంగాణ ఉద్యమ చరిత్ర (1956-1968) జీకే ప్రశ్నలు- జవాబులు | Telangana Movement History GK Questions with Answers in Telugu-2024

Telangana Movement Between 1991 to 2014 Part-1 #Telangana Movement Between 1991 to 2014 Part-1  #Telangana Movement Between 1991 to 2014 Part-1

TSPSC గ్రూప్​ 1​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్​​ విత్​ కీ | TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3

Telangana Movement Between 1991 to 2014 Part-1

TSPSC గ్రూప్​ 1​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్​​ విత్​ కీ | TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2

Telangana Movement Between 1991 to 2014 Part-1

TSPSC గ్రూప్​ 1​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్​​ విత్​ కీ | TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2

Telangana Movement Between 1991 to 2014 Part-1 #Telangana Movement Between 1991 to 2014 Part-1 

#Telangana Movement Between 1991 to 2014 Part-1

మార్చి 10th to 15th 2024 కరెంట్ అఫైర్స్, సమాధానాలతో వన్-లైన్ బిట్స్ | March 10th to 15th 2024 Current Affairs one-line Bits with Answers

Telangana Movement Between 1991 to 2014 Part-1 Telangana Movement Between 1991 to 2014 Part-1

Telangana Movement Between 1991 to 2014 Part-1 #Telangana Movement Between 1991 to 2014 Part-1

Telangana Movement Between 1991 to 2014 Part-1 #Telangana Movement Between 1991 to 2014 Part-1 #Telangana Movement Between 1991 to 2014 Part-1 #Telangana Movement Between 1991 to 2014 Part-1 #Telangana Movement Between 1991 to 2014 Part-1 #Telangana Movement Between 1991 to 2014 Part-1

#Telangana Movement Between 1991 to 2014 Part-1  #Telangana Movement Between 1991 to 2014 Part-1

Telangana Movement and State Formation

1 thought on “తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం 1991-2014 | Telangana Movement Between 1991 to 2014 Part-1”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.