Telangana Government Decided To Provide Digital Health Cards To Everyone Above 18 Years Of Age | హెల్త్ కార్డు… డిజిటల్ రికార్డు!
రాష్ట్ర ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డుల రూపకల్పనకు వైద్య ఆరోగ్య శాఖ శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులను అందజేయడంతో పాటు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ముఖ్యాంశాలు:
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- 18 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు
- అత్యవసర, మెరుగైన చికిత్స కోసం హెల్త్ కార్డులు
- కార్యాచరణ పై కసరత్తు
Telangana Government Decided To Provide Digital Health Cards To Everyone Above 18 Years Of Age: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆసరా పథకం కింద ఆరోగ్య శ్రీ పరిమితిని పెంచిన ప్రభుత్వం తాజాగా.. రాష్ట్ర ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డుల రూపకల్పనకు రెడీ అయింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్‌కార్డులను అందజేయడంతో పాటు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మార్గదర్శకాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు.
డిజిటల్ రికార్డుల తయారీ..
డిజిటల్ రికార్డుల తయారీ కార్యాచరణలో భాగంగా వివిధ అంశాలను పరిశీలిస్తున్నారు. ప్రజల ఆరోగ్య స్థితిగతులపై సమగ్ర సమాచారం అందుబాటులోకి తేవడంతో పాటు ఈ రికార్డు ద్వారా మెరుగైన, అత్యవసర వైద్య సేవలను అందించేందుకు వీలవుతుందని సర్కార్ భావిస్తోంది. దీనిద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలు, అందించాల్సిన వైద్యం, మెరుగుపరచాల్సిన వైద్య వసతులు, తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయాలు, నిధుల కేటాయింపు, వైద్య ఆరోగ్యశాఖకు ప్రాధాన్యం తదితర అంశాలపై పూర్తి స్పష్టత వస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు. డిజిటల్ హెల్త్‌కార్డులను రూపొందించేందుకు అవసరమైన ప్రాథమిక అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.
హెల్త్‌కార్డు ద్వారా సంబంధిత వ్యక్తి ఆరోగ్యం, అనారోగ్య పరిస్థితులు, గతంలో అందిన వైద్యం, చికిత్స, ఉపయోగిస్తున్న మందులు, సమస్య, డాక్టర్ల అభిప్రాయం వంటి అంశాలన్నీ డిజిటల్ రికార్డు రూపంలో అందుబాటులో ఉండనున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చికిత్సకు వెళ్లినా.. ఈ వివరాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులకు వెంటనే తెలియడంతో మెరుగైన చికిత్స, వైద్యసేవలకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కార్డును ఆరోగ్యశ్రీతోను.. ఆధార్‌తోనూ అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ ప్రక్రియలో భాగంగా ఆరోగ్య సిబ్బంది క్షేత్రస్థాయి ఇంటింటికీ వెళ్లి వ్యక్తిగత వివరాలను సేకరించి నమోదు చేస్తారు. ఎత్తు, పొడవు, బరువు వంటి వివరాలతో పాటు రక్త, మూత్ర పరీక్షలు చేసి వాటిద్వారా ఆరోగ్య సమస్యలను గుర్తించి రికార్డు చేస్తారు. బీపీ, మధుమేహం వంటి వ్యాధులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా గుర్తించనున్నారు. సమస్యలు ఉంటే ప్రత్యేక యాప్‌లో నమోదు చేసి చికిత్స అందిస్తారు. ఇలా వ్యక్తిగత రికార్డులను నమోదు చేసి.. అనంతరం వారికి అవసరమైన వైద్యసాయం అందిస్తారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో
ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు వెళ్లినా హెల్త్ కార్డులోని గుర్తింపు సంఖ్య నమోదుతో వివరాలు వెంటనే అందుబాటులోకి వస్తాయి. ప్రజల ఆరోగ్య సమస్యలు, సీజనల్ వ్యాధులు, ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటివాటిని గుర్తించేందుకూ అవకాశం ఉండనుంది. డిజిటల్ డేటాను భద్రపరుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఐటీ విభాగం సమన్వయంతో దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. త్వరలోనే 18 ఏళ్లు పైబడినవారికి హెల్త్ కార్డులు అందనున్నాయి.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
Can Medigadda barrage withstand the flood? | మేడిగడ్డ బ్యారేజీ.. వరదను తట్టుకోగలదా? 2024
CM Revanth Reddy Tweet About Changing The Name Of TS To TG-2024 | అందుకే TSను TGగా మార్చాం
Telangana Government Decided To Provide Digital Health Cards To Everyone Above 18 Years Of Age
Telangana Government Decided To Provide Digital Health Cards To Everyone Above 18 Years Of Age
1 thought on “Telangana Government Decided To Provide Digital Health Cards To Everyone Above 18 Years Of Age | హెల్త్ కార్డు… డిజిటల్ రికార్డు!”