Telangana CM Revanth Reddy likely to contest 2024 Andhra Pradesh elections | రేవంత్ రెడ్డి స్టెప్ ఏంటీ..? రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ..
Telangana CM Revanth Reddy likely to contest 2024 Andhra Pradesh elections: ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైపోయింది. పార్టీలన్నీ సభలు, సమావేశాలతో ఎన్నికల మూడ్‌లోకి వచ్చేశాయి. ఇక మిగిలిందంతా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటమే. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత అభ్యర్థుల ప్రకటనలు, ప్రచారాలతో ఏపీ హోరెత్తిపోనుంది. అయితే ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ తరుఫున ఏపీలో ఎన్నికల ప్రచారం చేస్తారనే వార్తలు వస్తున్నాయి.
ముఖ్యాంశాలు:
- ఏపీలో మొదలైన ఎన్నికల హడావిడి
- ప్రచార వ్యూహాలకు రాజకీయ పార్టీల పదును
- ఏపీలో ప్రచారానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి!
ఏపీలో ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఏ ఇద్దరిని కదిలించినా ఎన్నికల గురించే చర్చ. వీటికి తగ్గట్లుగానే పార్టీలు కూడా సభలతో తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. వైఎస్ జగన్ సిద్ధం అంటూ పంచులతో చెలరేగిపోతుంటే.. మరో పక్క టీడీపీ అధినేత చంద్రబాబు రా.. కదలిరా.. చూసుకుందాం రా అంటూ దూసుకెళ్తున్నారు. ఇక జనసేనాని సైతం మూడంచెల వ్యూహమంటూ హెలికాప్టర్ రెడీ చేసుకునే పనిలో పడ్డారు. వీటికి తోడు ఇటీవలే ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమితురాలైన షర్మిల సైతం వరుస పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. అయితే కుమారుడి పెళ్లి కారణంగా కొంచెం గ్యాప్ ఇచ్చారు షర్మిల. ఇలా నేతల సభలు, పొలిటికల్ స్పీచులతో ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది.
షర్మిలకు జతగా ఏపీ ఎన్నికల ప్రచారంలోకి:
అయితే షర్మిలకు జతగా ఏపీ ఎన్నికల ప్రచారంలోకి మరో ఫైర్ బ్రాండ్‌ను దించాలని హస్తం పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తోందట. అదెవరో కాదు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎన్నికల సమయంలో తన మాస్ స్పీచులతో పల్లెలలో మెజారిటీ ప్రజలను తనవైపు తిప్పుకోవటంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్‌తో ఏపీలోనూ రేవంత్ రెడ్డి పట్ల క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తరుఫున రేవంత్ రెడ్డితో ప్రచారం చేయించాలని కాంగ్రెస్ పెద్దలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇదే విషయాన్ని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తున్న మాణిక్కం ఠాగూర్ సైతం ఇటీవల వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని చెప్పారు.
మరోవైపు ఇటీవలే రేవంత్ రెడ్డిని వైఎస్ షర్మిల కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనా చర్చించారు. అయితే షర్మిల ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాతే ఈ భేటీ జరగింది. దీంతో ఏపీలో ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డిని తీసుకురావాలని షర్మిల.. సోనియాగాంధీకి వివరించారని, ఆమె ఇందుకు అంగీకరించిందనే వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాతే ఈ విషయాన్ని రేవంత్ వద్దకు షర్మిల తీసుకెళ్లారని రాజకీయ వర్గాల్లో టాక్.
అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..
అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు శిష్యుడు. టీడీపీని వదిలి కాంగ్రెస్‌లోకి వెళ్లిన సమయంలోనూ, ఆ తర్వాత కూడా చంద్రబాబు మీద, టీడీపీ మీద రేవంత్ రెడ్డి ఎలాంటి విమర్శలు చేయలేదు. ఇదే కారణంతో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం టీడీపీ పోటీకి దూరమైందని, టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ విజయానికి సహకరించారని రాజకీయ వర్గాల్లో టాక్. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి వంటి మంత్రులు సైతం ఇదే విషయాన్ని ఒకట్రెండు సార్లు బహిరంగంగానే చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డి వెళ్తే.. ఒకప్పటి బాస్ మీద విమర్శలు గుప్పిస్తారా, టీడీపీపై ఆరోపణలు చేస్తారా..లేక అధికార వైసీపీనే టార్గెట్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
Telangana CM Revanth Reddy likely to contest 2024 Andhra Pradesh elections
Telangana CM Revanth Reddy likely to contest 2024 Andhra Pradesh elections