...

Telangana CM Revanth Reddy invites all MLAs to visit Kaleshwaram project to inspect damages | కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలి, రూ.లక్ష కోట్ల ఖర్చు.. లక్ష ఎకరాలకూ నీరివ్వలేదు

Written by lsrupdates.com

Published on:

Telangana CM Revanth Reddy invites all MLAs to visit Kaleshwaram project to inspect damages | కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలి, రూ.లక్ష కోట్ల ఖర్చు.. లక్ష ఎకరాలకూ నీరివ్వలేదు

ముఖ్యాంశాలు:

  • కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలి
  • అక్రమాలకు బాధ్యులపై విచారణ చేయిస్తున్నాం
  • అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్టు
  • నేడు అసెంబ్లీలో సాగునీటి పై శ్వేతపత్రం
  • కేసీఆర్ చెప్పింది ఏటా 180 టీఎంసీలు.. అయిదేళ్లలో ఎత్తిపోసింది 162 టీఎంసీలే
  • కుర్చీ పోయినందుకే నల్గొండ సభకు కేసీఆర్మే
  • డిగడ్డ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి బ్యారేజీ సందర్శన

‘మేడిగడ్డ బ్యారేజీలో రెండుమూడు పిల్లర్లు కూలితే తప్పా? అని కేసీఆర్ అంటున్నారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టినా లక్ష ఎకరాలకు కూడా నీరివ్వలేదు. మీ లక్ష కోట్ల దోపిడీకి కాళేశ్వరం బలైపోయింది. కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ కుంగిపోయింది. అన్నారం సున్నమైంది. కుంగింది ప్రాజెక్టు కాదు.. తెలంగాణ ప్రజల నమ్మకం’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రీడిజైనింగ్ పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

Telangana CM Revanth Reddy invites all MLAs to visit Kaleshwaram project to inspect damages | కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలి, రూ.లక్ష కోట్ల ఖర్చు.. లక్ష ఎకరాలకూ నీరివ్వలేదు
Telangana CM Revanth Reddy invites all MLAs to visit Kaleshwaram project to inspect damages | కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలి

తన బండారం బయటపడుతుందన్న భయంతోనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ నల్గొండలో సభ పెట్టారని రేవంత్ విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని సీఎంతోపాటు మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, శ్రీధరాబాబు, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్, కౌసర్ మొహియుద్దీన్, జుల్ఫికర్, ఎమ్మెల్సీ మీర్జా హుస్సేన్ తదితరులు మంగళవారం సందర్శించారు. ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం సభ నిర్వహించారు. ఈ వేదికపై కాళేశ్వరం ఎత్తిపోతలు, ప్రాణహిత- చేవెళ్ల రీడిజైన్పై ఇన్చార్జి ఈఎన్సీ సుధాకర్, విజిలెన్స్ నివేదికపై డీజీ రాజీవ్ రతన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను వివరించారు. నల్గొండ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు పెనుప్రమాదంలో ఉన్నాయని.. నీళ్లు నింపితే అవి కొట్టుకుపోయే కుప్పకూలే ప్రమాదంలో ఉన్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరంతో కోటి ఎకరాలకు నీళ్లిచ్చామంటూ కేసీఆర్ చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని రుజువైందన్నారు. ఏటా విద్యుత్తు బిల్లులే రూ.10,500 కోట్లు కట్టాలని.. బ్యాంకు రుణవాయిదాలు, ఇతర ఖర్చులు కలిపితే ఏటా రూ.25,000 కోట్లు ఖర్చవుతాయని వివరించారు. సాగునీటి రంగంపై బుధవారం అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి శ్వేతపత్రం ప్రవేశపెడతారని ప్రకటించారు

మేడిగడ్డ సందర్శన అనంతరం సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్. వేదికపై మంత్రులు జూపల్లి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొన్నం, తుమ్మల, సీతక్క, ఎమ్మెల్యేలు

కుంగిన మేడిగడ్డను కప్పిపెట్టారు

‘మేడిగడ్డ కుంగినపుడు మేం వెళ్లి చూడాలనుకుంటే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంది. ఎన్నికల అధికారుల అనుమతితో నేను, రాహుల్గాంధీ, శ్రీధరాబాబు మేడిగడ్డను సందర్శించాం. పూర్తిగా చూసేందుకు నాడు మాకు సమయం సరిపోలేదు. బ్యారేజీని ఎవరూ చూడకుండా. తప్పిదాల్ని కప్పిపుచ్చుకునేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించింది. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలున్నాయని విజిలెన్స్ అధికారులతో మేం చేయించిన విచారణలో తేలింది.

Telangana CM Revanth Reddy invites all MLAs to visit Kaleshwaram project to inspect damages | కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలి, రూ.లక్ష కోట్ల ఖర్చు.. లక్ష ఎకరాలకూ నీరివ్వలేదు
Telangana CM Revanth Reddy invites all MLAs to visit Kaleshwaram project to inspect damages | కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలి 

కేసీఆర్ ప్రభుత్వం మేడిగడ్డ అంచనా వ్యయాన్ని రూ.1,800 కోట్ల నుంచి రూ.4000 కోట్లకు పైగా పెంచింది. కాళేశ్వరం రీడిజైనింగ్, రూ.వేల కోట్ల అవినీతిపై బడ్జెట్ సమావేశాల్లో చర్చ అనగానే తమ బండారమంతా బయటపడుతుందని కేసీఆర్కు భయమైంది. ప్రజలముందు దోషిగా నిలబడాల్సి వస్తుందనే… కాంగ్రెస్పై ఎదురుదాడికి నల్గొండలో సభ పెట్టారు. తప్పులన్నీ తాను చేసి కేసీఆర్ తానో సత్యహరిశ్చంద్రుడిని అన్నట్లు ఆ సభలో మాట్లాడారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చానని కోటి ఒకటోసారి అబద్ధం ఆడారు. రెండుసార్లు అవకాశమిస్తే.. పదేళ్లపాటు తెలంగాణను పీడించి దోచుకున్నారు’ అంటూ కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

మీ అబద్ధాలను జనం నమ్మరు

శాసనసభకు రమ్మన్నా కేసీఆర్ రాలేదు. కాలు విరిగిందని సాకు చెప్పారు. సానుభూతి పొందేందుకే నల్గొండ సభకు వెళ్లారు. కాళేశ్వరానికి ఆహ్వానించినా రాకపోగా ఆరోపణలు చేయడం దిగజారుడు రాజకీయమే. అసెంబ్లీలో ఉత్తమ్ ప్రవేశపెట్టిన తీర్మానం సరిగా లేదన్నారు.. మీ అల్లుడు, సాగునీటిశాఖ మాజీ మంత్రి హరీశ్రరావు ఆ తీర్మానానికి సంపూర్ణ మద్దతు పలికిన విషయం మీకు తెలియదా? అడిగితే సలహాలు ఇస్తానంటున్నారు.

Telangana CM Revanth Reddy invites all MLAs to visit Kaleshwaram project to inspect damages | కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలి, రూ.లక్ష కోట్ల ఖర్చు.. లక్ష ఎకరాలకూ నీరివ్వలేదు
Telangana CM Revanth Reddy invites all MLAs to visit Kaleshwaram project to inspect damages | కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలి 

అవినీతిలో మీ భాగస్వామ్యం లేకపోతే అసెంబ్లీకి ఎందుకు రాలేదు? కేఆర్ఎంబీపై చర్చకు ఎందుకు హాజరుకాలేదు? అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్న విషయాన్ని సభకు వచ్చి చెప్పాలి. నల్గొండలో సభ పెట్టి దిక్కుమాలిన మాటలు మాట్లాడతారా? బెదిరించి, బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారా? మా ప్రభుత్వాన్ని వెంటాడతారా? మీరు చేసిన పనులకు అసలు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కొద్దు. కుర్చీ పోగానే మీకు ఫ్లోరైడ్ గుర్తుకొచ్చింది. ఇక మీ అబద్ధాలను నమ్మేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు’ అంటూ రేవంత్ దుయ్యబట్టారు.

ఓట్ల కోసమే కేసీఆర్ ఎత్తుగడ

‘ఎల్అండ్ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలా.. వద్దా? కాళేశ్వరంపై భారాస వైఖరేమిటి? కేసీఆర్, హరీశ్ చెప్పాలి. కాలు విరిగినా, కట్టె పట్టుకుని వచ్చానని కేసీఆర్ అంటున్నారు. కుర్చీ పోయినందుకే నల్గొండ సభకు వెళ్లారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లోని 36 అసెంబ్లీ స్థానాల్లో భారాసకు వచ్చినవి నాలుగే. లోక్సభ ఎన్నికల్లో ఓట్ల కోసం కేసీఆర్ ఎత్తుగడలు వేస్తున్నారు. నల్గొండలో జనం దొరక్కపోతే కల్వకుర్తి నుంచి బస్సుల్లో రప్పించుకున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత కాళేశ్వరం వెళతామని అంటున్నారు. కేసీఆర్ కాళేశ్వరం కాదు.. కాశీకి వెళ్లి బిచ్చం ఎత్తుకోవాలి’ అని సీఎం దుయ్యబట్టారు. కేసీఆర్ కుట్రలు, కుతంత్రాల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రజలు, కవులు, కళాకారులపై ఉందన్నారు.

భాజపా వైఖరేంటో చెప్పాలి

‘మేడిగడ్డకు అన్ని పార్టీల్ని ఆహ్వానించాం. కేసీఆర్ అవినీతిని తేల్చే సమయంలో వారి (బారాస) చీకటిమిత్రులైన భాజపా వాళ్లు రాలేదు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాకుండా కిషన్రెడ్డి అడ్డుకున్నారు. మీరిద్దరూ (భాజపా, భారాస) కలిసే ఒకే విధానంతో ఉన్నారా? కేసీఆర్ అవినీతిని కాపాడటమా? చర్యలు తీసుకోవడమా? మేడిగడ్డలో భారాస అవినీతిని సమర్థిస్తున్నారా? భాజపా వైఖరేంటో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై విచారణకు సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టుకు ఇప్పటికే విజ్ఞప్తి చేశాం. న్యాయస్థానాలపై భాజపా నేతలకు నమ్మకం లేదా? పదేళ్లలో గత ప్రభుత్వంపై ఏ కేసులోనూ సీబీఐ, ఈడీ, ఐటీ విచారణ చేయలేదెందుకు? వరంగల్ వరకు వచ్చిన కిషన్రెడ్డి మేడిగడ్డకు ఎందుకు రాలేదు?’ అని ప్రశ్నించారు.

సీబీఐ విచారణ జరిపించి కేసీఆర్ను రక్షించాలని భాజపా వాళ్లు కోరుకుంటున్నారని ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మూడు బ్యారేజీల విషయంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీకి లేఖ రాస్తామని సీఎం స్పష్టం చేశారు. ఎల్అండ్ టీపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మేడిగడ్డ పునర్నిర్మాణంపై సాంకేతిక నిపుణుల సూచనల ప్రకారం ముందుకు వెళతామని.. హడావిడిగా నిర్ణయాలు తీసుకోబోమని తెలిపారు. విచారణలో అవినీతి, నిధుల దుర్వినియోగం తేలితే.. బాధ్యులపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగిస్తామని స్పష్టం చేశారు.

  • ‘రూ.1.40 లక్షల కోట్ల అంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు 93,870 కోట్లు ఖర్చు చేశారు. ప్రతిపాదిత 19.16 లక్షల ఎకరాల ఆయకట్టులో 98 వేల ఎకరాలకే నీరిచ్చారు. పరిస్థితి ఇలా ఉంటే కేసీఆర్ ఇదో బ్రహ్మాండమైన ప్రాజెక్టు అని, కోటి ఎకరాలకు నీరిచ్చామని ప్రచారం చేసుకున్నారు.
  • తనకు అనుగుణంగా పీపీటీ రూపొందించుకుని అవాస్తవాలు చొప్పించాలని ప్రయత్నించారు. కేసీఆర్ చెప్పింది ఏటా 180 టీఎంసీలు.. అయిదేళ్లలో వచ్చింది 162 టీఎంసీలే.
  • బ్యారేజీ నిర్వహణ కాలం తీరకముందే లయబిలిటీ పీరియడ్ పూర్తయిందంటూ నిర్మాణ సంస్థకు నాటి ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు లేఖ ఇచ్చేశారు. అందుకే విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా సస్పెన్షన్ వేటు వేశాం’ అని రేవంత్ రెడ్డి చెప్పారు.
  • Telangana CM Revanth Reddy invites all MLAs to visit Kaleshwaram project to inspect damages.

మీ గౌరవాన్ని తగ్గించం.. సభకు రండి

మీరు అసెంబ్లీకి రావాలని కోరుతున్నా. మీ గౌరవాన్ని ఏ మాత్రం తగ్గించం.. ఏ సూచనలు ఇచ్చినా వినేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉత్తమ్కుమార్రెడ్డి సాగునీటిపై సభలో శ్వేతపత్రం ప్రవేశపెడతారు. ఆ చర్చలో పాల్గొనండి. కృష్ణా జలాల్ని కాపాడుకునేందుకు కేంద్రంతో ఎలా కొట్లాడాలో మీ అనుభవంతో సూచనలు చేయాలి -కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి.

నాణ్యత లోపాలకు ఈ పగుళ్లే సాక్ష్యం ప్రజాప్రతినిధులకు వివరించిన సీఎం

Telangana CM Revanth Reddy To Give Appointment Letters To 15750 Constable Selected Candidates | కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త.. నేడు రేవంత్ చేతులమీదుగా నియామక పత్రాలు
Telangana CM Revanth Reddy invites all MLAs to visit Kaleshwaram project to inspect damages | కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలి, రూ.లక్ష కోట్ల ఖర్చు.. లక్ష ఎకరాలకూ నీరివ్వలేదు

బ్యారేజీ వద్ద పరిస్థితులను వివరిస్తున్న సీఎం. చిత్రంలో ఉత్తమ్, జూపల్లి, కూనంనేని తదితరులు

“ఇదే మేడిగడ్డ బ్యారేజీ పిల్లరు 20. గత ఏడాది అక్టోబరులో ఒక్కసారిగా భూమిలోకి కుంగిపోయింది. ఇది క్రెస్టు గేటు. పిల్లరుకు, గేటుకు మధ్య భారీ పగుళ్లు వచ్చాయి. రూ.వేల కోట్లతో నిర్మించిన ఇంత పెద్ద ప్రాజెక్టు.. మూడునాళ్లకే కుప్పకూలింది. నాణ్యత, డిజైన్ లోపాలతోపాటు నిర్వహణ లేక బ్యారేజీ మొత్తం పనికిరాకుండా పోయింది’ అంటూ అధికార, విపక్ష ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వివరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్ మేడిగడ్డ బ్యారేజీ పై భాగం, నది లోపలి భాగంలోని క్రెస్టు గేట్లు, రాఫ్ట్లను నిశితంగా పరిశీలించారు. 19-20 పిల్లర్ల మధ్య క్రెస్టు గేటు సమీపానికి చేరుకుని కాంక్రీట్ పగుళ్లు, గేటు కింది భాగంలో ఉన్న రాప్పై ఏర్పడిన నెర్రెలను ఎమ్మెల్యేలకు వివరించారు. Telangana CM Revanth Reddy invites all MLAs to visit Kaleshwaram project to inspect damages

ఇంకా ఎంత నష్టమన్నదే తేలాల్సి ఉంది

‘బ్యారేజీ ఆప్రాన్ నుంచి రాఫ్ట్ భూమిలోకి ఎంత దిగిపోయిందో పరిశీలించండి’ అంటూ సీఎం ఎమ్మెల్యేలకు వివరించారు. నదిలో ఎగువ నుంచి ఊట నీళ్లు 20వ పిల్లరు వద్ద పైకి ఎగసి వస్తుండటాన్ని సీఎం, మంత్రులు పరిశీలించారు. గేటు నుంచి పియర్ చివరి వరకు ర్యాప్ట్ నేలలోకి దిగిపోయిన తీరును చూసి.. భారీ స్థాయిలో కుంగుబాటు జరిగితేనే ఇలాంటి పరిస్థితి ఏర్పడి ఉంటుందని అంచనా వేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘కనిపిస్తున్న పిల్లర్లు కొన్నే. భూగర్భ పరీక్షలు, సాంకేతిక పరీక్షలు పూర్తి చేస్తే మరెంత నష్టం ఏర్పడిందో తేలుతుంది. అవి కొనసాగుతున్నాయి’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

Telangana CM Revanth Reddy invites all MLAs to visit Kaleshwaram project to inspect damages

CM Revanth Reddy-People should know the facts about Medigadda-2024 | ‘మేడిగడ్డ’ గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలి: సీఎం రేవంత్ రెడ్డి

TS Congress Government Announced That Krishna Projects Not Handed Over To KRMB-2024 | జలదోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి: అసెంబ్లీలో ఉత్తమ్ పీపీటీ

As per Minister Komatireddy That Regional Ring Road Will Be A Super Game Changer For Telangana-2024 ? | సూపర్ గేమ్ ఛేంజర్‌గా రిజినల్ రింగ్ రోడ్డు.. ఆ ప్రాంతంలోని భూములకు రెక్కలు..!

During Lok Sabha Elections Transfers Of IPS and Excise Employees In Telangana-2024 | లోక్‌సభ ఎన్నికల ముందు భారీగా IPSల బదిలీలు.. ఎక్సైజ్ శాఖలో ఏకంగా 105 మంది..!

Telangana CM Revanth Reddy invites all MLAs to visit Kaleshwaram project to inspect damages

Using Artificial Intelligence in Sammakka Sarakka Medaram Jatara-2024 | సమ్మక్క సారక్క మేడారం జాతరలో కృత్రిమ మేధ..!

Telangana CM Revanth Reddy invites all MLAs to visit Kaleshwaram project to inspect damages

Artificial Intelligence(Al) Smartphone-2024 | ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?

Telangana CM Revanth Reddy invites all MLAs to visit Kaleshwaram project to inspect damages

Telangana CM Revanth Reddy invites all MLAs to visit Kaleshwaram project to inspect damages

2 thoughts on “Telangana CM Revanth Reddy invites all MLAs to visit Kaleshwaram project to inspect damages | కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలి, రూ.లక్ష కోట్ల ఖర్చు.. లక్ష ఎకరాలకూ నీరివ్వలేదు”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.