...

Telangana Assembly Budget 2024-25 Live Updates | తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. శాఖలవారీగా కేటాయింపులు ఇవే..

Written by lsrupdates.com

Published on:

Telangana Assembly Budget 2024-25 Live Updates | తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. శాఖలవారీగా కేటాయింపులు ఇవే..

Telangana Assembly Budget 2024-25 Live Updates: తెలంగాణ ఆవిర్భావం తర్వాత మెుదటిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ 2024-25ను ప్రవేశపెట్టింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడు నెలల కాలానికి కేటాయింపులు ఉన్నా.. పూర్తి నెలలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.2.75 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

ప్రధానాంశాలు:

  • అసెంబ్లీలో ఓటాన్‌ ఎకౌంట్‌
  • రూ2.75 లక్షల కోట్లతో బడ్జెట్
  • సంక్షేమానికి పెద్దపీట

Telangana Assembly Budget 2024-25 Live Updates:

తెలంగాణలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రూ.2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.29,669 కోట్ల మూలధన వ్యయంతో కొత్త ప్రభుత్వ తొలి పద్దును ప్రతిపాదించారు. మార్పు కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారని.. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో భట్టి తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ను ప్రతిపాదించినట్లు వివరించారు. గత ప్రభుత్వ పథకాలు గొప్ప.. అమలుకు దిబ్బ అన్నట్లుగా ఉండేవన్నారు. గత పాలకుల నిర్వాకంతో ధనిక రాష్ట్రం ఆర్థిక కష్టాల పాలైందని చెప్పారు. గత ప్రభుత్వ అప్పులను అధిగమించి అభివృద్ధిలో సంతులిత వృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తామని వెల్లడించారు.

Telangana Assembly Budget 2024-25 Live Updates | తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. శాఖలవారీగా కేటాయింపులు ఇవే..
Telangana Assembly Budget 2024-25 Live Updates | తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. శాఖలవారీగా కేటాయింపులు ఇవే..

బడ్జెట్‌లో శాఖల వారీగా కేటాయింపులు:

  • పరిశ్రమల శాఖ 2,543 కోట్లు
  • ఐటి శాఖకు 774 కోట్లు.
  • పంచాయతీ రాజ్ 40,080 కోట్లు
  • పురపాలక శాఖకు 11,692 కోట్లు
  • మూసీ రివర్ ఫ్రాంట్ 1000 కోట్లు
  • వ్యవసాయ శాఖ 19,746 కోట్లు
  • ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1,250 కోట్లు
  • ఎస్సీ సంక్షేమం 21,874 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం 13,013 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం 2,262 కోట్లు
  • బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1,546 కోట్లు
  • బీసీ సంక్షేమం 8 వేల కోట్లు
  • విద్యా రంగానికి 21,389కోట్లు
  • తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు
  • యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు
  • వైద్య రంగానికి 11,500 కోట్లు
  • విద్యుత్ – గృహ జ్యోతికి 2,418 కోట్లు
  • విద్యుత్ సంస్థలకు 16,825 కోట్లు
  • గృహ నిర్మాణానికి 7,740 కోట్లు
  • నీటి పారుదల శాఖకు 28,024 కోట్లు

2024-25 ఓట్‌-ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ అంచనాలు:

  • మొత్తం వ్యయం 2,75,891 కోట్లు
  • రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్లు

ఆర్థిక మంత్రి ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలు:

  • ప్రజావాణి’లో రెండు నెలల్లో వచ్చిన దరఖాస్తులు 43,054.
  • ఇళ్ల కోసం వచ్చినవి 14,951.
  • దరఖాస్తుల పరిశీలన కోసం కలెక్టర్లు, శాఖాధిపతులకు పర్యవేక్షణ బాధ్యత.
  • ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వ తొలి ప్రాధాన్యత .
  • మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్లు చెల్లిస్తున్నాం.
  • ఆరోగ్యశ్రీకి అవసరమైన నిధులు అందిస్తాం.
  • గృహజ్యోతి ద్వారా అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
  • త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం.
  • దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.
  • పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు మరింత అభివృద్ధి.
  • ప్రభుత్వం నుంచి 2 లెదర్ పార్కులు, రాష్ట్రం నలుమూలలా ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం .
  • డ్రై పోర్టులను అందుబాటులోకి తెచ్చేందుకు బృహత్ ప్రణాళిక.
  • గ్రామీణ ప్రాంతాల అభివృద్దికి కృత్రిమ మేధ ఉపయోగిస్తాం.
  • ఐటీ రంగంలో నైపుణ్యాభివృద్ధికి నూతన పాలసీ.
  • రాష్ట్ర నలుమూలలకు విస్తరించేందుకు ప్రణాళికలు .
  • ఐటీ విస్తరణకు అమెరికాలోని ఐటీ సర్వ్ సంస్థతో సంప్రదింపులు
  • దేశంలోనే అత్యంత పటిష్ఠమైన ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్లు ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

FD Interest Rate Up To 8.25 Percentage for these Banks in Feb-2024 | ఫిబ్రవరిలో డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే..

Group-1 Notification Soon with Additional 60 Vacancies | 60 అదనపు ఖాళీలతో త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్

Telangana Assembly Budget 2024-25 Live Updates:

1 thought on “Telangana Assembly Budget 2024-25 Live Updates | తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. శాఖలవారీగా కేటాయింపులు ఇవే..”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.