దొంగిలించబడిన పద్మ పతకం దొరికింది, నలుగురి అరెస్ట్..| Stolen Padma Bhushan Medal Found-2024
Stolen Padma Bhushan Medal Found-2024: ప్రముఖ విద్యావేత్త దివంగత జిసి ఛటర్జీకి ఇచ్చిన పద్మభూషణ్ అవార్డు మెడల్‌ను దొంగిలించి విక్రయించారనే ఆరోపణలపై నలుగురిని అరెస్టు చేశారు . పతకం రికవరీ అయింది. నిందితుల్లో మెడికల్ అటెండెంట్‌గా పనిచేసిన ఓ వ్యక్తి ప్రధాన కుట్రదారుడని పోలీసులు తెలిపారు. నిందితులను శ్రావణ్ కుమార్ (33), రింకీ దేవి (40), హరి సింగ్ (45), వేద్ ప్రకాష్ (39)లుగా గుర్తించారు.
Padma Bhushan: దేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్. అయితే ఇలాంటి పద్మ భూషన్ అవార్డు తాజాగా చోరీకి గురి కావడం.. దాన్ని సినిమా రేంజ్‌లో పోలీసులు పట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ దొంగతనం జరిగింది దేశ రాజధాని ఢిల్లీలో కావడం గమనార్హం. ఇందులో మరో విచిత్రం ఏంటంటే.. ఆ పద్మ భూషణ్ పురస్కారం చోరీకి గురైందని.. ఇంటి యజమానికి కూడా తెలియదు. ఆ పద్మ విభూషణ్ అవార్డును దొంగిలించిన దొంగలు.. దాన్ని విక్రయించి డబ్బులు పొందాలని ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారు చేసిన పని కారణంగా పోలీసులకు దొరికిపోయారు.
వైద్య సహాయం అందించే ..
ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో నివసిస్తున్న పంజాబ్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మ భూషణ్ పతకం చోరీకి గురైంది. కల్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న మాజీ వైస్ ఛాన్సలర్ జీసీ ఛటర్జీ మనవడు సమరేశ్ ఛటర్జీకి తెలియకుండా ఆయన ఇంట్లో దొంగతనం జరిగింది. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడే సమరేశ్ ఛటర్జీ ఒంటరిగా నివసిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయనకు వైద్య సహాయం అందించే వ్యక్తి ఈ దొంగతనానికి సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. శ్రావణ్ కుమార్, రింకీ దేవి, హరి సింగ్, వేద్ ప్రకాశ్, ప్రశాంత్ బిస్వాస్‌లు నిందితులుగా గుర్తించి వారిని చివరికి పట్టుకున్నారు. వీరంతా మదన్‌పూర్ ఖాదర్ ప్రాంతానికి చెందినవారని గుర్తించారు.
అయితే సమరేశ్ ఛటర్జీకి సహాయకుడిగా ఉన్న శ్రావణ్ కుమార్.. ఆయన తాతకు వచ్చిన పద్మ భూషణ్ గురించి తెలుసుకున్నాడు. దీంతో దాన్ని ఇంట్లో నుంచి దొంగిలించి రింకీ దేవికి అప్పగించాడు. ఆ తర్వాత మిగిలిన నిందితులు అంతా కలిసి ఆ పద్మ భూషణ్ పురస్కారాన్ని చిత్తరంజన్ పార్క్ ప్రాంతంలోని జ్యువెలరీ షాప్‌లో విక్రయించాలని నిర్ణయించారు. అయితే ఆ పద్మ భూషణ్ పురస్కారాన్ని కొనుగోలు చేసేందుకు దిలీప్ అనే జ్యువెలర్ నిరాకరించాడు. దీంతో నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోగా.. ఖాలిందికుంజ్ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి దిలీప్ విషయాన్ని వివరించాడు.
రూ.70 వేలు పొందినట్లు..
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ దుకాణం వద్దకు వచ్చి సీసీటీవీ ఫుటేజీ పరీశీలించారు. నిందితులను గుర్తించి వారి కోసం గాలింపు చేపట్టి చివరికి ఐదుగురిని అరెస్ట్ చేశారు. అయితే అప్పటికే వారు ఆ పద్మ భూషణ్ పురస్కారాన్ని ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అందులో బంగారంతో పొదిగిన వస్తువులను తీసి వాటిని ఇచ్చి రూ.70 వేలు పొందినట్లు సౌత్‌ఈస్ట్ డీసీపీ రాజేష్ డియో వెల్లడించారు. అయితే ఆ పద్మ భూషణ్ అవార్డుకు సంబంధించిన ఇత్తడి భాగాలు ఇంకా దొరకలేదని పేర్కొన్నారు. సమరేశ్ ఛటర్జీ, పంజాబ్ యూనివర్సిటీ, రాజస్థాన్ యూనివర్సిటీలకు వైస్-ఛాన్సలర్‌గా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా, నేషనల్ బుక్ ట్రస్ట్ ఛైర్మన్‌గా పనిచేశారు.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
Stolen Padma Bhushan Medal Found-2024
గగన్‌యాన్ మిషన్ 4 వ్యోమగాముల గురించి | About Gaganyaan Mission 4 Astronauts
గగన్‌యాన్ వ్యోమగాములు వీళ్లే | PM Modi Announces 4 Astronauts For Gaganyaan Mission-2024
1 thought on “దొంగిలించబడిన పద్మ పతకం దొరికింది, నలుగురి అరెస్ట్..| Stolen Padma Bhushan Medal Found-2024”