పార్ట్-4: తెలంగాణ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర | Social and Cultural History of Telangana Part-4

Written by lsrupdates.com

Published on:

పార్ట్-4: తెలంగాణ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర | Social and Cultural History of Telangana Part-4

కాకతీయుల కాలం నాటి సమాజం

Social and Cultural History of Telangana Part-4: కాకతీయుల కాలంనాటి సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. సమాజంలో చేసే వృత్తి, నివసించే ప్రాంతాన్ని బట్టి అనేక కులాలు, ఉపకులాలు విస్తృతంగా ఉండేవి. ఈ కాలంనాటి శాసనాలు, సాహిత్యాధారాల ఆధారంగా సమాజంలో ఉండే కులాల గురించి తెలుస్తున్నది.

ప్రతి కులానికి, ఉపకులానికి ఉండే వృత్తి సంఘాల ‘సమయాలు’ అని పిలిచేవారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, కోమట్లు, సాలెలు, తెలికులు (నూనె వ్యాపారులు), తమ్మడ్లు (వ్యవసాయం), గొల్లవారు (పశుపోషణ), ఈదులవారు (గీత కార్మికులు), మంగలి, కుమ్మరి, మేదరి, వెలమ, కరణం (భూముల లెక్కలు), రెడ్లు (వ్యవసాయం), ఉప్పరి (మట్టి పని), మచరాసి (బెస్త, చేపలు పట్టడం), మేర, పెరిక (వ్యవసాయం, వాణిజ్యం), ఎరుకలి (బుట్టలు అల్లడం), కాసె (రాళ్లు కొట్టడం) మొదలైన కులాలు, ఉపకులాలు ప్రధానంగా ఉండేవి.

‘ప్రతాప చరిత్ర’లో కాకతీయుల రాజధాని నగరమైన ఓరుగల్లు నగర జీవితం గురించి, వివిధ వృత్తుల గురించి ప్రత్యేకమైన ప్రస్తావన కలదు. బ్రాహ్మణులు, మంత్రులు, యోధులు, వైశ్యులు, పద్మనాయకులు (వెలమ), విశ్వకర్మలు, కాపులు, ఎడిగలు (గీత కార్మికులు), కుంభకరులు (కుమ్మరులు), పట్టుసాలెలు (పట్టునేతవారు), పద్మసాలె (నేత కార్మికులు), మేదరులు, బెస్తలు, రజకులు, వేశ్యలు, పూటకూళ్లవారు ఓరుగల్లు నగర జీవన సంస్కృతిలో ఒక భాగంగా ఉండేవారు.

బ్రాహ్మణ కులస్థుల్లోనూ వైదికులు (వేదశాస్త్రాల అధ్యయనం, పౌరోహిత్యం), నియోగులు (రాజాశ్రయంలో ఉద్యోగాలు, పదవులు) అనే శాఖలు ఏర్పడ్డాయి. వైదికుల్లో కూడా వారు అధ్యయనం చేసిన వేదశాఖను బట్టి రుగ్వేదులు, శుక్ల యజుర్వేదులు, కృష్ణ యజుర్వేదులు అనే విభాగాలు ఏర్పడ్డాయి. ప్రాంతాన్ని బట్టి వారు అనుసరించే కులాల్లోనూ ఉపకులాలు ఏర్పడ్డాయి. వేంగినాటి, పాకనాటి, వెలనాటి, తెలంగాణ బ్రాహ్మణులుగా వ్యవహారంలోకి వచ్చారు.

ఈ కాలంలో బ్రాహ్మణులకు, దేవాలయాలకు పన్ను మినహాయింపుతో కూడిన భూములను దానం చేయడం విస్తృతమైంది. దీంతో వీటి వివరాలను లిఖిత పూర్వకంగా నమోదు చేయడం, భద్రపరిచి పర్యవేక్షణ చేయడానికి ఉద్యోగుల ఆవశ్యకత ఏర్పడింది. కాయస్థ, కరణం, కరణిక, లేఖిక, ధర్మలేఖిక మొదలైన ఉద్యోగులకు ఈ బాధ్యతల్ని అప్పగించడంతో వీరు ‘కాయస్థ’ అనే ఉపకులంగా ఆవిర్భవించారు. దీంతో రాజాస్థానాల్లో బ్రాహ్మణుల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసినట్లయింది. కాకతీయ ప్రభువులకు ‘కాయస్థులు’ మంత్రులుగా కూడా పనిచేశారు. వర్ణవ్యవస్థలో అట్టడుగున ఉన్న శూద్రుల పరిస్థితి మెరుగవడం ఈ కాలం నాటి ప్రధాన సామాజిక పరిణామం. వీరిని వ్యవసాయదారులుగా పరిగణించారు. రెడ్లు, వెలమలు, కమ్మలు రాజాస్థానాల్లో ఉన్నతోద్యోగాల్లో నియమితులయ్యారు. ఈ వైశ్యుల స్థాయి తగ్గడంతో వారిని శూద్రులతో సమానంగా పరిగణించారు.

కాకతీయ రాజవంశ ఆర్థిక వ్యవస్థ

ప్రభుత్వ ఆదాయానికి ప్రధాన వనరు వ్యవసాయ ఉత్పత్తులపై విధించే పన్ను. 

  • కార్తిక మరియు వైశాఖం రెండు ప్రధాన పంటల సీజన్లలో కాకతీయ రాజ్యంలో తరచుగా రెండు విడతలుగా పన్నులు చెల్లించేవారు. 
  • ఈ సందర్భంలో ఉపయోగించబడే పదం, సుంకము లేదా సుంక, అంటే ఎగుమతులు మరియు దిగుమతులపై సుంకాలు, ఎక్సైజ్ సుంకాలు మరియు మార్కెట్ నగరాలకు తీసుకువచ్చిన మరియు తీసుకున్న వస్తువులపై విధించే కస్టమ్స్ సుంకాలు.
  • గుర్రాలు, బండిలు (క్యారేజీలు) మరియు బానిసలు (బానిసలు) వంటి నిర్దిష్ట వస్తువుల యాజమాన్యంపై కాకతీయుల క్రింద పన్నులు విధించబడ్డాయి.
  • మోటుపల్లి కాకతీయ రాజవంశం యొక్క ముఖ్యమైన ఓడరేవు.
  • కాకతీయ చక్రవర్తులు వివిధ నీటిపారుదల వ్యవస్థలను నిర్మించడంలో బలమైన వ్యక్తిగత ఆసక్తిని కనబరిచినందుకు ప్రసిద్ధి చెందారు. 
  • నీటిపారుదల కొరకు, ఆనకట్టలు మరియు ట్యాంకులు (కాకతీయ సామ్రాజ్యంలో సముద్రాలు) నిర్మించబడ్డాయి. 
  • ట్యాంకులు చిన్నవి, నీటిపారుదల వ్యవస్థలు అంతంత మాత్రంగా ఉండేవి, కాకతీయులకు ముందు వ్యవసాయ ప్రాంతం భూమిలో కొద్ది భాగం మాత్రమే. 
  • కాకతీయ పాలకులు బీటా II, రుద్ర, గణపతి మరియు ప్రతాపరుద్ర వారి రాజ్యం చుట్టూ అనేక ట్యాంకులు నిర్మించారు.
  • రామప్ప మరియు పాకాల సరస్సులు అన్ని ట్యాంకుల కంటే పెద్దవి. పాలంపేటలోని రామప్ప దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. క్రీ.శ.1213లో కాకతీయ ఆధీనంలో ఉన్న జగదల ముమ్మడి పాకాల సరస్సును నిర్మించాడు.
  • ట్యాంకులు మరియు దేవాలయాల నిర్మాణం కొత్త పట్టణాల అభివృద్ధికి మార్గం సుగమం చేసింది, ఇది గతంలో సాగు చేయని భూభాగాన్ని సాగు చేయడానికి అనుమతించింది.
  • ఆంధ్ర ప్రాంతంలో, కాకతీయులు మరియు వారి ఆధీనంలో ఉన్న నాయకులు దాదాపు 5000 ట్యాంకులను నిర్మించినట్లు తెలిసింది, వీటిలో చాలా వరకు నేటికీ వాడుకలో ఉన్నాయి.

సాగుభూమిని 3 రకాలుగా వర్గీకరించారు 

1. వేలిచేను
2. నీరునెల
3. తోటభూమి
  • పొలాన్ని గడ / దండ /కోల అనే ప్రమాణంతో కొలిచేవారు.
  • భూమి శిస్తును వారి అనేవారు.  సాధారణంగా భూమి శిస్తు 1/6 వ వంతు ఉండేది.
  • అప్పట్లో వైశ్యలపై మరియు బిచ్చగాళ్లపై  గణాచారి పన్ను విధించేవారు.
  • పశువుల మేతపై పుల్లరీ పన్ను విధించేవారు.
  • రాజదర్శనం కోసం దరిశనం అనే పన్ను చెల్లించేవారు
  • నిర్మల్ ఖడ్గాలు డమాస్కస్ (సిరియా) కు ఎగుమతి చేశారని పేర్కొంటారు.
  • మార్కుపోలో అప్పటి గోల్కొండ వజ్రపుగనుల గురుంచి పేర్కొంటారు.
  • వీరి కాలంలో అతి ముఖ్యమైన ఓడరేవు – మోటుపల్లి
  • వీరికాలంలో దేశీయ వాణిజ్యానికి ప్రధానకేంద్రం – ఓరుగల్లు
  • రాజుయొక్క సొంత పొలాన్ని రాచదొడ్డి అనేవారు.
  • వీరికాలంలో సాగు చేయబడని పంట – కంది.

కాకతీయుల కాలంనాటి మతం

వీరికాలంలో శైవ మతం బాగా వ్యాప్తి చెందింది.

శైవమతం 3 శాఖలుగా చీలిపోయి వ్యాప్తి చెందింది

1. పాశుపత శైవం 

2. కాలముఖ శైవం (స్థాపకుడు – లకులీశ్వరుడు )

3. కాపాలిక శైవం 

  • గణపతిదేవుడు పాశుపత శాఖను ఆదరించాడు.  ఇతని గురువు విశ్వేశ్వర శంభు గోళకి మఠాలను స్థాపించి శైవమతాన్ని వ్యాప్తి చేసాడు.
  • వీరశైవ గురువులను జంగములు అంటారు
  • వీరి మత పుస్తకాలను ఆగములు అంటారు
  • వీరి అనుచరులను లింగాయతులు అంటారు
  • వీరికాలంలో బౌద్ధమతం పూర్తిగా అంతరించింది. తొలి కాకతీయులు జైన మతాన్ని ఆదరించారు.
సాహిత్యం 
కాకతీయుల అధికారిక బాష – సంస్కృతం
వీరు తెలుగు భాషకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు
వీరికాలంలో అనేక తెలుగు పుస్తకాలు రచించబడ్డాయి
1. రంగనాథ రామాయణం – గోనబుద్ధారెడ్డి
2. భాస్కర రామాయణం – భాస్కరుడు
3. బసవపురాణం – పాల్కురిసోమనాథుడు
4. పండితారాధ్య పురాణం – పాల్కురిసోమనాథుడు
5. మార్కండేయ పురాణం – మారన
వీరికాలంలో రచించబడిన సంస్కృత గ్రంధాలు 
1. నీతిసారం – రుద్రదేవుడు / ఒకటవ ప్రతాపరుద్రుడు
2. సకల నీతిసారం – ముడితి సింగన్న
3. నీతిసార ముక్తావళి – బద్దెన
4. సుమతీ శతకం – బద్దెన
5. ప్రతాపరుద్ర యశోభూషణం – విద్యానాథుడు
6. పురుషార్థ సారం – శివదేవయ్య
7. క్రీడాభిరాభం – వినుకొండ వల్లభాచార్యులు
8. ప్రేమాభిరామం – త్రిపురాంతకుడు
తెలంగాణ సాహిత్యంలో కాకతీయుల కాలం స్వర్ణయుగం అంటారు
తొలిసారిగా స్వతంత్ర రచన చేసిన పాల్కురిసోమనాథుడు ని తెలంగాణ సాహిత్యంలో ఆదికవిగా కీర్తించబడతారు.

వాస్తు శిల్పకళ 

కాకతీయుల కాలంలో ఆలయ నిర్మాణాల్లో పశ్చిమ చాళుక్యుల వాస్తు విధానాన్ని అనుసరించారు.
వీరు త్రికూట ఆలయాలు నిర్మించారు
రేచర్ల రుద్రుడు పాలంపేటలో రామప్పగుడిని నిర్మించాడు. ఈ దేవాలయంలో  ఉపయోగించిన ఇటుకలు నీటిలో తేలుతాయి.
రుద్రదేవుడు హనుమకొండలో వేయిస్తంభాల గుడిని నిర్మించాడు

కాకతీయుల సామంతులు

వీరి సామంత రాజవంశాలు
1. విరియాల వంశం
2. నటవాడి వంశం
3. గోన వంశం
4. చెరుకు వంశం
5. కాయస్థ వంశం
6. పోలవస రాజవంశం
7. గోండు రాజులు
8. మాల్యాల, బాచ వరూధిని
9. రేచర్ల రెడ్డి వంశం
10. పిల్లలమర్రి రేచర్ల రెడ్డి వంశం
11. ఎలకుర్తి రేచర్ల రెడ్డి వంశం
12. హైహయ వంశం
13. కొలనుపాక రాజ్యం
14. యాదవ రాజ్యం

విరియాల వంశం: 

  • ఈ వంశస్థులు గూడూరు, మొరిపిరాల, కటుకూరు షమ్మి, రాయపర్తి వంటి శాసనాలు వేయించారు.
  • ఈ శాసనాల ప్రకారం ఈ వంశం యొక్క మూల పురుషుడు పోరంటి వెన్న మూల పురుషుడు
  • ఎర్ర నరేంద్రుడు/ఎర్రసేనాని
  • కాకర్త్య గుండన సోదరి కామసానిని వివాహం చేసుకున్నాడు
  • ఇతని కాలంలోనే 2వ తైలవుడు రాష్ట్రకూటులను అంతంచేశాడు

నటవాడి వంశం:

  • నటవాడి ప్రాంతాన్ని పాలించిన వీరికి దాని పేరు మీదుగానే నటవాడి వంశం అని వచ్చింది
  • దుర్గరాజు (క్రీ.శ 1104-57)
  • ఇతను వరంగల్ జిల్లాలోని నిడిగొండ శాసనాన్ని వేయించాడు
  • ఇతని భార్య పేరు ప్రోలమదేవి
  • ఇతని మరణం తరువాత ఇతని భార్య క్రీ.శ 1157 లో నవేపోతవరంలో శాసనం వేయించింది

గోన వంశం:

  • వీరు వర్ధమానపురం నుండి పరిపాలించారు
  • రుద్రమదేవికి అత్యంత విశ్వాసమైనవాడు గోన గన్నారెడ్డి
  • గుండాదండాదీశుడు
  • ఇతను క్రీ.శ 1245-46లో వర్ధమానపుర శాసనాన్ని, 1259లో బూదపుర శాసనాన్ని వేయించాడు

చెరుకు రెడ్డి వంశం

  • జలాల్  పురం శాసనం ప్రకారం కాటసేనాని ఈ వంశానికి ఆద్యుడు

కాయస్థ వంశం

  • వీరు మహారాష్ట్ర నుంచి వచ్చి స్థిరపడ్డారు
  • వీరి రాజధాని వల్లూరు (కడప జిల్లా)
  • అంబదేవుడు ( క్రీ.శ 1275-1302)
  • ఇతను తనకుతాను స్వతంత్రం ప్రకటించుకొని కాకతీయులకు శత్రువయ్యాడు
  • చందుపట్ల శాసనం ప్రకారం రుద్రమదేవి అంబదేవుని చేతిలో హతమైంది

ముసునూరి వంశం  (క్రీ.శ. 1325-1368)- Musunuri Nayaks History 

  • క్రీ.శ 1323 లో కాకతీయ రాజ్యం పతనమైన తరువాత అప్పటి ఢిల్లీ సుల్తాన్ గియాజుద్దీన్ తుగ్లక్ మొహమ్మద్ బీన్ తుగ్లక్/జునాఖాన్  ను పంపి వరంగల్ ను అంతం చేయించి దానికి సుల్తానపూర్ అని నామకరణం చేశాడు.
  • ఢిల్లీ సుల్తాను నాయకులను ఎదుర్కోవడానికి ఆంధ్రదేశంలోని సుమారు 75 మంది రాజులు ప్రోలయ్య నాయకుడి నాయకత్వాన ఒకటయ్యారు.  ఈయన స్థాపించిన వంశమే ముసునూరి వంశం.
  • వీరి గురుంచి తెలిపే శాసనాలు – విలాస తామ్ర శాసనం(ప్రోలయ నాయుడు), పోలవరం శాసనం(కాపయ్యనాయుడు), ముసునూరి వంశ పాలకులు — 1. ప్రోలయ నాయకుడు 2. కాపయ నాయకుడు .
ప్రోలయ నాయకుడు (క్రీ. శ. 1325-1333)
  • ఇతని యొక్క తండ్రి పేరు పోతి నాయకుడు
  • ఇతను నేటి రేకపల్లిని (నేటి భద్రాచలం) రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు.
  • ఇతను విలాస శాసనం ను వేయించాడు
  • ఇతనికి కల బిరుదు ఆంధ్ర భూమండలాధ్యక్షుడు
కాపయ నాయకుడు (క్రీ.శ. 1333-1368)
  • ఇతను దేవనాయకుని కుమారుడు
  • ఇతనికి కల బిరుదులు ఆంధ్ర దేశాధీశ్వర, ఆంధ్రాసురత్రాణ,అనుమగంటి పురవరాదీశ్వర
  • ఇతను వేయించిన పోలవరం శాసనాన్ని వేయించాడు
  • ఇతను అప్పటి వరంగల్ ను పాలిస్తున్న మాలిక్ ముక్బుల్ ను ఓడించి వరంగల్ ను ఆక్రమించాడు
  • ఇతను బహుమనీ రాజ్యస్థాపనలో హాసన్ గంగూ కి సహాయం చేశాడు.
  • సికిందర్ ఖాన్ కాపయ నాయకుడిని ఓడించి కౌలస్ దుర్గంను (నిజామాబాదు) ఆక్రమించాడు.
  • క్రీ.శ 1356 లో బహమన్ షా తిరిగి దండెత్తటంతో ఇతను పరాజయంపాలై భువనగిరి దుర్గాన్ని కోల్పోయి సంధి కుదుర్చుకున్నాడు
  • క్రీ.శ 1368 లో రేచర్ల పద్మనాయక రాజు అయిన అనవోత నాయకుడు భీమవరం యుద్ధంలో కాపయ నాయుడుని హతమార్చాడు.  దీనితో ముసునూరి వంశం అంతమైంది.

వెలమలు వంశం (రాచకొండ, దేవరకొండ) – History of Recharla Velama Dynasty in Telangana

  • రేచర్ల పద్మ నాయకులను వెలమ నాయకులు అని కూడా అంటారు.
  • వీరి యొక్క మొదటి రాజధాని అనుమానగల్లు తరువాత రాచకొండ, దేవరకొండలను చేసుకుని పాలించారు
  • వీరి వంశానికి చెందినవారు దేవరకొండను రాజధానిగా చేసుకుని పరిపాలించారు
  • ఈ వంశం యొక్క స్థాపకుడు సింగమనాయకుడు
  • వీరిలో గొప్పవాడు 2వ సింగ భూపాలుడు
  • వీరియొక్క పూర్వికులు కాకతీయ వంశంలో ఉన్నతమైన పదవులు చేపట్టారు.
  • సింగమనాయుడు 2వ ప్రతాపరుద్రుడునికి సేనాధిపతిగా ఉన్నాడు
రేచర్ల వెలమ వంశం- (Recharla Velama Dynasty)
  1. సింగమనాయుడు (క్రీ.శ.1326-1361)
  2. మొదటి అనవోతనాయకుడు (క్రీ.శ.1361-1384)
  3. 2వ సింగభూపాలుడు (క్రీ.శ.1384-1399)
  4. 2వ అనవోతనాయకుడు (క్రీ.శ.1399-1421)
  5. మాదానాయకుడు (క్రీ.శ.1421-1430)
  6. 3వ సింగమనాయకుడు (క్రీ.శ.1430-1475)

దేవరకొండ వెలమ పాలకులు (Devarakonda Velama Dynasty)

దేవరకొండ రాజ్యాన్ని 1287 నుంచి 1475 వరకు 8 మంది రాజులు పరిపాలించారు. వారిలో ముఖ్యమైన కొందరు రాజులు .
  1. రాజా మాధానాయుడు 2
  2. రాజా పెదవేదగిరి నాయుడు (క్రీ.శ.1384-1410)
  3. రాజా మాదానాయడు 3 (క్రీ.శ.1410-1425)
  4. రాజా లింగమనాయుడు  (క్రీ.శ.1425-1475)
సింగమనాయుడు (క్రీ.శ. 1326-1361) Recharla Velama Singhama Nayak
  • ఇతను వెలమ వంశ స్థాపకుడు
  • ఇతను అనుమనగల్లును రాజధానిగా చేసుకుని పరిపాలించాడు.
  • ఇతను జల్లిపల్లి కోటను ఆక్రమించే క్రమంలో సోమవంశ క్షత్రియులచే హతమార్చబడ్డాడు
  • ఇతని తరువాత ఇతని కుమారుడు మొదటి అనవోతానాయకుడు పాలకుడయ్యాడు.
మొదటి అనవోతనాయకుడు (క్రీ.శ.1361-1384)
  • ఇతను రాజధానిని అనుమనగల్లు నుంచి రాచకొండకు మార్చాడు
  • ఇతను పరిపాలన సౌలభ్యం కొరకు రాజ్యాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించి ఇతను ఉత్తర భాగానికి తన తమ్ముడును దక్షిణ భాగానికి దేవరకొండ రాజధానిగా పరిపాలన కొనసాగించారు.
  • అప్పటినుంచి మదనాయకుడు వంశీయులు దేవరకొండ నుంచి పరిపాలించారు.
  • ఇతని కాలంలోనే నాగనాథుడు విష్ణుపురాణంను రచించాడు.
  • ఇతని తరువాత ఇతని 2వ సింగభూపాలుడు రాజ్యాన్ని అధిష్టించాడు.
కుమార సింగభూపాలుడు/2వ సింగభూపాలుడు (క్రీ.శ.1384-1399)
  • ఇతని యొక్క బిరుదులు సర్వజ్ఞ చక్రవర్తి,సర్వజ్ఞ చూడామణి, కళ్యాణిభూపతి, ప్రతి పండ భైరవ
  • ఇతనియొక్క రచనలు రసార్ణవ సుధాకరం, రత్న పాంచాలిక, సంగీత సుధాకరము
  • ఇతను యువరాజుగా ఉన్నప్పుడు కల్యాణదుర్గన్ని ఆక్రమించి కళ్యాణి భూపతి అనే బిరుదు పొందాడని ఇతని ఆస్థాన కవి విశ్వేశ్వరుడు తన చమత్కార చంద్రిక అనే  ప్రస్తావించాడు.
2వ అనపోత నాయకుడు (క్రీ.శ.1399-1421)
  • వెలుగోటి వంశావళి గ్రంథం ఇతని యొక్క విజయాలను ప్రస్తావించింది.
  • ఇతని కాలంలోనే వెలమ మరియు బహుమనీ ల మధ్య సంబంధాలు చెడిపోయినవి
  • ఇతను (క్రీ.శ. 1417 లో బహుమనీలకు వ్యతిరేకంగా విజయనగర రాజులతో కలిసి వారిని ఓడించాడు.
మాదానాయకుడు (క్రీ.శ.1421-1430)
  • ఇతను 2వ అనవోతా నాయకుడి సోదరుడు
  • (క్రీ.శ.  1425 లో అహ్మద్ షా వరంగల్ ను ఆక్రమించాడు. దీనితో మదనాయకుడు బహుమనీలతో సంధి చేసుకుని వరంగల్ ను తిరిగి పొందాడు.
  • ఇతను రామానుజాచార్యుని కుమారుడైన వెంకటచార్యుని శిష్యుడు
  • ఇతని భార్య నాగాంబిక క్రీ.శ.1429 లో రాచకొండ సమీపంలో నాగసముద్రం అనే చెరువు త్రవ్వించింది.
3వ సింగమ నాయకుడు (క్రీ.శ.1430-1475)
  • ఇతను 2వ అనవోతానాయకుడి కుమారుడు
  • ఇతని యొక్క బిరుదులు ముమ్మడి సింగమనాయుడు, సర్వజ్ఞరావ్ సింగమనాయుడు
  • ఇతని కాలంలోనే అహ్మద్ షా తెలంగాణను ఆక్రమించారు.
  • తరువాత బహుమాని రాజు హుమాయూన్ దేవరకొండను కూడా ఆక్రమించాడు.
  • దీనితో తెలంగాణ మొత్తం బహుమనీల ఆధీనంలోకి వచ్చింది.
  • ధర్మనాయుడు శాయంపేట శాసనం వేయించాడు.

Social and Cultural History of Telangana Part-4  #Social and Cultural History of Telangana Part-4 # Social and Cultural History of Telangana Part-4

తెలంగాణ సంతలు -Telangana Fairs and Festivals

సంతల విషయంలో తెలంగాణకు ప్రత్యేక స్థానమున్నది. సంత అనగా ఒక ప్రాంతానికి చెందిన ప్రజలు వారి నిత్యావసర వస్తువులు వారంలో ఏదో ఒక రోజు లేదా నెలలో ఒక రోజు లేదా సంవత్సరంలో ఒక రోజు ప్రజలందరు ఒక ప్రాంతంలో ఏకమవ్వటాన్ని ‘సంత’ అంటారు.

సంతలు అనేవి ప్రాంతాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వివిధ రకాలుగా ఉంటాయి.

1. సాధారణంగా సంతలు

2. ప్రత్యేకంగా జరిగే సంతలు

సాధారణంగా జరిగే సంతలు

1. కూరగాయల సంతలు

2. పశువుల సంతలు

3. గొర్రెల సంతలు

ప్రత్యేక సంతలు 

తెలంగాణ రాష్ట్రంలో వివిధ పండుగలు, జాతరలు ప్రధానమైనవి

1. మేడారం సంత

2. కొండగట్టు జాతర (Kondagattu Jatara Karimnagar Dist)

3. ఏడుపాయల జాతర (Edupayala Jatara Medak Dist)

4. సమ్మక్క సారక్క జాతర (Sammakka Sarakka Jatara Warangal Dist, Telangana)

5. నాగోబా సంత (Nagoba Jatara Adilabad Dist)

6. కురుమూర్తి సంత (Kurumurthy Jatara Mahaboobnagar Dist)

7. గొల్లగట్టు సంత (Golla Gattu Jatara Nalgonda Dist, Near to Suryapet)

  • ఆసియా లోనే అతిపెద్ద జంతువుల సంత — పాట్నా(బీహార్)
  • దేశంలోనే అతిపెద్ద పుస్తకాల సంత — కోల్ కత్తా
  • దేశంలోనే అతిపెద్ద మతపరమైన సంత — కుంభమేళా
  • తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మతపరమైన సంత — సమ్మక్క సారక్క

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సంతలు ప్రదేశాలు

1. సోనేపూర్ సంత — బీహార్ (ఆవులు, మేకలు, గొర్రెలు)

2. అంబుససి సంత — గౌహతి

3. హౌలా మొహల్లా — పంజాబ్

4. నాగౌర్ సంత — రాజస్థాన్

5. గంగా సాగర సంత — కోల్ కత్తా

6. ముక్తసర్ సంత — పంజాబ్

7. నవీపేట వారం సంత — నిజామాబాద్ (గొర్రెల, మేకల సంత – ఇది దక్షిణ భారతదేశంలో ప్రముఖమైనది)

8. పుష్కర సంత — రాజస్థాన్ (ఒంటెలు)

9. హోమిస్ గుప్తా సంత — లడఖ్ (బౌద్ధమతానికి సంబందించినది)

తెలంగాణ పండుగలు- List of Telangana Festivals

బోనాలు: 1813 నుంచి తెలంగాణాలో ఈ పండగను జరుపుకుంటున్నారు. 2014 జూన్ 16న తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది.

సంక్రాతి, శివరాత్రి ,హోలీ , ఉగాది, శ్రీరామ నవమి , వరలక్ష్మి వ్రతం , కృష్ణాష్టమి , వినాయక చవితి దీపావళి ,నాగుల చవితి , క్రిస్టమస్ .

దసరా: తెలంగాణాలో దసరా ఉత్సవాల్లో భాగంగా బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటారు.

బతుకమ్మ పండుగ : దేవి అవతారం అయిన బతుకమ్మను పుష్పాలతో అలంకరించి ఆటలతో పాటలతో పూజిస్తారు

  • 1వ రోజు: ఎంగిలిపూల బతుకమ్మ
  • 2వ రోజు: అటుకుల బతుకమ్మ
  • 3వ రోజు: ముద్దపప్పు బతుకమ్మ
  • 4వ రోజు: నాన బియ్యం బతుకమ్మ
  • 5వ రోజు: అట్ల బతుకమ్మ
  • 6వ రోజు: అలిగిన బతుకమ్మ
  • 7వ రోజు: వేపకాయల బతుకమ్మ
  • 8వ రోజు: వెన్నముద్దల బతుకమ్మ
  • 9వ రోజు: సద్దుల బతుకమ్మ

తీజ్ పండుగ: గిరిజన సంస్కృతికి సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే తీజ్ పండుగను బంజారాలు/లంబాడీలు ఘనంగా జరుపుకుంటారు.

మిలాద్-ఉన్-నబీ : ఈ పండుగను ప్రవక్త మహమ్మద్ జన్మదిన సందర్భంగా జరుపుకుంటారు.

ఈద్-ఉల్-ఫితర్: దీనికి గల మరొక పేరు రంజాన్

ఈద్-ఉల్-జుహ: ఈ పండుగను బక్రీద్ అని కూడా అంటారు. ఇది ప్రవక్త ఇబ్రహీం చేసిన త్యాగానికి గుర్తు చేసుకుంటూ జరుపుకునే పండుగ.

Social and Cultural History of Telangana Part-4  #Social and Cultural History of Telangana Part-4 # Social and Cultural History of Telangana Part-4

తెలంగాణ సంస్థానాలు, గడీలు 

హైదరాబాద్‌ అసఫ్‌జాహీ రాజ్యంలో కొన్ని స్వయంపాలన అధికారాలు కలిగిన సంస్థానాలు మరియు పన్ను వసూలు అధికారాలు పొందిన భూస్వాములు (గడీలు) ఉండేవారు.

నిజాం రాజ్యంలో మొత్తం 14 సంస్థానాలు ఉండేవి.

1. పాల్వంచ, 2 మునగాల, 3 దోమకొండ, 4 పాపన్నపేట, 5 గద్వాల్‌,  6 వనపర్తి , 7 జటప్రోలు,  8 రాజాపేట 9 అనెగొంది,  10 దుబ్బాక, 11 అమరచింత(ఆత్మకూరు),  12 గురుగుంట, 13 నారాయణపేట & 14 సిర్నవల్లి.

నిజాం రాజ్యంలోని కొన్ని ప్రముఖ భూస్వాములు/గడీలు

1. విసునూరు గడీ , 2 ఆత్మకూరు గడీ ,3. కల్లెడ గడీ , 4. జిల్లెల గడీ, 5 కంఠాత్మకూర్‌ గడీ , 6 పోలంపల్లి గడీ, 7 సిర్నవల్లి గడీ, 8 సంజీవన్‌రావుపేట గడీ, 9 బేతవోలు గడీ

సంస్థానాలు

సేనాపతులు/ఉన్నత అధికారులు పాలకులకు సేవలు అందించినందుకు ప్రతిఫలంగా కొన్ని ప్రాంతాల పాలనా అధికారాలను పొందేవారు. ఈ ప్రాంతాలే సంస్థానాలుగా ప్రసిద్ధి చెందాయి.

1. పాల్వంచ:

  • రాజధాని – పాల్వంచ
  • రెండవ రాజధాని – అశ్వరావుపేట
  • స్థాపకుడు – అప్పన్న అశ్వారావు
  • చివరివాడు – విజయ అప్పారావు
  • అప్పన్న అనే వ్యక్తి 2వ ప్రతాపరుద్రుని యొక్క గుర్రాన్ని నియంత్రించడంతో 2వ ప్రతాపరుద్రుడు అప్పన్నకి అశ్వారావు అనే బిరుదునిచ్చి పాల్వంచ ప్రాంతానికి అధిపతిని చేశాడు. అప్పటి నుంచి వీరి వంశాన్ని అశ్వరావు వంశం అంటారు.
  • వెంకట్రామ అశ్వరావు ఈ వంశంలో ప్రముఖుడు. ఇతను నిజాం అలీ నుండి రాజ్‌ బహదూర్‌ అనే బిరుదు పొంది, 3 వేల కాల్బలాన్ని 2 వేల అశ్వక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
ఈ వంశంలో చివరి ప్రముఖుడు విజయ అప్పారావు. ఇతను కొమర్రాజు లక్ష్మణరావు స్థాపించిన శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం గ్రంథాలయ ఏర్పాటులో సహకరించాడు.
శ్రీనాథుని వెంకట్రామయ్య ఈ వంశ చరిత్రను వివరిస్తూ అశ్వరాయ చరిత్ర/శ్రీరామ పట్టాభిషేకం అనే గ్రంథం రచించాడు.

2. మునగాల :

  • మొదటి రాజధాని – రేపాల
  • రెండవ రాజధాని – సిరిపురం
  • మూడవ రాజధాని – నడిగూడెం బహమనీల కాలంలో గార్లపాటి వంశానికి చెందిన ఎల్లప్ప మునగాల జాగీర్దార్‌ని పొందాడు.
  • ఇతని తర్వాత కాలంలో ప్రముఖుడు అయ్యన్న కుమారుడు.
  • ఇతని భార్య సుభద్రాదేవి (కీసర వారి వంశం)
  • అయ్యన్న కుమారుడి మరణానంతరం సుభద్రాదేవి మునగాలను పాలించింది.
  • ఈమె తన సోదరుడైన ముకుందప్పకు పాలనా బాధ్యతలు అప్పగించింది.
  • ముకుందప్ప బెరంగజేబుకు మద్దతు ప్రకటించడంతో మునగాల సంస్థానం ముకుందప్ప యొక్క కీసరవారి వంశానికి లభించింది. అప్పటి నుండి మునగాలను కీసరవారి వంశస్తులు పాలించారు.
  • 1766 లో అసఫ్జాహి పాలకుడైన నిజాం అలీ ఉత్తర సర్కార్‌లను బ్రిటిష్‌ వారికి అప్పగించడంతో మునగాల బ్రిటిష్‌ ఆధీనంలోకి వచ్చింది.
  • కీసరవారి వంశం ఆస్తి తగాదాల కారణంగా పతనమైంది. ఈ వంశానికి చెందిన గోపమ్మ కోదండరామయ్యను దత్తత తీసుకొని పాలకుడిగా ప్రకటించింది.
  • తర్వాత కాలంలో గోపమ్మ మరియు కోదండ రామయ్య భార్య అయిన రుక్కమ్మల మధ్య ఆస్తి తగాదాలు ఏర్పడ్డాయి.  దీంతో కొమర్రాజు వెంకటవృయ్య మధ్యవర్తిగా నియమించబడ్డాడు. చివరకు మునగాల యొక్క హక్కులు రుక్కమ్మకు ఇవ్వబడ్డాయి.
  • రుక్కమ్మ కుమార్తె లచ్చమ్మ నాయిని వెంకటరంగారావు/నరసింహరావుని దత్తత తీసుకొని మునగాల జమీందారుగా ప్రకటించింది.
  • నాయని వెంకటరంగారావు మొదట్లో గొప్ప అభ్యుదయవాది. సాహిత్యాన్ని ప్రోత్సహించాడు.
  • ఇతనికి తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం ఉంది.
  • తెలుగు విజ్ఞాన సర్వస్వం సృష్టికర్త కొమర్రాజు లక్ష్మణరావు మునగాల గడీ(సంస్థానంలో) దివాన్‌గా పనిచేశాడు.
  • కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావులతో కలసి 1901లో హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం, హన్మకొండలో రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషా నిలయంను స్థాపించారు.
  • నాయని ఆహ్వానం మేరకు జాతీయ పతాక రూపకర్త అయిన పింగళి వెంకయ్య రెండు మూడేళ్ల పాటు ఈ సంస్థానంలో వుండి, నాయనికి ప్రత్తి సాగులో మెళకువలను నేర్పాడు పింగళి వెంకయ్య ప్రత్తి పంటపై పరిశోధన చేయడం వల్ల అతన్ని పత్తి వెంకయ్య అని కూడా పిలిచేవారు.
  • నాయని వెంకటరంగారావు మొదట్లో అనేక అభ్యుదయ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ తర్వాత తన అభ్యుదయ భావాలను వదిలేసి తెలంగాణలోని గడిలో పరిపాలన చేశాడు.
  • నాయని రంగారావు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడైనప్పటికీ బ్రిటిష్‌ వారిచ్చిన రావు బహద్దూర్‌ కారణంగా నాయని వెంకట రంగారావుగా పిలువబడ్డాడు.
  • నాయని అనేక మంది ప్రజల భూములను ఆక్రమించాడు. కరణం భూములతో పాటు చాకలి, మంగళి, కమ్మరి ఇనామ్‌ భూములను కూడా ఆక్రమించాడు.
  • నాయని వెంకట రంగారావుకు వ్యతిరేకంగా 1930లో మెట్టమెదటిసారిగా మునగాల జమీన్‌ రైతు సంఘం ఏర్పాటు చేయబడింది.
  • తన భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా చేపట్టిన సత్యాగ్రహాలను నాయని అణచివేశాడు.
  • 144 సెక్షన్‌ను విధింపజేసి, దీన్ని ధిక్కరించిన పశువులను కూడా అరెస్ట్‌ చేయించాడు
  • ఇతనికి వ్యతిరేకంగా నండూరి ప్రసాదరావు కలుకోవ సత్యాగ్రహం చేపట్టాడు
  • 1949లో మద్రాన్‌ ఎస్టేట్స్‌ చట్టం ప్రకారం మునగాల జమిందారీ రద్దు అయింది.
  • నందికేశ్వరశాస్త్రి శివతత్వ సుధానిధి అనే గ్రంథంలో నాయిని రంగారావు యొక్క వంశ చరిత్రను తెలియజేశాడు.

3. దోమకొండ:

  • మొదటి రాజధాని – బిక్కనవూరు
  • రెండవ రాజధాని – కామారెడ్డిపేట
  • మూడవ రాజధాని – దోమకొండ
  • కామినేని కాచారెడ్డి మూల పురుషుడు. ఇతను దోమకొండ జాగీర్‌ను బహమనీల నుండి పొందాడు.
  • 1వ ఎల్లారెడ్డి రైతుల ఉద్ధరణకు కృషిచేసి నిజామాబాద్‌లో అనేక చెరువులు త్రవ్వించాడు.
  • 2వ మల్లారెడ్డి ఒక గొప్పకవి. ఇతను షద్బక్రవర్తి చరిత్ర, శివధర్మోత్తరం పద్మపురాణం అనే గ్రంథాలను రచించాడు
  • 2వ ఎల్లారెడ్డి లింగపురాణం అనే గ్రంథాన్ని రచించాడు.
  • రాజన్నచౌదరి రాజధానిని కామారెడ్డిపేటకు మార్చాడు.  రాజేశ్వరరావు రాజధానిని దోమకొండకు మార్చాడు.
  • చివరి పాలకుడైన రాజా సోమేశ్వరరావు బల్వంత్‌ అనే బిరుదును మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ నుండి పొందాడు.

4. పాపన్నపేట (మెదక్‌-అందోల్‌ చరిత్ర) :

  • మొదటి రాజధాని – కల్పగురు
  • రెండవ రాజధాని – అందోల్‌
  • మూడవ రాజధాని – పాపన్నపేట
  • ఈ సంస్థాన స్థాపకుడు అనంతరెడ్డి. ఇతను బహమనీల నుండి కల్పగురు జాగీర్‌ను పొందాడు
  • రామినెడు రాజధానిని అందోల్‌కు మార్చాడు. నరసింహారెడ్డి భార్య శంకరమ్మ నిజాం అలీ నుండి రాయ్‌ బగన్‌ (ఆడసింహం) అనే బిరుదును పొందింది. శంకరమ్మ తన తండ్రి సంగారెడ్డి పేరు మీద సంగారెడ్డి పట్టణం నిర్మించింది.
  • తల్లి రాజమ్మ పేరు మీద రాజంపేట, తన పేరు మీద శంకరంపేట, తన సేనాధిపతి పాపన్న పేరుమీద పాపన్నపేట నిర్మించింది.
5. గద్వాల (మహబూబనగర్)
  • రాజధాని – గద్వాల
  • ఈ సంస్థానం పరిధిలో 360 గ్రామాలు ఉన్నాయి.
  • మూలపురుషుడు – బుద్దారెడ్డి.
  • బుద్ధారెడ్డి గద్వాల జాగీర్‌ను 2వ ప్రతాపరుద్రుని నుండి పొందాడు
  • పెద సోమభూపాలుడు గొప్పవాడు. ఇతను గద్వాల కోటను నిర్మించాడు. ఇతను జయదేవుని గీతాగోవిందంను తెలుగులోకి అనువదించాడు.
  • చిన సోమభూపాలుడు రతిశాస్త్రంను తెలుగులోకి అనువదించాడు. గద్వాలకు చెందిన రాణి ఆదిలక్ష్మీదేవమ్మ తన మనవడు అయిన కృష్ణరాయ భూపాలుడిని దత్తత తీసుకుని గద్వాల పాలకుడిగా ప్రకటించింది. కానీ, ఇతను పూర్తి పాలనా బాధ్యతలు చేపట్టక ముందే ఇది భారత యూనియన్‌ (హైదరాబాద్‌ రాష్ట్రం) లో విలీనమైంది.
6. వనపర్తి (నహబూబ్‌నగర్‌):
  • మొదటి రాజధాని – నూగూరు
  • రెండవ రాజధాని -వనపర్తి
  • ఈ సంస్థానం పరిధిలో 124 గ్రామాలు ఉన్నాయి.
  • ఈ సంస్థాన స్థాపకుడు వీరకృష్ణారెడ్డి కాగా గొప్పవాడు – గోపాలరావు.
  • చివరి పాలకుడు – 3వ రామేశ్వరరావు
  • వీరక్రిష్టారెడ్డి బహమనీల నుండి నూగూరు జాగీర్‌ను పొందాడు
  • వెంకటరెడ్డి కాలంలో పెనగలూరి వెంకటాద్రి అనే కవి మోహిని విలాసం అనే గ్రంథాన్ని రచించాడు
  • 1వ రామకృష్ణారావు రాజధానిని వనపర్తికి మారాడు.
  • రాజరాజేశ్వరరావు దళితుల ఉద్ధరణకు కృషి చేశాడు. కుల వివక్షను ఖండించాడు. విద్య, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించాడు. ఇతని బిరుదు రాజా బహద్దూర్‌.
  • ఇతను 19వ శతాబ్ధం మొదటి దశకా(1810-40)ల్లో ఉన్నాడు. అందువల్లనే నురవరం ప్రతావరెడ్డి రాజరామేశ్వరరావుని ప్రథమావంధ్ర సంఘ సంస్కర్త అని పేర్కొన్నాడు.
7. జటప్రోలు (మహబూబ్‌నగర్‌):
  • మొదటి రాజధాని – జటప్రోలు
  • రెండవ రాజధాని – కొల్లాపురం
  • మూలపురుషుడు – చెవిరెడ్డి(భేతాళ రెడ్డి)
  • చివరి పాలకుడు – వెంకట జగన్నాథరావు
  • మాదానాయుడు విజయనగర పాలకుల నుండి జటప్రోలు జాగీర్‌ను పొందాడు.
  • సురభి మాదవరాయలు చంద్రిక పరిణయం అనే గ్రంథాన్ని రచించాడు.
  • సురభి వెంకటలక్ష్మారావు కాలంలో సదాశివశాస్త్రి, అవధానం శేషాశాస్రి చంద్రికా పరిణయంపై శరథాగయు అనే వాఖ్యాన గ్రంథం రచించాడు.
  • సురభి నర్సింగరావు నక్షత్ర ఖేలనం(సంస్కృతంలో) అనే గ్రంథాన్ని రచించాడు.
8. సిర్నవల్లి:
  • స్థాపకుడు – వెన్నమారెడ్డి
  • ప్రదేశం – నిజామాబాద్‌ జిల్లా, దర్చల్లి మండలం
  • నిజాం కాలం మొదట్లో ఈ సంస్థానం నర్సారావు ఆధీనంలో వుండేది. తర్వాత చీలం ప్రతాపరెడ్డి చేతిలోకి వచ్చింది.
  • ప్రతాపరెడ్డి చనిపోవడంతో ఆయన భార్య జానకీబాయి పాలనా బాధ్యతలు చేపట్టింది.
  • జానకీబాయి చాలాకాలం పాటు పాలించింది. ఈమె కాలంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లు పేర్కొంటారు.
  • ఈమె అనేక చెరువులు, కుంటలు, కాలువలు త్రవ్వించింది.  జానకీబాయికి పాలనలో వకీల్‌ లింగన్న అనే పట్వారీ సహకరించేవాడు.
  • 1901లో నిజాం రాజు హైదరాబాదు నుండి బోధన్‌ మీదుగా మహరాష్ట్రకు రైలు మార్గం వేయిస్తున్నప్పుడు ఆ మార్గాన్ని సిర్నవల్లి మీదుగా వేసేలా నిజాం రాజును జానకీబాయి ఒప్పించింది. దీనికి కృతజ్ఞతగా ఇందూరు ప్రాంతానికి నిజామాబాద్‌గా పేరును మార్చింది.
  • ఈమెకు సంతానం లేకపోవడంతో మెదక్‌కు చెందిన రామలింగారెడ్డిని దత్తత తీసుకుంది.
  • తర్వాతి కాలంలో ఈ గడీ పాలనను చీలం రామలింగారెడ్డి చూసేవాడు.
  • తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ఈ గడీ మీద కూడా దాడులు జరిగాయి. కానీ, అప్పటికే గడీలోని దొరలందరూ హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.
  • ఫ్యూడల్‌ వ్యవస్థ అంతం తర్వాత జరిగిన నక్సల్‌ పోరాటంలో, దట్టమైన అడవులు కలిగిన సిర్నవల్లి గ్రామం మిలిటెంట్ల కేంద్ర స్థానంగా వుండేది.
9. నారాయణపురం:
  • నల్గొండ జిల్లాలోని నారాయణపురాన్ని మంచల్‌రెడ్డి పాలించాడు
  • రాయన్‌రెడ్డి రాజాపేట కోటను నిర్మించాడు
  • ఈ సంస్థానంలో చివరి పాలకురాలు – జహరున్నీసా బేగం
10. ఆత్మకూరు/అమరచింత (మహబూబ్‌నగర్‌ జిల్లా) :
  • తొలి రాజధాని – తివుడంపల్లి
  • 2వ రాజధాని – ఆత్మకూరు
  • ఈ సంస్థానం మూల పురుషుడు – గోపాల్‌రెడ్డి
  • మొదటివాడు – గోపాల్‌రెడ్డి
  • 2వ సాహిబ్‌రెడ్డి రాజధానిని తివుడంపల్లి నుండి ఆత్మకూరుకు మార్చాడు
  • చివరి పాలకురాలు – భాగ్యలక్ష్మమ్మ

గడీలు

  • గడీ అనగా కోట అని అర్ధం (మరాఠీ భాషలో)
  • భూస్వాముల కోటలను గడీలు అనేవారు. ఈ భూస్వాములను దొరలు అని పిలిచేవారు. వీరు తమ ప్రాంతాల్లో అధికారాలు చెలాయించేవారు. భూస్వాములు తమ కార్యకలాపాలను తమ కేంద్ర స్థానంలోని కోట నుండి నిర్వహించేవారు. ఈ కోటనే గడీ అనేవారు.
  • భూస్వాములు ప్రజల భూములను ఆక్రమించి, గ్రామాలను దోచుకుని, ప్రజలతో వెట్టి చేయించి ఈ గడీలను నిర్మించారు.  ఈ గడీ చుట్టూ మట్టితో, రాతితో లేదా రెండూ కలిపి కట్టిన ఎత్తయిన ప్రహారీ గోడలు, అన్ని వైపులా బురుజులు ఉండేవి. మందపు ఇనుప కడ్డీలతో, పిడులతో తయారు చేసిన బలమైన తలుపులు, ఎత్తయిన దర్వాజలు (గుమ్మాలు) ఉండేవి.  సాధారణంగా ఈ కోట (గడీ)లో రెండు భాగాలు ఉండేవి
  • 1. ముందు భాగం – భూస్వామి అధికారిక వ్యవహారాలు
  • 2. వెనుక భాగం – భూస్వామి కుటుంబం నివాసం
  • భూస్వామి ప్రజలను గడీ ముందు భాగానికి పిలిపించి విచారణ జరిపేవాడు.
  • ప్రజలు చెల్లించాల్సిన జరిమానాలను నిర్ణయించేవాడు. ప్రజలను హింసించేది కూడా ఈ ముందు భాగంలోనే. దెబ్బలు కొట్టడానికి కొరడాలు, చిన్న కర్రలు ఉపయోగించేవారు. దీంతో పాటు ఇంకా వేలాడదీసి కొట్టేవారు.
  • భూస్వాములు సాగించే ఈ దురాగతాలకు గడీ ముందు భాగం కేంద్ర స్థానంగా ఉందేది.
  • ఆ ప్రదేశపు వాతావరణం అత్యంత భయానకంగా ఉండేది. అక్కడికి వెళ్లినవారు ఎటూ తోచని స్థితిలో ఉంటూ దొరకు దాసోహం అనేవారు.  దీన్నే తెలంగాణలో ‘గడీల పాలన’ అని పిలుస్తారు.
  • అవ్పట్లో తెలంగాణలో వన్ను వనూలు చేయుటకు నియమించబడిన వారిని వివిధ పేర్లతో పిలిచేవారు. వారిలో ప్రముఖులు
    దేశ్‌ముఖ్‌లు  దేశ్‌పాండేలు  పటేళ్లు
  • పట్వారీలు     జాగీర్‌దార్లు    మఖ్తాదారులు

Social and Cultural History of Telangana Part-4  #Social and Cultural History of Telangana Part-4 # Social and Cultural History of Telangana Part-4

దేశ్‌ముఖ్‌ – వీరు ఉన్నత స్థానంలో ఉండేవారు. వీరు అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. వీరు పన్నులు వసూలు చేయడానికి స్థానికంగా అనేక మంది క్రిందిస్థాయి ఉద్యోగులను నియమించేవారు. ఈ దేశ్‌ముఖ్‌లే తర్వాత కాలంలో భూస్వాములు గా ఎదిగి తమ ఆధీనంలోని గ్రామాల్లో దొరలుగా పెత్తనం చెలాయించసాగారు.

దేశ్‌పాండే – వీరు.కూడా ఉన్నత స్థానంలో ఉండే ఒక మేధావి వర్గంగా పరిగణించబడేవారు. వీరిలో అత్యధికంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు.

పటేల్,‌ పట్వారీ – క్షేత్ర స్థాయిలో పన్ను వసూలు చేసే క్రింది స్థాయి ఉద్యోగులు. వీరు కూడా క్షేత్ర స్థాయిలో ప్రజలను అనేక విధాలుగా దోచుకున్నారు. లేని పన్నులను వసూలు చేసేవారు. వీఠు చిన్న భూస్వాములుగా పెత్తనం చెలాయించేవారు.

జాగీర్‌దార్లు – ఉన్నత ఉద్యోగులకు జీతాలకు బదులుగా భూములు ఇవ్వబడదేవి. వీటిని జాగీర్లు అంటారు. ఈ భూముల యజమానులను జాగీర్‌దార్లు అంటారు. జాగీర్‌దార్లు క్షేత్ర స్థాయిలో వివిధ రకాల పన్నులు వసూలు చేసి ప్రజలపై ఆకృత్యాలు చేసేవారు.

మఖ్తాదార్లు – వీరికి గ్రామాల్లో పన్నులు వసూలు చేసే అధికారం ఉంటుంది. ఈ విధంగా పన్నులు వసూలు చేసే అధికారాన్ని పొందినందుకు గాను ప్రభుత్వానికి రుసుమును చెల్లించేవారు.

తర్వాత కాలంలో పైన పేర్కొనబడిన ప్రతీ ఒక్కరు కూడా భూములకు యజమానులై భూస్వాములు లేదా దొరలుగా పెత్తనం చెలాయించారు.

  • భూస్వాములు/దొరల దగ్గర అనేక మంది పని చేసేవారు
  • పెద్ద గుమస్తా – దొరకు సలహాలు ఇచ్చేవారు
  • చిన్న గుమస్తా – దొరలు చెప్పిన పనులు చేసేవారు
  • సేరిదారులు – వ్యవసాయం చేయించేవారు
  • సైసు – గుర్రాన్ని చూసుకునేవారు
  • దొరలలో కొంతమంది మంచివారు కూడా వున్నారు.
  • మందముల నర్సింగరావు ప్రకారం మంచి దొరలు
  • 1 నవాబ్‌ సాలర్‌జంగ్‌
  • 2 మహారాజా కిషన్‌సింగ్‌
  • 3 నవాబ్‌ కామూల్‌ జంగ్‌
విసునూరు గడీ: 
  • నిర్మించిన సంవత్సరం -1935-36
  • ప్రదేశం -నల్గొండ జిల్లా జనగామ తాలూకా
  • యజమాని -రాపాక రామచంద్రారెడ్డి
  • రాపాక రామచంద్రారెడ్డి తండ్రి కోనరెడ్ది, తల్లి జానమ్మ.  రాపాక జానమ్మ క్రూరురాలు. గుండాలతో అనేక గ్రామాలను ఆక్రమించి దురాగతాలకు పాల్పడేది.
  • జానమ్మను చూసి అందరూ భయపడేవారు. ఈమెను అమ్మా అని పిలిచినా తప్పే. “ఏంట్రా, అమ్మా అంటావ్‌..నీ అయ్యకు పెళ్లాన్నా?” అని గద్దించేది. అయ్యా అని పిలిపించుకునేది.
  • రామచంద్రారెడ్డి కూడా తల్లికి తగ్గ కొడుకే. ఇతని దురాగతాలకు అంతులేదు. ఇతను 60 గ్రామాలకు దేశ్‌ముఖ్‌.
  • రాపాక రామచంద్రారెడ్డి వినునూరులోని గ్రామాలను ఆక్రమించి, 4 ఎకరాలలో సకల వనతులతో గడీని నిర్మించుకున్నాడు. ఇందులో అప్పటికి ప్రపంచంలో అందుబాటులో వున్న సౌకర్యాలన్నీ వుండేవి.
  • ఈ గడీ నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఇటుక,సున్నపు బట్టీలు, అనేక గ్రామాలలోని తుమ్మ చెట్లను, బర్మా నుండి టేకు కర్ర, బెల్జియం నుండి అద్దాలు, అజంజాహి మిల్లు నుండి ప్రత్యేక విద్యుత్‌ లైను వేయించాడు.
  • ఈ గడీ గృహ ప్రవేశోత్సవంను ఎంతో వైభవంగా నిర్వహించాడు. పనులన్నీ ప్రజలతో వెట్టిగా చేయించాడు. దొర ఎక్కడికైనా బయటకు వెళ్తుంటే, ఎడ్లబండిలో వెళ్లేవాడు. బండి ముందు ఒక చాకలి పరుగెత్తేవాడు.
  • రామచంద్రారెడ్డి ఆ సమయంలోనే ఇంగ్లాండ్ నుండి ఒక కారు, రైఫిల్‌, పిస్టల్‌లను కొన్నాడు (అప్పటికి హైదరాబాద్‌లో మాత్రమే కార్లు వుండేవి)
  • దొర కుడి భుజం – బాబుదొర (ఇతను రెండవ కొడుకు)
  • రామచంద్రారెడ్డికి ప్రతి ప్రాంతంలో నమ్మకమైన బంటు వుండేవాడు.
  • విసునూర్‌ – మస్కీన్‌ అలీ, ఓనమాల వెంకయ్య
  • దేవరుప్పల – అబ్బాస్‌ అలీ
  • వరిమిడ పల్లె – జాన్‌మియా
  • ముత్తారం – రాంరెడ్డి
  • విసునూర్‌ గడీ ఎన్నో నెత్తుటి మరకలకు నెలవు. ఎంతో మంది అమాయక ప్రజలను బలితీసుకుంది.
  • రామచంద్రారెడ్డి అండతో ఇతని అనుచరులు ప్రజలపై దౌర్జన్యాలు చేసేవారు.
  • మూడు రోజుల బాలింత కూడా పొలం పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. పిల్లలకు పాలు ఇవ్వాలంటే మోదుగ దొప్పలో పాలు పిండి చూపించమనేంత క్రూరుడు విసునూర్‌ రామచంద్రారెడ్డి.
  • చిన్న భూస్వాముల పై కూడా అరాచకాలకు దిగేవాడు.
  • మోత్కూరు మండల భూస్వామి పడిశాల వెంకటరెడ్దిని హత్య చేయించాడు.
  • బమ్మెర మఖ్తాదారు నరసింహారావును అనేక అవనూనాలకు, హింసకు గురిచేశాడు.
  • తెలంగాణ ప్రజల జీవిత పరిశీలనకు వచ్చిన జాతీయ కాంగ్రెస్‌ నాయకులు వావిలాల గోపాలకృష్ణయ్య, నిరీక్షణరావు, భోగాతుల రామారావులను విసునూరు గడీలో 8 రోజులపాటు బంధించాడు.
  • అందుకే విసునూరు గడీ సాయుధ పోరాటానికి తొలి కేంద్రమైంది.
  • తన భూమిని దక్కించుకోవడానికి విసునూరి దౌర్జన్యాన్ని ఎదురించి, న్యాయం పోరాటం చేసి గెలిచిన పేద ముస్లిం యువకుడు షేక్‌ బందగీని కత్తులతో దాడి చేయించి హతమార్చాడు.
  • బందగీ మరణం తెలంగాణలో తొలి రక్త ప్రేరణగా నిలిచింది.
  • అన్యాయంగా పంటను కబళించాలని ప్రయత్నించిన విసునూరికి ఎదురొడ్డి పోరాడిన మహిళ చాకలి ఐలమ్మ తెలంగాణలో భూస్వాముల పై తిరుగుబాటులో తొలి విజయకేతనం ఎగురవేసింది.
  • చాకలి ఐలమ్మకు సహకరించిన దళం- భీంరెడ్డి నర్సింహారెడ్డి దళం
  • కడవెండి గ్రామంలో రామచంద్రారెడ్డి తల్లి జానమ్మ అక్రమాలకు ఎదురు తిరిగి, రామచంద్రారెడ్డి పై తిరుగుబాటు చేసిన దొడ్డి కొమరయ్యను దొర గుండాలు కాల్చి చంపారు.

సంజీవన్‌రావుపేట గడీ:

  • నిర్మించిన సంవత్సరం : 1910
  • ప్రదేశం ; నారాయణఖేడ్‌ (మెదక్‌)
  • యజమాని : సంజీవన్‌రావు దేశ్‌ముఖ్‌
  • ప్రధాని : దొడ్డప్ప
  • సంజీవన్‌రావుపేట గడీ 50 గ్రామాలకు కేంద్రం. ఈ గడీ నుండే మొత్తం పాలన జరిగేది.
  • ఈ గడీని పాలించిన దొరలు బ్రాహ్మణ వర్గానికి చెందినవారు. ఈ గడీ పాలనలో అరాచకం కాకుండా అభివృద్ధి వుండేది.
  • సంజీవన్‌ రావు కాలంలో ఎక్కువ అభివృద్ధి జరగడం వలన సంజీవన్‌రావు పేట అనే పేరు వచ్చింది.
  • సంజీవన్‌రావు రైతులకోసం అనేక చెరువులను త్రవ్వించాడు. నాందేడ్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారి నుండి నిజాంపేట, నారాయణఖేడ్‌ల మీదుగా సంజీవన్‌రావుపేటకు రహదారిని నిర్మించాడు.
  • సంజీవన్‌రావుపేటలో అన్ని కులాల వారికి ఉచితంగా ఇళ్లను నిర్మించాడు.
  • నిజాం ప్రభువు పర్యటన కోసం సంజీవన్‌రావుపేటలో కేవలం ఒక నెలలోనే ఒక భవనాన్ని నిర్మించాడు.
  • నిజాం ప్రధాని మహారాజ కిషన్‌ప్రసాద్‌ ఈ గ్రామాన్ని తరచూ సందర్శించేవాడు.
  • ప్రజలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నందుకు ఈ గడీ దొరలపై రజాకర్లు దాడి చేశారు.
  • సంజీవన్‌రావు 1946లో మరణించాడు. ఈయన అనంతరం ఇతని భార్య పద్మావతి పాలించేది.
  • హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన తర్వాత ఈ గడీ ప్రధాని అయిన దొడ్డప్ప సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు.

కంఠాత్మకూర్‌ గడీ :

  • ప్రదేశం ; నల్గొండ జిల్లా కంఠాత్మకూర్‌
  • యజమాని : పింగళి ప్రతాపరెడ్డి
  • ఈ గడీ ప్రజల వెట్టి చాకిరీ ద్వారా నిర్మించబడింది.
  • పింగళి ప్రతాపరెడ్డి ప్రజలపై అనేక ఆకృత్యాలు చేసేవాడు.  నాగు వడ్డీ వ్యాపారం, నిర్బంధ వసూళ్లు చేసేవాడు. అధికంగా పన్నులు విధించేవాడు.
  • ప్రజలు ఇతనికి మాత్రమే కాకుండా ఇతని పాలేర్లకు కూడా సేవలు చేయాల్సి వచ్చేది.
  • ఈయన గుమస్తా వడ్ల పెద్దన్న ప్రజలతో వేలిముద్రలు వేయించి దొంగ కాగితాలు సృష్టించేవాడు.
  • వడ్ల పెద్దన్న ఇంట్లో దొంగతనం నేరం మోపి శిక్షింపబడిన వ్యక్తి – దానమల్లు
  • వడ్ల పెద్దన్నకు ప్రజలు. ఏమాత్రం ఎదురు తిరిగినా చిత్రపాంసలకు గురిచేసి, అనేక నేరాలలో ఇరికించి ఇబ్బందులకు గురిచేసేవాడు.

పోలంపల్లి గడీ :

  • ప్రదేశం : కరీంనగర్‌ జిల్లా, తిమ్మాపురం మండలం
  • యజమాని: అనభేరి వెంకటేశ్వరరావు
  • అనభేరి వెంకటేశ్వరరావు, రాధాబాయి దంపతుల కుమారుడు అనభేరి ప్రభాకరరావు
  • అనభేరి ప్రభాకరరావు దొర బిడ్డగా జన్మించినప్పటికీ దొరతనాన్ని చూపలేదు. ప్రజల తరపున పోరాడారు. ఫ్యూడల్‌ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు చేశాడు.
  • దొర కుంటుంబంలో జన్మించిన అనభేరి ప్రభాకరరావు దొర వ్యవస్థకే వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాడు.
  • దొరల దగ్గర గల 40 గ్రామాలకు చెందిన ప్రజల దస్తావేజులను తగులబెట్టాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అనభేరి ప్రభాకరరావు నాయకత్వం వహించాడు.
  • కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలతో ప్రభావితమై, కరీంనగర్‌ జిల్లాలో అవభేరి ప్రభాకరరావు కమ్యూనిస్టు పార్టీకి నాయకత్వం వహించి ఆంధ్ర మహాసభతో కలసి ప్రజల కోసం పనిచేశాడు.
  • నిజాం ప్రభుత్వంలో తెలుగుకు గౌరవం ఇవ్వాలని ప్రశ్నించి పోరాటం చేశాడు.
  • రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడారు. రజాకర్ల బారి నుండి ప్రజలను కాపాడడం కోసం భూపతిరెడ్డి 12 మందితో కలిసి ఒక దళాన్ని ఏర్పాటు చేశాడు.
  • సాయుధ పోరాటంలో పాల్గొన్నందుకు గాను నిజాం ప్రభుత్వం ప్రభాకర్‌రావుపై నజర్‌బంద్‌ జారీ చేసింది. అయినప్పటికీ ప్రభాకర్‌రావు రహస్యంగా దళాన్ని నడిపి రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడాడు.
  • దీంతో 1948 మార్చి 14న రజాకర్లు ప్రభాకరరావుపై దాడిచేసి హతమార్చారు. ఈ పోరాటంలో ప్రభాకర్‌రావుతో పాటు భూపతి రెడ్డి, 12 మంది దళ సభ్యులు కూడా మరణించారు. ప్రజల కోసం పోరాడిన దొరగా అనభేరి ప్రభాకరరావు చరిత్రలో నిలిచిపోయాడు.
  • ప్రభాకరరావుతో పాటు మరి కొంతమంది దొరలు ఈ కోవకే చెందుతారు. వారిలో నల్గొండ జిల్లా, భువనగిరి తాలూకాలోని రేణికుంట రామిరెడ్డి ఒకరు.
  • ఇతని ఇంటిపేరు చింతలకుంట అయినప్పటికీ గ్రామం పేరు మీదుగా రేణికుంట రామిరెడ్డిగా పేరొందారు.
  • రేణికుంట రామిరెడ్డి కూడా దొర అయినప్పటికీ దొర వ్యవస్థకు, రజాకర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు.
  • ఇతను ఆరుట్ల రామచంద్రారెడ్డితో కలసి రజాకర్లకు వ్యతిరేకంగా మిలిటరీ తరహా దళాన్ని ఏర్పాటు చేశాడు.
  • చివరకు రజాకర్లతో పోరాటంలోనే వీరమరణం పొందాడు.

బేతవోలు గడీ:

  • నిర్మించిన సంవత్సరం : 1880
  • ప్రదేశం : నల్గొండ జిల్లా బేతవోలు గ్రామం
  • యజమాని : తడకమళ్ల సీతారామచంద్రరావు
  • ఈ గడీ తెలంగాణ మట్టి మనుషుల చేతిలో బద్దలు కొట్టబడింది.
  • హైదరాబాద్‌లో నివాసముండే సిద్దిఖీ అనే నవాబు దగ్గర తడకమళ్ల సీతారామచంద్రరావు 5 గ్రామాలను మళ్లాకు తీసుకున్నాడు.
  • 1 బేతవోలు 2 జర్రిపోతులగూడెం 3 ఆచార్యులగూడెం 4 చిన్నారిగూడెం 5 పాలెంగూడెం
  • అప్పటికే బేతవోలు గడీని బొంబాయి ఆర్కిటెక్చర్‌తో నిర్మించారు.
  • బేతవోలు గ్రామానికి మునగాల మీదుగా నీళ్లు వస్తాయి. కానీ, మునగాల దొర నాయని వెంకట రంగారావు నీటిని బేతవోలు గ్రామానికి వెళ్లకుండా అడ్డుకున్నాడు.
  • దీంతో సీతారామచంద్రరావు కోర్టులో కేసు వేసి బేతవోలు గ్రామానికి నీళ్లు వచ్చేలా చేశాడు. ఇందుకు అయిన ఖర్చును వడ్డీ, చక్రవడ్డీతో సహా ప్రజల నుండే వసూలు చేసేవాడు.
  • సెంట్ల పన్ను, ఆడబిడ్డ గంపలు, దేవుని పన్ను, కౌలుదారుని పన్ను, పశువులకు రూపాయిన్నర పన్ను చేనేత మగ్గాల పన్ను, పెళ్లి పన్ను మంత్రసాని పన్ను వంటి అనేక పన్నులు వసూలు చేసేవాడు.
  • సీతారామచంద్రరావు భూములను ఆక్రమించడం, ప్రజలతో వెట్టి చాకిరీ చేయించుకోవడం వంటి ఆకృత్యాలకు పాల్చడేవాడు. దీంతో ఆగ్రహించిన ప్రజలు సాయుధ పోరాట సమయంలో ఈ గడీపై దాడి చేసి, ధ్వంసం చేశారు.

Samstanalu Gadilu in Telangana

List of Telangana Festivals

పార్ట్-1: తెలంగాణ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర | Social and Cultural History of Telangana Part-1

పార్ట్-2: తెలంగాణ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర | Social and Cultural History of Telangana Part-2

పార్ట్-3: తెలంగాణ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర | Social and Cultural History of Telangana Part-3

Telangana Fairs and Festivals

History of Recharla Velama Dynasty in Telangana

Social and Cultural History of Telangana Part-4  #Social and Cultural History of Telangana Part-4 # Social and Cultural History of Telangana Part-4Social and Cultural History of Telangana Part-4  #Social and Cultural History of Telangana Part-4 # Social and Cultural History of Telangana Part-4

Social and Cultural History of Telangana Part-4  #Social and Cultural History of Telangana Part-4 # Social and Cultural History of Telangana Part-4

Social and Cultural History of Telangana Part-4  #Social and Cultural History of Telangana Part-4 # Social and Cultural History of Telangana Part-4

Social and Cultural History of Telangana Part-4  #Social and Cultural History of Telangana Part-4 # Social and Cultural History of Telangana Part-4

Leave a Comment