...

పార్ట్-3: తెలంగాణ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర | Social and Cultural History of Telangana Part-3

Written by lsrupdates.com

Published on:

పార్ట్-3: తెలంగాణ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర | Social and Cultural History of Telangana Part-3

కళ్యాణి చాళుక్యులు- History of Western Chalukyas 

Social and Cultural History of Telangana Part-3: కళ్యాణి చాళుక్యుల తొలి రాజధాని ‘కొలనుపాక’ అని ప్రముఖ చరిత్రకారుడు బీఎన్‌ శాస్త్రి పేర్కొన్నారు. తదనంతర కాలంలో వీరు రాజధానిని కర్ణాటకకు మార్చుకున్నారు. హన్మకొండ విషయపాలకుడుగా గరుడ బేతరాజును రెండో తైలపుడు నియమించాడు. రెండో తైలపుడు పేరుమీదుగా తెలంగాణ పేరు వచ్చినట్లు కూడా చారిత్రక వాస్తవం గమనించాలి. సత్యాశ్రయుడు రాజైన తర్వాత తెలంగాణ నుంచి శ్రీశైలం వరకు రాజ్యాన్ని విస్తరించాడు. కళ్యాణి చాళుక్యుల నుంచే కాకతీయులు స్వాతంత్య్రం పొంది రాజ్యాన్ని స్థాపించారు.

రెండవ తైలవుడు (క్రీ.శ.973-997)

రెండో తైలపుడు రాష్ట్రకూట రాజధాని మాన్యఖేటం ఆక్రమించి కర్క-2ను ఓడించి అహావమల్ల, భువనైకమల్ల అనే బిరుదులు ధరించి స్వతంత్ర చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. అతడు తనలాగే స్వతంత్ర రాజ్యం స్థాపించుకోవాలనుకునే రాజులతోనూ, రాష్ట్రకూటులకు విశ్వాసపాత్రులై అతన్ని ప్రతిఘటించిన రాజులతోనూ తీవ్ర యుద్ధాలు చేశాడు. అలాంటి వారిలో గంగ వంశీయులైన మారసిండు, పాంచాల దేవుడు ముఖ్యులు. మారసిండిని క్రీ.శ 974లో తైలపుడు ఓడించి వధించాడు. పాంచాల దేవుడు ధార్వాడ్‌ జిల్లాలోని ప్రాంతాన్ని పాలించేవాడు. చాళుక్యులకు ప్రభల శత్రువుగా ‘చాళుక్య పంచానన’ అనే బిరుదు పొందాడు. తైలపుడు తన మిత్రుడైన భూతిగదేవుని సాయంతో పాంచాల దేవున్ని కూడా వధించాడు.

సత్యాశ్రయుడు (క్రీ.శ .997-1008)

# సత్యాశ్రయుడు (997-1008) రాజైన తర్వాత తెలంగాణ నుంచి శ్రీశైలం వరకు తన రాజ్యాన్ని విస్తరించాడు. సత్యాశ్రయునికి కుమారుడు లేనందువల్ల తన సోదరి కుమారుడు 4వ విక్రమాదిత్యుడు (1008-1014) సింహాసనం అధిష్టించాడు. వీరు రాజ్య విస్తరణలో భాగంగా వేంగీ చాళుక్యులతోనూ, వారికి సహాయంగా వచ్చిన చోళులతోనూ పలుమార్లు యుద్ధాలు చేశారు.

మొదటి సోమేశ్వరుడు (క్రీ.శ .1042-1068)

మొదటి సోమేశ్వరుడు (1042-68) విజయసింని కుమారుడు. కళ్యాణి చాళుక్యుల్లో గొప్పవాడు. ఇతనికి త్రైలోక్యమల్ల, రాజనారాయణ అనే బిరుదులు ధరించినా ‘అహావమల్ల’ అనే బిరుదుతో ప్రసిద్ధుడు అయినాడు. ఇతడు తన పాలనా కాలంలో…
1) దక్షిణాన చోళ చక్రవర్తులతోనూ
2) ఉత్తరాన, పరమార, గుర్జార శాఖలకు చెందిన చాళుక్య రాజులతోనూ పోరాటం చేయడంతోనే గడిచింది. చివరకు సోమేశ్వరుడు రాజరాజనరేంద్రున్ని తన సామంతుడిగా మార్చుకున్నాడు. (దీన్నిబట్టి సోమేశ్వరుడి గొప్పతనం గుర్తించదగ్గ అంశం). తన ఆస్థానంలో ఉన్న ప్రధానమంత్రి అయిన నారాయణభట్టును నరేంద్రుని ఆస్థానంలోకి పంపాడు. సోమేశ్వరుని సేనాని అయిన నాగవర్మకు
1) విద్యాధిపమల్ల శిరచ్ఛేదన 2) శేవణదిశావట్ట
3) చక్రకూట, కాలకూట 4) ధారా వర్షధర్పోత్పాటన
5) మారి సింఘమదవర్ధన అనే బిరుదులు ఉన్నట్లు నాందేడ్‌ శాసనంలో పేర్కొన్నారు.

రెండవ సోమేశ్వరుడు (క్రీ.శ .1068-1076)

తెలంగాణలో కొన్ని శాసనాలు ఇతని గురించి వివరించాయి. తర్వాత ఇతని తమ్ముడు 6వ విక్రమాదిత్యుడు (1076-1126) రాజ్యానికి వచ్చాడు. తన సామంతులైన కందూరి చోళులు, కాకతీయుల సహాయంతో సింహాసనం ఆక్రమించి సుదీర్ఘ పాలన చేశాడు.

ఆరవ విక్రమాదిత్యుడు (క్రీ.శ .1076-1126)

ఆరో విక్రమాదిత్యుడు ‘త్రిభువన మల్ల’ అనే బిరుదు ధరించి సింహాసనం అధిష్టించాడు. తన ప్రారంభానికి చిహ్నంగా ‘చాళుక్యవిక్రమ శకం’ అనే నూతన శకాన్ని ప్రారంభించాడు. (భారతదేశంలో ఇలాంటి శకాలు విక్రమ శకం 58, కాలచూరులు, గుప్తులు 319 మొదలగువారు ప్రారంభించారు.) 1085లో చోళరాజ్యంపై దండెత్తి కాంచీ నగరాన్ని ఆక్రమించాడు. 1093లో వేంగిపై దండెత్తి వెలనాటి గొంకరాజును ఓడించి ఆంధ్రదేశాన్ని ఆక్రమించాడు. విక్రమాదిత్యుని తర్వాత అతని కుమారుడు 3వ సోమేశ్వరుడి (1126-1138) అనంతరం అతని పెద్ద కుమారుడు జగదేకమల్లుడు (1138-50) సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతనికి కందూరు చోడులు, కాకతీయ రాజులు సాయంగా ఉన్నారు. ఇతని తర్వాత సోదరుడు 3వ తైలపుడు (1150-56), తర్వాత అతని మేనల్లుడు బిజ్జలుడు 1156లో తైలపున్ని తొలగించి, కళ్యాణి నగరాన్ని ఆక్రమించుకున్నాడు. (బిజ్జలుడు కాలచూర్య వంశస్థుడు, ఇతని కాలంలో బసవేశ్వరుడు వీరశైవ మతాన్ని స్థాపించాడు.) 3వ తైలపుడి తర్వాత అతని కుమారుడు నాలుగవ సోమేశ్వరుని (1184-1200) కాలంలో ఈ రాజ్యం పతనమయ్యింది. ఆ తర్వాత..

1) హోయసళ (ద్వారసముద్రం)

2) యాదవ (దేవగిరి)

3) కాకతీయ (ఓరుగల్లు) బలమైన రాజ్యాలుగా అవతరించాయి. కళ్యాణి చాళుక్యులు తెలంగాణలో ఎనలేని రాజకీయ ప్రాముఖ్యత కలిగి ఉండెను.

రాష్ట్ర కూటులు – History of Rashtrakuta Dynasty

రాష్ట్రకూట వంశం బహు ప్రాచీనమైంది. క్రీ.శ. 6వ శతాబ్దం నుండి ఈవంశపు రాజులు దక్షిణ హిందూదేశంన పెక్కుచోట్ల చిన్నచిన్న సంస్థానంలు స్థాపించి, పాలన చేసారు.వీరు తొలుత చాళుక్యులకు సామంతులు.ఇప్పటి మహారాష్ట్రలోని ఎల్లోరా ప్రాంతంనేలుచున్న దంతిదుర్గుడు బాదామి చాళుక్యుల కడపటి రాజు రెండవ కీర్తివర్మను కూలద్రోసి రాజ్యం చేశాడు. ఇతనిని దంతివర్మ అని కూడా అంటారు. అద్వితీయ బలపరాక్రమ సంపన్నుడు. ఖడ్గావలోక, వైరమేఘ అను బిరుదులున్నాయి. క్రీ.శ. 758లో యుద్ధంలో మరణించాడు. రాజ్యం చేసిన కొద్దికాలంలోనే కాంచీ, కళింగ, కోసల, శ్రీశైల, మాళవ, లాట, టంక, సింధుదేశాలను జయించాడు. ఇతనికి వేములవాడ చాళుక్య వంశంనకు మూలపురుషుడైన వినయాదిత్య యుద్ధమల్లుడు తోడ్పడ్డాడు.

దంతిదుర్గుడు (క్రీ.శ.748-58): స్వతంత్ర రాష్ట్రకూట రాజ్య స్థాపకుడిగా దంతిదుర్గుడిని పేర్కొంటారు. ఈయన మహారాష్ట్ర మొత్తానికి అధిపతిగా ఉన్నారు. మహారాజాధిరాజ, పరమ మహేశ్వర, పరమ భట్టారక బిరుదులు ఉన్నాయి. సయంగఢ్ శాసనం, ఎల్లోరాలోని దశావతార గుహాలయ శాసనంలో దంతిదుర్గుడి యుద్ధ విజయాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఈయన మాల్వా పై దండెత్తి జయించాడు. ఉజ్జయినిలో హిరణ్యగర్భ దానాన్ని చేసి, తన విజయాన్ని ప్రకటించాడు.

మొదటి కృష్ణుడు (క్రీ.శ.758-72): ఈయనకు సుభత్తుంగ, అకాలవర్షుడు అనే బిరుదులు ఉన్నాయి. ఎల్లోరాలో కైలాసనాథ దేవాలయాన్ని (ఏకశిలా నిర్మితం) నిర్మించాడు. దీని నిర్మాణం దాదాపు వందేళ్లు కొనసాగింది. దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించింది.

ధ్రువరాజు (క్రీ.శ.780-92): ఈయన పాల, ప్రతీహార వంశ రాజులను జయించాడు. తన విజయానికి గుర్తుగా గంగా యమున తోరణాన్ని తన రాజ్య చిహ్నంగా ఏర్పాటుచేశాడు. ధ్రువరాజుకు శ్రీవల్లభ. విరూపకేళి వల్లభ, దానార్ణవ అనే బిరుదులు ఉన్నాయి.

మూడో గోవిందుడు (క్రీ.శ.793-814): ఈయన రాష్ట్రకూటుల్లో అగ్రగణ్యుడు. గోవిందుడికి ప్రభూతవర్ష, రాజాధిరాజ, రాజాపరమేశ్వర, త్రిభువనధవళి, శ్రీవల్లభ, జనవల్లభ, కీర్తినారాయణ అనే బిరుదులు ఉన్నాయి. సంజిన్ శాసనంలో ఈయన గొప్పతనం, విజయాల గురించి వివరణ ఉంది. ఈయన చిత్రకూటం, ఉజ్జయిని, బెంగాల్, కాళప్రియం, గంగా-యమున తీరప్రాంత మైదానాలను జయించాడు.

అమోఘవర్షుడు (క్రీ.శ.814-80): ఈయన అసలు పేరు శర్యుడు. గొప్ప కవి. కన్నడ భాషలో ‘కవిరాజ మార్గం’ అనే తొలి అలంకార గ్రంథాన్ని రచించాడు. ‘ప్రశ్నోత్తర రత్నమాలిక అనే కావ్యాన్ని రచించాడు. ఈయనకు ‘కవిరాజు’ అనే బిరుదు ఉంది. ఈయన కాలంలో జైనమత కవులైన మహావీర ఆచార్య ‘గణితసార సంగ్రహాన్ని’, శాత్తాయన ‘అమోఘవృత్తి’ని రచించారు.

Social and Cultural History of Telangana Part-3 Social and Cultural History of Telangana Part-3Social and Cultural History of Telangana Part-3

పరిపాలనా విధానం

  • రాష్ట్రకూటులు పటిష్ఠమైన పరిపాలనా వ్యవస్థను నెలకొల్పి, ప్రజాహితంగా రాజ్యపాలన చేశారు. మొదట్లో వీరికి ఎల్లిన్పూర్, ఎల్లోరా, పైరాన్ నగరాలు రాజధానులుగా ఉండేవి. అమోఘవర్షుడు మాన్యఖేటాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడు.
  • రాజ్య పాలనలో రాజుకు సహాయంగా మంత్రులు ఉండేవారు. వీరిలో ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి కోశాధికారి, న్యాయ మంత్రి సైన్యాధిపతి ముఖ్యులు.
  • భిన్నప్రాంతాల్లో నియమితులైన రాజోద్యోగులను ‘రాజస్థానీయ’ అనేవారు.
  • పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రం, విషయం, గ్రామాలుగా విభజించారు. రాష్ట్రానికి ‘మహాసామంత’ లేదా ‘మహామండలేశ్వర అనే ప్రధాన పాలనాధికారి ఉండేవారు. విషయపతి, భోగపతి అనే జిల్లా అధికారులు ఉండేవారు. పట్టణాన్ని పాలించేవారు ‘నగర పతి’. గ్రామానికి ‘గ్రామపతి’ అధిపతిగా ఉండేవారు.
  • రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమి శిస్తు. సైన్యాన్ని నిర్వహించడానికి కోసం ప్రజల నుంచి ‘పడేనాళ పన్నును వసూలు చేసేవారు.
  •  దక్షిణ భారతదేశంలో వ్యవసాయ భూమిని ప్రత్యేకంగా ‘ఎరిపట్టి’ లేదా ‘చెరువు కట్టు భూమి’ అని పిలిచేవారు.

విద్యా, సారస్వత పోషణ

  • రాష్ట్రకూట రాజులు విద్యాభివృద్ధి కోసం బ్రాహ్మణులకు అగ్రహారాలు, భూములను దానం చేశారు. అగ్రహారాలు, దేవాలయ ప్రాంగణాలు సంస్కృత విద్యకు కేంద్రాలుగా ఉండేవి.
  • జైన, బౌద్ధ మతాలు మత విద్యను బోధించేవి. మాల్టేడ్, నాసిక్, పైఠాన్ నగరాలు విద్యా కేంద్రాలుగా ఉండేవి.
  • వేదాలు, వ్యాకరణం, జ్యోతిషం, సాహిత్యం, ధర్మశాస్త్రం, పురాణాలు మొదలైన విద్యలను అభ్యసించేవారు.
  • క్రీ.శ.779లో ధ్రువ మహారాజు ధూలియా శాసనాన్ని వేయించాడు. అందులో దాన గ్రహీతలు వేద, వేదాంగ, ఇతిహాస, పురాణ, వ్యాకరణ, మీమాంస, తర్క శాస్త్రాల్లో పండితులుగా ఉన్నట్లు పేర్కొంది.
  • సంస్కృత వ్యాకరణం సమస్త శాస్త్రాలకు మూలమని పేర్కొన్నారు. ధార్వాడ్ మండలంలోని భుజభేశ్వరాలయంలోని మఠానికి క్రీ.శ.975లో 50 మత్తరాల భూమిని దానంగా ఇచ్చారు. ఆ మఠంలో విద్యార్థులకు ఉచితంగా విద్య, ఆహారాన్ని అందించేవారు. ధార్వాడ్ మండలంలోని కౌలాస్ అగ్రహారంలో సంస్కృత విద్యాపీఠాన్ని ఏర్పాటు చేశారు. అందులో 200 మంది బ్రాహ్మణ కుటుంబాలు వ్యాకరణ, నీతి శాస్త్ర, సాహిత్య, పురాణ విద్యల్లో నిష్ణాతులుగా ఉండేవారు.
  • రాష్ట్రకూట రాజులు సంస్కృతం, కన్నడ భాషలను పోషించారు. రాజభాష సంస్కృతం. జైన వాజ్మయం రాష్ట్రకూట రాజ్యంలో విలసిల్లింది. హలాయుధుడు “కవిరహస్యం’ను మూడో కృష్ణుడి కాలంలో రచించాడు. ఇందులో సంస్కృత ధాతువుల వివరణ, కృష్ణమహారాజు ప్రశస్తి ఉంది.
  • అమోఘవర్షుడి గురువు జనసేనుడు. ఆదిపురాణ రచనను జనసేనుడు మొదలుపెట్టగా, మరో శిష్యుడైన గుణచంద్రుడు పూర్తిచేశాడు. ఆదిపురాణం జైనతీర్థంకరుల జీవిత చరిత్ర.
  • కన్నడ కవిత్రయంలో రెండోవారైన ‘పొన్న’ మూడో కృష్ణుడి ఆస్థానకవి. ఈయన శాంతి పురాణాన్ని రచించారు.
  • రాష్ట్రకూటులకు సామంతులైన వేములవాడ చాళుక్యుల ఆస్థానంలో కన్నడ త్రయంలో మొదటి వారైన పంపకవి ఉండేవారు. ఆయన ‘ఆదిపురాణం’, ‘విక్రమార్జున విజయం’ గ్రంథాలను రచించారు.
  • సంస్కృత భాషలో మొదటి చంపూ (పద్య గద్య సంకలనం) కావ్యాన్ని త్రివిక్రమభట్టు రచించారు. ఈయన రాష్ట్రకూట రాజైన ఇంద్రుడి సమకాలీకుడు.

కాకతీయులు – History of Kakatiya Dynasty 

కాకతీయులు క్రీ. శ. 750 నుండి క్రీ. శ. 1323 వరకు నేటి తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించిన రాజవంశము. క్రీ. శ. 8వ శతాబ్దము ప్రాంతములో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఘనమైన పరిపాలనను అందించారు. శాతవాహనుల అనంతరం తెలుగు జాతిని సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిపత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే. కాకతీయులు దుర్జయ వంశస్థులుగా కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత తెలంగాణ అనే పదం కాకతీయుల కాలంలో త్రిలింగ అని, దేశపరంగా, జాతిపరంగా ప్రచారం పొందింది.వీరి రాజధాని ఓరుగల్లు (నేటి వరంగల్లు).

  • కాకతీయ వంశ స్థాపకుడు 1వ బేతరాజు వీరి యొక్క మూలపురుషుడు వెన్నడు ,మొట్టమొదటి స్వతంత్రపాలకుడు రుద్రదేవుడు
  • అందరిలో గొప్పవాడు గణపతిదేవుడు
  • కాకతీయులలో చివరి రాజు 2వ ప్రతాప రుద్రుడు వీరియొక్క రాజధాని హనుమకొండ, ఓరుగల్లు
  • వీరియొక్క రాజ భాష సంస్కృతం & రాజచిహ్నం వరాహం
  • శాతవాహనుల తరువాత తెలుగు ప్రాంతాన్ని ఒక దగ్గరకు తీసుకు వచ్చిన వారు కాకతీయులు. కాకతీయుల గురుంచి మొట్టమొదటిసారిగా మాగల్లు శాసనం (క్రీ.శ. 956) లో ప్రస్తావించబడింది. ఈ శాసనాన్ని వేయించినవారు వేంగీ చాళుక్య రాజు దానర్ణవుడు. కాకతి దేవత పేరు మీదుగానే వీరికి కాకతీయులు అని పేరు వచ్చింది. వినుకొండ వల్లభాచార్యుని క్రీడాభిరామం ప్రకారం వీరు ఓరుగల్లులో కాకతి, ఏకవీర అనే గ్రామ దేవతలను పూజించారని, ఓరుగల్లు కోటలో కాకతమ్మ దేవాలయం ఉండటం వల్ల వారికి కాకతీయులు అనే పేరు వచ్చింది.

Social and Cultural History of Telangana Part-3 Social and Cultural History of Telangana Part-3Social and Cultural History of Telangana Part-3

  • కాకతి అనగా దుర్గాశక్తి అని విద్యానాథుని ప్రతాపరుద్ర యశోధం కూడా వివరిస్తుంది. “కాకతమ్మ దేవత కాకతీర్నామ దుర్గా భజయంతి ఇతి కాకతీయ” అని విద్యానాధుడు పేర్కొన్నాడు. గణపతిదేవుని సోదరి ‘మైలాంబ’ బయ్యారం శాసనం వేయించింది. దీనిలో కాకతీయుల వంశం గురుంచి వివరించబడింది. దీని ప్రకారం కాకతీయుల మూలపురుషుడు వెన్నడు. ఇతను దుర్జయ వంశానికి చెందినవాడు. ఇతను రాష్ట్ర కూటుల సేనాపతిగా ఉండి వేంగి చాళుక్యులపై యుద్ధం చేశాడు.
  • వెన్నడు యొక్క నాల్గవ తరం వాడు కాకతీ గుండ్యన. ఇతను వేంగి చాళుక్య రాజు మొదటి భీముడికి వ్యతిరేకంగా నిరువద్యపురం (క్రీ.శ. 900) చేశాడు. ఈ యుద్ధంలో భీముని కుమారుడు ఇరుముర్తి కాకతీయ గుండ్యను హతమార్చాడు. ఇతని ధైర్యసాహసాలకు 2వ కృష్ణుడు గుండ్యన కుమారుడు ఎర్రయ ను కొరివి ప్రాంతానికి పాలకుడిగా చేశాడు. ఎర్రియ అనంతరం బేతియ కొరివి పాలకుడు అయ్యాడు.
  • బేతియ అనంతరం 4వ గుండ్యన లేదా కాకర్త్య గుండ్యన కొరివి పాలకుడు అయ్యాడు. అప్పుడు వేంగి చాళుక్య రాజ్యంలో దానార్ణవుడు మరియు 2వ అమ్మరాజు మధ్య వారసత్వ యుద్దాలు ప్రారంభమైనాయి. ఈ వారసత్వ యుద్ధంలో కాకర్త్య గుండ్యన దానార్ణవుడికి మద్దతు పలికాడు. దీనికి బదులుగా దానార్ణవుడు ‘నతవాటి సీమ’ ను కాకర్త్య గుండ్యనకు ఇచ్చాడు. ఇదే సమయంలో రాష్ట్రకూట రాజు 2వ కృష్ణుడు మరణించాడు. దీనితో రాష్ట్రకూటలు పతనం అయ్యారు.
  • రాష్ట్రకూట చివరి రాజు 2వ కర్కరాజు ను 2వ తైలవుడు ఓడించి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు. అప్పుడు కాకర్త్య గుండ్యన 2వ తైలవుడికి సామంతుడు అయ్యాడు. ఇతను హనుమకొండ రాకుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీరికి 1వ బేతరాజు జన్మించాడు. ఇతను గుమ్మడికాయ వలె ఉండేవాడు. కాకతి అనగా గుమ్మడి అని అర్ధం. 1వ బేతరాజు కాలం నుంచి వీరిని కాకతీయులు అనేవారు.
  • కాకర్త్య గుండ్యన సోదరి పేరు కామసాని. ఈమె భర్త విరియాల ఎర్ర భూపతి / ఎర్ర సేనాని. ఇతను 2వ తైలవుడికి సేనాధిపతి. ఇతని సహాయంతో ముదిగొండ పాలకుడు బొట్టు బేతరాజు కాకర్త్య గుండ్యనను హతమార్చాడు. దీని తరువాత 1వ బేతరాజు అనుమకొండకు పాలకుడిగా ప్రకటించ బడ్డాడు. ఈ విధంగా అనుమకొండలో 1వ బేతరాజు కాకతీయుల పాలనను ప్రారంభించాడు.

మొదటి బేతరాజు (క్రీ.శ. 995-1052)

  • ఇతను పశ్చిమ (కళ్యాణి) చాళుక్యులకు సామంతుడు. అనుమకొండను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు.
  • చిన్నవాడు కావడంతో రాజ్య భారాన్ని ఇతని మేనత్త కామసాని, ఆమె భర్త విరియాల ఎర్రభూపతి చూసుకున్నారు.
  • మొదటి బేతరాజు మంత్రి నారాయణయ్య శనిగరం (కరీంనగర్) వద్ద చాళుక్య యుద్ధమల్లుడు నిర్మించిన జినాలయానికి మరమ్మతులు చేసి శనిగరం శాసనాన్ని వేయించాడు.
  • ఇతని బిరుదులు కాకతి పురాధినాథ, చోడాకా్ష్మపాల మొదటి ప్రోలరాజు (క్రీ.శ. 1052-1076)
  • ఇతను మొదటి బేతరాజు కుమారుడు. కాజీపేట, పిల్లలమర్రి, పాలంపేట శాసనాలు ఇతడి గురించి పేర్కొంటున్నాయి.
  • ఈ శాసనాలు ప్రోలరాజు చక్రకూట విషయాన్ని చక్కదిద్దాడని, కొంకణ మండలాన్ని జయించాడని, భద్రంగపురాధీశ్వరుడిని తరిమాడని, పురాకుటాధీశుడైన గొన్నరాజును యుద్ధంలో సంహరించాడని తెలుపుతున్నాయి.
  • ఇతని విజయాల్లో ఎక్కువశాతం తన సార్వభౌముని (కళ్యాణి చాళుక్య సోమేశ్వరుడు) యుద్ధాలే ఉన్నాయి.
  • ఇతను కేసముద్రం, జగత్‌కేసరి సముద్రం అనే చెరువులు తవ్వించాడు. వరాహ చిహ్నంతో నాణేలు ముద్రించాడు.
  • ప్రోలరాజు బిరుదులు అరిగజకేసరి, కాకతి వల్లభ సమధీగత పంచమహేశబ్ద.

రెండో బేతరాజు (క్రీ.శ. 1076-1108)

  • ఇతడు మొదటి ప్రోలరాజు కుమారుడు.
  • 6వ విక్రమాదిత్యుని దండయాత్రలో పాల్గొని సబ్బి మండలంలో 1000 గ్రామాలు, ముదిగొండ రాజ్యంలోని కొంత భాగాన్ని బహుమానంగా పొందాడు.
  • రెండో బేతరాజు కాజీపేట శాసనాన్ని వేయించాడు. దీని ప్రకారం ఇతను గొప్ప యుద్ధవీరుడు.
  • ఇతని ఆధ్యాత్మిక గురువు రామేశ్వర దీక్షితులు. అతని నుంచి రెండో బేతరాజు శైవదీక్షను పొందాడు.
  • బేతరాజు పైజపల్లి అనే గ్రామానికి శివపురం అనే పేరుపెట్టి దాన్ని రామేశ్వర పండితునికి దానం చేశాడు.
  • అనుమకొండలో తన తండ్రిపేరుతో ప్రోలేశ్వర ఆలయం, తన పేర బేతేశ్వరాలయాలను నిర్మించాడు.
  • ఇతని సేనాని వైజ్జదండాధీశుడు గొప్ప రాజనీతిజ్ఞుడు. ఇతను కరీంనగర్‌ను ఆక్రమించాడు.
  • రెండో బేతరాజు బిరుదులు విక్రమ చక్రి, మహామండలేశ్వర, త్రిభువనమల్ల, చలమర్తిగండ.

దుర్గరాజు

  • బేతరాజు పెద్ద కుమారుడు దుర్గరాజు. క్రీ.శ. 1108-1116 వరకు పరిపాలించాడు.
  • ఇతను అనుమకొండ బేతేశ్వర శివాలయాన్ని రామేశ్వర పండితునికి దానం చేశాడు.
  • ఇతని బిరుదులు త్రిభువనమల్ల, చలమర్తి గండ.
  • ఇతనికి సంబంధించినది కాజీపేట దర్గా శాసనం ఒక్కటే.

రెండో ప్రోలరాజు (క్రీ.శ. 1116-1158)

  • బేతరాజు రెండో కుమారుడు. తొలి కాకతీయుల్లో గొప్పవాడు. ఇతను తన కళ్యాణి చాళుక్యుల సామంతులతో యుద్ధం చేసి విజయం సాధించాడు.
  • ఇతని కుమారుడైన రుద్రదేవుని ప్రసిద్ధ అనుమకొండ వేయి స్తంభాల గుడి శాసనం ఈ విషయాన్ని బలపరుస్తుంది.
  • రెండో ప్రోలరాజు చేతిలో కొలనుపాక పాలకుడైన పరమార జగ్గదేవుడు పరాజయం పొందాడు. క్రీ.శ. 1173లో కళ్యాణి చాళుక్య రాజు రెండో జగదేక మల్లుడు, రెండో ప్రోలరాజు సైన్యాలు కుండూరిపై దండెత్తి తైలపుణ్ణి ఓడించాయి.
  • ప్రోలరాజు భీమ చోడుణ్ణి ఓడించి వధించాడు. శ్రీశైలం వరకు సైన్యాలను నడిపి అక్కడ విజయస్తంభాన్ని నాటాడు.
  • ఇతని కాలం నుంచే పొలవాస ప్రభువులకు, అనుమకొండ ప్రభువులకు మధ్య సంఘర్షణ ప్రారంభమైంది.
  • ఇతని కాలంలోనే ఓరుగల్లు కోట నిర్మాణం ప్రారంభమైంది.
  • ప్రోలరాజు మహామంత్రి బేతనామాత్యుని భార్య మైలమ కడలవాయ బసదిని జైనుల కోసం నిర్మించింది.
  • ఇతని బిరుదులు మహామండలేశ్వర, దారిద్య్ర విద్రావణ

రుద్రదేవుడు (1158-62 వరకు, 1163-1195 వరకు)

  • కాకతీయ వంశ పాలకుల్లో రుద్రదేవుడి (మొదటి ప్రతాపరుద్రుడు) కాలానికి ప్రత్యేకత, చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఇతడు 1158-62 వరకు సామంతరాజుగా, 1163-95 వరకు స్వతంత్ర రాజుగా పరిపాలించాడు. ఇతడి అనుమకొండ వేయి స్తంభాల గుడి శాసనం (1163) రుద్రదేవుడు క్రీ.శ. 1163లో సంపూర్ణ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకొని తెలంగాణలో మొదటిసారిగా విశాల రాజ్యాన్ని స్థాపించాడని తెలుపుతుంది. అనుమకొండ శాసనాన్ని అచితేంద్రుడు లిఖించాడు. రుద్రదేవుడు నగర పాలకుడైన (కరీంనగర్ నగునూర్) దొమ్మరాజును, పొలవాస (జగిత్యాల) పాలకుడైన రెండో మేడరాజు, మైలిగ దేవుడు, చోడోదయుడు మొదలైన వారిని యుద్ధంలో ఓడించి తన ఆధిపత్యాన్ని తెలంగాణలో నెలకొల్పాడని వేయి స్తంభాలగుడి శాసనం తెలుపుతున్నది.
  • రుద్రదేవుడు కాలచూరి రాజ్యాన్ని ఆక్రమించి, కందూరి రాజ్యాన్ని జయించి తన సామ్రాజ్యంలో విలీనం చేశాడు. రుద్రదేవుడు కందూరి ఉదయచోడుని కుమార్తె పద్మావతిని వివాహమాడి ఆ రాజ్యానికి అతన్ని సామంతునిగా నియమించాడు. ఈ వివాహం సందర్భంగా రుద్రదేవుడు రుద్రసముద్ర తటాకం అనే చెరువును తవ్వించాడు. ఇతని రాజ్యం ఉత్తరాన గోదావరి వరకు, పశ్చిమాన బీదర్ వరకు, దక్షిణాన శ్రీశైలం వరకు విస్తరించి ఉంది.
  • రుద్రదేవుడు విజయాలకు సూచకంగా విజయశాసనాన్ని అనుమకొండలో వేయించి రుద్రేశ్వర, వాసుదేవ, సూర్యదేవుల విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడు. రుద్రదేవుడు ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఇతను 1182లో జరిగిన పల్నాడు యుద్ధంలో నలగామరాజుకు తన మద్దతు ప్రకటించాడు. ఇతని మంత్రి ఇనగాల బ్రహ్మారెడ్డి వేయించిన ద్రాక్షారామ శాసనం (1158) ప్రకారం రుద్రదేవుడు పరాక్రమశాలి. రుద్రదేవుడు సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు. విద్యాభూషణ బిరుదాంకితుడు. ఇతని మంత్రి వెల్లంకి గంగాధరుడు కరీంనగర్ శాసనం (1170) వేయించాడు. గంగాధరుడు అనుమకొండలో ఒక చెరువును, ప్రసన్న కేశవస్వామి గుడిని కట్టించాడు.
  • Social and Cultural History of Telangana Part-3 Social and Cultural History of Telangana Part-3Social and Cultural History of Telangana Part-3

మహాదేవుడు (క్రీ.శ. 1196 – 1199)

  • రుద్రదేవునికి సంతానం లేని కారణంగా అతని తమ్ముడైన మహాదేవుడు పాలకుడయ్యాడు. మహాదేవునికి గణపతిదేవుడు అనే కుమారుడు, మైలాంబ, కుదంబిక అనే కుమార్తెలు కలరు. తన ఇద్దరి కుమార్తెలను నతవాడి పాలకులైన ఒక్కలిక (మైలాంబ), మొదటి రుద్రుడు (కుందాంబిక ) కు ఇచ్చి వివాహం చేశాడు. ఇతని శైవ మత గురువు ‘దృవేశ్వర పండితుడు’యాదవ రాజు జైతూగి కాకతీయ రాజ్యంపై దండెత్తి మహాదేవుడిని కూడా హతమార్చాడు.

గణపతి దేవుడు (క్రీ.శ. 1199 – 1162)

  • ఇతను అత్యధికంగా 63 సంవత్సరాలు పరిపాలించాడు. యాదవ రాజు జైతూగి కాకతీయ రాజ్యంపై దాడి చేసి అప్పటి పాలకుడైన మహాదేవుని హతమార్చి వారసుడైన గణపతిదేవుణ్ణి తనతోపాటు దేవగిరికి తీసుకొనిపోయాడు. దీనితో కాకతీయ రాజ్యం సంక్షోభంలో పడింది. మహాదేవుని సైన్యాధిపతి అయిన రేచర్ల రుద్రుడు కాకతీయ రాజ్యాన్ని సంక్షోభం నుండి కాపాడాడు. దీనితో అతనికి కాకతీయ రాజ్యభార దౌరేయుడు, కాకతీయ రాజ్య సమర్థుడు అనే బిరుదులు ఇవ్వబడ్డాయి.
  • దేవగిరిలో గణపతి దేవుని మేథస్సు ను చుసిన జైతూగి అతన్ని విడుదల చేశాడు. గణపతి దేవుడు విడుదలలో జైతూగి కుమారుడు సింగనుడు సహకరించాడు. క్రీ.శ. 1199 లో గణపతి దేవుడు కాకతీయ పాలకుడు అయ్యాడు. ఇతను రేచర్ల రుద్రుని సహాయంతో కాకతీయ రాజ్యాన్ని విస్తరించాడు. ఇతను అనేక దండ యాత్రలు చేశాడు అందులో ముఖ్యమైనవి

నెల్లూరు

నెల్లూరు ప్రభువు 1వ మనువసిద్ధి మరణాంతరం అతని కుమారుడు తిక్కసిద్ధి నెల్లూరు ప్రభువు అవ్వడానికి సహకరించాడు. దీనికి గాను తిక్కసిద్ధి గణపతి దేవునికి పాకనాటిని అనే గ్రామాన్ని ఇచ్చాడు. గణపతి దేవుడు పాకనాటిని పాలించుటకు గంగా సాహిణి ని పంపాడు. తిక్కసిద్ధి మరణాంతరం విజయగొండ గోపాలుడు ఇతరుల సహాయంతో నెల్లూరు ప్రభువు అయ్యాడు. దీనితో తిక్కసిద్ధి కుమారుడైన 2వ మనుమసిద్ధి ఆస్థానకవి తిక్కన గణపతి దేవుడిని కలిసి తన రాజు తరుపున సహాయం కోరాడు .దీనితో గణపతి దేవుడు సామంత భోజుడిని నెల్లూరుకు పంపాడు. సామంత భోజుడు వలయూర్ యుద్ధంలో విజయగొండ గోపాలుడిని ఓడించి 2వ మనుమసిద్దిని నెల్లూరు ప్రభువుగా చేశాడు. దీనికి గాను 2వ మనుమసిద్ధి గణపతి దేవుడికి మోటుపల్లి ఓడరేవుని ఇచ్చాడు. గణపతి దేవుడు మోటుపల్లి ఓడ రేవుని అంతర్జాతీయ ఓడరేవుగా అభివృద్ధిపరచి విదేశీ వరకుల కొరకు అనేక నియమ నిబంధనలతో మోటుపల్లి అభయ శాసనాన్ని రుపొందించాడు. మోటుపల్లిలో అభయ శాసనమును అమలుపరుచుటకు సిద్దయ్యదేవున్ని పంపాడు.

తీరాంధ్ర

తీరాంధ్రలోని దివిసీమ ప్రాంతాన్ని ఆక్రమించుటకు ముత్యాల చౌదరాయుడు ని పంపాడు.ఇతను తీరాండ్రను పాలిస్తున్న అయ్య వంశానికి చెందిన పినచోడిని ఓడించి, దీపి లుంటాక, దీవి చూరకార అనే బిరుదులు పొందాడు.పినచోడి ఓటమి అనంతరం తన కుమార్తెలు అయినా నూరంబ, పెరంబలను గణపతిదేవునికిచ్చి వివాహం చేశాడు.పినచోడి కుమారుడైన జాయపసేనాని కాకతీయ గజ దళపతిగా నియమించబడ్డాడు.జాయపసేనాని నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాయిద్య రత్నావళి అనే గ్రంధంలులను సంస్కృత్రములో రచించాడు.

కళింగ

కళింగ ఆక్రమణ కొరకు రేచర్ల రాజానాయకుడు, చోడ భీముడు అనే సేనాపతులు పంపబడ్డారు. వీరు కళింగ రాజు అయిన గోదుమర్రటిని ఓడించి గంజాం, ఉదయగిరి, బస్తర్ ప్రాంతాలను ఆక్రమించారు. ఈ విధంగా గణపతి దేవుడు మొత్తం ఆంధ్రదేశంలో పాటు దక్షిణ ఒరిస్సా, దక్షిణ ఛత్తీస్ ఘడ్, ప్రాంతాలను కూడా పాలించాడు.రేచర్ల రుద్రుడు పాలంపేటలో 1213లో రామప్పగుడిని నిర్మించాడు. రామప్పగుడి ఏకశిలా కోవకు చెందుతుంది. గణపతి దేవుని రథ దళాధిపతి ‘గంగయ్య సేనాని’. గంగయ్య సేనాని యొక్క బిరుదులు – మాండలిక బ్రహ్మరాక్షస, రక్కశ గంగ, గండపెండేర, గణపతి దేవుడు ఓరుగల్లు పట్టణాన్ని పూర్తిగా నిర్మించి రాజధానిని పూర్తిగా ఓరుగల్లుకు మార్చాడు. ఓరుగల్లు కోటను ఏడు మట్టి కోటల నగరమని కూడా అంటారు. ఇతను ఓరుగల్లులో స్వయంభూ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడు (దీనిని ప్రారంభించింది 2వ ప్రోలరాజు).
ఇతను రామప్ప, పాకాల, లక్నవరం చెరువులను త్రవ్వించాడు.పాండ్యరాజు జటావర్మ సుందరపాండ్య ముత్తుకూరు యుద్ధంలో నెల్లూరు ప్రభువు అయిన 2వ మనువసిద్ధిని హతమార్చాడు. కొందరి చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ముత్తుకూరు యుద్ధంలోనే గణపతి దేవుడు కూడా హతమార్చబడ్డాడు.

ఇతనికి ఇద్దరు కుమార్తెలు: 

  • రుద్రమాంబ / రుద్రమదేవి (భర్త చాళుక్య వీరభద్రుడు)
  • గణమాంబ (భర్త బేతరాజు)

Social and Cultural History of Telangana Part-3 Social and Cultural History of Telangana Part-3Social and Cultural History of Telangana Part-3

కాకతీయుల వంశం రుద్రమదేవి చరిత్ర – Kakatiya Dynasty Rudrama Devi History

రుద్రమదేవి (క్రీ.శ. 1262 – 1289): రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన మహారాణి, కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీర వనిత.  భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి  ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. ఈమె తండ్రి గణపతి దేవునికి సంతానం లేదు అందువల్లన రుద్రంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేశాడు. గణపతిదేవుడు తన కుమార్తె రుద్రమదేవిని నిరవద్యపుర (నిడదవోలు) ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాళుక్యుడైన వీరభద్రునికి ఇచ్చి వివాహం చేశాడురుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మమ్ముడమ్మ, ఈమె మహాదేవుని భార్య, వీరి పుత్రుడే ప్రతాపరుద్రుడు. రుద్రమాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిక్షేకం చేసింది. ప్రతాపరుద్రునకు అన్నమదేవుడు అనే తమ్ముడు ఉండేవాడని స్థానిక గాథ. బస్తర్ రాజ్య చివరి పాలక వంశంవారు అన్నమదేవుని తమ వంశ కర్తగా చెప్పుకున్నారు.  రుద్రమదేవి రెండవ కుమార్తె రుయ్యమ్మను ఇందులూరి అన్నలదేవునికిచ్చి వివాహం చేసింది. అన్నలదేవుడు సేనాధిపతి మరియు మహ ప్రధాని.

జీవిత విశేషాలు:

కాకతీయులలో గణపతిదేవుని తరువాత 1262 లో రుద్రమదేవి  ‘రుద్రమహారాజు’ బిరుదుతో కాకతీయ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించింది. అయితే ఒక మహిళ పాలకురాలు కావడం ఓర్వలేని అనేకమంది సామంతులు తిరుగుబాటు చేశారు. అదే సమయంలో నెల్లూరు పాండ్యుల కింద వేంగీ ప్రాంతం గొంకరాజు మొదటి నరసింహుడి కిందకు వెల్లినాయి. పాకనాటి కాయస్థ అంబదేవుడు, కళింగ నరసింహుని కుమారుడు వీరబాణుడు తిరుగుబాట్లు చేసారు. రుద్రమదేవి తన సేనానులతో కలిసి ఈ తిరుగుబాట్లన్నింటిని అణచివేసింది.

రుద్రమాంబ ఎదుర్కొన్న దండయాత్రలల్లో దేవగిరి యాదవ రాజుల దండయాత్ర అతి పెద్దది, కీలకమైనది. యాదవరాజు మహాదేవుడు ఓరుగల్లును ముట్టడించాడు అయితే రుద్రమదేవి యాదవులను ఓడించి, దేవగిరి దుర్గం వరకు తరిమి కొట్టింది. వేరే దారి లేక మహాదేవుడు సంధికి దిగి వచ్చి  యుద్ధ పరిహారంగా మూడుకోట్ల సువర్ణాలు చెల్లించాడు.

రుద్రమదేవి  యొక్క శైవమత గురువు విశ్వేశ్వర శివశంబు. గణపతి దేవునికి, 2వ ప్రతాపరుద్రుని కూడా ఈయనే గురువు. రుద్రమదేవి  తానె స్వయంగా కాయస్థ రాజ్యంపై దాడి చేసినట్లు తెలుస్తుంది. కాయస్థ అంబదేవునితో జరిగిన యుద్ధాలలో రుద్రమదేవి  మరణించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు.
రుద్రమదేవి  కల ఇతర బిరుదులు: రాయగజకేసరి, ఘటోదృతి.
ప్రఖ్యాత పథికుడు ‘మార్క్ పోలో’ చైనా దేశంనుండి తిరిగి వెళ్తూ దక్షిణ భారతదేశమును సందర్శించి రుద్రమదేవి గురుంచి, ఆమె పాలన గురుంచి బహువిధములుగా పొగిడాడు. మోటుపల్లి రేవు నుంచి కాకతీయుల సముద్ర వ్యాపారము గురుంచి కూడా వివరముగా వ్రాసాడు.

ఓరుగల్లుపై తురుష్కుల దండయాత్రలు 

కొన్ని గ్రంధాల ప్రకారం ఓరుగల్లుపై 8 సార్లు, మరికొన్ని గ్రంథాలు 5 సార్లు దండయాత్రలు చేసినట్లుగా వివరిస్తున్నాయి. కాని చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం 5 సార్లు దండయాత్రలు చేసినట్లుగా పేర్కొన్నారు.
ఈ దండయాత్రలకు సంబంధించి ఆధారాలు :అమీర్ ఖస్రు రచనలు & అబ్దుల్ వాసప్ రచనలు
పైన పేర్కొన్న గ్రంధాలు 5 సార్లు దండయాత్ర చేసినట్లుగా ఉన్నాయి.
ఈ క్రింది పేర్కొన్నవి  8 సార్లు దండయాత్ర చేసినట్లుగా ఉన్నాయి.
కాసే సర్వప్ప – ప్రతాప చరిత్ర
ప్రోలయ్య నాయకుడు — విలాస శాసనం ,కలువచేరు శాసనం

మొదటి దండయాత్ర 1303

  • ఆ నాటి ఢిల్లీ సుల్తాను అల్లా ఉద్దీన్ ఖిల్జీ (1296-1316)
  • దండయాత్ర జరిపిన సేనాపతి మాలిక్ ఫక్రుద్దీన్ జునా
  • ఉప్పరపల్లి (కరీంనగర్) యుద్ధంలో కాకతీయ సైన్యం చేతిలో ఓడిపోయారు
  • అతనిని ఓడించిన కాకతీయ సేనాపతులు రేచర్ల వెన్నడు, కొలిగింటి మైలి
రెండవ దండయాత్ర 1309-10
  • ఆ నాటి ఢిల్లీ సుల్తాను అల్లా ఉద్దీన్ ఖిల్జీ (1296-1316)
  • ఈ దండయాత్రకు నాయకత్వం వహించింది మాలిక్ కాఫర్
  • ఇతను ఓరుగల్లుపై దాడి చేసిన మార్గం బసీర్గర్ – సర్బార్ – కూనర్ బార్ – హనుమకొండ – వరంగల్
  • 2వ ప్రతాపరుద్రుడు సంధి చేసుకున్నాడు
మూడవ దండయాత్ర 1317-18
  • ఆ నాటి ఢిల్లీ సుల్తాను ముబారక్ ఖిల్జీ (1316-20)
  • ఈ దండయాత్రలకు నాయకత్వం వహించింది ఖుస్రూ ఖాన్ (అమీర్ ఖుస్రూ)
  • ఈ దండయాత్రలో ప్రతాపరుద్రుడు సంధి చేసుకున్నాడు
నాల్గవ దండయాత్ర 1321-22
  • ఈ కాలం నాటి ఢిల్లీ సుల్తాను గియాజుద్దీన్ తుగ్లగ్ (1320-25)
  • ఈ దండయాత్రకు నాయకత్వం వహించింది జునాఖాన్ మొహ్మద్ బిన్ తుగ్లక్
  • ఆయన వెంట వచ్చిన జ్యోతిష్యుడు ఉభయ్యద్ తన తండ్రి గియాజుద్దీన్ తుగ్లక్  మరణించాడని ఊహించి చెప్పడం వల్లన వెనుతిరిగిన ఢిల్లీ సైన్యాలను కొలచెలను యుద్ధంలో ఓడించిన వారు ఏచనాయక (కొసగి వంశం).
ఐదవ దండయాత్ర 1323
  • ఈ కాలం నాటి ఢిల్లీ సుల్తాను గియాజుద్దీన్ తుగ్లక్
  • ఈ దండయాత్రకు నాయకత్వం వహించింది జునాఖాన్ మొహ్మద్ బిన్ తుగ్లక్
  • ఈ దండయాత్రలో కాకతీయ సైన్యం ఓడిపోయి ఢిల్లీ సామ్రాజ్యంలో కలిసిపోయింది
  • యుద్ధ సమయంలో సైన్యం నుండి వైదొలిగి శత్రువుల పక్షాన చేరి కాకతీయుల ఓటమికి పరోక్షంగా కారణమైనవాడు — బొబ్బారెడ్డి

కాకతీయుల పరిపాలన 

  • వీరి పరిపాలనలో వికేంద్రీకృత రాచరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాచరికం పితృస్వామికంగా ఉండేది.  పరిపాలనలో రాజుకు సహకరించడానికి అనేకమంది మంత్రులు ఉండేవారు. వీరిలో ముఖ్యమైనవారు మహాప్రధాని, ప్రధాని, ప్రెగ్గడ (అంతఃపుర అధ్యక్షుడు), అమాత్య.
  • నాడులో నాయంకర / నాయక వ్యవస్థను మొట్టమొదటి సరిగా ప్రవేశపెట్టిన వాడు — గణపతిదేవుడు
  • వీరి రాజ్యంలో మొత్తం 77 మంది నాయకులు ఉండేవారు. వీరికి పన్ను వసూలుతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించే బాధ్యత కూడా ఉండేది.
  • వీరు కార్యకలాపాలను నిబంధలప్రకారం నిర్వహించేవారు వీటిని లెంకవళి దర్మం అంటారు.
  • గ్రామంలో పరిపాలన కొరకు అయ్యగార్ల విధానం ఉండేది. మొత్తం 12 మంది అయ్యగార్లు ఉండేవారు. వీరిలో 3గురు ప్రభుత్వ సేవకులు, మిగిలినవారు గ్రామ సేవకులు.

ప్రభుత్వ సేవకులు:

1. కరణం — పన్ను లెక్కలు
2. రెడ్డి/కాపు — పన్ను వసూలు
3. తలారి — శాంతి భద్రతలు
 

గ్రామసేవకులు:

1. కుమ్మరి
2. కంసాలి
3. కమ్మరి
4. వడ్రంగి
5. మంగలి
6. చాకలి
7. వెట్టి
8. పురోహిత
9. చర్మకారుడు
న్యాయపరంగా న్యాయమూర్తిని ప్రాద్వివాక అనేవారు. ఇతను జారీచేసే ఆదేశాలను ముద్రవర్తులు అంటారు
2వ ప్రతాపరుద్రునికి నవలక్ష ధనుర్దారాధీశ్వరుడు అనే బిరుదు కలదు. దీని అర్ధం తొమ్మిది లక్షల కాల్బలం, 20 వేల అశ్వక బలం, 100 గజబలం కల్గినవాడు.

1 thought on “పార్ట్-3: తెలంగాణ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర | Social and Cultural History of Telangana Part-3”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.