...

పార్ట్-1: తెలంగాణ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర | Social and Cultural History of Telangana Part-1

Written by lsrupdates.com

Published on:

Table of Contents

తెలంగాణ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర | Social and Cultural History of Telangana Part-1

తెలంగాణ చరిత్ర పూర్వయుగం అంటే ఏమిటి ?

  • చరిత్ర పూర్వయుగం అంటే లిఖిత పూర్వక ఆధారాలు లేని యుగం. లిఖిత ఆధారాలు లభిస్తున్న గత 2300 సంవత్సరముల కాలాన్ని చారిత్రక యుగం అంటారు.

Social and Cultural History of Telangana Part-1

  • తెలంగాణాలో మొదటిసారిగా చరిత్ర పూర్వ యుగానికి (బృహత్ యుగానికి) సంబందించిన ప్రదేశం నల్గొండ జిల్లా లోని వలిగొండ, దీనిని పరిశోధన చేసినవారు – రాబర్ట్ బ్రూస్ పూట్.
  • హైదరాబాద్ పురావస్తుశాఖ 1914లో ఏర్పాటు చేయబడింది.
  • కొత్త రాతియుగంలో మానవుడు ఉపయోగించిన పనిముట్టు – రాగి
  • రాక్షసగూళ్ళ యుగంలో మానవుడు ఉపయోగించిన పనిముట్లు – ఇనుప పనిముట్లు, కావున ఈ కాలాన్ని అయో (ఇనుప) యుగమని కూడా అంటారు.  ఈ యుగంలో చిన్న చిన్న రాజ్యాలు, లిపి, నాగరికతా చిహ్నాలు ప్రారంభమైనవి. కాబట్టి ఈ యుగాన్ని “చరిత్ర పూర్వ యుగం” , “చారిత్రక యుగం”, “మధ్య సంధి యుగం (ప్రోటో హిస్టరీ) లేదా “పురా చారిత్రక యుగం” అని అంటారు.
  • చరిత్ర పూర్వ యుగాన్ని వారు వాడిన పనిముట్ల ఆధారంగా కూడా పిలుస్తారు.

ఉదాహరణగ తీసుకుంటే:

  • దిగువపాత రాతియుగం – గులక రాయి పనిముట్లు
  • మధ్య పాత రాతియుగం – రాతి పెచ్ఛుల పనిముట్లు
  • ఎగువ పాత రాతియుగం – కొచ్చెటి పనిముట్లు
  • మధ్య రాతియుగం – చిన్న చిన్న రాతి పనిముట్లు
  • కొత్త రాతి యుగం – నున్నటి పనిముట్లు
  • రాక్షసగుళ్ల యుగం – ఇనుప లోహ పనిముట్లు

మధ్య పాత రాతి యుగం (1 లేదా . లక్షల సంవత్సరాల క్రితం):

మొదటిసారిగా ఎద్దు అస్థిపంజరం అవశేషాలు లభించిన ప్రదేశం – మహబూబనగర్ జిల్లాలోని యపాలపాడు దగ్గర జరిపిన త్రవ్వకాల్లో.  దీనినిబట్టి ఈ యుగపు మానవులకు ఎద్దులతో సంబంధం ఉంది అని అర్ధం అవుతుంది.  ఈ యుగపు మానవులు వదిన పనిముట్లు – చిన్న తరహా గొడ్డళ్లు, గండ్ర గొడ్డళ్లు, గోకుడు రాళ్లు .

దిగువ పాత రాతియుగం (3 నుంచి 1.30 లక్షల సంవత్సరాల క్రితం):

ఈ యుగానికి చెందిన ముఖ్యమైన ప్రదేశాలు:

  • ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ , పొచ్ఛేర జలపాతం
  • కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖిని , రామగుండం
  • ఖమ్మం జిల్లాలోనే పాల్వంచ
  • నల్గొండ జిల్లాలోని రాయవరం, ఏలేశ్వరం, నాగార్జున కొండ
  • మహబూబనగర్ జిల్లా లోని చంద్రగుప్త పట్టణం, ఈర్ల దిన్నె
  • పెద్ద ఆకారాలతో ఉండే చేతి గొడ్డళ్లు, గోఖుడు రాళ్లు , వృత్తాకారపు రాళ్ళూ, ఈ యుగపు మనుషుల వేటలో మరియు ఆహారణ సేకరణలో ఉపయోగపడ్డాయి .
  • ఈ యుగపు ఆయుధాలు ఆఫ్రికా లోని “అష్యులియన్” ప్రాంతపు ఆయుధాలతో పోలి ఉన్నాయి .
పార్ట్-1: తెలంగాణ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర | Social and Cultural History of Telangana Part-1
పార్ట్-1: తెలంగాణ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర | Social and Cultural History of Telangana Part-1

ఎగువ పాత రాతి యుగం(క్రీ. పూ. 20000 – 10000 సంవత్సరాల క్రితం):

ఈ యుగంలో జీవించిన ప్రజలు బ్లేడ్ పనిముట్లు, ప్రక్క అంచు ఉన్న బ్లేడ్ పనిముట్లు, కొన్నిచోట్ల ఎముకలతో చేసిన పనిముట్లను వాడారు. రాతి గుహల్లో రంగు బొమ్మలను గీయడం నేర్చుకున్నారు.ఇది “హాలోసీన్” ఆరంభ దశను చుసిస్తుంది.

మధ్య రాతి యుగం(క్రీ.పూ. 8500 – 3000 సంవత్సరాల క్రితం):

  • భౌగోళిక వాతావరణ పరంగా “తోలి హాలోసీన్” యుగానికి చెందినది.
  • ఈ యుగంలో అతి చిన్న (సూక్ష్మ) రాతి  ఆయుధాలను వాడారు.
  • ఈ యుగాన్ని ‘సూక్ష్మ రాతి యుగం” అని కూడా అంటారు.
  • ఈ యుగానికి చెందిన గుహల్లోని రంగు చిత్రాల్లో 150 కి పైగా బొమ్మలు కనిపిస్తాయి.
  • వీటిలో ప్రధానంగా జింక, చెవుల పిల్లి, హైనా, నక్క, కుక్క, తాబేలు, రేఖాగణిత నమూనాలు సున్నపురాయి, గ్రానైట్ రాయి కొండా గుహలలో కనిపిస్తాయి.
  • వీటిలో ముఖ్యమైనది జింక చిత్రం.

Social and Cultural History of Telangana Part-1

కొత్త రాతి యుగం (క్రీ.పూ. 3000 – 1500 సంవత్సరాల క్రితం):

  • ఈ యుగం మలిదశలో రాగి, కంచుతో పనిముట్లను తయారు చేయడం నేర్చుకున్నారు. వీటి సహాయంతో భూమిని త్రవ్వి మొక్కలను నాటడం, పెంచడం, పంటలను పండించడం నేర్చుకున్నారు.
  • దీని వల్లనా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తద్వారా కుటుంబం, సమాజం, గ్రామం ఏర్పడ్డాయి.
  • పండిన పంటలను నిల్వ చేసుకోవడానికి పాత్రలు  అవసరమైనాయి దీనివల్ల కుండలు, బానాలు  తయారు చేసుకోవడానికి కారణమైనది. మొదట కుండలను చేత్తో చేసేవారు తరువాత కుమ్మరి చక్రాన్ని కనుకొన్నారు. వ్యక్తిగత ఆస్థి  అనే భావన పుట్టి ధనిక – పేద సమాజ ఏర్పాటుకు దారి తీసింది.
  • పశువులను మఛ్చిక చేసుకున్నారు. పంట ఉత్పత్తి చేయడానికి వ్యాపారం పుట్టుకకు దారి తీసాయి.
  • కరీంనగర్ జిల్లా లో తొగర్రాయి అవాసంలో  పైకి పొడుచుకు వఛ్చిన గ్రానైట్ గుట్టల దగ్గర పనిముట్లను తయారుచేసే కేంద్రం కనిపించింది.
  • మట్టిపాత్రలకు ఎక్కువగా కెంపు రంగు అలంకారం ఉండేది.
  • ఈ యుగపు ఆర్ధిక వ్యవస్థ ప్రధానంగా పశుపోషణ , వ్యవసాయం మీద ఆధారపడింది.
  • బూడిద కుప్పలు, కొన్ని అడవి జంతువుల లేదా పశువుల దొడ్లు లభించిన ప్రదేశం – మహబూబనగర్ జిల్లాలోని ఉట్నూరు.
  • మూపురపు ఎద్దుల టెర్రకోట బొమ్మలు, తాటి చిత్ర లేఖనాలు కరీంనగర్ జిల్లాలోని బూదగది, వరంగల్ జిల్లాలోని పాండవుల గుట్ట, నల్గొండ జిల్లాలోని రాచకొండ, ఖమ్మం జిల్లాలోని నల్లముడి, మహబూబనగర్ జిల్లాలోని దుప్పాడు  గుట్ట, దొంగల గట్టు తదితర ప్రాంతాలు వెలుగు చూశాయి.
  • ఈ కాలంలో ప్రజలు ప్రదానంగా జొన్నలు, పప్పులు, వడ్లు పండించేవారు. పంటలను ప్రధానంగా వర్షాధారంగానే పండించేవారు.
  • కొత్త రాతియుగంలో చనిపోయిన వారి తలను ఉత్తరం వైపు పెట్టి ఖననం చేసేవారు.
  • నాగార్జునకొండలో ఆవాస ప్రాంతంలో ఇద్దరి శిశువులను కుండలో సమాధి చేసిన ఆధారాలు కనిపించాయి.

రాక్షసగుళ్ల  యుగం (క్రీ.పూ. 1500 – క్రీ. శ . 300 సంవత్సరాల వరకు)

ఈ యుగంలో ఇనుప వస్తువులు వాడటం వలన దీనిని అయో యుగమని అంటారు. చనిపోయిన వారి అస్థి పంజరాలను శవపేటికలో గాని, రాతిగుండులో  కానీ పెట్టి పూడ్చి ఆ గూడు చుట్టు  పెద్ద పెద్ద రాళ్లను వలయాకారంలో నిలిపేవారు. కావున ఈ యుగాన్ని రాక్షసగుళ్ల  యుగం అంటారు. స్థానిక ప్రజలు వీటిని పాండవుల గూళ్ళు, వీర్లపాడులని కూడా అంటారు. చనిపోయిన వ్యక్తికి  ప్రియమైన పెంపుడు జంతువులను (కుక్క) కూడా అతనితోపాటు ఖననం చేసేవారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆవరణలో ఉన్న రాక్షసగూడు  సమాధి దేశంలోనే మొదటిది.

రాక్షసగుళ్ల సమాధులను నిర్మాణం ఆధారంగా 4 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి

1) గుంత సమాధులు: గుంత తవ్వి అందులో మట్టి శవపేటికలో గాని, దీర్ఘచతురస్రాకారపు రాతి పలకల గదిలో గాని అస్థిపంజరాన్ని పూడ్చి దాని చుట్టూ వలయాకారంలో పెద్ద పెద్ద రాళ్లను నిలిపితే దానిని గుంత సమాధి అంటారు.

2) గది  సమాధి : రాతి సమాధి మొత్తం భూమి ఉపరితలం మీదనే ఉంటె దానిని గది సమాధి అంటారు.

3) గూడుసమాదులు: దీర్ఘచతురస్రాకారపు  రాతి గదిని పూర్తిగా పూడ్చి వేయకుండా ఒక మూరెడు ఎత్తు భూమి ఉపరితలంపైకి కనిపించే విధంగా పూడ్చి దాని మీద ఒక రాతి పాలకను పెడితే దానిని గూడు సమాధి అంటారు.

4) గుహ సమాధులు : కొండల్లో గుండ్రటి గుహలను తొలచి వాటిల్లో శవాలను పెట్టి కప్పువేస్తే వాటిని గుహ సమాధులు అంటారు.

మహబూబనగర్ జిల్లాలోని ఉప్పలపాడు గుంతసమాధిలో పడవ ఆకారపు శవపేటిక లభ్యమైంది.  చిన్నమారూర్ గూడు సమాధిపై తడిక గుర్తులు కనిపించాయి. మహబూబనగర్ జిల్లాలో ఉన్న వీరాపురం సమాధుల్లో అనేక రకాల ‘ఆహార ధాన్యాలు’ లభించాయి. వాటిలో ముఖ్యమైనవి వరి, బార్లీ, కొర్రలు వంటి తృణ ధాన్యాలు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లోని సమాధిలో రాగులు బయటపడ్డాయి. గుహరాళ్ళపై  చెక్కిన రేఖాచిత్రాలలో ప్రధానంగా త్రిశూలం, చక్కంలో నుంచి దూరిపోయే త్రిశూలం, బల్లెం కనిపిస్తాయి.

శాతవాహన యుగం/వంశం-Satavahana Dynasty:

  • తెలంగాణ అనే పదం ఢిల్లీ సుల్తానుల కాలం నుంచి వ్యవహారంలోకి వచ్చింది. అమిర్ ఖస్రు అనే కవి మొదటగా తెలంగాణను పేర్కొన్నాడు. ఆంధ్రుల ప్రస్తావన మొదటగా ఋగ్వేదంలో భాగమైన “ఐతరేయ బ్రాహ్మణం” లో క్రీ.పూ.1000  కలదు. దక్షిణ భారతదేశంలో వెలిసిన ఏకైక జనపదం  – అశ్మక(నిజామాబాద్ , కరీంనగర్, ఆదిలాబాద్) దీని రాజధాని బోధన్. (మొత్తం జనపదాలు 16).
  • ]క్రీ.పూ. 4 వ శతాబ్దంలో ‘మొగస్తనీస్’ అనే గ్రీకు రాయబారి తన “ఇండికా” గ్రంధంలో ఆంధ్రులకు ముప్పది కోటలున్న నగరాలు ఉన్నాయని, ఒక లక్ష కాల్బలం, రెండువేల అశ్విక బలం, ఒక వెయ్యి గజదళం ఉన్నాయని పేర్కొన్నాడు. ఇదే విషయాన్నీ ఫ్లీని కూడా పేర్కొన్నాడు.
  • మొగస్తనీస్ చెప్పిన కోటల్లో తెలంగాణాలో బోధన్, కోటిలింగాల, ధూళికట్ట, పెద్దబంకుర్ , కొండాపూర్, ఫణిగిరి, గాజులపురి, ఇంద్రపురి గా గుర్తించారు.
  • కరీంనగర్ జిల్లా లోని ‘పెద్దబంకుర్’ లో కుమ్మరి కొలిమి ని కనుకొన్నారు.
  • దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన తొలి  ప్రధాన రాజ వంశం శాతవాహనులది. మౌర్యుల కాలంలో సామంతులుగా ఉండి కణ్వ వంశ కాలంలో స్వతంత్రం ను ప్రకటించుకున్నారు.
  • తెలంగాణాలోని కోటిలింగాల లో వీరి పాలన ప్రారంభమై తరువాత ప్రతిష్ఠానపురం (పైఠాన్ ) రాజధాని అయింది. మలిశాతవాహనుల  కాలం నాటికీ ధనకటకానికి (ధాన్యకటకంగా) మార్పు చేయడం జరిగింది. శాతవాహనులు మగధ వరకు తమ దిగ్విజయ యాత్రను నిర్వహించారు.
శాతవాహనుల కంటే ముందు తెలంగాణను పరిపాలించిన రాజ్యాలు, క్రీ.పూ. 3 వ శతాబ్దం నాటి భట్టిఫ్రోలు స్థూపం లోని ‘ధాతురకాండ‘ శాసనాల్లో కుభీరుడనే రాజు నిగమసభ, గోష్ఠి ల సహాయంతో పరిపాలన చేసాడు.
  • ‘వడ్డెమాను శాసనం’ లో రజసోమకుడు, జంటుపల్లి,వేల్పూరు శాసనంలో సరిపద , మహాసద్ , అశోకపద, శివపద ,శివమ కసద పరిపాలించినట్లు పేర్కొన్నవి.
  • కోటిలింగాలలో గోబద్ , సమగోప , నారన , కాంవయసిరి  నాణేలు దొరికాయి.
  • గోబద్”  తెలంగాణాలో మొదటిసారిగా నాణెములు వేయించాడు.
  • శాతవాహనుల శాసనాలు బ్రహ్మలిపిలో, పాకృత భాషలో ఉన్నాయి
  • సుధీర్ఘకాలానికి చెందిన 24 శాసనాలు మాత్రమే దొరికాయి.
నాసిక్-8, కన్హేరీ -5, కార్లే-3, భిల్సా -1, నానాఘాట్-2, మ్యాకదోని-1, చిన్నగంజాం-1, అమరావతి-2, కొడవలి-1 లభ్యమైనాయి.
నానేఘాట్ శాసనాన్ని మొదటి శాతకర్ణి భార్య రాణి నాయినిక(నాగానిక) వేయించింది. ఇది అలంకార శాసనం మాత్రమే.
  • కన్హేరీ శాసనాన్ని కృష్ణుడు(కన్హ) వేయించాడు.
  • గౌతమి బలసిరి  వేయించిన శాసనం – నాసిక్, తన కొడుకు గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలను ప్రస్తావిస్తుంది.
  • మహామేఘవాహన వంశానికి చెందిన కళింగ రాజు, ఖారవేలుడు వేయించిన హథీగంప శాసనం, అతని సమకాలీనుడు అయినా శాతకర్ణి గురుంచి సమాచారం తెలియజేస్తుంది.
  • శాతవాహనులు సీసం, రాగి నాణేలు అధిక సంఖ్యలో ముద్రించారు .
  • రాగి, తగరం లోహాల మిశ్రమంతో ‘ఫోటిన్’ నాణేలను కూడా ముద్రించారు.గౌతమి పుత్ర శాతకర్ణి వెండి నాణేలను కూడా ముద్రించాడు.
  • వీటిపై కొన్ని సంకేతాలు – వృషభం, ఏనుగు, సింహం, కొండ , ఉజ్జయిని, ఓడ , సూర్యుడు, చంద్రుడు, కమలం, శంఖం ముద్రించేవారు.తొలి  శాతవాహనుల శాసనాలు నానేఘాట్, నాసిక్ లో మాత్రమే లభించాయి.
  • మత్స్య పురాణం ప్రకారం 30 మంది రాజులూ 456 సంవత్సరములు పరిపాలించారని పేర్కొంది.
  • వాయుపురాణం ప్రకారం 17 మంది రాజులూ 272 సంవత్సరములు పరిపాలించారని పేర్కొంది.
  • శ్రీముఖుడు కణ్వ  రాజు సుశర్మను వధించి మగధను  ఆక్రమించి శాతవాహన రాజ్యాన్ని ఆక్రమించాడని అన్ని పురాణాలు  పేర్కొన్నాయి. స్థాపన నుంచి గౌతమీపుత్ర శాతకర్ణి రాజ్యానికి వచ్చేవరకు గల రాజులను తొలి  శాతవాహనులు అని, గౌతమీపుత్ర శాతకర్ణి నుంచి చివరి రాజుల వరకు మలి  శాతవాహనులు అంటారు.

శాతవాహన రాజ్యస్థాపకుడు – శ్రీముఖుడు

అందరికంటే గొప్పవాడు – గౌతమీ పుత్ర శాతకర్ణి

చివరి గొప్పవాడు – యజ్ణశ్రీ శాతకర్ణి

శ్రీముఖుడు(క్రీ.పూ.231-208):

  • ఇతను శాతవాహన రాజ్యస్థాపకుడు
  • ఇతనిని పురాణాలు సింథకుడు, బలపుచ్ఛకుడు, బలి అని పేర్కొన్నాయి.
  • ఇతని పరిపాలన కాలం 23 సంవత్సరములు.
  • ఇతను మొదటగా జైన మతాన్ని స్వీకరించి చివర్లో వైదిక మతాన్ని ఆచరించాడు.
  • ఇతని నాణెముల మీద ‘సిరి చిముక’, ‘సిరి చిముక శాతవాహన’, ‘సిరి శాతవాహన’ అనే 3 పేర్లు ఉన్నాయి.
  • ఇతను రాఠీకులు అనే నాగ జాతి తెగను ఓడించి వారితో వివాహసంబందాలు ఏర్పరుచుకున్నాడు.
  • ఇతని కుమారుడు 1వ శాతకర్ణి.

కృష్ణుడు :

  • ఇతను  శ్రీముఖుని సోదరుడు
  • ఇతని  పరిపాలన కాలం 18 సం.
  • ఇతని ‘నాసిక్‘ శాసనం లో శాతవాహన పాలనా పద్దతి, మౌర్యుల విధానంలో తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది.
  • ఇతడు నాసిక్ గుహలను తొలిపించాడు. నాసిక్ లో బౌద్ధ సన్యాసుల క్షేమం కొరకు ధర్మమహాత్య అనే అధికారులను నియమించాడు. ‘భాగవత’ మతం ఇతనికాలంలో దక్షిణభారతదేశానికి వ్యాప్తి చెందింది.

Social and Cultural History of Telangana Part-1 Social and Cultural History of Telangana Part-1

మొదటి శాతకర్ణి :

  • ఇతను శ్రీముఖుని కుమారుడు.
  • ఇతని పరిపాలన కాలం 18 సం.
  • ఇతని భార్య పేరు నాయనిక (నాగానిక), ఈమె వేయించిన శాసనం పేరు నానేఘాట్, దీనిపై వీరి కుమార్తె మహారతి త్రణకయిరో, కుమారులు కుమార హకుశ్రీ, కుమార శాతవాహన, వెదిశ్రీ(పెద్ద కుమారుడు) ల ప్రతిమలు ఉన్నాయి.
  • ఇతను రెండు అశ్వమేఘ యాగాలు, ఒక రాజసూయ యాగం, 20 క్రతువులను నిర్వహించాడు.
  • ఇతని బిరుదులు – అప్రతిహతచక్ర, ఏకవీర, దక్షిణ పథపతి.
  • గజ‘ గుర్తు గల నాణేలను ముద్రించాడు.
  • పురాణాలూ ఇతడిని ‘మహాన్’, ‘మల్లకర్ణ’ అని పేర్కొన్నాయి.
  • ఇతను ‘ఉజ్జయిని పట్టణ’ గుర్తుతో నాణేలు ముద్రించాడు.
  • ఇతని సమకాలీన పాలకులు

    పుష్యమిత్రశుంగుడు – మగద
    ఖారవేలుడు – కళింగ
    డెమిత్రియస్ – ఇండో గ్రీకు

  • ఇతను కళింగ ఖారవేలుడు పై దండెత్తినట్లు ‘ఛుళ్ళా కళింగ జాతక’ ద్వారా తెలుస్తుంది.
  • ఇతను తొలిసారిగా బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు భూములను దానంగా ఇచ్చాడు.
  • వైవాహిక సంబంధాల ద్వారా రాజ్య విస్తరణ చేశాడు.
  • ఇతని భార్య నాగానిక తండ్రి పేరు మహారథకైరో (రాతికుల రాజు).

2వ శాతకర్ణి 

  • పురాణాల ప్రకారం ఇతను 6వ రాజు 
  • ఇతని పరిపాలన కాలం 56 సం.
  • ఇతను ‘సాంచీ‘ స్థూపానికి దక్షిణ తోరణం నిర్మించాడు. ‘ఆనందుడు‘ దక్షిణ తోరణం పై శాసనాన్ని చెక్కించాడు.
  • ఉత్తర భారతదేశంలో రాజ్య(పాలన) విస్తరణ చేసిన మొదటి దక్షిణ భారతదేశ రాజుగా పేర్కొంటారు.
  • ఇతని తరువాత లంబోదరుడు,అపీలకుడు, మేఘస్వాతి, స్వాతి, స్కందస్వాతి, మృగేంద్ర స్వాతి కర్ణి, కుంతల శాతకర్ణి, స్వాతి కర్ణి, అనే 8 మంది రాజులు పాలించారు.
  • అపీలకుడు పరిపాలన కాలం 12 సం. పురాణాల ప్రకారం ఇతని పరిపాలన కాలం 8 వ రాజు

కుంతల శాతకర్ణి :

  • ఇతని బిరుదు విక్రమార్క
  • పురాణాల ప్రకారం ఇతను 13వ రాజు
  • ఇతని ఆస్థానంలో శర్వవర్మ ‘కాతంత్ర వ్యాకరణం’ ను సంస్కృతంలో రచించాడు.
  • ఇతని ఆస్థానంలో  అభివృద్ధి చెందినది
  • కుంతల శాతకర్ణికి 6 నెలల్లో సంస్కృతం నేర్పించింది శర్వవర్మ .
  • పైశాచిక భాషలో ‘బృహత్కథ ను ఇతని ఆస్థానంలో రచించింది గుణాధ్యుడు.
  • ఇతని భార్య పేరు మలయావతి. ఈమె ‘కరిర్త’ అనే రతి భంగిమ కారణంగా మరణించింది.
  • కుంతలా శాతకర్ణి గురించి ఈ క్రింది గ్రంథాలలో పేర్కొనబడింది

1. వాత్సాయ కామ సూత్రం. (దీనిని తెలుగులోకి అనువాదం చేసినది పంచాంగుల  నారాయణ శాస్త్రి )
2. రాజశేఖరుడి కావ్య మీ మాంస
3. గుణాఢ్యుడి బృహత్కథ

  • ఇతని తరువాత స్వాతి కర్ణి పరిపాలించాడు.

1 వ పులోమావి :

  • ఇతను 15వ రాజు ఇతను  చెందిన సుశర్మను ఓడించి మగధను 10 సం. లు పరిపాలించాడని వాయు పురాణం పేర్కొంది.
  • పులోమావి ‘ గడ్డిలో జన్మించినవాడు’ అని అర్థం.
  • ఇతని తరువాత పాలకుడు శివస్వాతి .

హాలుడు:

  • శాతవాహన చక్రవర్తులలో 17వ రాజు
  • ఇతను సరస్వతాభిమాని, సాహితీవేత్త
  • ఇతని బిరుదు కవి వత్సలుడు,
  • ‘బాణుడు’ తన హర్షచరిత్రలో గాదా సప్తశతిని హాలుడు రచించాడని పేర్కొన్నాడు.
  • ఇతని భార్య  పేరు లీలావతి
  • ఇతని వివాహంపై ‘కుతూహలుడు’ “లీలావతి పరిణయం” ను రచించాడు.

మలి శాతవాహనులు

గౌతమీపుత్ర శాతకర్ణి(క్రీ.శ. 106-130):

  • ఇతను శాతవాహనులందరిలో గొప్పవాడు. ఇతని పరిపాలన కాలం 24 సం.లు
  • క్రీ.శ. 78 లో శాలివాహన యుగం ప్రారంభించాడు.
  • ఇతని తండ్రి పేరు శివ స్వాతి. తల్లి పేరు గౌతమీ బాలశ్రీ . ఈమె తన పుత్రుడి మరణాంతరం అతని గొప్పతనాన్ని వివరిస్తూ “నాసిక్” శాసనం వేయించింది.
  • ఇతని యొక్క బిరుదు – త్రిసముద్ర పీతవాహన
  • ఇతను శకులను, పల్లవులను, యవనులను ఓడించాడు. ఇతను క్షాత్రప వంశాన్ని నిర్ములించాడు.
  • ఇతనికాలంలోనే తెలుగు ప్రాంతం మొత్తం ఆదీనంలో ఉంది.
  • ఇతని కాలం నుంచే రాజులు తల్లుల పేర్లు తమ పేర్లతో జోడించుకొనే సంప్రదాయం మొదలైంది.
  • ఇతను నాసిక్ దగ్గర ‘జోగల్ తంబీ’ అనే యుద్ధంలో శక రాజు ‘సహఫానుణ్ణి’ ఓడించి ఆతను ముద్రించిన వెండి నాణేలను సేకరించి మరల తన చిహ్నాలతో వాటిని పునః ముద్రించాడు.
  • ఇతని కాలం లో రాజ్యం బాగా విస్తరించింది.
  • ఇతను వైదిక మాత సంప్రదాయాలను పాటిస్తూ, బౌద్ధ మతాన్ని కూడా ఆచరించాడు.

2వ పులోమావి / వాశిష్ఠపుత్ర శాతకర్ణి :

  • ఇతను గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు
  • ఇతని రాజధాని ధాన్యకటకం. ఇతని పరిపాలన కాలంలో ‘నాసిక్’ శాసనం వేయించబడింది.
  • ఇతని యొక్క బిరుదు నవనాగరా స్వామి
  • ఇతని కాలంలోనే ప్రఖ్యాత అమరావతి స్థూపం నిర్మించబడించి. దీనిని స్థానిక రాజు “వీలుడు” లేదా ‘నాగరాజు’ నిర్మించాడని పేర్కొంటారు.
  • రుద్రదాముడు వేయించిన శాసనం పేరు – జునాఘడ్, దీనిలో శాతకర్ణిని రెండుసార్లు ఓడించినట్లు పేర్కొన్నాడు. ఇది సంస్కృతంలో వేయించిన మొదటి శాసనం.
  • ఇతను కార్లెలో బౌద్ధ సన్యాసులకు విరాళాలు ఇచ్చాడు.
  • ఇతని ఆస్థానంలోని ‘టాలమీ‘ ఉన్నాడు. ఇతను భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతను రాసిన గ్రంధం “గైడ్ టు జాగ్రఫీ “

వాశిష్ఠ పుత్ర శివ శ్రీ శాతకర్ణి:

  • ఇతను కూడా గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు
  • ఇతను రుద్రదాముని కుమార్తెను వివాహం చేసుకున్నాడు.
  • ఇతను పాకృతం మరియు తమిళం రెండు భాషలతో నాణెములను ముద్రించిన తొలి శాతవాహన రాజు
  • ఇతని బిరుదు క్షత్రప.

యజ్ణశ్రీ శాతకర్ణి(క్రీ.శ. 165-194)

  • ఇతను పురాణాల ప్రకారం 26వ రాజు. శాతవాహనులలో చివరి గొప్పవాడు.
  • ఇతను అనేక యజ్ఞాలు చేసి ఈ పేరు పొందాడు.
  • ఇతను రెండు తెరచాపలున్న ఓడ బొమ్మ లేదా లంగరు వేసిన ఓడ చిహ్నంతో నాణేలు ముద్రించాడు.
  • ఇతని కాలంలోనే మత్స్య పురాణం సంకలన ప్రారంభమైంది.
  • ఇతని ఆస్థానంలో ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు.
  • యజ్ఞశ్రీ నాగార్జునిడి కొరకు శ్రీపర్వతం లేదా నాగార్జునకొండ పై మహావిహారం లేదా పారవాత విహారం నిర్మించాడు.
  • మహారాష్ట్ర, మధ్యప్రదేశ్,ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలన్నింటినీ పాలించిన చివరి రాజు.

విజయశ్రీ శాతకర్ణి

  • ఇతను 28 వ రాజు
  • శ్రీపర్వతం దగ్గర విజయపురి పట్టణం ను నిర్మించాడు.
  • ఇతని తరువాత చంద్రసేనుడు / చంద్రశ్రీ పాలించాడు.

3వ పులోమావి 

  • ఇతను 30వ లేదా చివరి రాజు
  • ఇతని సేనాధిపతి శ్రీమాంతమూలుడు
  • ఇతను బళ్లారిలో ‘మ్యాకదోని‘ శాసనంను వేయించాడు.

శాతవాహనుల పరిపాలన వ్యవస్థ

  • నాసిక్, కార్లే గుహ శాసన ద్వారా వీరిపాలన విధానం గూర్చి తెలుస్తుంది.
  • మొదట్లో వీరి పాలన మౌర్యుల పాలన సంప్రదాయాలను అనుసరించారు.
  • రాజు రాజ్యానికి అధిపతి. రాజు దైవాంశ సంభూతుడనే భావన ఉండేది.
  • రాజు, మహారాజు వంటి బిరుదులు ధరించారు.
  • రాజుకు పరిపాలనలో సహాయపడటానికి 4 అమాత్యులు ఉండేవారు.
  1. విశ్వ అమాత్య – రాజు ఆంతరంగిక సలహాదారుడు (ప్రధాని)
  2. రాజు అమాత్య – రాజు ఆదేశాలను అమలు పరిచేవాడు
  3. మహా అమాత్య – ఆర్ధిక మంత్రి
  4. మహా తలవర – ప్రధాన సైన్యాధిపతి

వీరితోపాటు రాజుకు సలహాలిచ్చేవారు

  1. మహారథులు – రాష్ట్రాన్ని పాలించే అధికారులు
  2. మహాభోజకులు – రాష్ట్ర పాలకుడు హోదా
  3. మహాసేనాపతి – సైన్యాధిపతి
  4. హిరణ్యకుడు – కోశాధికారి (ద్రవ్యపరమైన ఆదాయాన్ని)
  5. భండారీక – వస్తురూపంలో ఆదాయాన్ని భద్రపరిచేవారు
  6. మహాతరక – రాజు అంగరక్షకుడు
  7. నిబంధకర – దస్తావేజుల ఆదాయాన్ని భద్రపరిచే వారు
  8. గ్రామకుడు – గ్రామాధికారి
  9. మహామంత్రులు – బౌద్ధ బిక్షువుల బాధ్యతలను చూసేవారు

Social and Cultural History of Telangana Part-1 #Social and Cultural History of Telangana Part-1

శాతవాహన రాజ్యాన్ని మూడు భాగాలుగా విభజించారు అవి:

  1. రాజు కంఖేట ప్రాంతం – రాజు ప్రత్యక్ష పాలనలో ఉన్న ప్రాంతం
  2. సామంతుల ప్రాంతం
  3. సరిహద్దుల ప్రాంతం
  • శాతవాహనుల రాజ్యాన్ని కొన్ని ఆహారాలుగా (రాష్ట్రాలుగా) విభజించారు. వీటి పాలకుడు అమాత్యులు
  • నగరాలను నియమాలనే వారు
  • కుల పెద్దలను గుహాపతులు అనేవారు
  • గ్రామం పాలన బాధ్యతలను చూసే అధికారిని గ్రామిక లేదా గుమిక అనేవారు.
  • గౌల్మికులు అనగా సైన్యాధిపతులు
  • గౌల్మీకుడు అంటే 30 మంది సైనికులకు ఆధిపతి
  • గ్రామంలో సమస్యల పరిష్కరానికి “మహాకార్యక” అనే ప్రభుత్వ అధికారి ఉండేవాడు.
  • రాజు యొక్క సొంతభూమిని “రాజు ఖంకేట” అనేవారు
వీరి సైన్యం 4 రకాలుగా విభజించారు.
  1. రథ
  2. గజ
  3. అశ్విక
  4. చతురంగ
  • శాతవాహనుల సైనిక శిబిరాలను స్కంధవారంకటకమని పిలిచేవారు
  • స్కంధవారం అంటే తాత్కాలిక సైనికశిబిరం, కటక మంటే నగరాల్లో సైన్యాగారాలు.
  • ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం భూమిశిస్తు. దీనిని రాజభోగ , దేయమేయ అనే 2 రకాలుగా పిలిచేవారు.
  • భూమిశిస్తు 1/6 వంతు మేరకు వసూలు చేసేవారు.
  • చేతి వృత్తులపై “కరకర” అనే పన్నును విధించేవారు
  • బౌద్ధవులకు, బ్రాహ్మణులకు భూదానం చేసేవారు.
  • బ్రాహ్మణులకు భూదానం చేసిన మొదటి రాజు – గౌతమీపుత్ర శాతకర్ణి
  • బావుల నుండి నీళ్లు తోడటానికి ఉడక యంత్రాలను వాడేవారు
  1. ఉదగ యంత్రం – భూమిని దున్నే యంత్రం
  2. ఘటిక –  యంత్రం – నీటిని పైకి లాగటానికి
  3. గరిక యంత్రం – ముడి ప్రత్తి నుండి విత్తనాలు వేరు చేయడానికి వాడే యంత్రం
  • రజ్జగాహకుడు భూమి శిస్తును నిర్ణయించి ఆ శిస్తును వసూలు చేసేవారు.
  • అప్పట్లో 18 వృత్తి శ్రేణి వారు / అష్టాదశ వర్గాల వారు ఉండేవారు.
  1. కొలికులు — నేత కారులు
  2. తిలిషకులు — నూనె తీసేవారు
  3. కాసకారులు — ఇత్తడి పనివారు
  4. కులరికులు / కుమారులు — కుమ్మరులు
  5. తెసకారులు — మెరుగు పట్టేవారు
  6. మణికారులు — రత్నపని వారు
  7. మాల కారులు — పూల వర్తకులు
  8. ఓద యాంత్రికులు — ఉదయ యంత్రాలు చేసేవారు
  9. లోహవాణియులు — ఇనుప వర్తకులు
  10. సువణ కారులు — సువర్ణకారులు
  11. వథకులు — వడ్రంగులు
  12. సెలవధకులు — రాతపనివారు
  13. అవేసినులు — చేతివృత్తివారు
  14. లేఖకులు — రాయసగాళ్లు
  15. చమ్మకారులు — చర్మకారులు
  16. పాసకారులు — మేదరివారు
  17. మీఠీకులు — రాయి మెరుగు పెట్టేవారు
  18. గధికులు — సుగంధ ద్రవ్యాల వర్తకులు
  • ఒక్కొక్క వృత్తిని అనుసరించేవారు ఒక్కొక్క శ్రేణిగా ఏర్పడ్డారు. వీరికి శ్రేష్టి అనే అధ్యక్షులు ఉండేవారు.
  • వడ్డీ వ్యాపారులు 12% వడ్డీని వసూలు చేసేవారు
  • స్వదేశీ వర్తకులు సంఘాలుగా ఏర్పడేవారు. ఈ సంఘాలనే నిభయ  లేదా నికాయ లేదా నిగమ
  • అనేవారు.
  • సంఘాల సమావేశాన్ని “గోష్ఠి” అనేవారు.
  • గోష్ఠి అధ్యక్షుడుని శెట్టి అంటారు.
  • శాతవాహనుల కాలంలో అత్యధికంగా సీసం నాణెములు ముద్రించబడ్డాయి.
  • వీరికాలంలో రోమ్ దేశంతో వర్తకం బాగా జరిగేది.
  • ఫ్లీని యొక్క గ్రంధం – “Natural History “
  • ఒక బంగారు నాణెం 35 వెండి నాణెములతో సమానం
  • అప్పట్లో శాతవాహనుల ముఖ్యమైన ఓడ రేవు – మైసోలి(తూర్పు తీరం), కోల్డురా, కంటక సేల, అల్లోసిగ్నే.
  • పశ్చిమతీరం – బారుకాచ్(బ్రోచే-గుజరాత్) , సోహాల్, కళ్యాణ్.
  • వీరికాలంలో ప్రధాన ఎగుమతులు – సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, మణులు, పట్టు వస్త్రాలు
  • వీరికాలంలో ప్రధాన దిగుమతులు – వెండి, బంగారం, వైన్

మతం 

  • వీరికాలంలో వైదిక, బౌద్ధ మతాలు వ్యాప్తి చెందాయి
  • శాతవాహన రాజులూ వైదిక మతాన్ని పాటించగా రాణులు మాత్రం బౌద్ధ మతాన్ని ఆచరించేవారు.
  • గాధాసప్తశతి పుస్తకం శివుని ప్రార్థనతో ప్రారంభమయి గౌరిస్తోత్రంతో ముగుస్తుంది. దీనిని హాలుడు రచించాడు.
  • అతి ప్రాచీన శివలింగం చిత్తూరు జిల్లా గుడిమల్లు లో కలదు.
  • ఆంధ్రదేశంలో మొట్టమొదటి జైనాచార్యుడు ‘కొండా కుందనాచార్యుడు‘ ఇతడు ‘సమయసారం’ అనే గ్రంథాన్ని రచించాడు
  • శాతవాహన ఆస్థానంలోని 52 మంది సేనాధిపతులు తమ పేర్ల మీదుగా 52 జైన దేవాలయాలు నిర్మించారని ‘జీవ ప్రభావసూరి’ యొక్క కల్ప ప్రదీప ప్రకారం తెలుస్తుంది.
  • ఆంధ్రదేశంలో మొట్టమొదటి బౌద్ధాచార్యుడు ‘మహాదేవ భిక్షువు‘. ఇతను బుద్ధుని చిహ్నాలను పూజించే చైత్యేకవాదం అనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు.
  • అమరావతి స్థూపం 2వ పులమావి కాలంలో నిర్మించబడింది.
  • 1797 లో కల్నన్ క్యాలిన్ మెకంజీ అమరావతి స్థూపాన్ని కనుకొన్నారు.
  • మహా సాంఘిక శాఖకు జన్మభూమి ‘ధాన్యకటకం’.
  • ఆచార్య నాగార్జునుడు ‘వెదలి‘ అనే గ్రామంలో జన్మించాడు. ఇతను యజ్ఞశ్రీ శతకర్ణికి సమకాలికుడు.
  • శాతవాహనుల అధికార బాష — ప్రాకృతం
  • భారతదేశంలో భూదానాలు చేసిన తొలి రాజులు వీరే.
  • భాగవత మతాన్ని ఉత్తరభారతదేశంలో వాసుదేవుడు స్థాపించాడు

బిరుదులు 

  • మొదటి శాతకర్ణి — దక్షిణాపథపతి
  • యజ్ఞశ్రీ శాతకర్ణి — త్రిసముద్రాధిపతి
  • 2వ పూలమావి — దక్షిణాపదేశ్వరుడు
  • గౌతమీపుత్ర శాతకర్ణి — రామకేశవ

కవులు – గ్రంథాలు

  • ఆర్యదేవుడు — చిత్తశుద్ధి
  • నాగార్జునుడు — దసభూమిక సూత్ర
  • ఆర్య మంజుశ్రీ — కల్పసూత్రం
అజంతా 10వ గుహలోనే ‘శ్వేత గజ జాతక‘ చిత్రం శాతవాహన యుగానిదే
ఆచార్య నాగార్జునిడి గ్రంథాలు
  • శున్యసప్తపతి
  • రతిశాస్త్రం
  • మణిమంగళం
  • స్పుహలేఖ

శాతవాహన యుగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు

  • మహానగర శిథిలాలు బయటపడిన ప్రదేశం — కదంబపుర్
  • రాప్పన్, బారువా అనే చరిత్రకారులు ఏ నదిని ‘కన్న బెన్న’ గ పేర్కొన్నారు — వైన్ గంగా
  • తెలంగాణ ప్రాంతాన్ని చివరిగా పాలించింది — కౌశికీ పుత్ర శాతకర్ణి
  • నిబందకారులకు మరోపేరు — అక్ష పటకులు
  • కరీంనగర్ జిల్లా ‘ముసులగుట్ట’ అనేది ఒక జైన క్షేత్రం
  • స్కంధావారం అనే పదానికి అర్ధం — మిలిటరీ క్యాంప్
  • కటకం అనే పదానికి అర్ధం — సైన్యాగారం
  • ఖారవేలుడు గాడిదలతో తొక్కించి నేలమట్టం చేసిన నగరం — పిదుండ
  • టంకశాల నగరం — కొండాపురం
  • విదేశీ వ్యాపారానికి ఉపయోగించిన నదులు — మూసీ, గోదావరి
  • వీరికాలంలో తక్కువుగా వాడుకలో ఉన్న లోహం — రాగి
  • వీరి కాలంలో ఎక్కువగా వాడుకలో ఉన్న లోహం — వెండి
  • బుద్ధపాదరదన గురుంచి ప్రస్తావించిన గ్రంథం — గాథాసప్తశతి
  • క్రతు ప్రధానమైన మతం – వైదికం
  • దక్షిణభారతదేశంలో ‘పాశుపత శైవం’ ప్రాచుర్యం పొందిన కాలం —  క్రీ శ. 1వ శతాబ్దం
  • పాశుపత శైవం — ‘లకు విశా శివాచార్యుడు’
  • లీలావతి కావ్యమును ప్రాకృతంలో రచించారు.
  • సెలవధకులు అంటే శిల్పులు
  • వసకారులు అంటే మెదరివారు
  • వర్గాలు – 4
  • అధికార మతం — వైదికం
  • రాజ బాష — ప్రాకృతం
  • ప్రపంచకథకు మూలాధారం – బృహత్కథ(దీనిని గుణాడ్యుడు కొండాపురంలో రచించాడు)
  • అత్త, పిల్ల అనే తెలుగు పదాలు ‘గాధాసప్తశతి’ లో వాడారు
  • హాలునితో సన్మానం పొందినవారు — కుమారీలుడు, శ్రీ పాలితుడు
  • తెలంగాణాలో తొలి లిఖిత కవి — గుణాఢ్యుడు

Social and Cultural History of Telangana Part-1 #Social and Cultural History of Telangana Part-1 #Social and Cultural History of Telangana Part-1 #Social and Cultural History of Telangana Part-1

Also Read: 👇👇👇 

పార్ట్-3: 1948-1970 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాక్టీస్ బిట్స్ | Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-3 – LSR Updates

పార్ట్-2: 1948-1970 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాక్టీస్ బిట్స్ | Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2 – LSR Updates

పార్ట్-1: 1948-1970 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాక్టీస్ బిట్స్  | Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1 – LSR Updates

చాప్టర్-2 తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం సమాధానాలతో కూడిన ప్రశ్నలు | Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2 – LSR Updates

తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం సమాధానాలతో కూడిన ప్రశ్నలు | Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 – LSR Updates

చాప్టర్-3 తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం 1991-2014 | Telangana Movement Between 1991 to 2014 Part-3 – LSR Updates

చాప్టర్-2 తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం 1991-2014 | Telangana Movement Between 1991 to 2014 Part-2 – LSR Updates

Social and Cultural History of Telangana Part-1 #Social and Cultural History of Telangana Part-1 #Social and Cultural History of Telangana Part-1 #Social and Cultural History of Telangana Part-1

తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం 1991-2014 | Telangana Movement Between 1991 to 2014 Part-1 – LSR Updates

తెలంగాణ ఉద్యమ చరిత్ర (1956-1968) జీకే ప్రశ్నలు- జవాబులు | Telangana Movement History GK Questions with Answers in Telugu-2024 – LSR Updates

Social and Cultural History of Telangana Part-1 #Social and Cultural History of Telangana Part-1 #Social and Cultural History of Telangana Part-1 #Social and Cultural History of Telangana Part-1

Social and Cultural History of Telangana Part-1 #Social and Cultural History of Telangana Part-1 #Social and Cultural History of Telangana Part-1 #Social and Cultural History of Telangana Part-1Social and Cultural History of Telangana Part-1 #Social and Cultural History of Telangana Part-1 #Social and Cultural History of Telangana Part-1 #Social and Cultural History of Telangana Part-1Social and Cultural History of Telangana Part-1 #Social and Cultural History of Telangana Part-1 #Social and Cultural History of Telangana Part-1 #Social and Cultural History of Telangana Part-1

1 thought on “పార్ట్-1: తెలంగాణ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర | Social and Cultural History of Telangana Part-1”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.