Secunderabad Cantonment MLA Lasya Nanditha Died in A Road Accident at Patancheru-2024 | తండ్రి మరణించిన ఏడాదికే..కంటోన్మెంట్ MLA లాస్య నందిత మృతి..
Secunderabad Cantonment MLA Lasya Nanditha Died in A Road Accident at Patancheru: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఓఆర్‌ఆర్‌పై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. కారు డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో లాస్య నందిత మృతి చెందారు. పది రోజుల క్రితం కూడా లాస్య నందిత కారు ప్రమాదానికి గురైంది. నల్గొండ కేసీఆర్ సభ తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో ఓ హోంగార్డ్ ప్రాణాలు కోల్పోయారు.
ముఖ్యాంశాలు :
- బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం
- కంటోన్మెంట్ MLA లాస్య నందిత మృతి
- కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన లాస్య
బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పటాన్‌చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న లాస్య నందిత స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.
డ్రైవర్ నిద్రమత్తు, ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. వెనుక సీట్లో కూర్చున్న లాస్య నందిత సీటు బెల్ట్ పెట్టుకొని ఉండుంటే.. ప్రాణాపాయం తప్పేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వెంటాడిన మృత్యువు..
ఇటీవల ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన లాస్యనందిత హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో నార్కట్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డుపక్కకు దూసుకెళ్లటంతో ఓ హోంగార్డు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో లాస్య నందిత స్వల్పగాయాలతో బయటపడింది. ఈ ప్రమాదం జరిగి పది రోజులు గడవకముందే ఆమె మరో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది.
గత ఏడాది డిసెంబర్లో సికింద్రాబాద్ లో ఓ కార్యక్రమానికి వెళ్లిన లాస్య లిఫ్టులో ఇరుక్కుపోయిన సంగతి తెలిపిందే. ఓవర్లోడ్ కారణంగా లిఫ్ట్ కిందకి పడిపోవడంతో అందులో చిక్కుకుపోయారు.
పటాన్‌చెరు నుంచి..
ఓఆర్‌ఆర్‌పై పటాన్‌చెరు నుంచి మేడ్చల్ వెళ్తున్న క్రమంలో సుల్తాన్‌పూర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆమె స్పాట్‌లోనే మృతి చెందారు. లాస్య ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కన డివైడర్‌ను ఢీకొట్టటంతో విషాదం చోటుచేసుకుంది. అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నార్కట్‌పల్లి ప్రమాదంలో ఆమె కారు దెబ్బతినగా.. ఇటీవల కొత్త కారు కొనుగోలు చేశారు. ఆ కారు కూడా ప్రమాదానికి గురికావటంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని ప్రమాద ఘటనపై ఆరా తీస్తున్నారు.
ఏడాది కాలంలోనే..
దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందిత. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న మృతి చెందారు. ఏడాది కాలంలోనే తండ్రి, కూతురు మృతి చెందడం.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. తండ్రి సాయన్న కోరిక మేరకు లాస్య నందిత రాజకీయాల్లోకి వచ్చారు. 1987లో హైదరాబాద్లో జన్మించిన లాస్య నందిత.. కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశారు. 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పికెట్ నాలుగో వార్డు నుంచి సభ్యురాలిగా పోటీ చేసిన ఆమె పరాజయం చెందారు.
ఎన్నికైన మూడు నెలల్లోపే..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం తెలంగాణలో విషాదాన్ని నింపింది. పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆమె మృతి వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఆమె.. కారు ప్రమాదం ఎలా జరిగింది..? తెల్లవారుజామనే ఆమె అక్కడికి వెళ్లారు అనే విషయాలు చాలా మందిని ఆలోచింపజేస్తున్నాయి. ఆమె సదాశివపేట వెళ్లారని ఒకరు.. బాసర నుంచి తిరుగొస్తుండగా ప్రమాదం జరిగిందని మరొకరు ఇలా రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
2016లో సాయన్నతోపాటు భారాసలో చేరారు. 2016-20 మధ్య కవాడిగూడ కార్పొరేటర్గా పనిచేశారు. 2021 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భాజపా అభ్యర్థిపై 17 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.ఎమ్మెల్యేగా ఎన్నికైన మూడు నెలల్లోపే ఆమె రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.
Also Read:
లాస్య నందిత యాక్సిడెంట్‌కు ముందు జరిగింది ఇదే.. ఆమె ఎక్కడికి వెళ్లారంటే..? | Cantonment MLA Lasya Nanditha Car Accident Before What Happened ?
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం తెలంగాణలో విషాదాన్ని నింపింది. పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆమె మృతి వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఆమె.. కారు ప్రమాదం ఎలా జరిగింది..? తెల్లవారుజామనే ఆమె అక్కడికి వెళ్లారు అనే విషయాలు చాలా మందిని ఆలోచింపజేస్తున్నాయి. ఆమె సదాశివపేట వెళ్లారని ఒకరు.. బాసర నుంచి తిరుగొస్తుండగా ప్రమాదం జరిగిందని మరొకరు ఇలా రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
అయితే యాక్సిడెంట్‌కు ముందు ఆమె ఎక్కడికి వెళ్లిందనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. ప్రమాదానికి ముందు ఎమ్మెల్యే లాస్య నందిత సదాశివపేట దర్గాకు కుటుంబ సభ్యులతో వెళ్లినట్లు తెలిసింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూర్ నుంచి కోనాపూర్ వెళ్లే మార్గంలో ఉన్న మీస్కిన్ బాబా దర్గాకు ఆమె వెళ్లినట్లు తెలిసింది. ఈ దర్గాకు ఎమ్మెల్యే లాస్య నందిని అర్ధరాత్రి సుమారు 12.30 నిమిషాలకు వచ్చిందని ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. మొక్కులు తీర్చుకున్న అనంతరం ఉదయం 3-4 గంటల మధ్య దర్గా నుంచి వెళ్లిపోయిందని చెప్పారు.
‘రాత్రి వాళ్ల అక్కవాళ్లు ముందు వచ్చారు. మేడం వారి తర్వాత దర్గాకు వచ్చింది. కొబ్బరికాయలు కొట్టి దర్గా వద్ద ప్రార్ధనలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపు ఇక్కడే కూర్చొని ఆ తర్వాత వెళ్లిపోయారు. వచ్చిన వారులో ఓ నలుగురైదుగురు ఉన్నారు.’ అని దర్గా నిర్వహకురాలు మీడియాతో వెల్లడించారు.
ఇక యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల సీఎం రేవంత్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా అన్ని పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయస్సులోనే ఆమె అకాల మరణం చెందటం దురదుష్టకరమన్నారు. ఆమె అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆమె మృతదేహాం గాంధీ ఆసుపత్రిలో ఉండగా.. ఇంటికి తరలించాక సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు వెళ్లి నివాళులర్పించనున్నారు.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
Secunderabad Cantonment MLA Lasya Nanditha Died in A Road Accident at Patancheru-2024
Secunderabad Cantonment MLA Lasya Nanditha Died in A Road Accident at Patancheru-2024
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.