Penny Stocks: రూ.1 నుంచి రూ.381కి పెరిగిన షేరు.. Penny Stock Hazoor Multi Projects Ltd Shares Turns Multibagger In 5 Years Rs 1 Lakh Turns To Rs 3 Crore
Penny Stock: పెన్ని స్టాక్ కాస్త మల్టీబ్యాగర్ స్టాక్‌గా మారిపోయింది. రూ.1 స్థాయి నుంచి ఏకంగా రూ.381కి పెరిగింది. దీంతో లక్ష పెట్టుబడికి రూ.3.81 కోట్లు లాభాలు వచ్చాయి. ఈ స్టాక్ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉంది? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Penny Stock: భారతీయ స్టాక్ మార్కెట్లలో ఇటీవలి కాలంలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించిన కంపెనీల్లో హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (Hazoor Multi Projects Ltd) ఒకటి. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ స్టాక్ పెన్నీ స్టాక్ నుంచి మల్టీబ్యాగర్ గా మారిపోయింది. షేరు ధర రూ. 1 స్థాయి నుంచి ఏకంగా రూ. 381 కి చేరింది. 2019, మార్చి 29వ తేదీన రూ.1 వద్ద ఉన్న షేరు.. ఫిబ్రవరి 16, 2024 రోజున రూ. 380 కి చేరింది. ఈ ఐదేళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు ఏకంగా 38 వేల శాతం లాభాలు అందించింది. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఈ ఫలాలు అందాయని చెప్పవచ్చు. ఐదేళ్ల క్రితం రూ. 1 లక్ష పెట్టి షేర్లు కొనుగోలు చేసిన వారికి ఇప్పుడు ఆ విలువ రూ. 3.81 కోట్లకుపైగా అవుతుంది.
హుజూర్ మల్టీ ప్రాజెకట్స్ షేరు ధర హిస్టరీ..
ఈ కంపెనీ స్టాక్ గత వారం రోజుల్లో చూసుకుంటే వరుసగా రెండు సెషన్లలో అప్పర్ సర్క్యూట్ తాకింది. ఫిబ్రవరి 15, 16 వ తేదీల్లో 5 శాతానికిపైగా పెరిగి అప్పర్ సర్క్యూట్ కొట్టింది. అలాగే గత నెల రోజుల్లో చూసుకుంటే మాత్రం 2 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో హుజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ షేరు ధర రూ. 130 నుంచి రూ. 381 కి పెరిగింది. ఆరు నెలల్లో 190 శాతం పెరిగింది. గత ఏడాది కాలంలో చూసుకుంటే రూ. 99.60 నుంచి రూ. 381 కి పెరిగింది. అంటే ఏడాదిలో 280 శాతం రిటర్న్స్ అందించింది. ఇదే ప్రకారం.. గత 5 ఏళ్ల కాలంలో చూసుకుంటే మాత్రమం మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ తమ వాటాదారులకు ఏకంగా 38000 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
గత వారం చివరి ట్రేడింగ్ రోజు చూసుకుంటే హుజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ షేరు బీఎస్ఈలో ట్రేడ్ వాల్యూమ్ 1,43,600గా ఉంది. అలాగే ఆ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 387 కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 428.70 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ. 78.01 వద్ద ఉంది. బీఎస్ఈ వెబ్ సైట్ ప్రకారం చూసుకుంటే ఈ స్టాక్ ఎప్పుడూ ఎక్స్ బోనస్ లేదా ఎక్స్ స్ప్లిట్ ట్రేడింగ్ చేయలేదు. అంటే బోనస్ లు , స్టాక్ స్ప్లిట్లు ప్రకటించలేదు.
Dynacons systems and solutions limited
Multibagger Stocks: స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సంపదను ఎన్నో రెట్లు పెంచే స్టాక్స్ ఎన్నో ఉంటాయి. ఈ మల్టీబ్యాగర్ స్టాక్స్ కనిపెట్టడమే కాస్త కష్టం అని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా స్మాల్ క్యాప్ స్టాక్స్ భారీ లాభాల్ని ఇవ్వొచ్చు. లేదా తీవ్ర అనిశ్చితికి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. లార్జ్ క్యాప్ స్టాక్స్‌తో పోల్చినా ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇన్వెస్టర్లకు అదిరిపోయే రిటర్న్స్ ఇచ్చి ఆశ్చర్యానికి కూడా గురిచేస్తాయని చెప్పొచ్చు. అందుకే మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆయా స్టాక్స్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. ఇంకా ఆర్థిక నిపుణుల సలహా తీసుకొని పెట్టుబడులు పెడుతుండాలి. ఇన్వెస్టర్లకు అదిరిపోయే రిటర్న్స్ ఇచ్చిన ఒక స్టాక్ గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
అదే డైనాకాన్స్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ లిమిటెడ్ (Dynacons systems and solutions limited). ఇది ఇటీవలి కాలంలో ఇన్వెస్టర్లకు భారీగా సంపద సమకూర్చిందని చెప్పొచ్చు. ఈ కంపెనీ షేర్లు కొంతకాలంగా అప్‌వర్డ్ ట్రాజెక్టరీలోనే వెళ్లాయి. 2020 ఏప్రిల్‌లో రూ. 17.75 వద్ద ఉన్న షేరు ఇప్పుడు రూ. 760 లెవెల్స్‌లో ట్రేడవుతోంది. ఈ కాలంలో 4300 శాతం మేర షేరు పెరిగింది.
ఈ క్రమంలో అంటే 2020 ఏప్రిల్ సమయంలో ఈ స్టాక్‌లో రూ. 10 వేలు పెట్టుబడి పెట్టిన వారి సంపద రూ. 4.4 లక్షలకు చేరింది. 45 నెలల్లోనే ఇంత మొత్తంలో రిటర్న్స్ ఇవ్వడం విశేషం. ఈ సమయంలో 28 నెలలు స్టాక్ పాజిటివ్ రిటర్న్స్ అందించింది. అదే రూ. లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే ఈ సమయంలో రూ. 44 లక్షల లాభం వచ్చేది.
స్థిరంగా రిటర్న్స్ అందించే మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఇదొకటి అని చెప్పొచ్చు. 2020 క్యాలెండర్ సంవత్సరంలో ఈ స్టాక్ 162 శాతం పుంజుకుంది. 2021లో 151 శాతం పెరిగింది. 2022లో అయితే 112 శాతం రాణించింది. 2023లో 77 శాతం పెరిగింది. ఇప్పుడు 2024లోనూ రెండు నెలల్లోనే 20 శాతం వరకు పెరగడం విశేషం. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట విలువ రూ. 849 కాగా.. కనిష్ట విలువ రూ. 284.55 గా ఉంది. దీని మార్కెట్ విలువ రూ. 959.20 కోట్లుగా ఉంది. ఐదేళ్లలో చూస్తే 2500 శాతం వరకు స్టాక్ పుంజుకుంది.
డైనాకాన్స్ సిస్టమ్స్ కంపెనీ విషయానికి వస్తే ఇది ఐటీ రంగానికి చెందినది. ముంబై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇటీవల జనవరి 30న 2023 సంవత్సరానికి గానూ గ్లోబల్ లీడర్ హ్యులెట్ పకార్డ్ ఎంటర్‌ప్రైస్ (HPE).. ఈ కంపెనీకి బెస్ట్ న్యుటానిక్స్ పెర్ఫామెన్స్ అవార్డ్ అందించింది. ఇంకా ఈ కంపెనీ ఈ సంవత్సరంలో ఎన్నో ఆర్డర్లు అందుకుంది. Penny Stock Hazoor Multi Projects Ltd Shares Turns Multibagger In 5 Years Rs 1 Lakh Turns To Rs 3 Crore.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
Multibagger Shares-1000% profit in 3 years..! – Lsrallinonenews.com
Paytm Ecommerce Renamed-2024 | Paytm పేరు మారింద? కొత్త పేరు ఏంటి, వివరాలు
3 thoughts on “Penny Stocks: రూ.1 నుంచి రూ.381కి పెరిగిన షేరు..| Penny Stock Hazoor Multi Projects Ltd Shares Turns Multibagger In 5 Years Rs 1 Lakh Turns To Rs 3 Crore”