One Flyover And Three Underpasses On Hyderabad Bangalore National Highway | ఒక ఫ్లైఓవర్, మూడు అండర్‌పాస్‌లు.. ఇక ఆ రూట్‌లో నో యాక్సిడెంట్స్, ట్రాఫిక్ ఫ్రీ జర్నీ..!
హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై కొత్తగా ఓ ఫ్లైఓవర్, మూడు అండర్‌పాస్‌ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న 4 ప్రాంతాల్లో వాటిని నివారించనున్నారు. ఈ మేరకు టెండర్లు కూడా ఆహ్వానించారు.
ప్రధానాంశాలు:
- ఒక ఫ్లైఓవర్, మూడు అండర్‌పాస్‌లు
- హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై నిర్మాణం
- టెండర్లు ఆహ్వానించిన కేంద్రం
హైదరాబాద్ నగరంలో ఇప్పటికే కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి వచ్చాయి. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా.. ప్రభుత్వం వీటిని నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చింది. మరికొన్ని ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. ఇక హైదరాబాద్ వెలుపలి కూడా యాక్సిడెంట్లు జరిగే స్పాట్లపై కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న 4 ప్రాంతాల్లో వాటిని నివారించేందుకు చర్యలు చేపట్టింది. ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ఈ ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించింది.
ఈ జాతీయ రహదారిపై తెలంగాణలోని పరిధిలోని పెబ్బేరు, కనిమెట్ట, అమడబాకుల, తోమాలపల్లి వద్ద జంక్షన్లు ఉన్నాయి. ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు జాతీయ రహదారిని దాటడం ఒక్కటే మార్గం. ఈ నేపథ్యంలో ఇక్కడ తరచుగా యాక్సిడెంట్లు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. అవసరమైన చర్యలు చేపట్టాలని కొన్నేళ్లుగా ప్రజలు గగ్గోలు పెడుతున్నా.. టెంపరరీ చర్యలతోనే కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు నెట్టుకొచ్చింది.
ప్రస్తుతం ఇది 4 లైన్ రోడ్డు కాగా..
ప్రస్తుతం ఇది 4 లైన్ రోడ్డు కాగా.. వచ్చే ఏడాదిలో 6 వరుసలకు విస్తరించాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. అందుకు సంబంధించిన ప్రాథమిక కసరత్తును కూడా పూర్తి చేసింది. భారత్‌మాల పరియోజన-2లో ఈ రహదారి విస్తరణను చేపట్టాలని నిర్ణయించింది. ఆలోగానే దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు గాను అధ్యయనం చేసింది. ఈ మార్గంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న వనపర్తి జిల్లా పెబ్బేరు వద్ద కొత్తగా ఫ్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించింది. కొత్తకోట దాటిన తరవాత పెబ్బేరు పట్టణంలోకి వెళ్లేందుకు జాతీయ రహదారికి అనుసంధానంగా మార్గం ఒక్కటే అక్కడి ప్రజలకు ఆధారం. జాతీయ రహదారి మీదుగా వేగంగా వచ్చే వాహనాలతో ట్రాఫిక్ రద్దీతో పాటు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చేపట్టిన సర్వేలో ఫ్లైఓవర్ నిర్మాణం ఒక్కటే మార్గమని గుర్తించారు. అదే మార్గంలోని కనిమెట్ట, అమడబాకుల, తోమాలపల్లి వద్ద వెహికల్ అండర్‌పాస్ (VUP)లను నిర్మించనున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో ఈ జాతీయ రహదారి పరిధిలోనే ఆయా గ్రామాలు కూడా ఉన్నాయి. ఈ రోడ్డు గుండానే ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించాల్సి ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రహదారికి ఇరువైపుల ఉన్న మార్గాలను కలుపుతూ వీయూపీలను నిర్మించాలని నిర్ణయించారు.
ఫ్లైఓవర్, అండర్‌పాస్‌లను..
ఫ్లైఓవర్, అండర్‌పాస్‌లను నిర్మించేందుకు రూ.121 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మార్గాన్ని 6 వరుసలకు విస్తరించనున్న నేపథ్యంలో తదనుగుణంగా ఫ్లైఓవర్, అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 18 నెలల వ్యవధిలో ఈ నిర్మాణాలను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆయా నిర్మాణాల కోసం కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ టెండర్లు ఆహ్వానించింది. ఎంపికైన కాంట్రాక్టర్లు ఆయా నిర్మాణాలను అయిదేళ్లపాటు నిర్వహించాలనే నిబంధనను రూపొందించింది. టెండర్లు దాఖలు చేసేందుకు పిభ్రవరి 20వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు. కాగా, ఈ ఫ్లైఓవర్, అండర్‌పాసులతో రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
One Flyover And Three Underpasses On Hyderabad Bangalore National Highway.
One Flyover And Three Underpasses On Hyderabad Bangalore National Highway
Also Read:
1 thought on “One Flyover And Three Underpasses On Hyderabad Bangalore National Highway-2024 | ఒక ఫ్లైఓవర్, మూడు అండర్‌పాస్‌లు”