...

New Route Map For Hyderabad Metro Phase 2 | హైదరాబాద్‌లో నూతన మెట్రో రైలు రూట్ మ్యాప్ రెడీ.. 70కిలోమీటర్ల నిర్మాణంపై హెచ్ఎంఆర్ఎల్ నిర్ణయం

Written by lsrupdates.com

Published on:

New Route Map For Hyderabad Metro Phase 2 Expansion Finalized : హైదరాబాద్‌లో నూతన మెట్రో రైలు రూట్ మ్యాప్ రెడీ.. 70కిలోమీటర్ల నిర్మాణంపై హెచ్ఎంఆర్ఎల్ నిర్ణయం

Hyderabad Metro Route Map : హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) గుర్తించిన ప్రాంతాల్లో మెట్రో రైలు నెట్‌వర్క్ విస్తరణ కోసం కొత్త రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. 70కిలోమీటర్ల నిర్మాణంపై హెచ్ఎంఆర్ఎల్ నిర్ణయం తీసుకుంది.

New Route Map For Hyderabad Metro Phase 2: 

హైదరాబాద్ మహానగరంలో గుర్తించిన ప్రాంతాల్లో మెట్రో రైలు నెట్‌వర్క్ విస్తరణ కోసం నూతన మెట్రో రైలు రూట్ మ్యాప్ సిద్ధమైంది. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు హెచ్ఎమ్ఆర్ఎల్ (HMRL) మెట్రో రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ఫేజ్-2లో భాగంగా బస్టాండ్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న మెట్రోను మరింత విస్తరించనున్నారు. ప్రస్తుతం ఉన్న మెట్రో రైల్వే లైనును చాంద్రాయణగుట్ట వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడు నెల్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో డీపీఆర్ సిద్ధం చేస్తామని మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు.

New Route Map For Hyderabad Metro Phase 2 Expansion Finalized
      New Route Map For Hyderabad Metro Phase 2 Expansion Finalized

ఫేజ్-2 కింద మొత్తం 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో రైలు మార్గాలను నిర్మించేందుకు ఈ ప్రతిపాదనలు ఖరారయ్యాయి. కొత్త మెట్రో కారిడార్‌ల కోసం డీపీఆర్‌ల తయారీ శరవేగంగా జరుగుతోందని, మరో 3 నెలల్లో డీపీఆర్‌లు సిద్ధమవుతాయని ఎండీ, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నూతన మెట్రో కారిడర్ రూట్లను కూడా వెల్లడించారు.

కొత్త మెట్రో రైలు రూట్ మ్యాప్ ఇదే : ఎక్కడి నుంచి ఎక్కడి వరకంటే? :

ప్రస్తుతం, హైదరాబాద్ మెట్రో రైలు మియాపూర్, ఎల్‌బి నగర్, జెబిఎస్ స్టేషన్ నుంచి ఎంజిబిఎస్, నాగోల్ నుంచి రాయదుర్గం మధ్య మూడు కారిడార్‌లలో 69 కి.మీ మేర సర్వీసులను అందిస్తోంది. కొత్త ప్రతిపాదిత మెట్రో రైలు మార్గాలు హైదరాబాద్ నగరంలోని మెజారిటీ ప్రయాణికులకు మెట్రో రైలు సర్వీసులు అందుబాటులో ఉండేలా నగరంలోని నాలుగు మూలల నుంచి విమానాశ్రయాన్ని కలుపుతాయి.

ఇదీ రూట్ మ్యాప్..

New Route Map For Hyderabad Metro Phase 2 Expansion Finalized
  New Route Map For Hyderabad Metro Phase 2 Expansion Finalized
  • కారిడార్ 2: ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్ నుమా – 5.5 కిలోమీటర్లు.
  • కారిడార్ 2: ఫలక్ నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు – 1.5 కిలోమీటర్లు.
  • కారిడార్ 4: నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ స్టేషన్ వరకు, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు, మైలార్ దేవ్ పల్లి, పీ7 రోడ్డు మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ – 29 కిలోమీటర్లు.
  • కారిడార్ 4: మైలార్ దేవ్ పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్ లో ప్రతిపాదించిన
    హైకోర్టు ప్రాంగణం – 4 కిలోమీటర్లు.
  • కారిడార్ 5: రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్ (ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్) – 8 కిలోమీటర్లు.
  • కారిడార్ 6: మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్ ఈఎల్ మీదుగా పటాన్ చెరు – 14 కిలోమీటర్లు.
  • కారిడార్ 7: ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్ నగర్ – 8 కిలోమీటర్లు విస్తీర్ణంలో మెట్రోను నిర్మించనున్నారు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

Republic Day Celebrations Held At Nampally Public Garden In Hyderabad-2024 | తెలంగాణలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవం

TJS President Kodandaram Appointed as MLC In Governor Quota Telangana-2024| గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్ కు ఎమ్మెల్సీ పదవి !!!

Importance and History of Indian Republic Day in Telugu-2024

Indian Navy to set up its second VLF communication transmission station in Vikarabad Telangana | దేశంలోనే రెండో VLF స్టేషన్ మన దగ్గరే ఏర్పాటు

Exploring the Best Affiliate Marketing Strategies -2024 (lsrallinonenews.com)

ఎయిర్ ఇండియా, మహీంద్రా, జీఎంఆర్ తో ఎయిర్బస్ ఒప్పందాలు (lsrallinonenews.com)

Divy Ayodhya App: భక్తుల కోసం @ Ayodhya Ram Mandir-2024 (lsrallinonenews.com)

3 thoughts on “New Route Map For Hyderabad Metro Phase 2 | హైదరాబాద్‌లో నూతన మెట్రో రైలు రూట్ మ్యాప్ రెడీ.. 70కిలోమీటర్ల నిర్మాణంపై హెచ్ఎంఆర్ఎల్ నిర్ణయం”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.