...

New candidates for Lok Sabha elections-2024 in Telangana Congress | తెలంగాణ కాంగ్రెస్‌లో లోక్సభ ఎన్నికల బరిలోకి కొత్త అభ్యర్థులు

Written by lsrupdates.com

Published on:

New candidates for Lok Sabha elections-2024 in Telangana Congress | తెలంగాణ కాంగ్రెస్‌లో లోక్సభ ఎన్నికల బరిలోకి కొత్త అభ్యర్థులు

New candidates for Lok Sabha elections-2024 in Telangana Congress: తెలంగాణలో అధికారాన్ని దక్కించుకొన్న కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యం లభించని స్థానాలపై దృష్టిసారించి కొత్త అభ్యర్థులను తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆదిలాబాద్‌ నుంచి ఆదివాసీ వైద్యురాలిని మల్కాజిగిరికి ఓ వ్యాపారవేత్త పేరును పరిశీలించి రంగంలోకి దింపే యోచనలో హస్తం పార్టీ ఉన్నట్లు సమాచారం.

ప్రధానాంశాలు:

  • అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యం లభించని స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు
  • ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ వైద్యురాలిని రంగంలోకి దింపే యోచన
  • మల్కాజిగిరికి ఓ వ్యాపారవేత్త పేరు పరిశీలన
New candidates for Lok Sabha elections-2024 in Telangana Congress | తెలంగాణ కాంగ్రెస్‌లో లోక్సభ ఎన్నికల బరిలోకి కొత్త అభ్యర్థులు
New candidates for Lok Sabha elections-2024 in Telangana Congress | తెలంగాణ కాంగ్రెస్‌లో లోక్సభ ఎన్నికల బరిలోకి కొత్త అభ్యర్థులు

తెలంగాణాలో అధికారాన్ని దక్కించుకొన్న కాంగ్రెస్.. లోక్సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించినా కొన్ని లోక్సభ స్థానాల పరిధిలో విపక్ష భారాస, భాజపాల కంటే తక్కువ ఓట్లు లభించాయి. ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల ఇలాంటి ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలలో ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాదు మినహాయిస్తే మిగిలిన 16 స్థానాలకు గాను 9చోట్ల కాంగ్రెసు, 7చోట్ల భారాసకు ఆధిక్యం లభించింది. ఆధిక్యం లభించని చోట బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలన్న ఆలోచనతో కాంగ్రెస్ ఉంది.

New candidates for Lok Sabha elections-2024 in Telangana Congress

ఆదిలాబాద్ నుంచి..

ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ వర్గానికి చెందిన ఓ వైద్యురాలిని రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఆమె వైద్య సేవల ద్వారా గ్రామాల్లో మంచి పేరు గడించారని, ఆమె కుటుంబానికి కూడా మంచి పేరుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మరో టీచర్ పేరు కూడా పరిశీలనకు వచ్చినా వైద్యురాలివైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో భాజపా కంటే భారాసకు 17వేల ఓట్ల ఆధిక్యత వచ్చింది. కాంగ్రెస్కు ఈ రెండు పార్టీల కంటే రెండు లక్షల ఓట్లు తక్కువ వచ్చాయి. దీంతో ఆదిలాబాద్పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్లు తెలిసింది.

మల్కాజిగిరి నుంచి..

మల్కాజిగిరి లోక్సభ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను భారాస గెలుచుకొంది. రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ కంటే దానికి మూడున్నర లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఈ లోక్సభ స్థానం సీఎం రేవంత్రెడ్డి గత ఎన్నికల్లో గెలిచినది కావడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. వ్యాపారవేత్త అయిన ఓ మాజీ ఎమ్మెల్యేను రంగంలోకి దించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మరో జిల్లా నుంచి గతంలో వేరే పార్టీ తరపున గెలిచిన ఆయనకు వ్యాపారాలన్నీ గ్రేటర్ పరిధిలో ఉన్నాయి.

సికింద్రాబాద్..

సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక్క స్థానం కూడా లభించలేదు. మొత్తం ఓట్లలో లక్షా 80వేలు తక్కువగా వచ్చాయి. ఇక్కడి నుంచి అనిల్ కుమార్ యాదవ్ పేరు ఇప్పటివరకు పరిగణనలో ఉన్నా, మరో బలమైన అభ్యర్థి దొరికితే మార్చే అవకాశాలున్నాయి. నిజామాబాద్ లోక్ సభ సెగ్మెంట్ పరిధిలో మూడు పార్టీలకు ఓట్లు పోటాపోటీగా వచ్చినా కాంగ్రెస్ కంటే 9వేల ఓట్లు భారాసకు ఎక్కువగా వచ్చాయి. ఇక్కడ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు. చేవెళ్లలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన విశ్వేశ్వర్రెడ్డి ప్రస్తుతం భాజపాలో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చే అవకాశం లేదని భావిస్తున్న కాంగ్రెస్.. మరో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధిని చేర్చుకొని అక్కడి నుంచి పోటీ చేయించే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది.

పోటీలో సోనియా లేదా ప్రియాంక!

గాంధీ కుటుంబం నుంచి సోనియా, ప్రియాంక గాంధీలలో ఒకరిని ఖమ్మం లేదా భువనగిరి నుంచి పోటీ చేయించేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. దక్షిణాది నుంచి పోటీకి వారు ఆసక్తి చూపకపోతే కొత్తవారిని ఎంపికచేసే అవకాశం ఉంది. నల్గొండ నుంచి జానారెడ్డి లేదా ఆయన కుమారుడు, మహబూబాబాద్‌ నుంచి బలరాంనాయక్‌, పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే వివేక్‌ కుమారుడు వంశీ, జహీరాబాద్‌ నుంచి సురేశ్‌షెట్కార్‌కు ఎక్కువ అవకాశం ఉంది. నల్గొండ టికెట్‌ ఇస్తామని గతంలో పటేల్‌ రమేశ్‌ రెడ్డికి హామీ ఇచ్చినందున ఆయనకి ప్రత్యామ్నాయం ఏం చూపుతారో చూడాల్సిఉంది. ముందుగా రాజ్యసభ ఎన్నికలు రానున్నందున నల్గొండ విషయంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు.

లోక్ సభ స్థానాలపై కాంగ్రెస్​ గురి : మెదక్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేరు వినిపిస్తోంది. గత ఎన్నికల్లో పటాన్‌చెరు టికెట్‌ ఇచ్చి చివర్లో తప్పించిన నీలం మధు ముదిరాజ్‌ పేరును కొందరు ప్రతిపాదించినట్లు తెలిసింది. కరీంనగర్‌ నుంచి హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నా మరికొందరి పేర్లు పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌ నుంచి వంశీచంద్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లేనని చెబుతున్నారు. ఫార్మాకంపెనీకి చెందిన జీవన్‌రెడ్డి పేరు వినిపిస్తున్నా, ఆయనను మరో రకంగా వినియోగించుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నాగర్‌కర్నూల్‌ నుంచి మల్లురవి లేదా సంపత్‌కుమార్‌కు అవకాశాలున్నాయి. వరంగల్‌ స్థానానికి పలువురు పోటీపడుతున్నా ఇంకా ఎవరివైపు మొగ్గు చూపలేదని తెలుస్తోంది.

లోక్​సభ ఎన్నికల అభ్యర్థులపై ఏఐసీసీదే నిర్ణయం

తెలంగాణలో రాబోయే లోక్​ సభ ఎన్నికల అభ్యర్ధులను నిర్ణయించే సర్వాధికారాలను హైకమాండ్‌కు అప్పగిస్తూ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ ఏకగ్రీవంగా తీర్మాణం చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే కాంగ్రెస్‌ హామీలు అమలవుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్​ సభ సీట్లు గెలవాల్సి ఉందని, ఇందుకు అందరూ కలిసి పని చేయాల్సి ఉందని పిలుపునిచ్చారు.

New candidates for Lok Sabha elections-2024 in Telangana Congress | తెలంగాణ కాంగ్రెస్‌లో లోక్సభ ఎన్నికల బరిలోకి కొత్త అభ్యర్థులు
New candidates for Lok Sabha elections-2024 in Telangana Congress | తెలంగాణ కాంగ్రెస్‌లో లోక్సభ ఎన్నికల బరిలోకి కొత్త అభ్యర్థులు

ఇవాళ గాంధీభవన్​లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ(PEC) సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి దీపాదాస్‌ మున్షీతోపాటు ఏఐసీసీ(AICC) కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీఖాన్, విష్ణు నాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్స్, ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

CM Revanth Reddy on Lok Sabha Electionsఈ సమావేశంలో లోక్​ సభ అభ్యర్ధులతో పాటు రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై కూడా చర్చించినట్లు రేవంత్‌ రెడ్డి వివరించారు. ఆశావహుల నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ వేసినట్లు తెలిపారు. లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కలిగిన ఆశావహులు ఫిబ్రవరి 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. జనరల్‌ స్థానాలకు దరఖాస్తు ఫీజు రూ.50,000 కాగా, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ. 25 వేలుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

రాజకీయ కుట్రతోనే ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం వాయిదా వేసి కుట్రకు తెరలేపారని సీఎం రేవంత్​రెడ్డి ఆరోపించారు. ఫిబ్రవరి 2వ తేదీన ఇంద్రవెల్లి సభ నుంచి లోక్​సభ ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌-బీజేపీ ఒకటేనని మాట్లాడడంలో అర్ధం లేదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీతో కేసీఆర్‌ చీకటి చర్చలు జరుపుతున్నారని ఆరోపించారు.

New candidates for Lok Sabha elections-2024 in Telangana Congress

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

ఎమ్మెల్యేగా KCR ప్రమాణస్వీకారం.. డేట్ ఫిక్స్, అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ-2024

Latest IBM Recruitment-2024 for Technical Support Engineer | టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ కోసం తాజా IBM రిక్రూట్‌మెంట్-2024

AP DME has Released 424 Assistant Professors Posts-2024 | ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు

AP People prepare to defeat YSRCP in 2024 | వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధం

Protein Deficiency-2024: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. ? ప్రోటీన్ లోపం ఉన్నట్లే!

1 thought on “New candidates for Lok Sabha elections-2024 in Telangana Congress | తెలంగాణ కాంగ్రెస్‌లో లోక్సభ ఎన్నికల బరిలోకి కొత్త అభ్యర్థులు”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.