Penny Multibagger Stocks of GG Engineering & Akshar Spintex Ltd

Written by lsrupdates.com

Published on:

Penny Multibagger Stocks of GG Engineering & Akshar Spintex Ltd

Penny Multibagger Stocks : 2 రూపాయల షేరు.. వరుసగా ఆరో సెషన్ అప్పర్‌సర్క్యూట్.. దీంతో కాసుల పంటే! Small cap stock GG Engineering Ltd circuit to circuit stock hits upper circuit on sixth straight session

Penny Multibagger Stocks: భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. గత 3 సెషన్లుగా ఆరంభంలో లాభాల్లో ప్రారంభమై ఆఖర్లో భారీ నష్టాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ కూడా నష్టాల్లోనే ఉంది. అయినప్పటికీ ఒక స్మాల్ క్యాప్ స్టాక్ వరుసగా ఆరో సెషన్‌లో అప్పర్‌సర్క్యూట్ కొట్టింది. దీని గురించి తెలుసుకుందాం.

Stock Market Today: కొత్త ఏడాదిలో దేశీయ స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఒకరోజు భారీ లాభాలు.. మళ్లీ భారీ నష్టాలు ఇలాగే సాగుతోంది. గత 3 రోజులుగా మాత్రం ఇంకా తీవ్ర ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. గతేడాది ఆఖర్లో రికార్డు గరిష్టాలకు సూచీలు చేరగా.. చాలా స్టా్క్స్ జీవన కాల గరిష్టాల్ని నమోదు చేశాయి. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. దీంతో అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో.. షేర్లు పడిపోతున్నాయి. గురువారం సెషన్‌లో కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 600 పాయింట్లకుపైగా నష్టంతో 70 వేల 400 మార్కు వద్ద ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 170 పాయింట్లు కోల్పోయి 21 వేల 280 వద్ద ట్రేడవుతోంది.

Penny Multibagger Stocks of GG Engineering & Akshar Spintex Ltd
                 Penny Multibagger Stocks of GG Engineering & Akshar Spintex Ltd

మార్కెట్లు ఇలా వరుసగా నష్టపోతున్నా కూడా ఒక స్మాల్ క్యాప్ స్టాక్ మాత్రం పరుగులు పెడుతోంది. వరుసగా ఆరు సెషన్లుగా అప్పర్‌సర్క్యూట్ కొడుతూనే ఉంది. అదే G G ఇంజినీరింగ్ లిమిటెడ్(GG Engineering Ltd) స్టాక్. ఇది దలాల్ స్ట్రీట్‌లో ఒక సర్క్యూట్ టు సర్క్యూట్ స్టాక్‌ అని చెప్పొచ్చు. ఇది ఇంకా రూ. 5 కంటే తక్కువ విలువైన షేరు కూడా. గత 6 సెషన్లలోనూ ఈ స్టాక్‌లో బుల్ జోరు కొనసాగుతోంది.

జనవరి 18న 5 శాతం అప్పర్‌సర్క్యూట్ కొట్టిన ఈ స్టాక్.. తర్వాత వరుసగా జనవరి 19, జనవరి 20, జనవరి 22, జనవరి 23, జనవరి 24 ల్లో కూడా 5 శాతం చొప్పున పెరిగింది. ఇవాళ కూడా 5 శాతం ఎగబాకి ప్రస్తుతం రూ. 2.58 కు చేరింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట విలువ రూ. 2.77 కాగా.. కనిష్ట విలువ రూ. 0.74 గా ఉంది. దీని మార్కెట్ విలువ రూ. 301.73 కోట్లుగా ఉంది.

ఇక భారత స్టాక్ మార్కెట్ నుంచి వచ్చిన పెన్నీ మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఇదొకటి అని చెప్పొచ్చు. గత 6 నెలల వ్యవధిలోనే ఈ స్టాక్ ఏకంగా 116 శాతం పుంజుకుంది. దీంతో 6 నెలల కిందట రూ. లక్ష పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు మరో లక్షకుపైగా లాభం వచ్చింది. అయితే మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. అప్పుడు రిస్క్ పెద్దగా లేకుండానే లాభాలు అందుకోవచ్చు.

Also Read: NALCO, Bhubaneswar Specialist and EO2 Grade Posts-2023 (lsrallinonenews.com)

Whatsapp Latest Features-2024 | ఇకపై వాట్సాప్‌లో బ్లూటూత్ ఫీచర్.. ఎలాంటి ఫైల్స్ అయినా వేగంగా షేర్ చేసుకోవచ్చు!!!

 

Penny Stock : బోనస్ షేర్లకు రికార్డు తేదీని సవరించిన రూ. 5 లోపు ధర గల పెన్నీ స్టాక్.. ప్రతి ఐదు షేర్లకు ఒకటి ఉచితం.

Penny Multibagger Stocks of GG Engineering  Ltd & Akshar Spintex Ltd also Mid cap NBFC stock approves bonus shares to investors.

టెక్స్‌టైల్ రంగానికి చెందిన స్మాల్ క్యాప్ స్టాక్ అక్షర్ స్పింటెక్స్ లిమిటెడ్ (Akshar Spintex Ltd)షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్ఈ లో అక్షర్ స్పింటెక్స్(Akshar Spintex) షేర్ల చివరి ట్రేడింగ్ ధర రూ.4.68 గా ఉంది. ఈ స్టాక్ ఈ ఏడాది ఇప్పటివరకు 12 శాతం పెరిగింది. అయితే గత సవంత్సరంలో చూసుకంటే మాత్రం 15 శాతం క్షీణత నమోదు చేసింది.

బోనస్ షేర్లకు రికార్డు తేదీని సవరించిన రూ. 5 లోపు ధర గల పెన్నీ స్టాక్
                   బోనస్ షేర్లకు రికార్డు తేదీని సవరించిన రూ. 5 లోపు ధర గల పెన్నీ స్టాక్

1:5 బోనస్ షేర్లు రికార్డు తేదీలో మార్పు..

అక్షర్ స్పింటెక్స్(Akshar Spintex) 1:5 నిష్పత్తిలో బోనస్ షేర్ జారీ కోసం రికార్డ్ తేదీని సవరించింది. జనవరి 23 నాటి కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం బోనస్ షేర్ల జారీకి ఫిబ్రవరి 8, 2024, గురువారం రోజును రికార్డు తేదీగా ఖరారు చేసింది. అంటే ఆ తేదీ నాటికి ఈ కంపెనీ షేర్లు కలిగి ఉన్న షేర్ హోల్డర్లకు ప్రతి ఐదు షేర్లకు ఒక షేరును బోనస్ గా ఉచితంగా పొందుతారు.

ఇంటర్నేషనల్ ఆర్డర్

కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్లయింట్ ద్వారా భారీ ఆర్డర్ పొందింది. ఈ ఆర్డర్ ద్వారా వివిధ ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్‌లకు అధి నాణ్యత నూలు, ప్రతిష్టాత్మక ఫ్యాషన్ లేబుల్‌లతో లను అందించాల్సి ఉంది. ఈ గణనీయమైన అంతర్జాతీయ ఆర్డర్ మొత్తం విలువ రూ. 171.17 కోట్లు అని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయ టెక్స్‌టైల్ మార్కెట్‌లో అక్షర్ స్పింటెక్స్ లిమిటెడ్ (Akshar Spintex Ltd) ఉత్పత్తుల నాణ్యత, విశ్వసనీయత, పోటీతత్వానికి ఇది నిదర్శనమని కంపెనీ పేర్కొంది.

స్టాక్ ఔట్‌లుక్ & రిటర్న్:

బీఎస్ఈలో అక్షర్ స్పింటెక్స్(Akshar Spintex Ltd) షేర్ 52 వారాల గరిష్ట ధర రూ. 8.40. 52 వారాల కనిష్ట ధర వరుసగా రూ. 3.86 గా ఉంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 117.00 కోట్లుగా ఉంది. అక్షర్ స్పింటెక్స్(Akshar Spintex ) షేర్లు గత 3 నెలల్లో 34 శాతం పడిపోయాయి. గత 6 నెలల్లో 36 శాతం క్షీణించాయి. గత రెండు సంవత్సరాలలో 24 శాతం రాబడిని ఇచ్చాయి. గత 3 సంవత్సరాలలో 277 శాతం పెరిగాయి. గత 5 సంవత్సరాలలో అక్షర్ స్పింటెక్స్(Akshar Spintex ) స్టాక్ 188 శాతం పెరిగింది.

Penny Multibagger Stocks of GG Engineering & Akshar Spintex Ltd-2024

Penny Multibagger Stocks of GG Engineering & Akshar Spintex Ltd

Penny Multibagger Stocks of GG Engineering & Akshar Spintex Ltd- 2024

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

Indian Navy to set up its second VLF communication transmission station in Vikarabad Telangana | దేశంలోనే రెండో VLF స్టేషన్ మన దగ్గరే ఏర్పాటు

Hyderabad Police Rude Behavior with ABVP woman leader | ABVP నాయకురాలిని బైక్‌పై వెంబడించి.. జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన పోలీసులు

Nova Agritech IPO Details with GMP | నోవా అగ్రిటెక్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన

TSRTC Apprenticeship Notification-2024 | డిగ్రీతో 150 ఖాళీల భర్తీకి RTC నోటిఫికేషన్‌ విడుదల.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు.. రీజియన్ల వారీగా ఖాళీలివే

Jio, Reliance Retail to steal the show in RIL’s report card (lsrallinonenews.com)

Naa Saami Ranga’ movie review-2024 – Lsrallinonenews.com

Saindhav Movie Review-2024 An action entertainer capsized by sentimentality. – Lsrallinonenews.com

Hanuman movie review: This homegrown superhero film (lsrallinonenews.com)

RRB ALP Recruitment 2024 Notification, Eligibility, Salary (lsrallinonenews.com)

 

1 thought on “Penny Multibagger Stocks of GG Engineering & Akshar Spintex Ltd”

Leave a Comment