...

Mahalakshmi Scheme Gas Cylinder Selection Procedure In Telangana | రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఎంపిక విధానం ఇదే..!

Written by lsrupdates.com

Published on:

Mahalakshmi Scheme Gas Cylinder Selection Procedure In Telangana | రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఎంపిక విధానం ఇదే

Mahalakshmi Scheme Gas Cylinder Selection Procedure In Telangana: మాహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు గుర్తించనున్నారు. అర్హులను గుర్తించి ప్రభుత్వం సూచించిన ప్రత్యేక మెుబైల్ యాప్‌లో వివరాలు నమోదు చేయనున్నారు.

ప్రధానాంశాలు:

  • రూ.500కే గ్యాస్ సిలిండర్
  • ప్రభుత్వం కీలక నిర్ణయం
  • అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలకు ఎంపిక బాధ్యతలు

కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలకు కసరత్తు ప్రారంభిస్తోంది. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేయగా.. రూ. 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పథకాల అమలుకు తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి వీటిని అసెంబ్లీలో ప్రకటించనున్నారు. రూ.500కు వంటగ్యాస్‌ సిలిండర్‌ అందజేత పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

ప్రజాపాలన కార్యక్రమంలో..

ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తల ద్వారా పరిశీలించి అర్హులను ఎంపిక చేయనున్నారు. ఆ తర్వాత అర్హుల వివరాలను ప్రత్యేక మొబైల్‌ యాప్‌లో నమోదు చేయించాలని నిర్ణయించింది. ప్రతి కార్యకర్త 30 దరఖాస్తులను ఇంటింటికీ తీసుకువెళ్లి రేషన్‌కార్డు, ఎల్‌పీజీ కంపెనీ పేరు, వినియోగదారు నంబర్‌, పాస్‌బుక్‌ నెంబర్, డెలివరీ రసీదు నంబరు పరిశీలిస్తారు. అర్హతలున్నాయనుకుంటే తెల్ల రేషన్‌కార్డు, ఎల్‌పీజీ కంపెనీ పేరు, వినియోగదారు సంఖ్య యాప్‌లో నమోదు చేస్తారు. ఆయా గ్రామాల్లో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహన ఉండటంతో అర్హుల ఎంపిక ప్రక్రియను వారికి అప్పగించారు.

ప్రత్యేక మొబైల్‌ యాప్‌..

ఈ మేరకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ నేడు అన్ని జిల్లాలకు పంపిస్తారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండలస్థాయిలో ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, జిల్లాస్థాయిలో కలెక్టర్లు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తారు. రాష్ట్రస్థాయిలో రెవెన్యూ కార్యదర్శి, పౌరసరఫరాలు, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ పరిశీలిస్తారు. పరిశీలన అర్హుల ఎంపిక ద్వారా రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయనున్నారు.

రూ.500కే గ్యాస్‌ అమలుకు మూడు ప్రతిపాదనలు.. విధివిధానాల తయారీపై కసరత్తు 

ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విధి విధానాల రూపకల్పనపై పౌరసరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆ శాఖ ఉన్నతాధికారులు ఆయా గ్యాస్‌ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విధి విధానాల రూపకల్పనపై పౌరసరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆ శాఖ ఉన్నతాధికారులు ఆయా గ్యాస్‌ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలన్న అంశంపై చర్చించారు. అమలులో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించినట్టు తెలిసింది. చర్చల అనంతరం ప్రధానంగా 3 ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించి ప్రభుత్వ ఆదేశాల మేరకు అమలు చేయనున్నారు. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతుండటంతో అనంతరం దీనిపై ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నదని తెలిసింది.

Mahalakshmi Scheme Gas Cylinder Selection Procedure In Telangana | రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఎంపిక విధానం ఇదే
         Mahalakshmi Scheme Gas Cylinder Selection Procedure In Telangana | రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఎంపిక విధానం ఇదే

మూడు ప్రతిపాదనలు సిద్ధం

రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకం అమలుకు సంబంధించి అధికారులు మూడు ప్రతిపాదనలను తయారు చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఒక్కో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.955గా ఉన్నది. ఈ పథకంలో భాగంగా రూ.500 వినియోగదారుడు భరిస్తుండగా మిగిలిన రూ.455 సబ్సిడీని ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ సబ్సిడీ మొత్తాన్ని ఎవరికి అందించాలనే అంశంపై మూడు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇందులో ఒకటి గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాలని, మరొకటి గ్యాస్‌ కంపెనీలకే ఇవ్వాలని ప్రతిపాదించగా మూడోది వినియోగదారులకే నేరుగా ఇవ్వాలని ప్రతిపాదించినట్టు సమాచారం.

రాజస్థాన్‌ మాదిరిగా ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్లు, కంపెనీలు సబ్సిడీ అమౌంట్‌ను తీసుకొనేందుకు అంగీకరించకపోవచ్చని తెలిసింది. ఇప్పటికే ఈ విషయాన్ని ఇటీవల జరిగిన సమావేశంలో కంపెనీల ప్రతినిధులు, సివిల్‌ సైప్లె అధికారులు వెల్లడించినట్టు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో ఎన్ని గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి? వారిలో ఎంత మంది రేషన్‌కార్డు కలిగి ఉన్నారు? వినియోగదారులవారీగా వివరాలను అందించాల్సిందిగా గ్యాస్‌ కంపెనీలను పౌరసరఫరాల అధికారులు కోరగా ఇందుకు వారు నిరాకరించినట్టు తెలిసింది. కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలని, అప్పుడే సమాచారాన్ని అందించగలమని చెప్పినట్టు తెలిసింది.

64 లక్షల కుటుంబాలకే అర్హత!

500కే గ్యాస్‌ సిలిండర్‌ అమలు కోసం తెల్ల రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 90 లక్షల తెల్ల రేషన్‌కార్డులున్నాయి. సుమారు 1.24 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. 90 లక్షల తెల్ల రేషన్‌కార్డుల్లో సుమారు 64 లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నట్టు పౌరసరఫరాల శాఖ గుర్తించింది. మిగిలిన సుమారు 26 లక్షల కార్డులకు గ్యాస్‌ కనెక్షన్‌ లేదు. ఈ లెక్కన 64 లక్షల కార్డుదారులకు మాత్రమే 500కు గ్యాస్‌ కనెక్షన్‌ వర్తించే అవకాశం ఉన్నది. 64 లక్షల కార్డులకు రూ.1,747 కోట్ల ఆర్థిక భారం మాత్రమే ప్రభుత్వంపై పడనున్నది.

Mahalakshmi Scheme Gas Cylinder Selection Procedure In Telangana.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

Telangana Government Decided To Provide Digital Health Cards To Everyone Above 18 Years Of Age | హెల్త్ కార్డు… డిజిటల్ రికార్డు!

India Bounce Back With Win Over England Jump To Second Place | వైజాగ్ టెస్టులో విజయంతో WTC పాయింట్ల పట్టికలో దూసుకొచ్చిన భారత్‌-2024

Can Medigadda barrage withstand the flood? | మేడిగడ్డ బ్యారేజీ.. వరదను తట్టుకోగలదా? 2024

Can Medigadda barrage withstand the flood? | మేడిగడ్డ బ్యారేజీ.. వరదను తట్టుకోగలదా? 2024

CM Revanth Reddy Tweet About Changing The Name Of TS To TG-2024 | అందుకే TSను TGగా మార్చాం

Mahalakshmi Scheme Gas Cylinder Selection Procedure In Telangana.

Mahalakshmi Scheme Gas Cylinder Selection Procedure In Telangana.

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.