...

Loksabha Polls on April 16th-2024: ఏప్రిల్ 16 వ తేదీన లోక్‌సభ ఎన్నికలు.. అధికారులకు సర్య్కులర్.. ఈసీ ఏమందంటే?

Written by lsrupdates.com

Published on:

Loksabha Polls on April 16th-2024 after viral note to officers a clarification.

Loksabha Polls: దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు అనే చర్చ మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకున్నా దేశ వ్యాప్తంగా జాతీయ పార్టీలతోపాటు ప్రాంతీయ పార్టీలు కూడా సన్నద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక సర్య్కులర్ వెలుగులోకి రావడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఏప్రిల్ 16 వ తేదీన దేశంలో ఎన్నికలు జరగనున్నట్లు అందులో ఉండటం సంచలనం అయింది. అయితే దీనిపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.

Loksabha Polls on April 16th-2024:ఏప్రిల్ 16 వ తేదీన లోక్‌సభ ఎన్నికలు జరగనున్నట్లు జారీ అయిన సర్క్యులర్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనంగా మారింది. సార్వత్రిక ఎన్నికలు అదే రోజు జరుగుతాయని దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని కింది స్థాయి అధికారులకు ఇచ్చినట్లు ఉన్న ఆ సర్క్యులర్ బయటికి రావడంతో దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. ఆ సర్క్యులర్‌పై క్లారిటీ ఇచ్చేసింది.

Loksabha-Polls-on-April-2024.
                 Loksabha-Polls-on-April-2024.

లోక్‌సభ ఎన్నికలపై ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి జారీ చేసిన ఓ సర్క్యులర్‌ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌ 16 వ తేదీన జరగవచ్చని.. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలంటూ సర్క్యులర్‌లో అధికారులను ఢిల్లీ సీఈఓ ఆదేశించారు. దీంతో సార్వత్రిక ఎన్నికలు ఆరోజే జరుగుతాయని దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఆ సర్క్యులర్‌పై పూర్తి వివరాలు అందించాలని ఢిల్లీ సీఈవోకు విజ్ఞప్తులు వెల్లువెత్తగా.. ఎట్టకేలకు ఢిల్లీ ఎన్నికల సంఘం ట్విటర్‌లో స్పందించింది. ఎన్నికల సంఘం ప్రణాళిక ప్రకారం పోలింగ్‌ ఏర్పాట్లలో నిమగ్నమయ్యేందుకు ఈ తేదీని రిఫరెన్స్‌గా మాత్రమే పేర్కొన్నట్లు స్పష్టం చేసింది

కేంద్ర ఎన్నికల సంఘం ప్రణాళికల ప్రకారం పోలింగ్‌ ఏర్పాట్లు చేసుకునేందుకు జిల్లా రిటర్నింగ్‌ అధికారులకు రిఫరెన్స్‌ కోసమే ఆ తేదీని సర్క్యులర్‌లో పేర్కొన్నట్టు స్పష్టం చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సరైన సమయంలో విడుదల చేస్తుందని ఢిల్లీ సీఈవో కార్యాలయం తెలిపింది. ఈ వివరణతో ఎన్నికల తేదీకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న చర్చకు ముగింపు పలుకుతుందని ఢిల్లీ ఎన్నికల సంఘం ఆశాభావం వ్యక్తం చేసింది.

గత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను పరిశీలిస్తే.. 2019 మార్చి 10 వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏప్రిల్‌ 11 వ తేదీన మొదలైన లోక్‌సభ పోలింగ్‌ 7 దశల్లో జరిగింది. 2019 మే 23 వ తేదీన ఓట్ల లెక్కింపు.

Loksabha Polls on April 16th-2024 after viral note to officers a clarification.

Loksabha Polls on April 16th-2024 after viral note to officers a clarification.

Also Read: History of Ayodhya ram mandir in Telugu-2024| తెలియని కొన్ని (lsrupdates.com)

Stock Market Rally-స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీ -Jan-2024 (lsrupdates.com)

Zee Entertainment share price down 30 Percentage after Sony? (lsrupdates.com)

Brisk Technovision IPO Details Date, Price, Allotment, GMP- 2024

Euphoria Infotech India Limited IPO Details-2024

Zee Entertainment shares down 25% after Sony calls off merger

2 thoughts on “Loksabha Polls on April 16th-2024: ఏప్రిల్ 16 వ తేదీన లోక్‌సభ ఎన్నికలు.. అధికారులకు సర్య్కులర్.. ఈసీ ఏమందంటే?”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.