...

Latest Medaram Jatara updates on 19/02/2024 | మేడారం జాతర న్యూస్ 19/02/2024

Written by lsrupdates.com

Published on:

Latest Medaram Jatara updates on 19/02/2024 | మేడారం జాతర న్యూస్ 19/02/2024

ఆసియా ఖండంలోనే అత్యంత విశేషంగా జరిగే గిరిజన జాతర మేడారం జాతర. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వద్ద అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

మేడారం జాతరలో అలా చేస్తే అమ్మవారికి మెుక్కు చెల్లదు: ప్రధాన పూజరి | Head Priest of Sammakka Said That Halal Is Not Allowed at Medaram Jatara

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వద్ద అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అమ్మవార్ల ప్రధాన పూజారి సిద్దబోయిన అరుణ్ కీలక కామెంట్స్ చేసారు.

ముఖ్యాంశాలు:

  • మేడారంలో హలాల్ నిషిద్ధం
  • అలాంటివి చేస్తే మెుక్కు చెల్లదు
  • సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రధాన పూజారి

Latest Medaram Jatara updates on 19/02/2024: తెలంగాణ కుంభమేళా, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. ఈనెల 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరగనుంది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది వస్తారు. భక్తులు సమ్మక్క, సారలమ్మలకు మెుక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణ సీఎం, గవర్నర్ సహా ఇతర ముఖ్యులు వస్తుండటంతో అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుండగా.. కేంద్ర రైల్వేశాఖ వివిధ ప్రాంతాల నుంచి స్పెషల్ ట్రైన్లు కూడా ఏర్పాటు చేసింది.

Latest Medaram Jatara updates on 19/02/2024 | మేడారం జాతర న్యూస్ 19/02/2024
                                                           Latest Medaram Jatara updates on 19/02/2024 | మేడారం జాతర న్యూస్ 19/02/2024

ఇక జాతరలో చాలా మంది భక్తులు ఎత్తుబెల్లం మెుక్కులు చెల్లించుకుంటారు. తామ కోరిన కోరికలు తీరినందుకు అమ్మవారికి మెుక్కులు సమర్పించుకుంటారు. అలాగే కోళ్లు, మేకలు వంటివి అమ్మవార్లకు బలిస్తారు. వాటిని బలి ఇచ్చిన అనంతరం అక్కడే విందు ఆరగించి తిరుగు ప్రయాణమవుతారు. అయితే కొందరు అమ్మవార్లకు బలిచ్చే కోళ్లు, మేకలను హలాల్ చేయిస్తారు. హలాల్ చేసిన మాంసాన్ని తినే కొందరు ఈ విధంగా హలాల్ చేయిస్తారు.

హలాల్ విషయంలో..

ఈ నేపథ్యంలో హలాల్ విషయంలో సమ్మక్క, సారలమ్మ ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ కీలక కామెంట్స్ చేశారు. మేడారం మహా జాతరలో ఎవరు హలాల్ చేయకూడదని.. హలాల్ చేయడం నిషేధం అని అన్నారు. మేడారం జాతరలో హలాల్ చేస్తే అమ్మవారికి మెుక్కు చెల్లదు అని పేర్కొన్నారు. గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు హలాల్ చేయడం విరుద్ధమని సిద్దబోయిన అరుణ్ తెలిపారు.
‘ఆదివాసీ సంప్రదాయాల్లో హలాల్ అనేది నిషిద్ధం. దయచేసి హలాల్ చేయకండి. అలాంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి మేడారం రావొద్దు. పూజారుల మనోభావాలను, ఆదివాసీ సంప్రదాయాలను దెబ్బతీయెుద్దు.’ అని పూజారి అరుణ్ కోరారు.

మేడారం జాతరకు వచ్చే VIPలకు మంత్రి పొంగులేటి కీలక సూచన | Minister Ponguleti Srinivas Reddy Important Instructions For VIP Devotees Traveling To Medaram Jatara 

Latest Medaram Jatara updates on 19/02/2024: తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతరకు సర్వం సిద్ధమైంది. ఈనెల 21 నుంచి 24 వరకు జరిగే జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడారం వచ్చేందుకు ప్రత్యేకంగా బస్సులు, ట్రైన్లతో పాటు హెలికాప్టర్ ప్రయాణ సదుపాయాన్ని కూడా కల్పించారు. మేడారం జాతర ఏర్పాట్లను ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరో మంత్రి సీతక్కతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పొంగులేటి జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా.. అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు.

Latest Medaram Jatara updates on 19/02/2024 | మేడారం జాతర న్యూస్ 19/02/2024
                                                     Latest Medaram Jatara updates on 19/02/2024 | మేడారం జాతర న్యూస్ 19/02/2024

స్పెషల్ బస్సులను

మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల నుంచి సరిపడా స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 17 కోట్ల మంది మహిళలు జీరో టికెట్‌తో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని.. మేడారం జాతరకు వచ్చే మహిళలకు కూడా బస్సుల్లో ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. జాతర జరుగుతున్న ప్రాంతంలో చెత్తా చెదారం పేరుకుపోకుండా ఎక్కువ మంది పారిశుధ్య కార్మికులను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. మేడారం జాతరలో పర్యవేక్షణ కోసం ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులను నియమించామని చెప్పారు.

జాతరకు వచ్చే వీఐపీలకు

ఈ క్రమంలో జాతరకు వచ్చే వీఐపీలకు మంత్రి పొంగులేటి కీలక సూచన చేశారు. తమ వాహనాలను ములుగులోనే పార్క్ చేసి ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సుల్లో మేడారానికి రావాలని పిలుపునిచ్చారు. తద్వారా ట్రాఫిక్‌ సమస్య తలెత్తదని.. వీఐపీలు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకునే అవకాశం ఉండదని అన్నారు. భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే అధికారుల దృష్టి తీసుకురావాలని తెలిపారు. రానున్న నాలుగు రోజుల్లో దాదాపు 2 కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు వస్తారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. జాతర సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తూ బడ్జెట్‌ను కేటాయిస్తున్నామని పొంగులేటి స్పష్టం చేసారు.

మేడారం జాతరకోసం పోలీసుల ప్రత్యేక మొబైల్ యాప్ | Police Department Mobile App On Medaram Jatara Facilities and Full Information Available…

Latest Medaram Jatara updates on 19/02/2024: ఈ సారి మేడారం జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt). ప్రజలకు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేయాలన్న లక్ష్యంగా అన్నింటినీ రూపొందిస్తోంది. చిన్న చిన్న సౌకర్యాల నుంచి పెద్ద వాటి వరకూ అన్నింటి మీద దృష్టిని పెట్టింది. రేపటి నుంచి మొదలయ్యే జాతర (Medaram Jatara) కోసం స్పెష్ల్ ఆర్టీసీ బస్సులను వేశారు. వైఫై వచ్చేట్టు ఏర్పట్లుచేశారు. భక్తులు చెల్లించుకునే మొక్కు లకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేవారు. దానికి తోడు ఇప్పుడు ఒక మొబైల్ యాప్‌ను కూడా రూపొందించారు. 

Latest Medaram Jatara updates on 19/02/2024 | మేడారం జాతర న్యూస్ 19/02/2024
                                                             Latest Medaram Jatara updates on 19/02/2024 | మేడారం జాతర న్యూస్ 19/02/2024

అసలేంటీ యాప్…

మేడారం వెళ్ళే భక్తులకు కావాల్సిన అన్ని వివరాలు యాప్‌లో దొరికేట్టు తయారు చేయించారు ములుగు పోలీసులు. ఎక్కడెక్కడ ఏమేం ఉన్నాయి. ఎలా వెళ్ళాలి, బస్సులు ఎక్కడ దొకుతాయి, పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి, పుడ్ ఎక్కడ దొరుకుతుంది లాంటి అన్ని వవరాలు ఇందులో లభ్యమవుతాయి. ఈ ఆప్ ను గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి #Guide to Medaram by MuluguPolice అని టైపు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ ఆప్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా వీలైనంత ఎక్కువ సమాచారాన్ని చూడగలిగేలా, ముఖ్యంగా జాతర పరిసర ప్రాంతాలలో ఉన్న పార్కింగ్ స్థలాలు, ఆర్టీసీ పార్కింగ్, జంపన్న వాగు, దర్శనం ప్రదేశాల మధ్య దారి ని ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే చూసుకునే విధంగా ఈ ఆప్ ను రూపొందించారు. ఒక్కసారి ఈ ఆఫ్లైన్ మ్యాప్ ఓపెన్ చేసుకుంటే, ఇంటర్నెట్ లేకున్నా కూడా పని చేయడం దీని ప్రత్యేకత.

యాప్‌లో ఏమేమేం ఉంటాయి..Medaram Police App Details

మేడారం ప్రవేశం, నిష్క్రమణ చుట్టుప్రక్కల ప్రదేశాల మార్గాలు, రహదారులు సూచించే మార్గ సూచిక మ్యాప్, అత్యవసర సమాచారం, చేయవలసినవి, చేయకూడనివి, సలహాలు, సూచనలు అందించడం, ఇతరులకు పంచుకోవడం వంటి సదుపాయాలతో పాటు, ఎప్పటికప్పుడు పోలీసులు పౌరులకు నేరుగా సమాచారం అందించడానికి వీలుగా ప్రకటనలు శీర్షిక కూడా చేర్చబడినది. ఈ ఆప్ ను హైదరాబాద్ కు చెందిన విమాక్స్ ఈ-సొల్యూషన్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ ద్వారా రూపొందించబడింది. అలాగే మేడారం జాతర విశిష్టత, చరిత్ర, జాతర కార్యక్రమ సరళి, తేదీలు, రోజువారీ కార్యక్రమాల వివరాలతో పాటు, జాతర జరిగే 4 రోజులలో ఉండే రద్దీ దృశ్యా ప్రయాణికులకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి స్వంత లేదా ప్రైవేట్ వాహనాలకు, ఆర్టీసీ బస్సులకు వేరు వేరు మార్గాలు అలాగే రావడానికి, తిరిగి వెళ్ళడానికి వేరు వేరు మార్గాలను ఏర్పాటు చేశారు.

ప్రయాణానికి సంబంధించి ముఖ్య విషయాలు..

తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి స్వంత లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా వచ్చేవాళ్ళుఏ ఏ మార్గాల ద్వారా రావచ్చు, ఎక్కడి నుండి ఎంత దూరం ఎక్కడెక్కడ దారి మళ్ళింపులుంటాయి..ఏ మార్గాల ద్వారా వచ్చే వారికీ ఏ పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉంటాయి..ఏ మార్గం ద్వారా వచ్చిన వారు తిరిగి ఏ మార్గం ద్వారా తమ గమ్య స్థానం చేరుకోవచ్చు లాంటి అంశాలననీ యాప్‌లో ఉన్నాయి. దాంతో పాటూ దారిలో పాటించవలసిన సూచనలను, మ్యాప్ లు ఉంచారు.

ఇవి గూగుల్ మ్యాప్‌తో అనుసంధానం అయ్యేట్టు ప్లాన్ చేశారు. అలాగే మేడారం చుట్టుప్రక్కల ఉన్న 30కి పైగా పార్కింగ్ స్థలాలను భూ ఉపరితల అనుసంధానం చేసి (జియో ట్యాగ్గింగ్) ఆప్ వాడే వారు తమ ఉన్న స్థలం నుండి అక్కడికి గూగుల్ మ్యాప్ ద్వారా చేరుకునే విధంగా సూచనలను అందించడం, పార్కింగ్ సామర్థ్యం, పార్కింగ్ స్థలం విస్తీర్ణత, వంటి అంశాలు, ఆ పార్కింగ్ స్థలం నుండి అమ్మవారి గద్దెలకు సుమారు దూరం, పార్కింగ్ స్థలాల నుండి ఆర్టీసీ వారు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సదుపాయం నుండి సుమారు దూరం వంటి సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. అలాగే ఆర్టీసీ బస్సుల ద్వారా, రైలు మార్గాల ద్వారా వచ్చే మార్గాలు, తగిన సమాచారం కూడా ఇందులో ఉంది.

తప్పిపోయిన వారి కోసం కూడా..

జాతరలో తప్పి పోయే వారి సహాయార్థం ఈ సారి ప్రత్యేకంగా సహాయ, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి వారి ఫోటోలు, వివరాలు తెలపడానికి పెద్దపెద్ద తెరలను భక్తులకు కనబడే విధంగా పలు ప్రదేశాలలో ఏర్పరిచి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పర్యవేక్షించనున్నారు. సహాయ కేంద్రాల వివరాలు, అదే విధంగా ఎవరైనా తమ వారు తప్పి పోయినా లేదా తప్పి పోయినవారు కనిపించినా, ఈ ఆప్ ద్వారా ఫోటో, వారి ప్రదేశం వివరాలతో సమాచారం అందించవచ్చు. ఇవే కాకుండా భక్తులు ఏవైనా ఇబ్బందులు లేదా సంఘటనలు ఎదురైతే వాటిని కూడా పోలీసువారికి ఈ ఆప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

Helicopter Services in Medaram Jatara-2024 | ఈసారీ మేడారం జాతర లో ‘హెలికాప్టర్ సర్వీసెస్’ టికెట్ ధరలు ఎంతంటే?

Latest Medaram Jatara updates on 19/02/2024

Latest Medaram Jatara updates on 19/02/2024 | మేడారం జాతర న్యూస్ 19/02/2024

Latest Medaram Jatara updates on 19/02/2024 | మేడారం జాతర న్యూస్ 19/02/2024

1 thought on “Latest Medaram Jatara updates on 19/02/2024 | మేడారం జాతర న్యూస్ 19/02/2024”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.