...

Kalyana Laxmi Shadi Mubarak Scheme To Have 10 Gram Gold Along With Rs 1 Lakh in Telangana

Written by lsrupdates.com

Published on:

Kalyana Laxmi Shadi Mubarak Scheme To Have 10 Gram Gold Along With Rs 1 Lakh in Telangana | Kalyana laxmi Scheme : కొత్తగా పెళ్లైనవారికి గుడ్ న్యూస్.. రూ. లక్షతో పాటు తులం బంగారం.. సీఎం కీలక ఆదేశాలు..

కళ్యాణ లక్ష్మీ పథకం కింద రూ. లక్షతో పాటు 10 గ్రాముల బంగారం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు కింది కథనంలో..

The Telangana Cm Revanth Reddy Orders Kalyana Laxmi Shadi Mubarak Scheme To Have 10 Gram Gold Along With Rs 1 Lakh in Telangana

కళ్యాణ లక్షీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా….

కళ్యాణ లక్షీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఈ పథకం కింద అదనంగా తులం బంగారం కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. తాజాగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ. లక్షతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. దీంతో కొత్త పెళ్లైనవారు త్వరలోనే రూ. లక్షతో పాటు 10 గ్రాముల బంగారం అదనంగా పొందవచ్చు. అయితే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ అర్హతలు ఏంటి, ఎవరెవరికి ఈ పథకం వర్తిస్తుందో ఇప్పుడు చూద్దాం.

Kalyana Laxmi Shadi Mubarak Scheme To Have 10 Gram Gold Along With Rs 1 Lakh in Telangana
Kalyana Laxmi Shadi Mubarak Scheme To Have 10 Gram Gold Along With Rs 1 Lakh in Telangana

కళ్యాణలక్ష్మి పథకం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన ఆడపిల్లకు వర్తిస్తుంది. మైనారిటీకి చెందిన అమ్మాయిలు అయితే షాదీ మూబారక్ పేరుతో ఈ స్కీమ్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అయితే వార్షిక ఆదాయం రూ. 2 లక్షలకు మించకూడాదు. ఈబీసీ కేటగిరీ అయితే పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షల లోపు వార్షిక ఆదాయం, గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ. 1.5 లక్షల లోపు ఆదాయం ఉన్న ఆడపిల్లలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు. వయసు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. తెలంగాణ నివాసి అయి ఉండాలి.

పెళ్లైన అమ్మాయిలందరూ…..

పెళ్లైన అమ్మాయిలందరూ ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వధూవరుల వయసు 18 ఏళ్లు పైబడి ఉండాలి. పుట్టిన తేదీ ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. పెళ్లి కూతరు తల్లి బ్యాంకు ఖాతా వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

పెళ్లికూతురు ఫోటో, ఆధార్, మ్యారేజ్ సర్టిఫికేట్, వయసు ధ్రవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్, పెళ్లికూతరు తల్లి బ్యాంక్ పాస్ బుక్, పెళ్లి కొడుకు ఆధార్ కార్డు వంటి వివరాలు తీసుకుని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో ఈ స్కీమ్ కోసం అప్లై చేయవచ్చు. లేదా అన్ని డాక్యుమెంట్లు సమకూర్చుకుని ఆన్ లైన్లో కల్యాణలక్ష్మి అధికారిక వెబ్ సైట్లోకి లాగిన్ అయి రిజిస్టర్ చేసుకుని కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే కచ్చితంగా అన్ని పత్రాలు పొందుపర్చాల్సి ఉంటుంది.

అన్ లైన్లో అప్లై చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..

హైదరాబాద్: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు అవసరమైన బడ్జెట్ ప్రణాళికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) అధికారులను ఆదేశించారు. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించిన సీఎం.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి లోకసభ నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న గురుకులాలకు యుద్ధ ప్రాతిపదికన సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని సీఎం స్పష్టం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు, నోట్ బుక్స్, యూనిఫామ్స్్స్కు సీఎస్ఆర్ ద్వారా నిధులు సమీకరించాలని తెలిపారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, సీఎస్ శాంతి కుమారి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమీక్షలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో త్వరలో కులగణన..

త్వరలో రాష్ట్రంలో కుల గణన చేపట్టనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. బీసీ జనగణన చేపడతామని గతంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీనికి అనుగుణంగా అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. బీసీ జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో నిధులు కేటాయించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Telangana Cm Revanth Reddy Orders Kalyana Laxmi Shadi Mubarak Scheme To Have 10 Gram Gold Along With Rs 1 Lakh in Telangana.

Telangana Cm Revanth Reddy Orders Kalyana Laxmi Shadi Mubarak Scheme To Have 10 Gram Gold Along With Rs 1 Lakh in Telangana.

Kalyana Laxmi Shadi Mubarak Scheme To Have 10 Gram Gold Along With Rs 1 Lakh in Telangana.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

APPSC Jobs 2024 Notification for 240 Lecturer Posts – Lsrallinonenews.com

Indiramma Indlu Scheme Applications Filtering through Artificial Intelligence in Telangana-2024 | పేదలకు ఇందిరమ్మ ఇళ్లు.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో లేటెస్ట్ టెక్నాలజీ..! – Lsrallinonenews.com

DGP Mahender Reddy Appointed as TSPSC Chairman-2024 | TSPSC ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి – Lsrallinonenews.com

Venkaiah Naidu History: From ABVP President To Vice President Of India-2024 | ఏబీవీపీ నుంచి పద్మవిభూషణ్ దాకా వెంకయ్య నాయుడి తిరుగులేని ప్రస్థానం

CM Reventh Reddy May Go For Extension of Telangana Cabinet for 2nd Deputy CM

India vs England :Ravindra Jadeja Missed century-24 | సెంచరీ మిస్‌ చేసుకున్న జడేజా.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 436 ఆలౌట్‌

Announced Padma Awards-2024 Check Complete List Of Winners | పద్మ అవార్డుల ప్రకటన.. పూర్తి జాబితా ఇదే!!!

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.