ఐటీ స్టాక్స్ పతనం ఆ ఒక్క కారణంతో .. లిస్ట్‌లో TCS, HCL Tech, Wipro సహా మరెన్నో..! | IT stocks in downtrend after CLSA downgrades TCS HCL Tech Wipro
IT stocks in downtrend after CLSA downgrades TCS HCL Tech Wipro: ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లు రికార్డు గరిష్టాలకు చేరుతున్నప్పటికీ.. ముఖ్యంగా ఐటీ రంగాల స్టాక్స్ చూస్తే మాత్రం కొన్ని వరుసగా నష్టపోతున్నాయి. టీసీఎస్(TCS), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్(HCL Tech) సహా ఇంకెన్నో ఐటీ స్టాక్స్ ఇందులో ఉన్నాయి. ఐటీ కంపెనీల స్టాక్స్ ఎందుకు నష్టపోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
IT stocks in downtrend after CLSA downgrades TCS HCL Tech Wipro
స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిందే. మార్కెట్ సమయంలోనే కాకుండా.. మార్కెట్ ట్రేడింగ్ ముగిసిన తర్వాత జరిగే పరిణామాలు కూడా ఆయా రంగాల షేర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. కేవలం ఆ కంపెనీలు తీసుకునే నిర్ణయాలు మాత్రమే కాకుండా.. కొన్ని బయటి కారకాల వల్ల కూడా స్టాక్స్‌పై ఎఫెక్ట్ పడుతుంది. వీటిల్లో ముఖ్యంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కావొచ్చు.. ఇది సానుకూలంగా ఉండొచ్చు.. ప్రతికూలంగా ఉండొచ్చు. ఇంకా కొన్ని బ్రోకరేజీ సంస్థలు ఆయా స్టాక్స్ రేటింగ్ పెంచడం లేదా తగ్గించడం చేస్తుంటాయి ఇలా కూడా స్టాక్ ధరలు ప్రభావితం అవుతుంటాయి.
బ్రోకరేజీ సంస్థ CLSA ..
కొంత కాలంగా భారత ఐటీ రంగాల స్టాక్స్ ఒడుదొడుకుల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రముఖ బ్రోకరేజీ సంస్థ CLSA .. భారత అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సహా హెచ్‌సీఎల్ టెక్(HCL Tech) షేర్ల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ (తగ్గించడం) చేసింది. ఇక మరో రెండు దిగ్గజ ఐటీ సంస్థలైన ఎల్టీఐ మైండ్‌ట్రీ(LTI Mindtree), విప్రో షేర్లను అమ్మేయాలని (సెల్ కాల్) వెల్లడించడం గమనార్హం.
2024లో ఈ ఐటీ సెక్టార్ వృద్ధి దృక్పథం బలహీనంగానే ఉంటుందని.. ప్రస్తుత కాలంలో ఇది కూడా మంచి పనితీరేనని చెప్పిన సీఎల్ఎస్ఏ.. స్టాక్స్ వాల్యుయేషన్స్‌లో మాత్రం అది కనిపించట్లేదని చెప్పుకొచ్చింది. దీంతో ఆయా స్టాక్స్ పడిపోతున్నాయి. మార్చి 4న ఈ బ్రోకరేజీ ప్రకటన చేయగా.. ఆ రోజు భారీగా తగ్గిన ఈ షేర్లు తర్వాత కాస్త కోలుకున్నాయి. టీసీఎస్ 1 శాతం, హెచ్‌సీఎల్ దాదాపు 2 శాతం పడిపోయాయి.
TSC Stock
టీసీఎస్(TCS) స్టాక్ ఇటీవల రూ. 4184.75 వద్ద జీవన కాల గరిష్టాల్ని తాకిన సంగతి తెలిసిందే. తర్వాత భారీగా పడిపోయింది. ప్రస్తుతం రూ. 4058 మార్కు వద్ద ఉంది. ఇటీవలి కాలంలో పెద్దగా రిటర్న్స్ అందించలేదు. ఏడాది వ్యవధిలో మాత్రం 20 శాతం వరకు పుంజుకుంది.
HCL Stock
హెచ్‌సీఎల్(HCL) షేరు రూ. 1697.35 వద్ద ఇటీవల 52 వారాల గరిష్టాన్ని తాకగా.. తర్వాత బ్రోకరేజీ ప్రకటనతో వెనక్కి తగ్గింది. ప్రస్తుతం రూ. 1648 వద్ద ట్రేడవుతోంది. అయితే ఏడాది వ్యవధిలో ఈ షేరు 47 శాతం పెరగడం విశేషం.
Infosys Stock
మరోవైపు ఇన్ఫోసిస్(Infosys) తన 52 వారాల గరిష్ట ధర రూ.1733 నుంచి చాలా దూరంలో ఉంది. ప్రస్తుతం రూ. 1618 లెవెల్స్‌లో ఉంది. ఏడాదిలో కేవలం 8 శాతమే పుంజుకుంది. LTI మైండ్‌ట్రీ,(LTI Mindtree), విప్రో(Wipro) పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
IT stocks in downtrend after CLSA downgrades TCS HCL Tech Wipro