...

Indian Navy to set up its second VLF communication transmission station in Vikarabad Telangana | దేశంలోనే రెండో VLF స్టేషన్ మన దగ్గరే ఏర్పాటు

Written by lsrupdates.com

Published on:

Indian Navy to set up its second VLF communication transmission station in Vikarabad Telangana | ఇండియన్ నేవీకి కీలక స్థావరంగా తెలంగాణ.. దేశంలోనే రెండో VLF స్టేషన్ మన దగ్గరే ఏర్పాటు

Indian Navy to set up its second VLF communication transmission station in Vikarabad Telangana

Indian Navy: ఇండియన్ నేవీకి సంబంధించిన కీలక రాడార్‌ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కాబోతోంది. దేశంలోనే రెండో వీఎల్‌ఎఫ్‌ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్‌ ట్రాన్స్‌మిషన్‌ స్టేషన్‌ను వికారాబాద్‌ జిల్లా దామగుండం రక్షిత అటవీ ప్రాంతంలో నెలకొల్పనున్నారు. ఇందుకోసం ఇక్కడి 1174 హెక్టార్ల (2,900 ఎకరాలు) భూమిని అటవీశాఖ నౌకాదళానికి అప్పగించింది.

Indian Navy to set up its second VLF communication transmission station in Vikarabad Telangana:

ప్రధానాంశాలు:

  • వికారాబాద్ జిల్లాలో VLF స్టేషన్
  • ఆర్మీ స్కూళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు
  • మారనున్న ఆ ప్రాంత స్వరూపం

Revanth Reddy: భారత నావికా దళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్‌ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్‌మిషన్ స్టేషన్‌ను ఉపయోగిస్తుంది. వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్ ఏర్పాటు చేయనుంది. దేశంలోనే ఇది రెండో స్టేషన్. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొట్ట మొదటిది. 1990 నుంచి అది నావికా దళానికి సేవలందిస్తోంది. రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఇప్పటికే గుర్తించింది.

2010 నుంచి నావికా దళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. పర్యావరణ అనుమతులు, క్లియరెన్స్‌లన్నీ వచ్చినప్పటికీ భూముల కేటాయింపు అంశం ముందుకు సాగలేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయాయి. కమోడోర్ శ్రీ కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో శ్రీ రోహిత్ భూపతి, కెప్టెన్ శ్రీ సందీప్ దాస్ బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వికారాబాద్ డీఎఫ్‌వో, నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1,174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించారు.

ndian-Navy-to-set-up-its-second-VLF-communication-transmission-station-in-Vikarabad
Indian-Navy-to-set-up-its-second-VLF-communication-transmission-station-in-Vikarabad

2014లోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నేవీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అటవీ భూమి అప్పగించేందుకు రూ.133.54 కోట్ల కాంపా నిధులు, భూసంరక్షణ చర్యలకు చేపట్టే పనులకు రూ.18.56 కోట్లను నేవీ చెల్లించింది. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ దామగూడెం ఫారెస్ట్ ప్రోటెక్షన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన షరతులకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో ఒక ఆలయం ఉంది. దీనికి ఇబ్బంది తలెత్తకుండా చూడటం, ఇతరులను అనుమతించేందుకు నేవీ అంగీకరించింది.

ఇక్కడ నేవీ స్టేషన్‌తో పాటు ఏర్పడే టౌన్‌షిప్‌లో స్కూళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు, మార్కెట్లు ఉంటాయి. ఈ నేవీ యూనిట్‌లో దాదాపు 600 మంది నావికాదళంతో పాటు ఇతర సాధారణ పౌరులుంటారు. దాదాపు 2,500 నుంచి 3,000 మంది ఈ టౌన్‌షిప్‌లో నివసిస్తారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపడుతారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కి.మీ రోడ్డు నిర్మిస్తారు. 2027లో ఈ కొత్త వీఎల్ఎఫ్ సెంటర్ అందుబాటులోకి రానుంది.

Also Read : Indian Navy: నేవీ రిక్రూట్‌మెంట్.. ఇంటర్ చదివిన విద్యార్థులకు మంచి అవకాశం

10+2 ,B.Tech (టెన్ ప్లస్ టూ(బీ టెక్)) కేడెట్ ఎంట్రీ స్కీమ్ కింద ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచ్‌ల్లో నాలుగేళ్ల బీటెక్ కోర్సు చేరేందుకు నావికాదళం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 35 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

Indian Navy నేవీ రిక్రూట్‌మెంట్.. ఇంటర్ చదివిన విద్యార్థులకు మంచి అవకాశం
Indian Navy నేవీ రిక్రూట్‌మెంట్.. ఇంటర్ చదివిన విద్యార్థులకు మంచి అవకాశం

Navy Recruitment: 10+2 ,B.Tech (టెన్ ప్లస్ టూ(బీ టెక్)) కేడెట్ ఎంట్రీ స్కీమ్ కింద ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచ్‌ల్లో నాలుగేళ్ల బీటెక్ కోర్సు చేరేందుకు నావికాదళం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 35 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లను ఎంపిక చేసి ఎస్ఎస్‌బీ బోర్డులో ఉత్తీర్ణత సాధించిన వారికి కోర్సులోకి తీసుకుంటారు. జనవరి 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని, ఆసక్తిగల అభ్యర్థులు joinindiannavy.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని నేవీ ఓ ప్రకటనలో తెలిపింది.

  • ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో కనీసం 70 శాతం మార్కులు, ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులతో 10+2 లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
  • వయోపరిమితి: 2005 జనవరి 2, 01 జులై 2007 మధ్య పుట్టిన వారు ఈ పరీక్షకు అర్హులు
  • ఎన్‌టీఏ 2023 జేఈఈ సీఆర్ఎల్ ర్యాంకుల అధారంగా కాల్-అప్ ఉంటుంది.

దారఖాస్తు ఇలా..

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించాలి. ఆ తరువాత దరఖాస్తు కన్ఫర్మేషన్ పేజీని ప్రింటౌట్ తీసుకోవాలి. ఎంపిక చేసిన అభ్యర్థులకు బెంగళూరు, భోపాల్, కోల్‌కతా, విశాఖపట్నంలో మార్చి నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

Hijack: హైజాక్‌కు గురైన నౌకలో భారతీయులు సేఫ్.. హైజాకర్లపై కాల్పులు

సోమాలియా సరిహద్దులో హైజాక్ కి(Hijacked Cargo Ship) గురైన కార్గో నౌక “ఎంవీలిలా నార్‌ఫోర్క్”ను ఎట్టకేలకు భారత నేవీ అధికారులు గుర్తించారు. అందులో 15 మంది భారతీయులు ప్రయాణిస్తున్నారని వారు తెలిపారు. వారి జాడ గుర్తించడంతో 15 మంది భారతీయులతోపాటు 21 మంది క్రూ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు.

ఢిల్లీ: సోమాలియా సరిహద్దులో హైజాక్ కి(Hijacked Cargo Ship) గురైన కార్గో నౌక “ఎంవీలిలా నార్‌ఫోర్క్”ను ఎట్టకేలకు భారత నేవీ అధికారులు గుర్తించారు. అందులో 15 మంది భారతీయులు ప్రయాణిస్తున్నారని వారు తెలిపారు. వారి జాడ గుర్తించడంతో 15 మంది భారతీయులతోపాటు 21 మంది క్రూ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు. నౌక లైబీరియా నుంచి వెళ్తుండగా సోమాలియా ప్రాంతంలో దుండగులు హైజాక్ చేశారు.

Hijack: హైజాక్‌కు గురైన నౌకలో భారతీయులు సేఫ్.. హైజాకర్లపై కాల్పులు
Hijack: హైజాక్‌కు గురైన నౌకలో భారతీయులు సేఫ్.. హైజాకర్లపై కాల్పులు

విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తం అయింది. ఎప్పటికప్పుడు స్థానిక అధికారులతో చర్చలు జరుపుతూ నౌక జాడలు కనిపెట్టేందుకు ప్రయత్నించింది. ఎట్టకేలకు నౌక జాడ కనుక్కుంది. ఇందుకోసం చెన్నై వార్ షిప్ లను కూడా రంగంలోకి దింపారు అధికారులు. డ్రోన్లు తదితర యంత్రాల సాయంతో జాడ తెలుసుకున్నట్లు వారు వివరించారు. నౌకను చుట్టుముట్టి హైజాక్ చేసిన వారిపై కాల్పులు జరిపారు. తప్పించుకోవడానికి వారు సిటాడెల్ లో దాక్కున్నారని వివరించారు.

అతి కష్టంమీద జరిపిన కాల్పుల్లో వారు మృతి చెందినట్లు ఇండియన్ నేవీ ఓ ప్రకటనలో తెలిపింది. నేవీ అధికార ప్రతినిధి వివేక్ మాధ్వాల్ మాట్లాడుతూ.. భారతీయులతోపాటు 21 మంది ఇతర సిబ్బందిని రక్షించామని తెలిపారు. హైజాక్ సమాచారాన్ని బ్రిటిష్ మిలిటరీ ఆర్గనైజేషన్, యూకే మారిటం ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. సముద్రంలో వెళ్తున్న నౌకలను ట్రాక్ చేయడమే వీటి పని.

భారత నావికాదళ ప్రధాన కార్యాలయం సముద్రంలో కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. హైజాక్ చేసిన ఓడను చేరుకున్న తర్వాత అందులో ఉన్న సముద్రపు దొంగలకు మార్కోస్ గట్టి హెచ్చరిక చేసింది. హైజాక్ చేసిన ఓడను వెంటనే వదిలివేయమని వారిని కోరింది. చివరికి దాడులు జరిపింది. నౌకలో ఉన్న సిబ్బందితో ఎప్పటికప్పుడు మాట్లాడటం వల్లే ఆపరేషన్ విజయవంతం అయిందని నేవీ అధికారులు వెల్లడించారు. ఈ విధానం సముద్రపు ముప్పులను త్వరితగతిన గుర్తించి పరిష్కరించడంలో ఉపయోగపడుతుందని అన్నారు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

Nova Agritech IPO Details with GMP | నోవా అగ్రిటెక్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన

Hyderabad Police Rude Behavior with ABVP woman leader | ABVP నాయకురాలిని బైక్‌పై వెంబడించి.. జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన పోలీసులు

TSRTC Apprenticeship Notification-2024 | డిగ్రీతో 150 ఖాళీల భర్తీకి RTC నోటిఫికేషన్‌ విడుదల.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు.. రీజియన్ల వారీగా ఖాళీలివే

Whatsapp Latest Features-2024 | ఇకపై వాట్సాప్‌లో బ్లూటూత్ ఫీచర్.. ఎలాంటి ఫైల్స్ అయినా వేగంగా షేర్ చేసుకోవచ్చు!!!

Exploring the Best Affiliate Marketing Strategies -2024 (lsrallinonenews.com)

Zee Entertainment shares down 25% after Sony calls off merge (lsrallinonenews.com)

Brisk Technovision IPO Details Date, Price, Allotment -2024 (lsrallinonenews.com)

Indian Navy to set up its second VLF communication transmission station in Vikarabad Telangana.

Indian Navy to set up its second VLF communication transmission station in Vikarabad Telangana

 

2 thoughts on “Indian Navy to set up its second VLF communication transmission station in Vikarabad Telangana | దేశంలోనే రెండో VLF స్టేషన్ మన దగ్గరే ఏర్పాటు”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.