...

చాప్టర్-2 తెలుగులో భారత రాజ్యాంగ సాధన క్విజ్| Indian Constitution Practice Quiz in Telugu Part-2

Written by lsrupdates.com

Published on:

చాప్టర్-2 తెలుగులో భారత రాజ్యాంగ సాధన క్విజ్| Indian Constitution Practice Quiz in Telugu Part-2

Indian Constitution Practice Quiz in Telugu Part-2: 1990 నుంచి వివిధ పోటీ పరీక్షల్లో ముఖ్యంగా సివిల్స్‌, TSPSC, APPSC, RRB, Banking, SSC,గ్రూప్‌-1, గ్రూప్‌-2, జె.ఎల్‌., డి.ఎల్‌,, నెట్‌, స్లైట్‌ మొదలైన పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు మరియు జవాబులు  ఈ ఆర్టికల్ లో ఇవ్వబడినవి.

1. ప్రభుత్వ పాలనకు పాటించవలసిన ముఖ్యమైన అంశాలు

ఎ) ప్రాథమిక హక్కులు

బి) మానవ హక్కులు

సి) శాసన సూత్రాలు

డి) ఆదేశిక సూత్రాలు

జవాబు: డి) ఆదేశిక సూత్రాలు

2. ఆదేశిక సూత్రాల ముఖ్య ఉద్దేశం

ఎ) నిరుద్యోగ నిర్మూలన

బి) సంక్షేమ రాజ్యస్థాపన

సి) పారిశ్రామికీకరణ

డి) ఆర్థిక పురోభివృద్ధి

జవాబు: బి) సంక్షేమ రాజ్యస్థాపన

3. గ్రామ పంచాయితీల ఏర్పాటు సూచిస్తున్న ఆర్టికల్‌ ఏది.

ఎ) 40

బి) 41

సి) 42

డి) 43

జవాబు: ఎ) 40 

4. ఆదేశిక సూత్రాల అమలు కోసం, ప్రాథమిక హక్కులను పరిమితం చేయరాదని ఏ కేసులో తీర్పు ఇచ్చారు.

ఎ) గోలక్‌నాథ్‌కేసు

బి) కేశవానంద భారతి కేసు

సి) మినర్వా మిల్స్‌

డి) ఏదీ కాదు

జవాబు: ఎ) గోలక్‌నాథ్‌కేసు 

5. ఉమ్మడి పౌరస్యృతిని తెలుయచేసే నిబంధన ఏది.

ఎ) 44

బి) 45

సి) 46

డి) 47

జవాబు: ఎ) 44 

6. జతపరచండి.

1. ఆర్టికల్‌ 40    ఎ) కార్మికులకు కనీస వేతనాలు

2. ఆర్టికల్‌ 41    బి) పని హక్కు

3. ఆర్జికల్‌ 42    సి) గ్రామ పంచాయితీల నిర్వహణ

4. ఆర్టికల్‌ 43    డి) పని చేయడానికి తగిన పరిస్థితులు, స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలు

ఎ) 1-సి, 2-బి, ౩-డి, 4-ఎ

బి) 1-ఎ, 2-బి, ౩-డి, 4-సి

సి) 1-బి, 2-ఎ, ౩-డి, 4-సి

డి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ

జవాబు: ఎ) 1-సి, 2-బి, ౩-డి, 4-ఎ

7. ఆదేశిక సూత్రాలు అంటే ఏమిటి.

ఎ) ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలు

బి) రాష్ట్రాలకు కేంద్రం జారీ చేసే ఆదేశాలు

సి) కేంద్ర రాష్ట్ర సంబంధాలను నిర్వహించే సూత్రాలు

డి) న్యాయ సాధనలను నిర్వహించే సూత్రాలు

జవాబు: ఎ) ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలు

8. ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు తేదా ఏమిటి.

ఎ) ప్రాథమిక హక్కులు న్యాయ సాధ్యమైనవి, ఆదేశిక సూత్రాలు కావు.

బి) ఆదేశిక సూత్రాలు న్యాయసాధ్యమైనవి, ప్రాథమిక హక్కులు కావు.

సి) పై రెండూ

డి) ఏవీకావు

జవాబు: ఎ) ప్రాథమిక హక్కులు న్యాయ సాధ్యమైనవి, ఆదేశిక సూత్రాలు కావు.

9. ఆదేశ సూత్రాలను ఈ క్రింది వారిలో ఎవరు ఒక వాస్తవమైన మానసిక ప్రవృత్తుల చెత్తకుండీ అని అన్నారు.

ఎ) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌

బి) టి.టి. కృష్ణమాచారి

సి) కె.ఎం. మున్షీ

డి) ఎన్‌. గోపాలస్వామి అయ్యంగార్‌

జవాబు: బి) టి.టి. కృష్ణమాచారి

10. శాసన వ్యవస్థకు నిర్దేశిక నియమాలు కరదీపం వంటివని అన్నదెవరు.

ఎ) ఎం.సి. చాగ్గా

బి) ఎం.సి. సెతల్వాడ్‌

సి) కెటిషా

డి) అంబేద్కర్

జవాబు: బి) ఎం.సి. సెతల్వాడ్‌

11. భారత రాజ్యాంగంలోని లక్ష్యాల సాధనకు తోడ్పడినవి

ఎ) ప్రాథమిక హక్కులు

బి) నిర్దేశిక నియమాలు

సి) ప్రాథమిక విధులు

డి) పైవేవీ కావు

జవాబు: బి) నిర్దేశిక నియమాలు

12. క్రింది వాటిలో సరైనది

1) పురుషులకు, మహిళలకు సమానమైన పని, సమాన వేతనాన్ని ప్రోత్సహించేందుకు రాజ్యాంగంలో ఎటువంటి నిబంధన లేదు.

2) వెనుకబడిన తరగతులను రాజ్యాంగం నిర్వచించలేదు.

ఎ) 1 మాత్రమే

బి) 2 మాత్రమే

సి) పై రెండు సరైనవే

డి) ఏదీ కాదు

జవాబు: డి) ఏదీ కాదు

13. భారత రాజ్యాంగము ననుసరించి సంఘాలను ఏర్పరచుకునే స్వేచ్చను ఏ విషయంలో నియంత్రించవచ్చును.

ఎ) ప్రజా భద్రత

బి) విదేశాలలో స్నేహ సంబంధాల నిర్వహణ దృష్టా

సి) కోర్టు ధిక్కరణ విషయంలో

డి) పైవన్నీ

జవాబు: డి) పైవన్నీ

14. ఆర్థిక ప్రజాస్వామ్యం దీని ద్వారా సాధింపబడుతుంది.

ఎ) ప్రాథమిక హక్కులు

బి) ప్రవేశిక

సి) రాష్ట్ర విధానానికి సంబంధించిన ఆదేశికసూత్రాలు

డి) కేంద్ర జాబితా

జవాబు: సి) రాష్ట్ర విధానానికి సంబంధించిన ఆదేశికసూత్రాలు

15. ఆదేశిక సూత్రాలకు ప్రాధమిక హక్కులపై ఆధిక్యతను కల్పించడానికి ఉద్దేశింపబడిన రాజ్యాంగ సవరణలు

ఎ) 25

బి) 42

సి) 44

డి) ఎ & బి

జవాబు: బి) 42 

16. ప్రవంచీకరణ ఆర్థిక నరళీకరణ నేవథ్యంలో ప్రభావితమౌతున్న ఆదేశిక సూత్రాల స్వభావం 

ఎ) సంక్షేమ స్వభావం

బి) గాంధేయ స్వభావం

సి) ఉదార స్వభావం

డి) పై అన్నియు

జవాబు: ఎ) సంక్షేమ స్వభావం 

17. ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది

ఎ) ఆదేశికాలు నూతన పోకడలు – అంబేద్కర్

బి) శుష్క వాగ్ధానాలు – ఐవర్‌ జెన్నింగ్స్‌

సి) రాజ్యాంగ లక్ష్యాల మానిఫెస్టో – కె.సి.వేర్‌

డి) పైవన్నియు సరైనవి

జవాబు: సి) రాజ్యాంగ లక్ష్యాల మానిఫెస్టో – కె.సి.వేర్‌

18. ఆదేశిక నియమాలనేవి

ఎ) పౌరుల బాధ్యతలను తెలియజేస్తాయి.

బి) పౌరుల హక్కులను పరిరక్షిస్తాయి

సి) న్యాయ పాలనలో ప్రాతిపదికలు

డి) పరిపాలనలో మార్గదర్శకాలు

జవాబు: డి) పరిపాలనలో మార్గదర్శకాలు

19. సంక్షేమ రాజ్య స్వభావమనే భావన ఏ భాగములో స్పష్టీకరించబడింది.

ఎ) ప్రవేశిక

బి) ప్రాధమిక హక్కులు

సి) ఆదేశిక నియమాలు

డి) ప్రాథమిక విధులు

జవాబు: సి) ఆదేశిక నియమాలు 

20. ఈ క్రిందివాటిలో ఏది సరైనది

ఎ) ఆదేశిక సూత్రాలకు ప్రాధమిక హక్కులకు సంబంధం లేదు

బి) ఆదేశిక సూత్రాలు ప్రాధమిక హక్కుల కంటే గొప్పవి

సి) ప్రాధమిక హక్కులు ఆదేశిక సూత్రాల కంటే గొప్పవి

డి) పరస్పర పోషకాలు

జవాబు: డి) పరస్పర పోషకాలు

చాప్టర్-2 తెలుగులో భారత రాజ్యాంగ సాధన క్విజ్| Indian Constitution Practice Quiz in Telugu Part-2
చాప్టర్-2 తెలుగులో భారత రాజ్యాంగ సాధన క్విజ్| Indian Constitution Practice Quiz in Telugu Part-2

21. ప్రాథమిక హక్కులు అమలుకు ఏ అధికరణ ప్రకారం చట్టం చేయవచ్చు

ఎ) ఆర్టికల్‌ 32

బి) ఆర్టికల్‌ 33

సి) ఆర్టికల్‌ 34

డి) ఆర్టికల్‌ 35

జవాబు: డి) ఆర్టికల్‌ 35

22. ప్రాథమిక హక్కులు నేరుగా ఎవరికి వర్తించవు.

ఎ) ఆర్మీలో పనిచేసే వారికి

బి) పోలీసు శాఖకు

సి) ఎ.సి.బి

డి) సి.బి.ఐ

జవాబు: ఎ) ఆర్మీలో పనిచేసే వారికి

23. భారత్‌ రాజ్యాంగంలోని అధికరణ 14 క్రింద దీనినినిషేధించలేదు

ఎ) క్లాస్‌ చట్టం

బి) న్యాయమైన వర్గీకరణ

సి) తారతమ్యం

డి) విడదీయడం

జవాబు: బి) న్యాయమైన వర్గీకరణ

24. సెక్యులరిజం అనే పదం రాజ్యాంగంలో పొందుపరచక ముందు రాజ్యాంగంలోని క్రింది అధికరణలు సెక్యులరిజం గురించి తెలిపేవి.

ఎ) అధికరణలు 14 నుండి 18

బి) అధికరణలు 19 నుండి 22

సి) అధికరణలు 28 నుండి 24

డి) అధికరణలు 25 నుంచి 28

జవాబు: డి) అధికరణలు 25 నుంచి 28

25. రాజ్యాంగంలో పేర్కొనబడిన ప్రాథమిక విధులు

ఎ) పది విధులు

బి) పదకొండు విధులు

సి) తొమ్మిది విధులు

డి) పన్నెండు విధులు

జవాబు: బి) పదకొండు విధులు

26. ప్రాథమిక హక్కుల నుంచి అస్తి హక్కును ఎవరి పదవీ కాలంలో తొలగించారు?

ఎ) మొరార్డీ దేశాయ్‌

బి) రాజీవ్‌ గాంధీ

సి) చరణ్‌ సింగ్‌

డి) ఇందిరా గాంధీ

జవాబు: ఎ) మొరార్డీ దేశాయ్‌

27. జాతీయ అత్యవసర పరిస్థితిలో రద్దు కాని హక్కు

ఎ) సమానత్వపు హక్కు

బి) జీవనము వ్యక్తి స్వాతంత్ర్యము హక్కు

సి) మతపరమైన స్వేచ్చ

డి) భావ ప్రకటన స్వేచ్చ

జవాబు: బి) జీవనము వ్యక్తి స్వాతంత్ర్యము హక్కు

28. 2002 తరువాత విద్యా వాక్కు ఏ రూవం సంతరించుకుంది

ఎ) న్యాయ పరమైన హక్కు

బి) మానవ హక్కు

సి) ప్రాథమిక హక్కు

డి) సివిల్‌ హక్కు

జవాబు: సి) ప్రాథమిక హక్కు

29. ఓటు హక్కు దీని క్రిందికి వస్తుంది

ఎ) న్యాయపరమైన హక్కు

బి) ప్రాథమిక హక్కు

సి) రాజ్యాంగ పరమైన హక్కు

డి) పైవన్నీ సరియైనవి కావు

జవాబు: సి) రాజ్యాంగ పరమైన హక్కు

30. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ “రాజ్యం” అనే పదాన్ని నిర్వచిస్తుంది

ఎ) 12

బి) 18

సి) 14

డి) 15

జవాబు: ఎ) 12 

31. భారత రాజ్యాంగంలోని 15వ అధికరణ ఈ క్రింది వాటికి వర్తిస్తుంది

ఎ) పౌరులకు మాత్రమే

బి) పౌరులు కాని వారికి మాత్రమే

సి) పౌరులు మరియు పౌరులు కానివారికి

డి) కార్పోరేషన్లకు మరియు సంఘాలకు

జవాబు: సి) పౌరులు మరియు పౌరులు కానివారికి

32. భారత సుప్రీంకోర్టు ఏ కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాలు ప్రకటించింది.

ఎ) గోలక్‌నాథ్‌ – పంజాబ్‌ రాష్ట్రం

బి) కేశవానంద భారతి – కేరళ రాష్ట్రం

సి) శంకర ప్రసాద్‌ – భారత యూనియన్‌

డి) వీటిలో ఏదీకాదు

జవాబు: బి) కేశవానంద భారతి – కేరళ రాష్ట్రం

33. భారత రాజ్యాంగపు మౌలిక లక్షణం కానిది.

ఎ) పార్లమెంటరీ వ్యవస్థ

బి) న్యాయస్థాన ఆధిక్యం

సి) సమాఖ్య వాదం

డి) ప్రాధమిక హక్కులు

జవాబు: బి) న్యాయస్థాన ఆధిక్యం

34. రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశికకు మూలాధారమైన ఆశయాల తీర్మానాన్ని నెహూ ఎప్పుడు ప్రవేశపెట్టారు.

ఎ) 1946 డిసెంబర్‌ 18

బి) 1946 డిసెంబర్‌ 11

సి) 1948 డిసెంబర్‌ 13

డి) 1948 డిసెంబర్‌ 11

జవాబు: ఎ) 1946 డిసెంబర్‌ 18

35. ప్రవేశికలో ఈ విధంగా ఉంది.

ఎ) భారత ప్రజలమైన మేము

బి) హిందూ దేశ ప్రజల మైన మేము

సి) యూనియన్‌ ప్రజల మైన మేము

డి) ఫెడరల్‌ ప్రజల మైన మేము

జవాబు: ఎ) భారత ప్రజలమైన మేము

36. ప్రవేశికలో లేని పదాలు

ఎ) సమగ్రత

బి) సార్వభౌమత్వం

సి) న్యాయం

డి) సమాఖ్య

జవాబు: డి) సమాఖ్య

37. బెరుబారి అనేది.

ఎ) వ్యక్తి పేరు

బి) ప్రాంతం పేరు

సి) కమీషన్‌ పేరు

డి) పైవేవీ కావు

జవాబు: బి) ప్రాంతం పేరు

38. ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం కాదు అని చెప్పిన కేసు

ఎ) బెరుబారి

బి) కేశవానంద భారతి

సి) ఎల్‌.ఐ.సి.

డి) గోపాలన్‌

జవాబు: ఎ) బెరుబారి

39. జతపరుచుము.

1. 1960    ఎ) బెరూబారి

2. 1973    బి) కేశవానంద భారతి

3. 1975    సి) ఇందిరాగాంధీ – రాజ్‌నారాయణ్‌

4. 1980    డి) మినర్వామిల్స్‌

ఎ) 1-ఎ, 2-బి, ౩-సి, 4-డి

బి) 1-బి, 2-ఎ, ౩-డి, 4సి

సి) 1-సి, 2-ఎ, ౩-బి, 4-డి

డి) 1-ఎ, 2-బి, ౩-డి, 4-సి

జవాబు: ఎ) 1-ఎ, 2-బి, ౩-సి, 4-డి

40. రాజ్యాంగ మౌలిక లక్షణాల సారం

ఎ) ప్రాథమిక హక్కులు

బి) ఆదేశిక సూత్రాలు

సి ప్రాథమిక విధులు

డి) ప్రవేశిక

జవాబు: డి) ప్రవేశిక

41. భారత రాజ్యాంగ ప్రవేశిక అమెరికా స్వాతంత్ర్య ప్రకటనలాగే రాజ్యాంగ ఆత్మ రాజకీయ వ్యవస్థ స్వరూపం, పవిత్ర నిర్ణయాన్ని తెలియ చేస్తుంది. విప్లవం తప్ప మరొకటి దీన్ని మార్చలేదు అని వ్యాఖ్యానించింది.

ఎ) అంబేద్కర్‌

బి) నెహ్రూ

సి) గాంధీ

డి) హిదయతుల్లా

జవాబు: డి) హిదయతుల్లా

42. ప్రాథమిక హక్కుల అమలుకు జారీ చేసే కోర్టు ఆదేశాలను ఏమంటారు.

ఎ) రిట్లు

బి) డిక్రీ

సి) ఆర్డినెన్సు

డి) పైవన్ని

జవాబు: ఎ) రిట్లు 

43. రాజ్యాంగంలో పరోక్షంగా గుర్తింపబడిన ప్రాథమిక హక్కు ఏది

ఎ) రహస్యాలను కాపాడుకునే హక్కు

బి) సంఘాలను ఏర్పర్పుకునే హక్కు

సి) సంచార హక్కు

డి) స్థిర నివాస హక్కు

జవాబు: ఎ) రహస్యాలను కాపాడుకునే హక్కు

44. వ్యక్తిగత స్వేచ్చల పరిరక్షణ శక్తి ఏది

ఎ) హెబియస్‌ కార్చస్‌

బీ) మాండమస్‌

సి) ప్రొహిబిషన్‌

డి) పైవేవి కాదు

జవాబు: ఎ) హెబియస్‌ కార్చస్‌ 

45. ప్రాథమిక హక్కులకు మరొక పేరు సహజ హక్కులు అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు పేర్కొంది

ఎ) కేశవానంద భారతి కేసు

బి) గోలక్‌నాథ్‌ కేసు

సి) ఏ.కె. గోపాలన్‌ కేసు

డి) ఎస్‌.ఆర్‌. బొమ్మయ్‌

జవాబు: బి) గోలక్‌నాథ్‌ కేసు

46. ఒక ప్రభుత్వం యొక్క గొప్పతనం ఇది ప్రజలకు కల్పించిన హక్కులపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నది?

ఎ) అరిస్టాటిల్‌

బి) హెచ్‌.జె. లాస్కి

సి) జెయస్‌. మిల్‌

డి) ఐవర్‌ జెన్నింగ్స్‌

జవాబు:  బి) హెచ్‌.జె. లాస్కి

47. ప్రకరణ 12 ప్రకారం రాజ్య నిర్వచనంలోకి రాని అంశం?

ఎ) గ్రామ పంచాయతి

బి) సహకార సంఘాలు

సి) యూనివర్శిటీలు

డి) పైవేవీ కావు

జవాబు: బి) సహకార సంఘాలు

48. ప్రకరణ 13లో ప్రస్థావించిన అంశం/అంశాలు

ఎ) రాజ్యాంగానికి వ్యతిరేకమైన చట్టాలు చెల్లవు

బీ ప్రాథమిక హక్కులను హరించే చట్టాలు చెల్లవు

సి) చట్ట నిర్వచనం .

డి) పై అన్నియూ సరైనవే

జవాబు: డి) పై అన్నియూ సరైనవే

49. ప్రకరణ 13 ప్రకారం చట్ట నిర్వచనంలోకి రానిది?

ఎ) దత్త శాసనాలు

బి) ఉప చట్టాలు (Bye-laws)

సి) రూల్స్‌

డి) రాజ్యాంగ సవరణ

జవాబు: డి) రాజ్యాంగ సవరణ

50. హెన్రీ-(VIII) క్లాస్‌ అనగా?

ఎ) అనుచిత చట్టాలు

బి) సరళ చట్టాలు

సి చట్టాలలోని దోషాలను తొలగించడం

డి) సవరణకు అతీతమైన చట్టాలు

జవాబు: సి చట్టాలలోని దోషాలను తొలగించడం

51. హంస, పాలు నుండి నీరును వేరు చేస్తుందనే అంశం ఈ క్రింది సూత్రానికి అన్వయించవచ్చు?

ఎ) డాక్ట్రిన్‌ ఆఫ్‌ సెవరబిలిటి

బి) డాక్ట్రిన్‌ ఆఫ్‌ వేయివర్‌

సి) డాక్ట్రిన్‌ ఆఫ్‌ ఎక్షిప్స్‌

డి) డాక్ట్రిన్‌ ఆఫ్‌ పిత్‌ అండ్‌ సబ్‌స్టాన్స్‌

జవాబు: ఎ) డాక్ట్రిన్‌ ఆఫ్‌ సెవరబిలిటి

52. న్యాయ సమీక్ష అధికారం

ఎ) పరోక్షంగా ఉంది

బి) ప్రత్యక్షంగా ఉంది

సి) ఆపాదించబడింది

డి) పైవి ఏవీ కొదు

జవాబు: బి) ప్రత్యక్షంగా ఉంది

53. ప్రకరణ 114 దేనిని అనుమతిస్తుంది?

ఎ) వర్గ చట్టాలను

బి) హేతుబద్ద వర్గీకరణను

సి) పై రెండింటిని

డి) పైవి ఏవీ కొదు

జవాబు: బి) హేతుబద్ద వర్గీకరణను

54. విశాఖ Vs స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ 1997 వివాదంలో ముఖ్యాంశం? 

ఎ) పని ప్రదేశాలలో స్త్రీలపై లైంగిక వేధింపులు

బి) బాల కార్మిక. వ్యవస్థ

సి) అశ్లీల సాహిత్యం

డి) పైవి ఏవీ కాదు

జవాబు: ఎ) పని ప్రదేశాలలో స్త్రీలపై లైంగిక వేధింపులు

55. కొన్ని ఉద్యోగాలను స్త్రీలకు మాత్రమే రిజర్వ్‌ చేయడంచెల్లుబాటు అవుతుందని సుప్రీం కోర్టు ఏ కేసులో తీర్పు  చెప్పింది?

ఎ) యూనియన్‌ ఆఫ్‌ ఇండియా Vs  ప్రభాకరన్‌ 1997

బి) సాగర్‌ vs  ఎ.పి. గవర్నమెంట్‌ – 1968

సి) పై రెండూ

డి) పై రెండూ కాదు

జవాబు: సి) పై రెండూ

56. ప్రాథమిక హక్కులకు, ఆదేశ నూత్రాలకు విరోధమునకు కారణము

ఎ) రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయాలని న్యాయశాఖ ఆరాటం

బి) లిఖిత రాజ్యాంగం

సి) సాంఘిక, ఆర్ధిక అసమానత

డి) ముందు చూపున్న నాయకులు లేకపోవడం

జవాబు: ఎ) రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయాలని న్యాయశాఖ ఆరాటం

57. ఆదేశ సూత్రాలకు సంబంధించి ఆర్దికల్‌ 41లో లేనిది.

ఎ) పనిహక్కు

బి)ఆశ్రయపు హక్కు

సి) విద్యాహక్కు

డి) ప్రభుత్వ సహాయపు హక్కు

జవాబు: బి)ఆశ్రయపు హక్కు

58. ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఏ ప్రభుత్వమైనా విస్మరిస్తే, వారు ఎన్నికల కాలంలో ప్రజల ముందు జవాబుదారియై తప్పనిసరిగా నిలువవలసి ఉంటుంది అని వ్యాఖ్యానించినది ఎవరు.

ఎ) జవహర్‌లాల్‌ నెహ్రూ

బి) డా. బి.ఆర్‌. అంబేద్కర్‌

సి) ఐవర్‌ జన్సింగ్స్‌

డి) వల్లభ్‌భాయ్‌ పటేల్‌

జవాబు: బి) డా. బి.ఆర్‌. అంబేద్కర్‌

59. M K గాంధీ తత్వాన్ని ప్రతిబింబించే అదేశిక నియమాలు

ఎ) సమాన పనికి సమాన వేతనం

బి) ఉచిత న్యాయ సలహా

సి) గోవధ నిషేధం

డి) చారిత్రక కట్టడాల పరిరక్షణ

జవాబు: సి) గోవధ నిషేధం

60. ఆదేశిక నియమాలు దేనిని నెలకొల్పుతాయి

ఎ) ఆర్థిక ప్రజాస్వామ్యం

బి) సామాజిక ప్రజాస్వామ్యం

సి) సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం

డి) M K గాంధీ గ్రామ స్వరాజ్యం

జవాబు: ఎ) ఆర్థిక ప్రజాస్వామ్యం

61. అదేశిక నియమాలకు సంబంధించి సరైనవి

ఎ) వీటికి న్యాయ సంరక్షణ లేదు

చి) ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలు

సి) వీటికి మరోపేరు న్యాయ సంరక్షణ లేని హక్కులు

డి) పైవన్నియు

జవాబు: డి) పైవన్నియు

62. ఆదేశిక సూత్రాల అమలులో ప్రస్తుతం ఉన్న ప్రతిబంధకాలు

ఎ) ప్రపంచీకరణ

బి) ఆర్థిక సరళీకరణ

సి) ప్రైవేటీకరణ

డి) పైవన్నియు

జవాబు: డి) పైవన్నియు

63. కొత్తగా చేర్చబడిన ఆదేశికాలు

ఎ) ఉచిత న్యాయ సలహా

వీ) పర్యావరణ పరిరక్షణ

సి) పరిశ్రమ నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం

డి) పైవన్నియు సరైనవి

జవాబు: డి) పైవన్నియు సరైనవి

64. ప్రకరణ 39(b & c) నిర్దేశిక నియమాల అమలుకు చేసే చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చెల్లుబాటు అవుతాయి అని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మార్పు చేశారు.

ఎ) 24వ రాజ్యాంగ సవరణ

బి) 23వ రాజ్యాంగ సవరణ

సి) 42వ రాజ్యాంగ సవరణ

డి) 44వ రాజ్యాంగ సవరణ

జవాబు: ఎ) 24వ రాజ్యాంగ సవరణ

65. విద్యా సంస్థలలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించేందుకు దీనిని ప్రాతిపదికగా తీసుకుంటారు.

ఎ) కులం

బి) పేదరికం

సి) గ్రామీణ వాతావరణం

డి) మతం

జవాబు: ఎ) కులం 

66. ప్రకరణ 19(1) ప్రకారం నిర్వహించే హిక్‌లిన్‌ టెస్ట్‌ (Hicklin Test) దేనికి సంబంధించినది

ఎ) సభ్యత, నైతికత

బి) ప్రాణ నష్టం

సి) భారత సమైక్యత

డి) పైవేవీ కాదు

జవాబు: ఎ) సభ్యత, నైతికత 

67. ఆదేశిక నియమాలకు ఈ క్రింది ఏ లక్షణాన్ని ఆపాదించలేము

ఎ) న్యాయ సంరక్షణ

బి) వ్యక్తి శ్రేయస్సు

సి) స్వామ్యవాద తరహా లక్షణం

డి) పై అన్నియు

జవాబు: ఎ) న్యాయ సంరక్షణ

68. ఆదేశిక నియమాలకు న్యాయ నంరక్షణ కల్పించబడలేదు. కారణం / కారణాలు గుర్తించండి

ఎ) అమలు చేయడం సాధ్యం కాకపోవడం

బి) అంత ప్రాముఖ్యమైనవి కాకపోవడం

సి) ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉండటం

డి) పై అన్నియు సరైనవే

జవాబు: ఎ) అమలు చేయడం సాధ్యం కాకపోవడం

69.ఈ క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త ఆదేశికాలు చేర్చబడలేదు.

ఎ) 24వ సవరణ

బి) 42వ సవరణ

సి) 97వ సవరణ

డి) పైవి ఏవీ కాదు

జవాబు: డి) పైవి ఏవీ కాదు

70. ప్రాథమిక హక్కులకు, ఆదేశిక నియమాలకు మధ్య వివాదాన్ని మరొక విధంగా ఇలా అంటారు

ఎ) శాసనశాఖ – న్యాయశాఖ మధ్యవివాదం

బి) కార్యనిర్వాహక శాఖ – న్యాయ శాఖ మధ్య వివాదం

సి) న్యాయ శాఖ – ప్రజలు మధ్య వివాదం

డి) శాసన శాఖ – న్యాయ శాఖ మధ్య వివాదం

జవాబు: ఎ) శాసనశాఖ – న్యాయశాఖ మధ్యవివాదం

71. ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడలేదు

ఎ) ప్రాథమిక హక్కులు – ప్రభుత్వంపై పరిమితులు

బి) ఆదేశిక నియమాలు – ప్రభుత్వ బాధ్యతలు

సి) ప్రాథమిక విధులు – పౌరుల బాధ్యతలు

డి) పైవి ఏవీ కాదు

జవాబు: డి) పైవి ఏవీ కాదు

72.ఈ క్రింది వాటిని పరిశీలించండి

1) ఆదేశిక నియమాల అమలు కోసం న్యాయ స్థానాల జోక్యాన్ని కోరలేము

2) వీటికి న్యాయ సంరక్షణ లేదు

3) ఇవి సవరణకు అతీతం

4) ఇంతవరకు ఏ ఒక్క ఆదేశిక నియమం రాజ్యాంగం నుంచి తొలగించబడలేదు

పై వాటిలో సరైనవి

ఎ) 1, 2, 3, 4

బి) 2, 3

సి) 2, 4

డి) 2, 3, 4

జవాబు: సి) 2, 4

73. ఈ క్రింది ఏ ఆదేశిక సూత్రాలు సామ్యవాదేతర అంశాలుగా పరిగణించవచ్చు.

ఎ) స్త్రీ, పురుషులకు సమాన జీవన అవసరాలు

బి) మానవీయ పని ప్రదేశాలు

సి) ఉచిత న్యాయ సలహా

డి) యువతను దోడిపి నుంచి రక్షించటం

జవాబు: సి) ఉచిత న్యాయ సలహా

74. ప్రాథమిక హక్కులు ఆదేశిక నియమాల మధ్య ప్రస్తుతం ఎలాంటి సంబంధం ఉంది

ఎ) ప్రాథమిక హక్కులను ప్రభావితం చేసేలా ఏ ఆదేశిక నియమం అమలుచేసిన అవి చెల్లుబాటు కావు

బి) సమానత్వ హక్కును ఉల్లంఘించేలా ఆదేశిక నియమాలను అమలు చేయరాదు

సి) ఆదేశిక నియమాల్లో ప్రకరణ 39(a & b) అమలు చేస్తు చేసిన చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చెల్లుబాటు అవుతాయి.

డి) అన్ని విషయాల్లో ప్రాథమిక హక్కులదే పై చేయి అవుతుంది.

జవాబు: సి) ఆదేశిక నియమాల్లో ప్రకరణ 39(a & b) అమలు చేస్తు చేసిన చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చెల్లుబాటు అవుతాయి.

75. ఇంత వరకు అమలు కాని ఏకైక ఆదేశిక నియమం

ఎ) ప్రకరణ 44

బిప్రకరకణ 49

సి) ప్రకరణ 48

డి) పైవి ఏవీ కాదు

జవాబు: ఎ) ప్రకరణ 44

76. వికలాంగుల సంరక్షణ, సంక్షేమానికి సంబంధించిన ప్రకరణ

ఎ) 40

బి) 43

సి) 45

డి) 41

జవాబు: డి) 41

77. నిర్దేశిక నియమాల అమలు దేనిపై ఆధారపడి ఉంటుంది.

ఎ) న్యాయస్థానాల తీర్పులు

బి) ప్రజా చైతన్యం

సి) ప్రభుత్వ ఆర్థిక స్ధితి

డి) నాయకుల చిత్తశుద్ధి

జవాబు: సి) ప్రభుత్వ ఆర్థిక స్ధితి

78. రాజ్యాంగంలోని సామ్యవాదం అనేది జాతీయకరణలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది.

ఎ) ఎక్సెల్‌ వేర్‌ కేసు

బి) ఎల్‌ఐ.సీ ఆఫ్‌ ఇండియా

సి) మోహినీ జైన్‌ కేసు

డి) డి.ఎస్‌ నకారా కేసు

జవాబు: ఎ) ఎక్సెల్‌ వేర్‌ కేసు

79. ఇంత వరకు అమలుకాని ఏకైక నిర్దేశిక నియమం

ఎ) ఉమ్మడి పౌర నియమావళి

బి) నిరుద్యోగ భృతి

సి) సామ్యవాద తరహా సమాజం

డి) ఉచిత న్యాయ సలహా

జవాబు: ఎ) ఉమ్మడి పౌర నియమావళి

80. ప్రాథమిక హక్కులపై నిర్దేశిక నియమాల ఆధిపత్యానికి సంబంధించిన రాజ్యాంగ సవరణలు

ఎ) 24వ సవరణ

బి) 42వ సవరణ

సి) 44వ సవరణ

డి) ఎ & బి

జవాబు: డి) ఎ & బి

81. కింది వాటిలో ఏడో షెడ్యూల్‌లోని కేంద్ర జాబితాలో ఉన్న అంశం

ఎ) గనులు, చమురు క్షేత్రాల్లో పనిచేసే శ్రామికులు, వారి భద్రతను క్రమబద్ధీకరించడం

బి) వ్యవసాయం

సి) మత్స్య పరిశ్రమ

డి) ప్రజా ఆరోగ్యం

జవాబు: ఎ) గనులు, చమురు క్షేత్రాల్లో పనిచేసే శ్రామికులు, వారి భద్రతను క్రమబద్ధీకరించడం

82. కింది వివరాలను పరిశీలించండి.

1. దేశ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశంపై పార్లమెంటు చట్టం చేసేందుకు తీర్మానం చేసే అధికారం రాజ్యసభకు మాత్రమే ఉంది.

2. అత్యవసర పరిస్థితి విధించడాbనికి సంబంధించిన తీర్మానాలను లోక్‌సభ మాత్రమే ఆమోదిస్తుంది.

ఎ) 1 మాత్రమే సరైనది

బి) 2 మాత్రమే సరైనది

సి) రెండూ సరైనవి

డి) రెండూ సరికావు

జవాబు: ఎ) 1 మాత్రమే సరైనది

83. భారత రాజ్యాంగం ప్రకారం క్రింద పేర్కొన్న జతల్లో ఏది సరైనది కాదు.

ఎ) అడవులు – ఉమ్మడి జాబితా

బి) స్టాక్‌ ఎక్స్ఛేంజి – ఉమ్మడి జాబితా

సి) పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ – కేంద్ర జాబితా

డి) ప్రజా ఆరోగ్యం – రాష్ట్ర జాబితా

జవాబు: బి) స్టాక్‌ ఎక్స్ఛేంజి – ఉమ్మడి జాబితా

84. క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి.

1. భారత ప్రణాళికలను నిర్ణయించే అత్యున్నత సంస్థ భారత ప్రణాళికా సంఘం

2. ప్రణాళిక సంఘం కార్యదర్శి జాతీయాభివృద్ది మందలి కార్యదర్శిగా కూడా ఉంటారు.

౩. ఏడో షెడ్యూల్‌లోని ఉమ్మడి జాబితాలో క్రీడలు చేర్చారు.

పైన పేర్కొన్న వ్యాఖ్యల్లో సరైనవి.

ఎ) 1, 2

బి) 2, 3

సి) 2 మాత్రమే

డి) 3 మాత్రమే

జవాబు: ఎ) 1, 2

85. రాష్ట్ర ప్రభుత్వాలు తమ కార్య నిర్వహణాధికారాన్ని కేంద్ర కార్య నిర్వహణాధికారికి ఎటువంటి అవరోధం, ప్రమాదం ఏర్పడని విధంగా మాత్రవే వినియోగించుకోవాలని తెలియజేసే అధికరణం

ఎ) 257

బి) 258

సి) 355

డి) 356

జవాబు: ఎ) 257

86. కేంద్ర ప్రభుత్వం చేత విధించబడి, వసూలు చేయబడి రాష్ట్రాలకు ఇవ్వబడే పన్ను ఈ క్రింది వానిలో ఏది.

ఎ) ఎగుమతి, దిగుమతి సుంకాలు

బి) స్టాంపు డ్యూటీ

సి) ఆదాయపు పన్ను

డి) రైలు ఛార్జీలపై విధించే పన్ను

జవాబు: డి) రైలు ఛార్జీలపై విధించే పన్ను

87. శాంతి భద్రతలు ఏ జాబితాకు చెందినవి

ఎ) రాష్ట్ర జాబితా

బి) కేంద్ర జాబితా

సి) ఉమ్మడి జాబితా

డి) ఏదీ కాదు

జవాబు: ఎ) రాష్ట్ర జాబితా

88. అవశిష్ట అధికారం కలిగినది.

ఎ) కేంద్రం

బి) రాష్ట్రం

సి) రాష్ట్రపతి

డి) ప్రధానమంత్రి

జవాబు: ఎ) కేంద్రం

89. భారత సమాఖ్యకూ, అమెరికా సమాఖ్యకూ గల సాధారణ లక్షణం ఏది

ఎ) ఏక పౌరసత్వం

బి) రాజ్యాంగంలో మూడు జాబితాలు

సి) ద్వంద్వ న్యాయ వ్యవస్థ

డి) రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు ఒక సమాఖ్య న్యాయ వ్యవస్థ

జవాబు: డి) రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు ఒక సమాఖ్య న్యాయ వ్యవస్థ

90. భారత రాజ్యాంగం సమాఖ్యపూరితమని తెలియజేయునది

ఎ) లిఖిత, ధృఢ రాజ్యాంగము

బి) స్వతంత్ర న్యాయవ్యవస్థ

సి) కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన

డి) పై అన్నియు

జవాబు: డి) పై అన్నియు

91. భారత దేశంలోని ర్యాషాల మధ్య సహకారం సమన్వయాలకు ఉన్న రాజ్యాంగేతర, చట్టపరంకాని సాధనాలు ఏవి

1) జాతీయాభివృద్ధి మండలి

2) గవర్నర్ల సమావేశం

3) మండల కౌన్సిళ్ళు

4) అంత రాష్ట్ర మండలి

ఎ) 1, 2

బి) 1, 2, 3

సి) 3, 4

డి) 4

జవాబు: డి) 4

92. ఆదాయపు పన్ను విధింపు, వసూలు, పంపిణీకి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది.

ఎ) కేంద్రం విధించి, వసూలు చేసి, ఆ మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది.

బి) అన్ని పన్నులు కేంద్రం విధించి, వసూలు చేసిన మొత్తాన్ని తానే పొందుతుంది.

సి) అన్ని పన్నులు కేంద్రం విధించి, వసూలు చేసిన మొత్తాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది

డి)  ఆదాయపు పన్నుపై వసూలు చేసిన సర్‌ఛార్జీని మాత్రం కేంద్రం రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది.

జవాబు: ఎ) కేంద్రం విధించి, వసూలు చేసి, ఆ మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది.

93. ఈ క్రింది వారిలో ఎవరిని భారత ప్రభుత్వ సివిల్‌ సర్వీస్‌ ముఖ్య అధికారిగా భావించవచ్చు.

ఎ) హోం శాఖ కార్యదర్శి

బి) క్యాబినెట్‌ కార్యదర్శి

సి) సిబ్బంది శాఖా కార్యదర్శి

డి) ప్రధానమంత్రి కార్యదర్శి

జవాబు: బి) క్యాబినెట్‌ కార్యదర్శి

94. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలనా సంస్కరణల కమీషన్‌ మొదటి అధ్యక్షుదెవరు.

ఎ) గుల్జారీలాల్‌ నందా

బి) టి.టి.కృష్ణమాచారి

సి) మొరార్జీ దేశాయ్‌

డి) ఇందిరా గాంధీ

జవాబు: సి) మొరార్జీ దేశాయ్‌

95. ఈ క్రింది వానిలో దేనిపై ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకరణ 311 కింద ఇవ్వబడిన సంరక్షణ వర్తించదు.

ఎ) సస్పెండ్‌ చేయునప్పుడు

బి) హోదా తగ్గించినప్పుడు

సి) తీసివేసినప్పుడు

డి) బర్తరఫ్‌ చేసినప్పుడు

జవాబు: ఎ) సస్పెండ్‌ చేయునప్పుడు

96. కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనం కొరకు కేంద్రప్రభుత్వం నియమించిన కమీషన్‌ అధ్యక్షుడెవరు.

ఎ) జస్టిస్‌ ఎం.ఎం.పూంచి

బి) వి.కె.దుగ్గల్

సి) ధీరేంద్ర సింగ్‌

డి) మాధవీ మీనన్‌

జవాబు: ఎ) జస్టిస్‌ ఎం.ఎం.పూంచి

97. జంతు హింస నిషేధం రాజ్యాంగంలోని ఏ జాబితాలో ఉంది.

ఎ) యూనియన్‌ జాబితా

బి) రాష్ట్ర జాబితా

సి) ఉమ్మడి జాబితా

డి) అవశేషాధికారాలు

జవాబు: బి) రాష్ట్ర జాబితా

98. భారత సమాఖ్య విధానంను ఏకకేంద్ర విధానంగా ఎప్పుడు మార్చవచ్చు.

ఎ) ఆ విధంగా చేయాలని పార్లమెంటు నిశ్చయించినపుడు

బి) ఆ మేరకు రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానం రూపొందించు కున్నప్పుడు

సి) సాధారణ ఎన్నికల సమయంలో

డి) జాతీయ అత్యవసర పరిస్థితియందు

జవాబు: డి) జాతీయ అత్యవసర పరిస్థితియందు

99. అఖిల భారత సర్వీసులను ముఖ్యంగా ఐ.ఏ.ఎస్‌., ఐ,పి.ఎస్‌.లను రద్దు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది.

ఎ) కాకా కలేల్కర్ కమీషన్‌

బి) ఖేర్‌ కమీషన్‌

సి) రాజమన్నార్‌ కమీషన్‌

డి) సర్కారియా కమీషన్‌

జవాబు: సి) రాజమన్నార్‌ కమీషన్‌

100. ప్రాథమిక హక్కులకు మరోపేరు ఏంటి ?

ఎ) న్యాయ సంరక్షణ ఉన్న హక్కులు

బి) న్యాయ సంరక్షణ లేని హక్కులు

సి) నైతిక హక్కులు

డి) పౌర హక్కులు

జవాబు: ఎ) న్యాయ సంరక్షణ ఉన్న హక్కులు

Indian Constitution Practice Quiz in Telugu Part-2

Aso Read 👇👇

Indian Constitution Practice Quiz in Telugu Part-2

తెలుగులో భారత రాజ్యాంగ సాధన క్విజ్| Indian Constitution Practice Quiz in Telugu-2024

Indian Constitution Practice Quiz in Telugu Part-2 Indian Constitution Practice Quiz in Telugu Part-2

చాప్టర్-2 తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం సమాధానాలతో కూడిన ప్రశ్నలు | Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2

Indian Constitution Practice Quiz in Telugu Part-2 Indian Constitution Practice Quiz in Telugu Part-2

తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం సమాధానాలతో కూడిన ప్రశ్నలు | Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024

Indian Constitution Practice Quiz in Telugu Part-2

Indian Constitution Practice Quiz in Telugu Part-2

Indian Constitution Practice Quiz in Telugu Part-2 Indian Constitution Practice Quiz in Telugu Part-2 Indian Constitution Practice Quiz in Telugu Part-2 Indian Constitution Practice Quiz in Telugu Part-2 Indian Constitution Practice Quiz in Telugu Part-2 Indian Constitution Practice Quiz in Telugu Part-2 Indian Constitution Practice Quiz in Telugu Part-2 Indian Constitution Practice Quiz in Telugu Part-2

Indian Constitution Practice Quiz in Telugu Part-2 Indian Constitution Practice Quiz in Telugu Part-2 Indian Constitution Practice Quiz in Telugu Part-2 Indian Constitution Practice Quiz in Telugu Part-2 Indian Constitution Practice Quiz in Telugu Part-2 Indian Constitution Practice Quiz in Telugu Part-2 Indian Constitution Practice Quiz in Telugu Part-2 Indian Constitution Practice Quiz in Telugu Part-2

1 thought on “చాప్టర్-2 తెలుగులో భారత రాజ్యాంగ సాధన క్విజ్| Indian Constitution Practice Quiz in Telugu Part-2”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.