...

India vs England :Ravindra Jadeja Missed century-24 | సెంచరీ మిస్‌ చేసుకున్న జడేజా.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 436 ఆలౌట్‌

Written by lsrupdates.com

Updated on:

India vs England :Ravindra Jadeja Missed century-24 | India vs England: సెంచరీ మిస్‌ చేసుకున్న జడేజా.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 436 ఆలౌట్‌

India vs England : Ravindra Jadeja Missed century and India Bowled Out For 436 In First Innings Lead Of 190 Runs

India vs England 1st Test: ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 436 పరుగులకు ఆలౌట్ అయింది. మూడో రోజు ఆటలో టీమిండియా స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోయింది. ఓవర్‌ నైట్‌ స్కోరు 421/7కు మరో 15 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్‌ అయింది. రవీంద్ర జడేజా (87) సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌట్‌ కాగా, 190 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది.

ప్రధానాంశాలు:

  • ఇంగ్లాండ్-భారత్ మొదటి టెస్ట్ మ్యాచ్
  • సెంచరీ మిస్ చేసుకున్న రవీంద్ర జడేజా
  • ఫస్ట్ ఇన్సింగ్స్‌లో భారత్‌ 436 ఆలౌట్‌
India vs England : Ravindra Jadeja Missed century-24
       India vs England :Ravindra Jadeja Missed century-24

India vs England :Ravindra Jadeja Missed century-24 :

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 436 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓవర్‌ నైట్‌ స్కోరు 421/7తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. మరో 15 పరుగులు మాత్రమే జోడించి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. జో రూట్‌ వరుస బంతుల్లో రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్‌ బుమ్రాలను ఔట్‌ చేసి.. దెబ్బతీశాడు. చివరి వికెట్‌గా అక్షర్‌ పటేల్‌ ఔట్‌ అయ్యాడు.

ఓవర్‌ నైట్ స్కోరుతో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌కు..

ఓవర్‌ నైట్ స్కోరుతో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌కు.. జో రూట్‌ షాక్‌ ఇచ్చాడు. సెంచరీ చేసేలా కనిపించిన రవీంద్ర జడేజా (87)ను ఎల్బీడబ్ల్యూగా ఔట్‌ చేశాడు. అయితే జడేజా ఔట్‌ అనుమానస్పదంగా మారింది. రిప్లైలో ప్యాడ్‌ కన్నా ముందే బ్యాట్‌ తాకినట్లు కనిపించింది. కానీ అంపైర్‌ మాత్రం ఔట్‌ అని ప్రకటించడంతో జడేజా అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది.

ఆ తర్వాత వచ్చిన బుమ్రా..

ఆ తర్వాత వచ్చిన బుమ్రా.. తొలి బంతికే రూట్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత ఓవర్‌లో చివరి బంతికి అక్షర్‌ పటేల్‌ కూడా ఔట్‌ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో 121 ఓవర్లలో భారత్ 436 రన్స్‌కి ఆలౌట్ అయింది. టీమిండియా బ్యాటర్లలో రవీంద్ర జడేజా (87), కేఎల్‌ రాహుల్‌ (86), యశస్వి జైశ్వాల్‌ (80)లు రాణించారు.

ఇంగ్లాండ్‌ బౌలర్లలో స్పెషలిస్ట్‌ బౌలర్ల కంటే కూడా పార్ట్‌టైమ్‌ బౌలర్.. జో రూట్‌ అదరగొట్టాడు. వారికంటే ఎక్కువగా టీమిండియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. టామ్‌ హార్ట్లీ 2, రెహాన్‌ అహ్మద్‌ 2, జాక్‌ లీచ్‌ 1 వికెట్ తీశారు.

కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 246 పరుగులకు ఆలౌట్‌ అయింది. టీమిండియా 436 రన్స్‌ చేయగా.. 190 పరుగుల లోటుతో ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

Announced Padma Awards-2024 Full List – Lsrallinonenews.com

DGP Mahender Reddy Appointed as TSPSC Chairman-2024 | TSPSC ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి – Lsrallinonenews.com

Republic Day 2024: History importance significance and why we celebrate it. – Lsrallinonenews.com

New Route Map For Hyderabad Metro Phase 2 | హైదరాబాద్‌లో నూతన మెట్రో రైలు రూట్ మ్యాప్ రెడీ.. 70కిలోమీటర్ల నిర్మాణంపై హెచ్ఎంఆర్ఎల్ నిర్ణయం

Social Stock Exchange-2024: పెడితే రూపాయి రాదని తెలిసీ కోట్లు పెట్టుబడి..!

Announced Padma Awards-2024 Check Complete List Of Winners | పద్మ అవార్డుల ప్రకటన.. పూర్తి జాబితా ఇదే!!!

TJS President Kodandaram Appointed as MLC In Governor Quota Telangana-2024| గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్ కు ఎమ్మెల్సీ పదవి !!!

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.