...

India Bounce Back With Win Over England Jump To Second Place | వైజాగ్ టెస్టులో విజయంతో WTC పాయింట్ల పట్టికలో దూసుకొచ్చిన భారత్‌-2024

Written by lsrupdates.com

Published on:

India Bounce Back With Win Over England Jump To Second Place | వైజాగ్ టెస్టులో విజయంతో WTC పాయింట్ల పట్టికలో దూసుకొచ్చిన భారత్‌

World Test Championship: లక్ష్యం ఎంతైనా సరే కొట్టేస్తామంటూ ఇంగ్లాండ్. తమ ముందు ఆ ఆటలు సాగవంటూ భారత్! నాలుగో రోజు తొలి సెషన్లోనే ఇంగ్లిష్ జట్టు అయిదు వికెట్లు ఢమాల్. విజయానికి చేరువగా టీమ్ ఇండియా. కానీ బజ్బాల్తో ఎదురుదాడి చేసే ఇంగ్లాండ్ అంత సులువుగా వదిలితేగా! క్రాలీ కంగారు పెట్టాడు.

ముఖ్యాంశాలు :

  • రెండో టెస్టులో భారత్ గెలుపు
  • విజృంభించిన బుమ్రా,
  • అశ్విన్ ఇంగ్లాండ్ 292 ఆలౌట్

India Bounce Back With Win Over England Jump To Second Place

India Bounce Back With Win Over England Jump To Second Place | వైజాగ్ టెస్టులో విజయంతో WTC పాయింట్ల పట్టికలో దూసుకొచ్చిన భారత్‌
India Bounce Back With Win Over England Jump To Second Place | వైజాగ్ టెస్టులో విజయంతో WTC పాయింట్ల పట్టికలో దూసుకొచ్చిన భారత్‌

లక్ష్యం ఎంతైనా సరే కొట్టేస్తామంటూ ఇంగ్లాండ్. తమ ముందు ఆ ఆటలు సాగవంటూ భారత్! నాలుగో రోజు తొలి సెషన్లోనే ఇంగ్లిష్ జట్టు అయిదు వికెట్లు ఢమాల్. విజయానికి చేరువగా టీమ్ ఇండియా. కానీ బజ్బాల్ ఎదురుదాడి చేసే ఇంగ్లాండ్ అంత సులువుగా వదిలితేగా! క్రాలీ కంగారు పెట్టాడు. టెయిలెండర్లు పోరాడారు. లక్ష్యం కరుగుతూ వచ్చింది. ఉత్కంఠ తప్పదా? హైదరాబాద్లో మాదిరే విశాఖలోనూ స్టోక్స్ బృందం రోహిత్ సేనకు షాకిస్తుందా? అన్న భయాలు! కానీ ఈసారి కథ మారింది. అటు అశ్విన్.. ఇటు బుమ్రా చెలరేగిన వేళ విశాఖలో మనదే విజయ గర్జన. సిరీస్ సమమైంది. ఇక ఆధిక్యం వైపే అడుగులు!

టీమ్ ఇండియా లెక్క సరిచేసింది. హైదరాబాద్లో తొలి టెస్టులో ఓటమికి.. తెలుగు గడ్డపైనే ప్రతీకారం తీర్చుకుంది. విశాఖపట్నంలో మరో రోజు మిగిలి ఉండగానే ముగిసిన రెండో టెస్టులో భారత్ 106 పరుగుల తేడాతో ఇంగ్లాండు చిత్తుచేసింది. 399 పరుగుల ఛేదనలో ఓవర్నైట్ స్కోరు 67/1తో సోమవారం రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన ఇంగ్లిష్ జట్టు 292 పరుగులకు ఆలౌటైంది. మరోసారి జాక్ క్రాలీ (73) టాప్ స్కోరర్ గా నిలిచాడు. బుమ్రా (3/46), అశ్విన్ (3/72) ప్రత్యర్థిని పడగొట్టారు. ముకేశ్ (1/26), కుల్దేప్ (1/60), అక్షర్ (1/75) కూడా తలో వికెట్ సాధించారు. మ్యాచ్లో 9 వికెట్లు పడగొట్టిన బుమ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో అయిదు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. మూడో టెస్టు ఈ నెల 15న రాజ్కోట్లో ఆరంభమవుతుంది.

India Bounce Back With Win Over England Jump To Second Place | వైజాగ్ టెస్టులో విజయంతో WTC పాయింట్ల పట్టికలో దూసుకొచ్చిన భారత్‌
India Bounce Back With Win Over England Jump To Second Place | వైజాగ్ టెస్టులో విజయంతో WTC పాయింట్ల పట్టికలో దూసుకొచ్చిన భారత్‌

ఒక్క సెషన్లో అయిదు..:

ఇంగ్లాండ్ బజ్బాల్కు తొలి సెషన్ లోనే అయిదు వికెట్లతో కళ్లెం వేసిన బౌలర్లు భారత విజయాన్ని ఖాయం చేశారు. విశాఖ పిచ్పి బంతి చక్కగా తిరిగింది. అధిక బౌన్స్ లభించింది. అక్షర్ బయట నుంచి లోపలికి బంతిని స్పిన్ చేస్తూ, అశ్విన్ తనదైన శైలిలో వైవిధ్యంగా బంతులేస్తూ సాగారు. అయితే నాలుగో రోజు తొలి వికెట్ కోసం టీమ్ ఇండియా 9 ఓవర్ల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. నైట్ వాచ్మన్ రెహాన్ (23; ఓవర్నైట్ స్కోరు 9)తో కలిసి క్రాలీ (ఓవర్నైట్ స్కోరు 29) ఇన్నింగ్స్న నడిపించాడు. బుమ్రాను సమర్థంగా ఎదుర్కొన్న క్రాలీ.. స్పిన్నర్ల బౌలింగ్ లో పరుగుల వేట కొనసాగించాడు.

ఈ దశలో అక్షర్ ఓ చక్కటి బంతితో రెహాన్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కానీ పోప్ (23) వస్తూనే ఎదురు దాడికి దిగడం, క్రాలీ కూడా షాట్లు ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీళ్లిద్దరు కలిసి 39 బంతుల్లోనే 37 పరుగులు రాబట్టారు. అప్పుడు మాయ మొదలెట్టిన అశ్విన్.. వరుస ఓవర్లలో పోప్ పాటు రూట్ (16)ను ఔట్ చేసి గట్టిదెబ్బ కొట్టాడు. రోహిత్ పట్టిన సూపర్ క్యాచ్కు పోప్ నిష్క్రమించాడు. కుడి చేతి చిటికెన వేలి గాయంతో మూడో రోజు మైదానం వీడిన రూట్.. బ్యాటింగ్కు వస్తూనే రెండు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు. కానీ అశ్విన్ ముందు అతని పప్పులుడకలేదు. అక్షర్ పట్టిన క్యాచ్ తో రూట్ వెనుదిరిగాడు. మరోవైపు ఫోర్తో అర్ధశతకం చేరుకున్న క్రాలీ ప్రమాదకరంగా మారాడు. స్వీప్, కట్, స్ట్రెయిట్ డ్రైవ్, స్లాగ్ స్వీప్ బౌండరీలు రాబట్టాడు. బెయిర్హో (26)తో కలిసి పోరాడాడు.

ఈ సమయంలో బౌలింగ్ మార్పులతో రోహిత్ ఫలితం రాబట్టాడు. కుల్డీప్ వస్తూనే క్రాలీని ఎల్బీగా వెనక్కిపంపి జట్టులో సంతోషాన్ని నింపాడు. తక్కువ ఎత్తులో నేరుగా దూసుకొచ్చిన బంతిని ఆడటంలో క్రాలీ విఫలమయ్యాడు. సమీక్షలో భారత్ ఈ వికెట్ సాధించింది. ఇక బుమ్రా వరుసగా రెండో ఇన్నింగ్స్ నూ బెయిర్హోను బుట్టలో వేసుకున్నాడు. ఆఫ్ స్టంప్ ఆవల పడి లోపలికి వేగంగా దూసుకొచ్చిన బంతిని బెయిర్ ఆడలేకపోయాడు. తొలి సెషన్ అయ్యేసరికి మ్యాచ్ కాస్త భారత్ చేతుల్లోకి వచ్చినట్లే కనిపించింది.

ఆ జోడీ ఆడినా..

తొలి సెషన్ లో అయిదు వికెట్లు పడ్డా.. ఇంగ్లాండ్ 4.43 రక్తేట్తో 127 పరుగులు సాధించింది. స్టోక్స్ (11) క్రీజులో ఉండగా.. ఫోక్స్ (36) అతడికి సహకరించాడు. దీంతో మరో వికెట్ కోసం భారత్ శ్రమించింది. బుమ్రా ఏ క్షణమైనా వికెట్ తీసేలా కనిపించాడు. మరోవైపు స్పిన్నర్లు కూడా బ్యాటర్లను పరీక్షించారు. తట్టుకుని స్టోక్స్, పోక్స్ నెమ్మదిగా బ్యాటింగ్ కొనసాగించారు. కానీ శ్రేయస్ అద్భుతమైన పీల్డింగ్తో స్టోక్స్ రనౌటై వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ కథ ముగియడానికి ఇంకెంతోసేపు పట్టదనుకుంటే.. ఫోక్స్, హార్ట్లీ (36) కలిసి బౌలర్లను విసిగించారు. అలవోకగా పరుగులూ సాధించారు. లక్ష్యాన్ని కరిగించారు.

అశ్విన్ బౌలింగ్లో హార్టీని అంపైర్ ఔటిచ్చినా.. సమీక్ష అతనికి కలిసొచ్చింది. రివర్స్ స్వీప్ ఆడేందుకు హార్ట్ ప్రయత్నించగా.. అతని మణికట్టుకు పైన చేతికి తాకి గాల్లోకి లేచిన బంతిని డైవ్ చేస్తూ రోహిత్ అందుకున్నాడు. కానీ బంతి చేతి పైన తాకడంతో టీవీ అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. ఈ నిర్ణయం పై మైదానంలోని అంపైర్లతో రోహిత్ కాసేపు చర్చించాడు. వీళ్ల భాగస్వామ్యం 50 దాటింది. జట్టుకు అత్యవసరంగా వికెట్ కావాలి. అప్పుడు అందరు ఎవరి వైపు అయితే చూస్తారో అతనే బౌలింగ్కు వచ్చాడు.

బుమ్రా అవకాశాలను సృష్టించుకుని మరో రెండు వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించాడు. ముందుగా స్లో డెలివరీతో ఫోక్స్ను అతను బోల్తా కొట్టించాడు. బుమ్రాకు ఫోక్స్ రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. ఆ వెంటనే బషీర్ (0)ను ఔట్ చేసి ముకేశ్ ఈ మ్యాచ్లో తొలి వికెట్ సాదించాడు. త్వరగానే ఫలితం వచ్చేలా ఉండటంతో రెండో సెషన్ ను అరగంట పొడిగించారు. కానీ బుమ్రా ఎక్కువ ఆలస్యం చేయకుండా తనదైన శైలిలో రివర్స్ ఔట్స్వెంగర్తో హార్ట్ స్టంప్స్ ఎగరగొట్టి మ్యాచ్ ముగించాడు.

India Bounce Back With Win Over England Jump To Second Place | వైజాగ్ టెస్టులో విజయంతో WTC పాయింట్ల పట్టికలో దూసుకొచ్చిన భారత్‌
India Bounce Back With Win Over England Jump To Second Place | వైజాగ్ టెస్టులో విజయంతో WTC పాయింట్ల పట్టికలో దూసుకొచ్చిన భారత్‌

భారత్ తొలి ఇన్నింగ్స్: 396;
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 253;
భారత్ రెండో ఇన్నింగ్స్: 255;
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ ఎల్బీ (బి) కుల్డీప్ 73: డకెట్ (సి) భరత్ (బి) అశ్విన్ 28, రెహాన్ ఎల్బీ (బి)
అక్షర్ 23: పోప్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 23: రూట్ (సి) అక్షర్ (బి) అశ్విన్ 16, బెయిర్ స్టో ఎల్బీ (బి) బుమ్రా
26, స్టోక్స్ రనౌట్ 11, ఫోక్స్ (సి) అండ్ (బి) బుమ్రా 36: హార్ట్ (బి) బుమ్రా 36, బషీర్ (సి) భరత్ (బి) ముకేశ్ 0: అండర్సన్ నాటౌట్ 5; ఎక్స్ట్రా ట్రాలు 15;

మొత్తం: (69.2 ఓవర్లలో ఆలౌట్) 292;

వికెట్ల పతనం:

1-50, 2-95, 3-132, 4-154, 5-194, 6-194, 7-220, 8-275, 9-281;

బౌలింగ్:

బుమ్రా 17.2-4-46-3; ముకేశ్ 5-1-26-1; కుల్డీప్ 15-0-60-1; అశ్విన్ 18-2-72-3; అక్షర్ 14-1-75-1

ఇంగ్లాండ్పై టెస్టుల్లో అశ్విన్ వికెట్లు. ఈ జట్టుపై సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ అతనే. మాజీ లెగ్ స్పిన్నర్ చంద్రశేఖర్ (95) రికార్డును అతను బద్దలుకొట్టాడు.

India Bounce Back With Win Over England Jump To Second Place | వైజాగ్ టెస్టులో విజయంతో WTC పాయింట్ల పట్టికలో దూసుకొచ్చిన భారత్‌
India Bounce Back With Win Over England Jump To Second Place | వైజాగ్ టెస్టులో విజయంతో WTC పాయింట్ల పట్టికలో దూసుకొచ్చిన భారత్‌

బుమ్రా
“భారత్ బౌలింగ్ దళానికి నాయకుణ్ని అని చెప్పను. కానీ యువ బౌలర్లకు మార్గనిర్దేశం చేస్తా. రోహిత్తో సుదీర్ఘమైన అనుబంధం ఉంది. నాకు స్వేచ్ఛనిస్తాడు. పిచ్ను గమనిస్తా. పరిస్థితులను పరిశీలిస్తా. అందుకు అనుగుణంగా బౌలింగ్ చేస్తా”.

రోహిత్

“బుమ్రా ఛాంపియన్. కొంతకాలంగా జట్టు కోసం అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో టెస్టు గెలవడం అంత సులువు కాదు. బౌలర్లు సత్తాచాటాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మా వాళ్లు అదే చేశారు. యశస్వి తన ఆటను బాగా అర్థం చేసుకుంటాడు. అతనికి సుదీర్ఘ కెరీర్ ఉంది. అతను జట్టుకు ఏది అవసరమో దానిపై దృష్టి పెడతాడనే నమ్మకంతో ఉన్నా. బ్యాటింగ్లో మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సింది. మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మార్చాల్సింది. బ్యాటర్లకు ఆత్మవిశ్వాసం ఇవ్వడం మా బాధ్యత. ఈ యువ జట్టు పట్ల గర్వంగా ఉన్నా”.

ఆ క్యాచ్.. ఆ రనౌట్

రెండో టెస్టులో భారత విజయానికి జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనే కారణం. అయితే నాలుగో రోజు ఆటలో ఓ క్యాచ్, రనౌట్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 196 పరుగులతో టీమ్ ఇండియా ఓటమికి కారణమైన పోప్.. ఇప్పుడు ఛేదనలోనూ దూకుడు ప్రదర్శించాడు. 21 బంతుల్లో 5 ఫోర్లతో 23 పరుగులు రాబట్టాడు. ఆ దశలో అశ్విన్ బౌలింగ్లో రోహిత్ అందుకున్న మెరుపు క్యాచ్ తో అతను పెవిలియన్ చేరాడు. అధిక బౌన్స్తో పోప్ బ్యాట్ను తాకి వచ్చిన బంతిని స్లిప్లో మెరుపు వేగంతో తన ఎడమ వైపు తిరిగి ఠక్కుమని అందుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ రనౌట్ మ్యాచ్ పూర్తిగా మనవైపు తిరిగింది. ఫోక్స్ సింగిల్ కోసం ప్రయత్నించగా.. స్టోక్స్ స్పందించాడు. కానీ షార్ట్ మిడ్వికెట్ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన శ్రేయస్.. కిందకు వంగి ఒంటిచేత్తో బంతిని అందుకుని, అదే వేగంతో త్రో విసిరి స్టంప్స్ను పడగొట్టాడు. సాధారణంగానే పరుగెత్తిన స్టోక్స్ ఆ లోపు క్రీజులోకి చేరలేకపోయాడు.

శుభ్మను గాయం

టీమ్ ఇండియా యువ బ్యాటర్ శుభ్మన్ వేలికి గాయమైంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో కుల్స్టాప్ బౌలింగ్లో రెహాన్ క్యాచ్ పట్టే క్రమంలో అతనికి ఈ గాయమైంది. ఈ గాయంతోనే అతను రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసి శతకం సాధించాడు. మూడో రోజు ఆట ముగిసిన తర్వాత స్కానింగ్ తీయించుకున్నాడు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా నాలుగో రోజు ఫీల్డింగ్కు రాలేదు. తాను నాలుగైదు రోజుల్లో కోలుకుంటానని శుభ్మన్ చెప్పాడు.

India Bounce Back With Win Over England Jump To Second Place

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

Can Medigadda barrage withstand the flood? | మేడిగడ్డ బ్యారేజీ.. వరదను తట్టుకోగలదా? 2024

CM Revanth Reddy Tweet About Changing The Name Of TS To TG-2024 | అందుకే TSను TGగా మార్చాం

Panjagutta former CI Durga Rao arrested-2024 | పరారీలో ఉన్న పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావు అరెస్ట్

UBI Specialist Officer(SO) Recruitment 2024 Notification-దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇవే

ICG Navik GD Recruitment 2024 Apply Online for 260 Posts

Union Bank of India Recruitment 2024 Notification For 606 SO Posts

PNB Recruitment 2024 Notification for 1025 SO Posts

India Bounce Back With Win Over England Jump To Second Place

India Bounce Back With Win Over England Jump To Second Place

India Bounce Back With Win Over England Jump To Second Place

 

2 thoughts on “India Bounce Back With Win Over England Jump To Second Place | వైజాగ్ టెస్టులో విజయంతో WTC పాయింట్ల పట్టికలో దూసుకొచ్చిన భారత్‌-2024”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.