IND vs ENG 2nd Test Match Live Updates from Vizag | వైజాగ్ వేదికగా భారత్ – ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్.. లైవ్ అప్డేట్స్
ఇంగ్లాండ్ తొలి టెస్టులో (IND vs ENG) అనూహ్యమైన ఓటమిని చవిచూసిన టీమ్ ఇండియా.. సిరీస్లో వెనుకబడి పోకుండా ఉండాలంటే రెండో టెస్టులో గెలిచి తీరాలి. విశాఖపట్నం వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది.
IND vs ENG: ఆచితూచి ఆడుతున్న ఓపెనర్లు.. 5 ఓవర్లలో 9 పరుగులు
- ఇంగ్లాండ్ బౌలర్లు వికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
- అండర్సన్ బాల్ను అద్భుతంగా స్వింగ్ చేస్తూ బ్యాటర్లను నిలువరిస్తున్నాడు.
- మరోవైపు జోరూట్ స్పిన్ బౌలింగ్తో పరుగులను కట్టడి చేస్తున్నాడు.
- భారత ఓపెనర్లు మాత్రం జాగ్రత్తగా ఆడుతున్నారు.
- చివరి 5 ఓవర్లలో 9 పరుగులు వచ్చాయి.
- ప్రస్తుతం భారత స్కోరు 23/0 (10 ఓవర్లు).
- రోహిత్ శర్మ (10), జైస్వాల్ (13) బ్యాటింగ్ చేస్తున్నారు.
IND vs ENG: విశాఖ టెస్టు.. నిలకడగా ఆడుతున్న భారత ఓపెనర్లు
- బౌలింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ స్పిన్నర్, ఫాస్ట్ బౌలర్లను రంగంలోకి దింపింది.
- వరుసగా చెరో ఓవర్ వేస్తూ అండర్సన్, జో రూట్ వికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
- అండర్సన్ వేసిన మొదటి ఓవర్లో ఒక పరుగు మాత్రమే వచ్చింది.
- రూట్ వేసిన రెండో ఓవర్లో జైస్వాల్ రెండు ఫోర్లు బాదాడు.
- మూడో ఓవర్లో అండర్సన్ మూడు పరుగులిచ్చాడు.
- 4వ ఓవర్.. రూట్ ఒక పరుగు ఇచ్చాడు.
- 5వ ఓవర్.. ఒక పరుగు వచ్చింది.
- ప్రస్తుతం భారత స్కోరు 14/0 (5 ఓవర్లు).
- బ్యాటింగ్ రోహిత్ శర్మ (5), జైస్వాల్ (9).
IND vs ENG: రెండో టెస్టు.. తొలి రోజు ప్రారంభమైన ఆట
- రెండో టెస్టు తొలి రోజు ఆట ప్రారంభమైంది.
- క్రీజులోకి భారత బ్యాటర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ వచ్చారు.
- మొదటి ఓవర్ ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ వేస్తున్నాడు.
IND vs ENG: సర్ఫరాజ్కు దక్కని ఛాన్స్.. రజత్కు అవకాశం
- టీమ్ ఇండియా తుది జట్టులో సర్ఫరాజ్కు అవకాశం దక్కలేదు.
- రజత్ పటీదార్ టెస్టుల్లో ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేస్తున్నాడు.
ఇంగ్లాండ్ జట్టు :
జాక్ క్రాలే, బెన్ డకెట్, పోప్, జో రూట్, బెయిర్, బెస్టోక్స్ (కెప్టెన్), బెన్ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్, హార్ట్, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్.
భారత జట్టు :
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, రజత్ పటీదార్, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, బుమ్రా, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్.
IND vs ENG : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..
- విశాఖ వేదికగా కాసేపట్లో ప్రారంభం కానున్న రెండో టెస్టు.
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా.
ఆ రోజు రోడ్డు మీద ప్రాక్టీస్ చేసేవాణ్ని: సర్ఫరాజ్ ఖాన్
దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న ముంబయి బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) ఎట్టకేలకు భారత జట్టుకు ఎంపికయ్యాడు. విశాఖపట్నంలో ఇంగ్లాండ్ జరిగే రెండో టెస్టు కోసం అతడిని జట్టులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సర్ఫరాజ్ టీమ్ ఇండియా శిబిరంలో చేరి ప్రాక్టీస్ చేస్తున్నాడు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
విశాఖ టెస్ట్… రెండు మార్పులతో భారత్ను ఢీకొట్టనున్న ఇంగ్లాండ్!
అయిదు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ (IND vs ENG 2024) మధ్య ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. వైజాగ్లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటించింది. గాయపడిన జాక్ లీచ్ స్థానంలో కొత్త స్పిన్నర్ షోయబ్ బషీర్ను తీసుకున్నారు. ఇక మార్క్ వుడ్ స్థానంలో వెటరన్ బౌలర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) జట్టులోకి వచ్చాడు.
ఇంగ్లాండ్ తుది జట్టు:
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్హో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్.
“సర్ఫరాజ్ను తీసుకుంటారా? ఒకవేళ వస్తే ఏ స్థానంలో ఆడతాడు”
ఇంగ్లాండ్తో రెండో టెస్టులో (IND vs ENG) సర్ఫరాజ్ ఖాన్ను స్క్వాడ్లోకి తీసుకున్న భారత్ మేనేజ్మెంట్కు మాజీ క్రికెటర్ దీప్స్ గుప్తా రెండు ప్రశ్నలు వేశాడు. దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ 70 సగటుతో రాణించాడు. అయితే, కీలక మ్యాచుల్లో పెద్దగా రాణించలేదు. ఈ నేపథ్యంలో అతనికి అంతర్జాతీయ క్రికెట్లో రాణించగల సత్తా ఉందో, లేదో తెలియదని వ్యాఖ్యానించాడు.
విరాట్ టెక్నిక్స్ అద్భుతం.. వాటిని నేర్చుకోవడం తేలికేం కాదు: రజత్ పటీదార్
ఇంగ్లాండ్ (IND vs ENG) రెండో టెస్టు కోసం భారత్ ఇద్దరు కొత్త బ్యాటర్లను స్క్వాడ్లోకి తీసుకుంది. వీరిలో ఎవరు తుది జట్టులోకి వస్తారనేది ఆసక్తికరంగా మారింది. అందులో ఒకరు రజత్ పటీదార్ (Rajat Patidar). దేశవాళీ క్రికెట్లో లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చాడు. వైజాగ్లో సహచరులతో కలిసి నెట్స్లో శ్రమిస్తున్నాడు. తాజాగా అతడు మాట్లాడిన వీడియోను బీసీసీఐ (BCCI) తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్
చేసింది.
రెండో టెస్టుకు భారత బౌలింగ్ లో భారీ మార్పులు ఖాయం:
హర్భజన్ విశాఖపట్నం వేదికగా శుక్రవారం నుంచి ఇంగ్లాండ్ తో భారత్ రెండో టెస్టు మ్యాచ్ ఆడనుంది. తొలి మ్యాచ్లో అనూహ్య పరాజయంతో షాక్కు గురైన టీమ్ ఇండియా.. ఈసారి మాత్రం గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. అయితే, సీనియర్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా దూరం కావడం జట్టుకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకుల అంచనా. తుది జట్టుపై ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన ఫైనల్ XIను ప్రకటించాడు. యువ బ్యాటర్ అరంగేట్రం ఉంటుందని పేర్కొన్నాడు.
బషీర్ ను కేవలం అందుకోసమే తీసుకురాలేదు: బెన్ స్టోక్స్
“రెండో టెస్టులో జాక్ లీచ్ గాయం కారణంగా ఆడటం లేదు. దురదృష్టవశాత్తూ అతడి కాలు వాపు ఎక్కింది. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చాక ఇలా జరగడం లీచ్ తో పాటు జట్టును బాధకు గురి చేసింది. బషీర్ అరంగేట్రం గురించి కచ్చితంగా ఇప్పుడే చెప్పలేను. అతడికి అవకాశం వస్తే మాత్రం దీనిని అద్భుతమైన టెస్టుగా మార్చేందుకు ప్రయత్నిస్తాం. కెరీర్లో ఫస్ట్ టెస్టు అనేదానిని ఒకసారి మాత్రమే ఆడతాం. వైజాగ్ పిచ్ పరిస్థితిని అంచనా వేసి కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్, వైస్ కెప్టెన్ ఓలీ పోప్తో చర్చించి తుది జట్టుపై నిర్ణయం తీసుకుంటాం. బషీర్ స్క్వాడ్లో ఉన్నాడు. అతడిని కేవలం పర్యటన అనుభవం కోసమే ఇక్కడికి తీసుకురాలేదు. స్పిన్కు అనుకూలంగా ఉందని భావిస్తే బషీర్ను తుది జట్టులోకి తీసుకోవడానికి మొగ్గు చూపుతాం” అని స్టోక్స్ తెలిపాడు.
వైజాగ్ టెస్టు.. ‘ఫైనల్ XI’లో ఊహించని మార్పులుంటాయా..?
తొలి టెస్టులో ఊహించని పరాజయం మూటగట్టుకున్న భారత్కు రెండో టెస్టు (IND vs ENG) ప్రారంభం కాకముందే సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు జట్టుకు దూరమవ్వగా… ఫైనల్ 11లో ఎవరు అనే ప్రశ్న మరొకటి. సిరీస్లో మరింత వెనకబడిపోకుండా ఉండాలంటే ఈ మ్యాచ్లో విజయం అత్యవసరం. దీంతో ఈ సారి ఊహించని మార్పులు ఉంటాయి అని అంటున్నారు.
ఎట్టకేలకు సర్ఫరాజ్ వచ్చేశాడు… సీనియర్ల కంటే స్పెషలేంటి?
ఇంగ్లాండ్ (IND vs ENG) రెండో టెస్టుకు ముందు ఇద్దరు సీనియర్ భారత ఆటగాళ్లు గాయపడ్డారు. ఆ ఇద్దరికి బదులు మళ్లీ సీనియర్లనే తీసుకుంటారని అంతా భావించారు. తీరా.. కేవలం నాలుగు టెస్టులే ఆడిన వాషింగ్టన్ సుందర్ తో పాటు అంతర్జాతీయ క్రికెట్లోకి ఇంకా అడుగు పెట్టని మరో ఇద్దరికి అవకాశం దక్కింది. అందులో ఇప్పుడందరి దృష్టి సర్ఫరాజ్ ఖాన్పైనే (Sarfaraz Khan) పడింది. పుజారా, రహానె వంటి సీనియర్లను కాదని.. ఈ కుర్రాడివైపే బీసీసీఐ (BCCI) మొగ్గు చూపడానికి కారణాలున్నాయి.
1 thought on “IND vs ENG 2nd Test Match Live Updates from Vizag-2024 | వైజాగ్ వేదికగా భారత్ – ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్.. లైవ్ అప్డేట్స్”