Importance and History of Indian Republic Day in Telugu | రిపబ్లిక్ డే.. జనవరి 26నే ఎందుకు? భారత చరిత్రలో ఆ రోజుకు ఎందుకంతటి విశిష్టత?
Importance and History of Indian Republic Day 26th January Essay, Speech And Quotes In Telugu: Republic Day స్వాతంత్ర భారతావని మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 26న 21 ఫిరంగుల సెల్యూట్ స్వీకరించడంతోపాటూ, భారత జాతీయ జెండాను ఎగురవేసి దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటించారు. దాదాపు 200 ఏళ్ల బ్రిటిషర్ల పాలన అనంతరం.. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చినా.. 1950వ దశకంలోనే భారత్‌కు సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది. ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి ఎందరో స్వరాజ్య పోరాటంలో సమిధులుగా మారారు.
ప్రధానాంశాలు:
- లాహోర్ వేదికగా 1930లో పూర్ణ స్వరాజ్య తీర్మానం
- 1947 ఆగస్టు 15న బ్రిటిషర్ల పాలనకు ముగింపు
- 1950 జనవరి 26న గణతంత్ర దేశంగా భారత్
Republic Day వ్యాపారం కోసం దేశానికి వచ్చిన ఆంగ్లేయులు..
నాటి పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకుని, దేశంలోని అనైక్యతను ఆసరగా చేసుకుని క్రమంగా పట్టుసాధించారు. అనేక రాజ్యాలు, సంస్థాలుగా ఉన్న భారతావనిని.. విభజించు పాలించు విధానం అవలంభించి. అధికారం హస్తగతం చేసుకున్నారు. దాదాపు 2 శతాబ్దాలకుపైగా ఆంగ్లేయులు పాలనలో ఉన్న భరతమాతకు.. సుదీర్ఘ పోరాటం తర్వాత 1947లో విముక్తి లభించింది. దేశ స్వాతంత్రం కోసం వేలాది మంది ధన మాన ప్రాణత్యాగాలు చేశారు. అహింస అనే ఆయుధంతో భారతీయులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన గాంధీ.. జాతీయ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు.
అయితే, 1947 ఆగస్టు 15న స్వాతంత్ర వచ్చినా 1950వ దశకంలోనే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది. స్వాతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా 1950 జనవరి 26న భారత్ అవతరించింది. అదే రిపబ్లిక్ డే.. అయితే, దీని ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక సాధారణ సెలవు రోజు. సరదాగా ఇంటి పట్టున ఉంటూ సినిమాలు, షికార్లు, షాపింగ్‌లతోనూ కాలక్షేపం చేస్తారు. కానీ, దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి, స్వరాజ్య యజ్ఞంలో సమిధలైన గొప్ప వ్యక్తులను ఈ రోజు ఎంత మంది స్మరిస్తున్నారు? జాతీయ సెలవు రోజున ఎంత మంది వారి ఆదర్శాలను వల్లించుకుంటున్నారు? దేశ స్వాతంత్రం మీద నేటి యువతకి ఎంత అవగాహన ఉంది? అన్న అంశాలపై ఎవరైనా సర్వే నిర్వహిస్తే సిగ్గుతో తలదించుకునే విషయాలు బయటపడతాయి.
అసలు రిపబ్లిక్‌డేను జనవరి 26నే ఎందుకు జరుపుకోవాలి?
Importance and History of Indian Republic Day 26th January.
అసలు రిపబ్లిక్‌డేను జనవరి 26నే ఎందుకు జరుపుకోవాలి? అనే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చాలా మందికి తెలియదు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించింది.. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది… కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని భావిస్తారు. ఇందులో కాస్త నిజం లేకపోలేదు. కానీ, దీని వెనుక బలమైన కారణం ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు వేచి ఉన్నారు.
లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. నెహ్రూ సారథ్యంలో రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల స్వాతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అప్పటి దాకా కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు, సంపూర్ణ అధికారం భ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి, దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయినా ఫర్వాలేదనుకునేలా ఉన్న రాజకీయ నేతల వైఖరిని జలియన్‌వాలాబాగ్ ఉదంతం ఒక్కసారిగా కళ్లు తెరిపించింది.
నాడు సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు. ఆ రోజునే స్వాతంత్య్ర దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ప్రజలకు పిలుపు ఇచ్చింది. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన 1949లో పూర్తయినా.. మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి దానిని అమల్లోకి తెచ్చారు.
జనవరి 26, 1950 నుంచి బ్రిటీష్ కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం -1935 రద్దయ్యింది. ఆ రోజున భారత్ సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శినికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటుచేశారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్‌ను ఎన్నికోగా, రాజ్యాంగ రచనా ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా డాక్టర్ అంబేడ్కర్ ఛైర్మన్‌ను నియమించారు.
రాజ్యాంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంలో రూపొందించారు. అనేక సవరణల అనంతరం, 1949 నవంబర్ 26న దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలం పట్టింది. రాజ్యాంగ రచనకు మొత్తం రూ.64 లక్షలు ఖర్చయ్యింది.
భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ, అందులోని అనేక అంశాలను ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. బ్రిటీష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తరువాత భారత పౌరులందరిని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్ర్య పోరాట ఆశయాలను నెరవేర్చడానికి, రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇది జనవరి 26, 1950 నుంచి అమలులోకి వచ్చింది. ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికతత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది.
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం వేళ గణతంత్ర పరేడ్‌కు పోటీగా అదేరోజున సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారీఎత్తున రైతుల పరేడ్ నిర్వహించడం గమనార్హం. ప్రజలు పోరాడి సాధించిన ఈ గణతంత్రంలో రైతులు, కార్మికులు లేకుంటే కండపుష్టి వచ్చేది కాదని, ఆ రోజు స్వాతంత్య్రం తెచ్చిందీ రైతులే.. ఈ 74 ఏళ్ల స్వతంత్ర భారతం యొక్క మనుగడను కాపాడుతున్నదీ రైతులే అని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు.
ఇక, తొలి గణతంత్ర దినోత్సవం నాటికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతిగా ఉన్నారు. రాజ్యాంగం అమలైన తర్వాత ఆయన ప్రస్తుత పార్లమెంట్ దర్బార్ హాల్‌లో రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. ఐదు మైళ్ల పొడవున సాగిన పరేడ్ తర్వాత, ఆయన ఇర్విన్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు. వీదేశీ పాలన పూర్తిగా అంతరించి, అధికారాన్ని అప్పగించిన గురుతులే రిపబ్లిక్ డే! స్వతంత్ర దేశంగా పురుడుపోసుకుని ప్రపంచ దేశాల కూటమిలో సంపూర్ణ స్వతంత్ర దేశంగా భారత్ చేరింది.
Importance and History of Indian Republic Day in Telugu-2024
75th Republic Day 2024: గణతంత్ర దినోత్సవం 2024 ప్రత్యేకతలివే.. ఈ ఏడాది రిపబ్లిక్ డే ఛీఫ్ గెస్ట్, థీమ్ ఇదే..!
- January 26 Republic Day 2024 Know History Significance Theme And Chief Guest.
75th Republic Day Parade : జనవరి 26న భారతదేశం అంతటా ప్రజలు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీ గెజిటెడ్ సెలవుదినం.
Republic Day 2024 – January 26 : జనవరి 26న యావత్ భారతావని గణతంత్ర వేడుకలు (Republic Day 2024) ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఢిల్లీలో జరగనున్న ఈ వేడుకలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన రెండు రోజులపాటు జరగనున్నాయి. జనవరి 29న బీటింగ్ రిట్రీట్ వేడుకతో ముగుస్తాయి.
భారత్ ఆగష్టు 15, 1947న బ్రిటిషర్ల నుంచి స్వాతంత్ర్యం పొందింది. రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949న రాజ్యాంగ సభ ఆమోదించింది. జనవరి 26, 1950న అమల్లోకి వచ్చింది. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ రోజున జాతీయ జెండాను ఆవిష్కరించారు. అప్పటి నుంచి ప్రతి యేటా జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
Republic Day 2024 పరేడ్‌లో ఏం చేస్తారు..?
ప్రతియేటా గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో అద్భుతమైన సైనిక కవాతు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక సంస్కృతి ఇందులో ప్రతిబింబిస్తుంది. వేడుకలు చూసేందుకు ప్రధాని, కేంద్ర మంత్రిమండలితో సహా అనేక రాష్ట్రాల నుంచి ప్రముఖులు హాజరవుతారు. ఈ సందర్భంగా చేపట్టే శకటాల ప్రదర్శన రోజుకే హైలెట్ గా నిలుస్తుంది. కవాతు రాష్ట్రపతి భవన్ సమీపంలోని రైసినా హిల్‌లో ప్రారంభమై.. ఇండియా గేట్ నుంచి ఎర్రకోట వరకు సుమారు 5 కి.మీ.మేర సాగుతుంది.
Also Read: https://lsrupdates.com/whatsapp-latest-features-2024/
Republic Day 2024 ముఖ్య అతిథి ఎవరంటే..?
భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఆహ్వానం అందింది. దేశ రాజధానిలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ నాయకుడు ముఖ్య అతిథిగా రావడం ఇది ఆరోసారి. గతేడాది ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సీసీ హాజరరైన విషయం తెలిసిందే.
2024 కవాతు ప్రత్యేకత ఏంటి?
ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్‌లో రక్షణ దళాలకు చెందిన రెండు మహిళా బృందాలు కవాతు చేయనున్నాయి. “144 మంది సిబ్బందితో కూడిన ఒక బృందంలో మొత్తం మహిళా సైనికులు ఉంటారు. ఇందులో 60 మంది ఆర్మీ కాగా మిగిలినవారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీకి చెందిన వారు” అని రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో మొత్తం 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల నుండి మొత్తం 2,274 మంది క్యాడెట్‌లు నెల రోజుల పాటు జరిగే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) రిపబ్లిక్ డే క్యాంప్ 2024లో పాల్గొంటారు.
డిసెంబరు 30, 2023న సర్వ ధర్మ పూజతో ఢిల్లీ కాంట్‌లోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో క్యాంప్ 2024 ప్రారంభమైంది. ఈ వైవిధ్యమైన భాగస్వామ్యంలో జమ్మూ, కాశ్మీర్, లడఖ్ నుండి 122 మంది క్యాడెట్‌లు ఉన్నారు, ఈశాన్య ప్రాంతం నుంచి 171 మంది కాకుండా మినీ ఇండియాకు సంబంధించిన సూక్ష్మరూపాన్ని ప్రభావవంతంగా చిత్రీకరిస్తున్నారు.
Republic Day 2024 థీమ్ ఏంటి?
2024 రిపబ్లిక్ డే థీమ్ ”India – Mother of Democracy”, ”విక్షిత్ భారత్” (అభివృద్ధి చెందిన భారతదేశం) అని అర్థం.
గణతంత్ర వేడుకలను ఎలా చూడాలంటే..?
జనవరి 26న జరిగే గణతంత్ర కవాతును వీక్షించడానికి ప్రత్యక్ష ప్రసారం కోసం మీరు దూరదర్శన్ టీవీ ఛానెల్‌ని ట్యూన్ చేయవచ్చు. రిపబ్లిక్ డే పరేడ్‌కు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం జనవరి 26న ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. అంతేకాకుండా మీరు మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో యొక్క అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ల్లో కూడా దీన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. టీవీలు అందుబాటులో లేని వారికి మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో కవాతును ప్రసారం చేయడం అనుకూలమైన ఎంపికను అందిస్తుంది.
Importance and History of Indian Republic Day in Telugu-2024
Importance and History of Indian Republic Day in Telugu
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
Penny Multibagger Stocks of GG Engineering & Akshar Spintex Ltd
1 thought on “Importance and History of Indian Republic Day in Telugu-2024”