...

Hyderabad Police Rude Behavior with ABVP woman leader | ABVP నాయకురాలిని బైక్‌పై వెంబడించి.. జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన పోలీసులు

Written by lsrupdates.com

Updated on:

Hyderabad Police Rude Behavior with ABVP woman leader:

ABVP నాయకురాలిని బైక్‌పై వెంబడించి.. జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన పోలీసులు…Hyderabad Police Rude Behavior with ABVP woman leader in Rajendra Nagar Agricultural University.

Students Protest at Hyderabad University: హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో జరుగుతున్న విద్యార్థుల నిరసన ఉద్రిక్తంగా మారింది. జీవో నెం.55 కింద.. అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను నూతన హైకోర్టు నిర్మాణానికి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. నిరసనకారులను చెదరగొట్టే క్రమంలో.. ఏబీవీపీ నాయకురాలి పట్ల పోలీసులు కర్కషంగా వ్యవహించగా.. అందుకు సంబంధించి వీడియో వైరల్‌గా మారింది.

Watch this video :

https://x.com/NarsaiahBoora/status/1750206452155797795?s=20

Hyderabad Police Rude Behavior with ABVP woman leader.

ABVP Leader Video: ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ మాటలు చెప్పే రక్షకభటులు.. నిరసనలు, ఆందోళనలు జరిగినప్పుడు మాత్రం అదేంటో నిరసనకారులపై తమ ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తుంటారు. నిరసన వ్యక్తం చేసేది రాజకీయ నాయకులు కాకుండా విద్యార్థులో, రైతులో, మహిళలో అయితే మాత్రం.. వారిపట్ల కొంచెం క్రూరంగానే వ్యవహరిస్తుంటారు. దీనికి సాక్ష్యమే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. జీవో నెం.55ను వ్యతిరేకిస్తూ.. హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో గత కొన్ని రోజులుగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. నిరసనకారులను చెదరగొట్టే క్రమంలో.. పోలీసులు కాస్త దురుసుగా ప్రవర్తించారు.

విద్యార్థులకు మద్దతు తెలుపుతూ.. ఈరోజు ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుండగా.. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే.. ఏబీవీపీ ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ ఝాన్సీ.. పోలీసులను తప్పించుకుని పరుగెత్తారు. ఆమెను పట్టుకునేందుకు.. ఇద్దరు మహిళా పోలీసులు.. స్కూటీపై ఆమెను వెంబడించారు. దగ్గరికి చేరుకోగానే.. వెనుక ఉన్న పోలీసు ఝాన్సిని ఆపే ప్రయత్నంలో జుట్టును పట్టుకున్నారు. అయితే.. స్కూటీ రన్నింగ్‌లో ఉండటంతో.. ఝాన్సి కింద పడిపోయారు. అయినప్పటికీ.. ఆ పోలీసు జుట్టు వదలకుండా అలాగే పట్టుకున్నారు. అయితే.. ముందున్న పోలీసు బండిని వెంటనే ఆపేసింది. అయితే.. ఈ ఘటనలో విద్యార్థి నాయకురాలికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే.. బండిని వెంటనే ఆపేయటంతో.. పెద్ద ప్రమాదమే తప్పింది.

వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులకు అండగా నిలిచిన ఏబీవీపీ కార్యకర్త ఝాన్సీ పట్ల అమానుషంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఏబీవీపీ మహిళా కార్యకర్తపై లేడీ కానిస్టేబుల్స్‌ వ్యవహరించిన తీరు చూస్తే సభ్యసమాజం తలదించుకుంటోంది.

https://twitter.com/RaoKavitha/status/1750173391280333157/video/1

https://x.com/NarsaiahBoora/status/1750206452155797795?s=20

కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో.. ఈ ఘటన ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఒక విద్యార్థి నాయకురాలి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించాలా అని విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంచెం కూడా కనికరం లేకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లటమేంటని.. మండిపడుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసులమని చెబుతూ ఇలా కర్కషంగా వ్యవహరించటంపై సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నారు. ఇదే విషయంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా స్పందించారు. పోలీసులపై, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే.. అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను నూతన హైకోర్టు నిర్మాణం కోసం ఇవ్వొద్దని విద్యార్థులు చాలా రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వానికి ఇచ్చే స్థలంలో.. పరిశోధనకు ఉపయోగపడే మొక్కలు ఉన్నాయని, అందువల్ల ఈ భూములను హైకోర్టుకు తీసుకొవద్దని డిమాండ్ చేస్తున్నారు. జీవో నెం.55 ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

Nova Agritech IPO Details with GMP | నోవా అగ్రిటెక్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన

Zee Entertainment share price down 30 Percentage after Sony deal failure| కుప్పకూలిన దిగ్గజ కంపెనీ స్టాక్.. ఒక్కరోజే 30 శాతం పతనం.. ఆ ఒక్క కారణంతోనే..!

TSRTC Apprenticeship Notification-2024 | డిగ్రీతో 150 ఖాళీల భర్తీకి RTC నోటిఫికేషన్‌ విడుదల.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు.. రీజియన్ల వారీగా ఖాళీలివే

History of Ayodhya ram mandir in Telugu-2024 | అయోధ్య రామ మందిరం గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు..!!!

Brisk Technovision IPO Details Date, Price, Allotment -2024 (lsrallinonenews.com)

Megatherm Induction IPO News-2024 గ్రేమార్కెట్లో దూసుకుపోత (lsrallinonenews.com)

HDFC Bank share price extends decline; plunges over 10% (lsrallinonenews.com)

Ayodhya Ram Mandir Pics-2024 – Lsrallinonenews.com

Multibagger Stock-2024 : రూ. 10 వేలను రూ. 12.10 లక్షలు చేసిన (lsrallinonenews.com)

Hyderabad Police Rude Behavior with ABVP woman leader.

1 thought on “Hyderabad Police Rude Behavior with ABVP woman leader | ABVP నాయకురాలిని బైక్‌పై వెంబడించి.. జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన పోలీసులు”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.