...

మీకు జీరో కరెంట్ బిల్ రాలేదా..? అయితే వెంటనే ఇలా చేయండి..! | How to Apply Again If They Don’t Get Zero Current Bills Of Gruha Jyothi Scheme-2024

Written by lsrupdates.com

Published on:

మీకు జీరో కరెంట్ బిల్ రాలేదా..? అయితే వెంటనే ఇలా చేయండి..! | How to Apply Again If They Don’t Get Zero Current Bills Of Gruha Jyothi Scheme-2024

How to Apply Again If They Don’t Get Zero Current Bills Of Gruha Jyothi Scheme: గృహజ్యోతి పథకంలో(Gruha Jyothi Scheme) భాగంగా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించేవారికి ఈనెల 1 నుంచి జీరో బిల్లులు(Zero Current Bills) జారీ చేస్తున్నారు. అయితే చాలా మంది అర్హులకు జీరో బిల్లులు రావటం లేదు. రేషన్, ఆధార్, విద్యుత్ సర్వీస్ నెంబర్లలో తప్పుల కారణంగా వారికి పథకం అమలు కావటం లేదు.అర్హులుగా ఉండి జీరో బిల్లులు(Zero Current Bills) రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. మండల పరిధిలోని ఎంపీడీవో ఆఫీసుకు వెళ్లి మరోసారి దరఖాస్తులు చేసుకోవాలని చెబుతున్నారు. జీరో బిల్లుల(Zero Current Bills)పై పూర్తి సమాచారం శాఖకు చేరగానే ఆ మరుసటి నెల నుంచే సున్నా బిల్లులు వర్తింపజేస్తామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.

ముఖ్యాంశాలు :

  • గృహజ్యోతి పథకం జీరో బిల్లులు
  • అర్హులకు రాని బిల్లులు
  • మళ్లీ అప్లయ్ చేసుకోవాలంటున్న విద్యుత్ అధికారులు

రాష్ట్రంలో 10 లక్షలకు పైగా..

తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపుతో పాటు ఇటీవల మరో రెండు గ్యారంటీలైన రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్(Zero Current Bills) పథకాలను ప్రారంభించారు. ఇప్పటికే విద్యుత్ అధికారులు జీరో కరెంట్(Zero Current Bills) బిల్లులు తీస్తున్నారు. రాష్ట్రంలో 10 లక్షలకు పైగా వినియోగదారులకు ‘జీరో’ విద్యుత్‌ బిల్లులు జారీ అయ్యాయి.

మీకు జీరో కరెంట్ బిల్ రాలేదా..? అయితే వెంటనే ఇలా చేయండి..! | How to Apply Again If They Don't Get Zero Current Bills Of Gruha Jyothi Scheme-2024
How to Apply Again If They Don’t Get Zero Current Bills Of Gruha Jyothi Scheme-2024

ఈ నెల 1 నుంచి గృహజ్యోతి పథకం(Gruha Jyothi Scheme)లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించిన వారికి సున్నా బిల్లులు ఇస్తున్నారు. 5వ తేదీ వరకు టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో 2.5 లక్షలు, ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 7.5 లక్షల మంది వినియోగదారులకు జీరో బిల్లులు అందించారు. తెలంగాణ వ్యాప్తంగా తొలి విడతలో 39.9 లక్షల మందిని అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ వచ్చేలోపే వీరందరికీ సున్నా బిల్లింగ్‌ పూర్తి చేయాలని భావించినా.. క్షేత్రస్థాయిలో అనుకున్నంత వేగంగా సాగడం లేదు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో గృహజ్యోతి పథకాన్ని ఆరంభించలేదు.

డేటా ఎంట్రీలో పొరపాట్ల..

మిగిలిన జిల్లాల్లో కొందరికి జీరో బిల్లులు రావటం లేదు. 200 యూనిట్లలోపు విద్యుత్ వాడినా.. జీరో బిల్లులు రావటం లేదు. దాంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసి రేషన్ కార్డు కలిగిన తమకు సున్నా బిల్లులు రాలేదని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. వారిచ్చిన రేషన్ కార్డులు, ఆధార్‌, విద్యుత్‌ సర్వీస్‌ నంబర్లలో తప్పులు ఉండడం, డేటా ఎంట్రీలో పొరపాట్ల కారణంగా సమాచార ధ్రువీకరణ జరగలేదని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.

అర్హులుగా ఉండి జీరో బిల్లులు రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. మండల పరిధిలోని ఎంపీడీవో ఆఫీసుకు వెళ్లి మరోసారి దరఖాస్తులు చేసుకోవాలని చెబుతున్నారు. జీరో బిల్లుల(Zero Current Bills)పై పూర్తి సమాచారం శాఖకు చేరగానే ఆ మరుసటి నెల నుంచే సున్నా బిల్లులు వర్తింపజేస్తామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.

How to Apply Again If They Don’t Get Zero Current Bills Of Gruha Jyothi Scheme-2024

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

దక్షిణ భారత్‌కు తెలంగాణ గేట్‌వేలా నిలుస్తుంది : మోదీ | PM Narendra Modi Inaugurated the CARO at Begumpet-2024

How to Apply Again If They Don’t Get Zero Current Bills Of Gruha Jyothi Scheme-2024

How to Apply Again If They Don’t Get Zero Current Bills Of Gruha Jyothi Scheme-2024

1 thought on “మీకు జీరో కరెంట్ బిల్ రాలేదా..? అయితే వెంటనే ఇలా చేయండి..! | How to Apply Again If They Don’t Get Zero Current Bills Of Gruha Jyothi Scheme-2024”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.