...

Group-1 Notification Soon with Additional 60 Vacancies | 60 అదనపు ఖాళీలతో త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్

Written by lsrupdates.com

Published on:

Group-1 Notification Soon with Additional 60 Vacancies | త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్ అదనంగా 60 ఖాళీలు

ప్రశ్నపత్రాలు లీకైనందున గతంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను రద్దుచేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. 60 ఖాళీలు అదనంగా చేర్చి త్వరలో కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు.

ప్రధానాంశాలు:

  • గతంలో నిర్వహించిన పరీక్షల రద్దు
  • త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్ అదనంగా 60 ఖాళీలు
  • 15 రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ
  • వయో పరిమితి సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తాం
  • సింగరేణిలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే

ప్రశ్నపత్రాలు లీకైనందున గతంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను రద్దుచేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. 60 ఖాళీలు అదనంగా చేర్చి త్వరలో కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. వయో పరిమితి సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నియామక బోర్డుల ద్వారా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

Also Read:👇

Free Electricity only for Ration card holders under the Gruha Jyothi Scheme-2024 | రేషన్‌కార్డు ఉంటేనే ‘గృహజ్యోతి’ ఉచిత కరెంటు?

జాబ్ క్యాలెండర్..

జాబ్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహించి నియామక ప్రక్రియ పూర్తిచేస్తామని స్పష్టంచేశారు. సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాలకు ఎంపికైన 441 మందికి బుధవారం నెక్లెస్ రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నియామకపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబంలోని నలుగురి ఉద్యోగాలు ఊడగొట్టేందుకు కృషిచేసిన నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందన్నారు.

Group-1 Notification Soon with Additional 60 Vacancies | 60 అదనపు ఖాళీలతో త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్
               Group-1 Notification Soon with Additional 60 Vacancies | 60 అదనపు ఖాళీలతో త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్

అధికారంలోకి వచ్చిన వెంటనే స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీచేశామని గుర్తుచేశారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులకు సంపూర్ణమైన విశ్వాసం కల్పించడానికే ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. మరో పక్షం రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.

సింగరేణి ఖాళీల్లో 80 శాతం ఆ ప్రాంతం వారికే:

సింగరేణి నుంచి..

“సింగరేణి నుంచి కొనుగోలు చేసిన బొగ్గుకు సొమ్ములు చెల్లించకుండా సంస్థ ఖాయిలా పడే పరిస్థితిని కేసీఆర్ ప్రభుత్వం కల్పించింది. కేంద్రం గనులను ప్రైవేటుపరం చేస్తూ సంస్థ మనుగడను దెబ్బతీస్తున్నా అప్పటి పాలకులు ప్రశ్నించలేదు. ఇతర సమస్యల పరిష్కారంలోనూ పదేళ్లుగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. అందుకే సింగరేణి కార్మిక కుటుంబాలు కాంగ్రెస్కు అండగా నిలిచాయి. ఆ ప్రాంత ఎమ్మెల్యేలను అత్యధిక మెజార్టీతో గెలిపించాయి. సింగరేణి ఎన్నికల్లోనూ కార్మికులు కారు పార్టీకి బుద్ధి చెప్పారు.

Group-1 Notification Soon with Additional 60 Vacancies | 60 అదనపు ఖాళీలతో త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్
                    Group-1 Notification Soon with Additional 60 Vacancies | 60 అదనపు ఖాళీలతో త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్

పోలైన 38 వేల ఓట్లలో భారాసకు చెందిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి 1,298 ఓట్లు మాత్రమే దక్కేలా చేయడం ద్వారా భారాసకు అక్కడ స్థానం లేదని తేల్చిచెప్పారు. అందుకే అక్కడి సమస్యల పరిష్కారానికి కంకణం కట్టుకున్నాం. సంస్థలో ఏర్పడే ఖాళీల్లో 80 శాతం సింగరేణి ప్రాంతం వారికే ఇవ్వాలని నిర్ణయించాం. ఖాళీల భర్తీకి అవసరమైన చర్యలు తీసుకున్నాం. సంస్థ పరిధిలోని ఉద్యోగాల భర్తీలో వయో పరిమితిని సడలించాలని సింగరేణి సీఎండీకి సూచించాం. గుర్తింపు పొందిన కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటుచేసి ఆ ప్రాంతంలో సమస్యలన్నీ పరిష్కరిస్తాం” అని సీఎం రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు.

యువత ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తాం- భట్టి:

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఖాళీలన్నీ భర్తీచేసి యువత ఆశలను, ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేరుస్తామన్నారు. గత ప్రభుత్వం సింగరేణిలో భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ అవసరాలకు మాత్రమే కార్మికులను వాడుకుందని ఆరోపించారు.

భారాస ప్రభుత్వం కొనసాగి ఉంటే సింగరేణిలో ఉద్యోగాల సంఖ్యను 42 వేల నుంచి 5 వేల మందికి కుదించేదని, ప్రస్తుతం ఆ ప్రమాదం లేదని తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న గనులన్నీ సింగరేణికే చెందేలా కేంద్రంతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, ఒకప్పుడు సింగరేణిలో లక్షా 30 వేల మంది పనిచేసే వారని, ప్రస్తుతం ఆ సంఖ్య మూడు వంతులు తగ్గిందన్నారు. వేలం బిడ్డింగ్లో సింగరేణి పాల్గొనకపోవడం వల్లనే కొత్త గనులు రావడం లేదని అభిప్రాయపడ్డారు. వేలంలో పాల్గొనేలా సింగరేణిని ఆదేశించాలని సీఎంకు విన్నవించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సంస్థ సీఎండీ బలరాం తదితరులు పాల్గొన్నారు.

Telangana CM Revanth Reddy  about Jobs :

టీఎస్‌పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వెల్లడించారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. కొత్తగా ఎంపికైన 6,956 మంది స్టాఫ్‌ నర్సులకు నియామకపత్రాలు అందజేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో 15,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు.

Group-1 Notification Soon with Additional 60 Vacancies | 60 అదనపు ఖాళీలతో త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్
             Group-1 Notification Soon with Additional 60 Vacancies | 60 అదనపు ఖాళీలతో త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘విద్యార్థుల త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. స్టాఫ్‌ నర్సుల నియామకం చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది. ఇది పేదలకు ఉద్యోగాలు ఇచ్చి వారి కళ్లలో ఆనందం చూసే ప్రభుత్వం. ఆరోగ్య తెలంగాణ నిర్మించడంలో వారిదే కీలకపాత్ర. గడిచిన పదేళ్లలో తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేరలేదు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుంది. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనలో భాగంగా కొత్త చైర్మన్‌, సభ్యులను నియమించాం. ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం’’ అని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

Group-1 Notification Soon with Additional 60 Vacancies | 60 అదనపు ఖాళీలతో త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్

Free Electricity only for Ration card holders under the Gruha Jyothi Scheme-2024

Group-1 Notification Soon with Additional 60 Vacancies

Group-1 Notification Soon with Additional 60 Vacancies-2024

1 thought on “Group-1 Notification Soon with Additional 60 Vacancies | 60 అదనపు ఖాళీలతో త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.