...

Governor Tamilisai Speech In Telangana Assembly Budget Session 2024 | ప్రతి ఇంటికి ఇంటర్నెట్‌.. మూసీ అభివృద్ధితో ఉపాధి..

Written by lsrupdates.com

Published on:

Governor Tamilisai Speech In Telangana Assembly Budget Session 2024 | ప్రతి ఇంటికి ఇంటర్నెట్‌.. మూసీ అభివృద్ధితో ఉపాధి..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాళోజీ కవితతో గవర్నర్ తమిళిసై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కంచెను తొలగించామని.. ప్రజాభవన్‌లో ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజలకు అనుమతి లభించిందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను సకాలంలో అమలు చేస్తామన్నారు.

ప్రధానాంశాలు:

  • రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం
  • ప్రతీ ఇంటికి ఇంటర్నెట్‌ అందిస్తాం
  • అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం

Governor Tamilisai Speech In Telangana Assembly Budget Session 2024:

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగించారు. కాళోజీ కవితతో ప్రసంగాన్ని మెదలు పెట్టిన గవర్నర్.. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి మాకు అప్పగించారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పునర్‌నిర్మించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడంచారు. ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని.. దశాబ్ధకాంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తామని చెప్పారు.

Governor Tamilisai Speech In Telangana Assembly Budget Session 2024 | ప్రతి ఇంటికి ఇంటర్నెట్‌.. మూసీ అభివృద్ధితో ఉపాధి..
Governor Tamilisai Speech In Telangana Assembly Budget Session 2024 | ప్రతి ఇంటికి ఇంటర్నెట్‌.. మూసీ అభివృద్ధితో ఉపాధి..

“ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించారు. ప్రగతిభవన్‌ను.. ప్రజాభవన్‌గా అందుబాటులోకి వచ్చింది. ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నాం. ప్రజాపాలనలో కోటి 80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తాం. ప్రజాపాలనలో గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. అర్హులకు రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తాం. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీల అములుకు కట్టుబడి ఉన్నాం. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మాకు అప్పగించారు. రాష్ట్రాన్ని పునర్‌నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం.

ప్రతీ ఇంటికి ఇంటర్నెట్‌ అందిస్తాం

దశాబ్ధకాంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తాం. ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. TSPSC, SHRC వంటి సంస్థలు బాధ్యతాయుతంగా పనిచేసే స్వేచ్ఛను కల్పిస్తాం. గత సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశాం. ప్రజావాణి ద్వారా ప్రభుత్వం ప్రజా సమస్యలను తెలుసుకుంటోంది. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతాం. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం. మౌళిక వసతుల రంగాన్ని అభివృద్ధి చేస్తాం. ఇంటర్నెట్‌ కనీస అవసరంగా గుర్తించి అందించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఇంటికి ఇంటర్నెట్‌ అందిస్తాం.
టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నాం. మూసీని అభివృద్ధి చేసి ఉపాధి కల్పిస్తాం. మూసీ నది ప్రక్షాళనలకు ప్రణాళిక రూపొందించాం. ఎకో ఫ్రెండ్లీ టూరిజం హబ్‌గా హుస్సేన్‌సాగర్‌, లక్నవరం. త్వరలో గ్రీన్‌ ఎనర్జీని తీసుకువస్తాం. టూరిజం అభివృద్ధికి ప్రత్యేక పాలసీ తీసుకువస్తాం. దేశానికి హైదరాబాద్‌ను ఏఐ రాజధానిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. కొత్తగా రూ.40వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్త ఎంఎస్‌ఎంఈ పాలసీ. వెయ్యి ఎకరాల్లో 10-12 ఫార్మా విలేజీలు నిర్మిస్తాం.” అని గవర్నర్ తన ప్రసంగంలో వెల్లడించారు.

గవర్నర్ ప్రసంగం తర్వాత తొలిరోజు సభ వాయిదా పడగా.. రేపు ధన్యవాద చర్చను ప్రారంభించనున్నారు. అయితే తొలిరోజు సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కాలేదు. తొలుత ఆయన వస్తారని ప్రచారం జరిగిన చివరి నిమిషంలో ఆయన సభకు హాజరు కాలేదు. ఈనెల 10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా.. ఆ రోజు కేసీఆర్ సభకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Governor Tamilisai Speech In Telangana Assembly Budget Session 2024:

Governor Tamilisai Speech In Telangana Assembly Budget Session 2024:

1 thought on “Governor Tamilisai Speech In Telangana Assembly Budget Session 2024 | ప్రతి ఇంటికి ఇంటర్నెట్‌.. మూసీ అభివృద్ధితో ఉపాధి..”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.