...

Free Electricity only for Ration card holders under the Gruha Jyothi Scheme-2024 | రేషన్‌కార్డు ఉంటేనే ‘గృహజ్యోతి’ ఉచిత కరెంటు?

Written by lsrupdates.com

Published on:

Free Electricity only for Ration card holders under the Gruha Jyothi Scheme | రేషన్‌కార్డు ఉంటేనే ‘గృహజ్యోతి’ ఉచిత కరెంటు?

గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పథకం అమలుపై ప్రకటన చేయనుండగా.. అర్హుల ఎంపికపై అధికారులు కసరత్తు ప్రారంభించారు.రేషన్ కార్డు, ఆధార్, సెల్ఫోన్ నంబరు అనుసంధానమై ఉన్న కరెంటు కనెక్షన్ల ఇళ్లకు తొలిదశలో ‘గృహజ్యోతి’ కింద ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ప్రధానాంశాలు:

  • గృహజ్యోతి ఫ్రీ కరెంట్
  • అర్హుల ఎంపికపై కసరత్తు
  • రేషన్ కార్డు ఉంటనే పథకం ?

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్..

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తుండగా.. మరో రెండు గ్యారంటీల అమలకు ప్రభుత్వం సిద్ధమైంది. రూ. 500 గ్యాస్ సిలండర్, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచితి విద్యత్ పథకాలను అమలు చేయనున్నారు. నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఈ సమావేశాల్లోని గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ ప్రకటన చేయనున్నారు.

Free Electricity only for Ration card holders under the Gruha Jyothi Scheme:

రేషన్ కార్డు, ఆధార్, సెల్ఫోన్ నంబరు అనుసంధానమై ఉన్న కరెంటు కనెక్షన్ల ఇళ్లకు తొలిదశలో ‘గృహజ్యోతి’ కింద ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు ఈ మూడింటినీ ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా విద్యుత్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు.

ఇటీవల ‘ప్రజాపాలన’లో ఉచిత కరెంటు కోసం 81,54,158 మంది దరఖాస్తులిచ్చారు. వీటిలో 30 శాతం మంది రేషన్ కార్డు, ఆధార్, సెల్ఫోన్ నంబర్లను సరిగా నమోదు చేయలేదు. తనిఖీల్లో భాగంగా విద్యుత్ సిబ్బంది ఈ వివరాలను మళ్లీ నమోదు చేస్తున్నారు. దరఖాస్తుదారుల్లో 10 లక్షల మందికి అసలు రేషన్ కార్డులే లేవని తేలింది. ఇలాంటి వారికి తొలిదశలో ఉచిత కరెంటు సరఫరా సాధ్యం కాదని సమాచారం.

Also Read:

Mahalakshmi Scheme Gas Cylinder Selection Procedure In Telangana | రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఎంపిక విధానం ఇదే..!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 49.50 లక్షల విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటిలో దాదాపు 30 లక్షల కనెక్షన్లకు నెలకు 200 యూనిట్ల లోపే కరెంటు వాడుతున్నారు. కానీ 19.85 లక్షల మంది మాత్రమే ఉచిత కరెంటు కోసం దరఖాస్తులిచ్చారు. వీటిలో 5 లక్షల దరఖాస్తుల్లో రేషన్ కార్డుల వివరాలే లేవు. సుమారు 10 లక్షల మంది అసలు దరఖాస్తు చేయలేదు. వీటన్నిటినీ సరిచూడడానికే సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు.

రాష్ట్రమంతటా ఈ ప్రక్రియ పూర్తయ్యాక..

రాష్ట్రమంతటా ఈ ప్రక్రియ పూర్తయ్యాక.. ఎన్ని ఇళ్లకు ఉచిత కరెంటు సరఫరా చేయాలనే ప్రాథమిక లెక్కలు తేలతాయి. లబ్దిదారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేపో, మాపో జీవో జారీచేయనుంది. అందులో పేర్కొనే నిబంధనల ప్రకారం అర్హుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడానికి ‘విద్యుత్ పంపిణీ సంస్థ’ (డిస్కం)లు సాఫ్ట్వేర్ను రూపొందించాయి. కరెంటు కనెక్షన్ల తనిఖీపై రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి రిజ్వీ బుధవారం రెండు డిస్కంల సీఎండీలు, అన్ని విద్యుత్ సర్కిళ్ల ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష జరిపారు.

గత ఆర్థిక సంవత్సరంలో సగటు ప్రకారం..

ప్రాథమిక అర్హతలున్న కుటుంబాల్లో గత ఆర్థిక సంవత్సరం (2022-23) లో నెలవారీ సగటు కరెంటు వినియోగం 200 యూనిట్ల వరకు ఉన్న ఇళ్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ సంవత్సరం సగటు లెక్కలను డిస్కంలు ఆన్లైన్ ద్వారా సేకరిస్తున్నాయి. గత ఏడాది 200 యూనిట్ల వరకు వాడిన ఇళ్లకు ఇప్పుడు నెలకు ఉచితంగా 200 యూనిట్ల వరకు ఇస్తారు. గత ఏడాది ఒక ఇంటిలో నెలకు సగటున 90 యూనిట్లే వాడి ఉంటే, దానికి పది శాతం కోటా కింద 9 యూనిట్లు కలిపి.. మొత్తం 99 యూనిట్లకు మాత్రమే ఉచితంగా కరెంటు ఇచ్చే విధానం కర్ణాటకలో అమలవుతోంది. ఇక్కడ కూడా దాన్నే అమలు చేయాలనేది తెలంగాణ ప్రభుత్వ యోచన. జీవో విడుదలైతే మార్గదర్శకాలపై పూర్తి స్పష్టత రానుంది.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

CM Revanth Reddy Focused On KCR Haritha Haram-2024 | ‘ఆపరేషన్ KCR’ నెక్స్ట్ లెవల్.. ఆ లెక్కలన్నీ తీయాలని రేవంత్ ఆర్డర్స్.. శాంతి కుమారికి చిక్కులు!?

Telangana Government Decided To Provide Digital Health Cards To Everyone Above 18 Years Of Age | హెల్త్ కార్డు… డిజిటల్ రికార్డు!

Can Medigadda barrage withstand the flood? | మేడిగడ్డ బ్యారేజీ.. వరదను తట్టుకోగలదా? 2024

Free Electricity only for Ration card holders under the Gruha Jyothi Scheme-2024

Free Electricity only for Ration card holders under the Gruha Jyothi Scheme

Free Electricity only for Ration card holders under the Gruha Jyothi Scheme

CM Revanth Reddy Will Implement Two Guarantees From Keslapur Nagoba Temple | రేపు మరో 2 గ్యారంటీలు..ఆ రెండు ఇవేనా..?

Indiramma Indlu Scheme Applications Filtering through Artificial Intelligence in Telangana-2024 | పేదలకు ఇందిరమ్మ ఇళ్లు.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో లేటెస్ట్ టెక్నాలజీ..!

1 thought on “Free Electricity only for Ration card holders under the Gruha Jyothi Scheme-2024 | రేషన్‌కార్డు ఉంటేనే ‘గృహజ్యోతి’ ఉచిత కరెంటు?”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.