‘సిద్ధార్థ్ రాయ్’ మూవీ రివ్యూ | Siddharth Roy Movie Review in Telugu-2024

Written by lsrupdates.com

Updated on:

‘సిద్ధార్థ్ రాయ్’ మూవీ రివ్యూ | Siddharth Roy Movie Review in Telugu-2024

Siddharth Roy Movie Review in Telugu-2024: పలు చిత్రాల్లో బాలనటుడిగా మెరిసిన దీపక్ సరోజ్ ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో దీపక్ సరోజ్ హీరోగా యశశ్వి దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ యారొగెంట్ యాక్షన్ డ్రామా “సిద్ధార్థ్ రాయ్”(Siddharth Roy Movie Review in Telugu-2024). ‘అర్జున్రెడ్డి’, ‘యానిమల్ చిత్రాల్ని గుర్తు చేసే కథానాయకుడి పాత్రతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి ‘సిద్ధార్థ్ రాయ్’ ప్రచార చిత్రాలు. టీజర్, ట్రైలర్ తో మంచి ప్రచారాన్ని సొంతం చేసుకుందీ చిత్రం. మరి ఈ సినిమా ఎలా ఉంది? దీపక్ మెప్పించాడా?

విడుదల తేదీ : ఫిబ్రవరి 23, 2024

నటీనటులు: దీపక్ సరోజ్, తన్వి నేగి, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు

దర్శకుడు: వి. యశస్వి

నిర్మాత: జయ ఆడపాక

సంగీత దర్శకులు: రధన్

సినిమాటోగ్రాఫర్: సామ్ కె నాయుడు

ఎడిటింగ్: ప్రవీణ్ పూడి

సిద్ధార్థ్ రాయ్ కథేంటంటే:

సిద్ధార్థ్ రాయ్ (దీపక్ సరోజ్) తెలివైనవాడు. చిన్నప్పట్నుంచే పుస్తకాల పురుగై… పన్నెండేళ్లకే ప్రపంచంలోని ఫిలాసఫీనంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ, ఎమోషన్స్ని అస్సలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ‘ఎందుకు ఏడవడం చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు.

'సిద్ధార్థ్ రాయ్' మూవీ రివ్యూ | Siddharth Roy Movie Review in Telugu-2024
                                         ‘సిద్ధార్థ్ రాయ్’ మూవీ రివ్యూ | Siddharth Roy Movie Review in Telugu-2024

తిండి, నిద్ర, కోరిక… బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందనలు లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు (తన్వి నేగి). ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్లిద్దరి ప్రేమ నిలబడిందా? లాజిక్, ఎమోషన్… ఈ రెండూ సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే Siddharth Roy Movie Review in Telugu-2024.

సినిమా ఎలా ఉందంటే..

లాజిక్… ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు. దర్శకుడు. రెండింటి మధ్య సమతుల్యమే బతుకు కిటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకుని దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర, చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్రెడ్డి, యానిమల్ చిత్రాల్ని గుర్తు చేస్తుంది.

అయితే ఆ కథా ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. ప్రథమార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారం నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందనలు లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఇందు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం.

'సిద్ధార్థ్ రాయ్' మూవీ రివ్యూ | Siddharth Roy Movie Review in Telugu-2024
                                  ‘సిద్ధార్థ్ రాయ్’ మూవీ రివ్యూ | Siddharth Roy Movie Review in Telugu-2024

లాజిక్ ని నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయిక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికంగా మార్చాయి. వారిద్దరూ ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుందనే ఆసక్తిని సృష్టిస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయిక దారిలోకి వచ్చి ఎమోషన్స్లోనూ పతాక స్థాయికి వెళ్లాక ఏర్పడే పరిణామాలు కథని మలుపు తిప్పుతాయి. పాత్ర ప్రధానంగాసాగే చిత్రమిది. తాను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రతో బలంగా చెప్పడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. (Siddharth Roy Movie Review in Telugu-2024) అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరోకి పుస్తకాల్లో ఉన్న కోట్స్నే చెబుతూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా? లేక చదవలేదా? అన్ని పుస్తకాలు చదివిన హీరో ఎమోషనల్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికొస్తే అది తప్పేమీ కాదు. పతాక సన్నివేశాలు శ్రుతిమించినట్టుగా అనిపిస్తాయి.

ఎవరెలా చేశారంటే

దీపక్ సరోజ్ నటన చిత్రానికి ప్రధానబలం. ప్రథమార్ధంలో స్పందనలు లేని కుర్రాడిగా ఎంత బాగా నటించాడో, ద్వితీయార్థంలో పతాక స్థాయిలో ఎమోషన్స్ ఉన్న కుర్రాడిగా అంతకుమించి నటించాడు. లుక్స్ పరంగానూ వైవిధ్యం ప్రదర్శించాడు. తన్వి నేగి పాత్ర కూడా సినిమాకి ప్రధానబలం. ఆమె అందంగా కనిపిస్తూనే, నటనకి ప్రాధాన్యమున్న సన్నివేశాల్లోనూ ప్రతిభ చూపించింది. నందిని, కల్యాణి నటరాజన్, ఆనంద్ తదితరుల పాత్రలూ ఆకట్టుకుంటాయి. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. శ్యామ్ కె. నాయుడు కెమెరా, రథన్ సంగీతం సినిమాకి ప్రధానబలం. నిర్మాణం ఉన్నతంగా ఉంది.

ఇలాంటి కథ, పాత్రల్ని తీర్చిదిద్దాలంటే ఫిలాసఫీ, జీవితంపైన ఎంతో లోతైన అవగాహన ఉండాలి. దర్శకుడు అంతే అవగాహనతో కథపై పట్టు కోల్పోకుండా చిత్రాన్ని మలిచాడు. (Siddharth Roy Movie Review in Telugu-2024) కాకపోతే కథానాయకుడి పాత్ర, తన సమస్యని అందరికీ కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో విఫలం అయ్యారు. ఆంగ్లంలో సంభాషణలు మరింతగా గందరగోళానికి గురిచేస్తాయి.

ఈ సినిమా బలాలు

  • చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో మంచి రోల్స్ చేసిన దీపక్ ఈ బోల్డ్ చిత్రంలో మాత్రం సాలిడ్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు అని చెప్పాలి. తనలోని ఏపాటి పొటెన్షియల్, నటుడు దాగున్నాడో ఈ చిత్రంలో చూపించాడు.
  • ఇక ఫీమేల్ లీడ్ లో కనిపించిన తన్వి నేగి కూడా మంచి పెర్ఫామెన్స్ తో ఇంప్రెస్ చేస్తుందని చెప్పాలి. తన రోల్ లో కావాల్సిన ఎమోషన్స్ ని ఆమె పర్ఫెక్ట్ గా డెలివర్ చేసింది.
'సిద్ధార్థ్ రాయ్' మూవీ రివ్యూ | Siddharth Roy Movie Review in Telugu-2024
                                       ‘సిద్ధార్థ్ రాయ్’ మూవీ రివ్యూ | Siddharth Roy Movie Review in Telugu-2024

బలహీనతలు

  • కొన్ని సీన్స్ అయితే చాలా బోల్డ్ గా కొన్ని వర్గాల ఆడియెన్స్ కి ఇబ్బందిగా అనిపించవచ్చు. అలాగే కొన్ని లాజిక్ లు అయితే ఓవర్ గా అనిపిస్తాయి అలాగే సినిమాలో స్క్రీన్ ప్లే కూడా అంత ఇంప్రెసివ్ గా అనిపించదు.
  • ఇక ఫైనల్ గా సినిమాలో సాంగ్స్ కానీ వాటి ప్లేస్ మెంట్ లు కానీ బాగా డిజప్పాయింట్ చెయ్యడమే కాకుండా కథనంలో చికాకు తెప్పిస్తాయి.

ఫైనల్ తీర్పు(Final Review)

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “సిద్ధార్థ్ రాయ్” లో దీపక్ సరోజ్ తన సిన్సియర్ ఎఫర్ట్స్ ని పెట్టాడు. కానీ సినిమాలో అసలు విషయం తేలిపోయింది. ఓవర్ సీన్స్, వీక్ స్క్రీన్ ప్లే సినిమాని ఏమాత్రం ఎంగేజింగ్ గా మలచలేదు. వర్కౌట్ కాని ఎమోషన్స్, కొన్ని అడల్ట్ సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా ఇబ్బందిగా అనిపించవచ్చు. వీటితో అయితే ఈ వారాంతానికి ఈ చిత్రాన్ని స్కిప్ చేసేయడమే మంచిది.

Official Trailer for Deepak Saroj Siddharth Roy Movie-2024

 

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

‘భ్రమయుగం’ మూవీ రివ్యూ | Mammootty Bramayugam Movie Review in Telugu-2024

 

1 thought on “‘సిద్ధార్థ్ రాయ్’ మూవీ రివ్యూ | Siddharth Roy Movie Review in Telugu-2024”

Leave a Comment