...

తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి – సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024

Written by lsrupdates.com

Published on:

Table of Contents

తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి – సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024

Current Affairs Science and Technology News February-2024: ఉచిత కరెంట్ అఫైర్స్ క్విజ్‌లు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరియు అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. గుర్తుంచుకోండి, పోటీ పరీక్షల ప్రపంచంలో, ప్రతి సమాచారం ముఖ్యమైనది. ఈ రోజువారీ, వార మరియు నెలవారీ ఉచిత కరెంట్ అఫైర్స్ క్విజ్‌లను సమాధానంతో ప్రయత్నించండి, మీ సంసిద్ధతను అంచనా వేయండి మరియు మీ వ్యూహాన్ని పరిపూర్ణం చేసుకోండి.

మనిషి మెదడులో బ్రెయిన్ చిప్

తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి - సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024
తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి – సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024

అమెరికా స్టార్టప్ కంపెనీ న్యూరాలింక్ మనిషి మెదడులో తొలిసారిగా బ్రెయిన్ చిపు అమర్చి చరిత్ర సృష్టించింది. ఈ చిప్ ద్వారా మెదడుకు, కంప్యూటర్కు నేరుగా అనుసంధానం చేసే దిశగా ప్రయత్నాలు చేసింది. ఈ మేరకు న్యూరాలింక్ వ్యవస్థాపకుడు, ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ జనవరి 30న వెల్లడించారు. ‘మనిషి మెదడులో చిప్ ప్రవేశపెట్టాం. దీని ద్వారా న్యూరాన్ల కదలికలను గుర్తించాం’ అని ఆయన ట్వీట్చేశారు. చిప్ అమర్చిన వ్యక్తి వేగంగా కోలుకుంటున్నట్టు, తొలి ఫలితాల్లో స్పష్టమైన ‘న్యూరాన్ స్పైక్ డిటెక్షన్ ‘ను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ చిపన్నకు ‘ఎన్ 1(లింక్)’గా నామకరణం చేశారు.

అంతరిక్షంలోకి మహిళా రోబో ‘వ్యోమమిత్ర’

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మహిళా రోబో ‘వ్యోమిత్ర’ను అంతరిక్షంలోకి పంపనుంది. ఈ సంవతసరం అక్టోబర్ లో గగన్యాన్ మిషన్ ను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది. గగన్యాన్ ప్రోగ్రాంలో భాగంగా చేపట్టిన మానవ రహిత అంతరిక్ష పరయోగంలో ఇది ఒక భాగమని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేందర్ సింగ్ అన్నారు. అక్టోబర్ మొదటి, రెండో వారంలో గగన్యాన్ తొలి ట్రయల్ రన్ను ఇస్రో చేపట్టనుందని తెలిపారు. రెండో ప్రయోగంలో మహిళా రోబో వ్యోమిత్రను అంతరిక్షంలోకి పంపనున్నారు.

తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి - సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024
తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి – సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024

మనిషి లాగేనే అన్ని యాక్టివిటీస్ ను నిర్వహించగలిగే ఈ రోబోను పంపించిన తరువాత అంతా సవ్యంగా ఉంటే ఇక వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించవచ్చన్నారు. భూమి పై నుంచి 400 మీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి గగన్యాన్ మిషన్ ద్వారా వ్యోమగాములను తీసుకెళ్లనున్నారని అన్నారు.

మూడు ఉపగ్రహాలను ప్రయోగించిన ఇరాన్

మూడు ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపినట్లు ఇరాన్ ప్రకటించింది. సిమోర్ట్ రాకెట్తో వాటిని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు తెలిపింది. సెమ్నాన్ ప్రావిన్స్ లోని ఇమామ్ ఖొమైనీ అంతరిక్ష కేంద్రంలో ఈ ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో మహా అనేది పరిశోధక ఉపగ్రహం కాగా, కేహాన్ –2, హతెఫ్-1 అనేవి జీపీఎస్, కమ్యూనికేషన్ కు సంబంధించిన నానో శాటిలైట్లని ఇరాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది. గాజాపై యుద్ధంలో సైనికపరంగా చేసుకోనప్పటికీ.. ఇటీవల జరిగిన ఇస్లామిక్ స్టేట్ భారీ ఆత్మాహుతి దాడి, ఇరాన్ అండదండలున్న హౌతీ తిరుగుబాటుదారులు విదేశీ నౌకలపై దాడులు చేయడం వంటివి ఇరాన్ మతపెద్దలపై ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలోనే ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టినట్లుగా భావిస్తున్నారు.

తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి - సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024
తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి – సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024

‘స్పేస్ రిఫార్మ్ ఇయర్’గా 2024–25

ఈ ఏడాదిని ‘స్పేస్ రిఫార్మ్ ఇయర్’గా ఇస్రో ప్రకటించింది. 2023–24 ఆర్థిక ఏడాదిలో భాగంగా మార్చిలోపు అగ్నిబాన్, ఎస్ఎస్ఎల్పీ డీ3 ప్రయోగాలు చేయనున్నారు. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి దాకా 26 ప్రయోగాలు చేయడానికి ఇస్రో ప్రణాళిక రచించింది. ఈ ఏడాది గగన్యాన్ ప్రాజెక్టుకు సంబంధించిన 7 ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతమైతే 2025 ఆఖరికి మానవుడిని అంతరిక్షంలోకి పంపించి క్షేమంగా భూమికి తీసుకువచ్చేందుకు ఇస్రో సమాయత్తమవుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఐఎల్), ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) ఆధ్వర్యంలో రాబోయే 14 నెలల్లో 30 ప్రయోగాలను

నిర్వహించనున్నారు. 2024-25 ఆర్థిక ఏడాదిని గగన్యాన్ సంవత్సరంగా ప్రకటించి 7 గగన్యోన్ ప్రయోగాత్మక పరీక్షలను నిర్వహించేందుకు ప్రణాళిక రచించారు. అలాగే, స్కైరూట్ ఎయిరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన విక్రమ్-1టీబీడీ పేరుతో 4 ప్రయోగాలు, అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన అగ్నిబాన్–టీబీడీ పేరుతో 3 ప్రయోగాలు చేయనున్నారు. ఇస్రో పీఎస్ఎల్వీ సిరీస్లో 8 ప్రయోగాలు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికే ఈ ఏడాది జనవరి 1న పీఎస్ఎల్పీ సీ57 ప్రయోగాన్ని పూర్తి చేశారు.

వీటి తరువాత పీఎస్ఎల్వీ సీ58, సీ59, సీ61, సీ62, సీ63, పీఎస్ఎల్పీ ఎన్1, ఎన్2 పేరుతో 8 ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. జీఎస్ఎల్వీ సిరీస్లో ఈ నెల 17న జీఎస్ఎల్వీ ఎఫ్14, తరువాత ఎఫ్15, ఎఫ్16, ఎఫ్ 17 ప్రయోగాలను చేయడానికి సంసిద్ధమవుతున్నారు. ఎఎస్ఎల్వీ సిరీస్ లో ,డీ3 ఎస్1, ఎస్ 2 పేరు తో ౩ ప్రయోగాలు, ఎల్ వీ ఎం ౩-ఎం 5 రాకెట్ ద్వారా ఒక ప్రయోగం తో కలిసి ఈ ఏడాదిలో 30 ప్రయోగాలు చేయనున్నారు.

ఫిబ్రవరి 17వ తేదీ జీఎస్ఎల్వీ ఎఫ్14 ప్రయోగం

వాతావరణ ఉపగ్రహం ఇనా శాట్- 3డీఎస్ ను మోసుకెళ్లే జీఎస్ఎల్వీ ఎఫ్14 ఉపగ్రహ వాహక నౌకను ఫిబరవరి 17వ తేదీ ఇస్రో ప్రయోగించనుంది. ఇందుకోసం ఫిబ్రవరి 16వ తేదీ మధ్యాహ్నమే కౌంట్ డౌన్ మొదలైంది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు దీనిని ప్రయోగించనున్నారు. గతంలో ప్రయోగించిన ఇనా శాట్- 3డీ, ఇనాశాట్-3డీఆర్ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఇన్ శాట్- 3డీఎస్ ని పంపుతున్నట్లు ఇస్రో వెల్లడించింది. సుమారు 2,275 కిలోల బరువైన ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి.

 

తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి - సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024
తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి – సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024

ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులను చేపడతాయి. ప్రయోగం మొదలైన 20 నిమిషాల తర్వాత జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్(జీటీవో)లో శాటిలైట్ను ప్రవేశపెడతారు. అనంతరం దశలవారీగా రెండు రోజులపాటు కక్ష్యను మారుస్తూ జియో స్టేషనరీ ఆర్బిట్లోకి మారుస్తారు.

సముద్రంలోకి కార్టోశాట్–2

పాత ఉపగ్రహాలతో ఆయా కక్ష్యల్లో పెరిగిపోతున్న అంతరిక్ష చెత్తను కాస్తయినా తగ్గించే లక్ష్యంతో ఇస్రో మరో అడుగు ముందుకేసింది. దాదాపు 17 సంవత్సరాల క్రితం ప్రయోగించాక చాలా ఏళ్లు దేశానికి సేవలందించిన కార్టోశాట్-2 ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా భూ వాతావరణంలోకి తీసుకొచ్చి హిందూ మహాసముద్రంలో పడేలా చేసింది. ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 3.48 గంటలకు ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని ఇస్రో ఫిబరవరి 16వ తేదీ ప్రకటించింది. పట్టణ ప్రణాళికలకు సాయపడేలా అత్యంత స్పష్టమైన హై రెజల్యూషన్ ఇమేజీలు తీసేందుకు 2007 జనవరి పదో తేదీన 680 కేజీల ఇస్రో కార్టోశాట్-2 ఉపగ్రహాన్ని 635 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో విజయవంతంగా పంపింది.

తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి - సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024
తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి – సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024

ఇది 2019 ఏడాదిదాకా పనిచేసింది. తర్వాత కక్ష్య తగ్గించుకుంటూ క్రమంగా భూవాతావరణంలోకి ప్రవేశించి అత్యంత వేగంగా తిరుగుతూ మండి, ధ్వంసమై అతి చిన్న ముక్కలుగా మారిపోనుంది. అలా కావడానికి సాధారణంగా 30 సంవత్సరాల సమయం పడుతుంది. ఈలోపు ఉపగ్రహాలుండే కక్ష్యల్లో అంతరిక్ష చెత్తను తగ్గించేందుకు ముందుగానే దీనిని భూవాతావరణంలోకి రప్పించారు.

జీఎస్ఎల్వీ ఎఫ్ 14 ప్రయోగం విజయవంతం

ఇస్రో ప్రతిష్టాత్మంగా చేపట్టిన జీఎస్ఎల్వీ- ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఫిబరవరి 17వ తేదీ (శనివారం) శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇన్ శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ- ఎఫ్14 రాకెట్ విజయవంతంగా శాటిలైట్ను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. కాగా.. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి 24 గంటల కౌంట్ డౌన్ అనంతరం ఈ రోజు జీఎస్ఎల్వీ- ఎఫ్14 రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.

తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి - సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024
తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి – సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024

నిప్పులు చిమ్ముతూ నింగిలోకి వెళ్లిన జీఎస్ఎల్వీ- F14 రాకెట్ ఇన్ శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. 19 నిమిషాల్లోనే నింగిలోని నిర్ణీత కక్షకు రాకెట్ చేరుకునేలా సైంటిస్ట్లు రూపకల్పన చేశారు. గతంలో ప్రయోగించిన ఇన్ శాట్- 3డీ. ఇన్సాట్- 3డీఆర్ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఇన్సాట్- 3డీఎస్ ని పంపారు. సుమారు 2,275 కిలోల బరువైన ఇన్ శాట్- 3డీఎస్ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి. ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులపై అధ్యయనం చేయనుంది.

‘సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్’ పరీక్ష విజయవంతం

గగన్యాన్ ప్రయోగంలో భాగంలో మానవ సహిత అంతరిక్ష యాత్రలకు తోడ్పడే ఎల్బీఎం3 లాంచ్ వెహికల్ తయారీలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ఘనత సాధించింది. ఈ లాంచ్ వెహికల్కు గుండెకాయ లాంటి ‘సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్’ను విజయవంతంగా పరీక్షించినట్లు ఇస్రో ఫిబరవరి 21వ తేదీ వెల్లడించింది. తమ పరీక్షలో క్రయోజనిక్ ఇంజన్ పూర్తి సంతృప్తికరమైన పనితీరు కనబర్చిందని, అంతరిక్ష యాత్రలకు అర్హత సాధించిందని వెల్లడించింది. గగన్యాన్ యాత్రకు ఈ ఇంజన్ అనువైందని తేలినట్లు స్పష్టం చేసింది. పలు రకాల కఠిన పరీక్షల తర్వాత ఈ క్రయోజనిక్ ఇంజిన్ భద్రతా ప్రమాణపత్రాన్ని పొందిందని పేర్కొంది. మానవ రహిత గగన్యాన్-1 యాత్రను 2024లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి - సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024
తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి – సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024

ఈ ప్రయోగం సఫలమైతే మానవ సహిత యాత్ర చేపట్టనున్నారు. ముగ్గురు వ్యోమగాములను భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలోకి చేర్చి, మళ్లీ క్షేమంగా వెనక్కి తీసుకురావడం గగన్యోన్ మిషన్ లక్ష్యం. మొత్తం మూడు రోజుల్లో ప్రయోగం పూర్తవుతుంది. ఈ ప్రయోగంలో వ్యోమగాములను ఎల్బీఎం3 లాంచ్ వెహికల్లో అంతరిక్షంలోకి చేర్చాలని నిర్ణయించారు. ఇందులో ఘన, ద్రవ, క్రయోజనిక్ దశలు ఉంటాయి. ఈ క్రయోజనిక్ దశలో లాంచ్ వెహికల్ను గమ్యస్థానానికి చేర్చడంలో సీఈ20 ఇంజిన్ పాత్ర అత్యంత కీలకం. ఈ ఇంజన్పై ఏడో వాక్యూమ్ టెస్టును ఈ నెల 14న తమిళనాడు మహేంద్రగిరిలోని హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీలో నిర్వహించినట్లు ఇస్రో వెల్లడించింది.

గగన్యాన్ మిషన్లో ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమించామని ‘ఎక్స్’ లో పోస్టు చేసింది. సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్ యాక్సెప్టెన్స్ టెస్టులు, ఫైర్ టెస్టులు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి.

‘ఇంట్యూటివ్ మెషీన్స్’ ఘన విజయం..

చంద్రుడి ఒడిలో ‘ఒడిస్సియస్’! జాబిలిపైకి ల్యాండర్ల పరంపర కొనసాగుతోంది. జపాన్ ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ తర్వాత తాజాగా అమెరికా వంతు వచ్చింది. అర్ధ శతాబ్దం తర్వాత చంద్రుడిపై మరోమారు అగ్రరాజ్యం జెండా రెపరెపలాడింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హూస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేటు సంస్థ ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ రూపొందించిన ‘ఒడిస్సియస్’ (నోవా-సీ శ్రేణి) ల్యాండర్ జాబిలి ఉపరితలంపై దక్షిణ ధ్రువం చేరువలోని ‘మాలాపెర్ట్ ఎ’ బిలంలో దిగ్విజయంగా దిగింది. తొలుత ల్యాండర్ నేవిగేషన్ వ్యవస్థలోని లేజర్ రేంజిఫైండర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మిషన్ కంట్రోల్ కేంద్రంలోని శాస్త్రవేత్తలు ఆందోళన చెందారు.

దీంతో ల్యాండర్ దిగాల్సిన నిర్దేశిత సమయంలో కొంత జాప్యం సంభవించినప్పటికీ భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 4:53 గంటలకు అది క్షేమంగా చంద్రుడిపై దిగి భూమికి సంకేతం పంపింది. ‘మాలాపెర్ట్ ఎ’ అనేది చంద్రుడి దక్షిణ ధృవానికి 300 కిలోమీటర్ల దూరంలో 85 డిగ్రీల దక్షిణ అక్షాంశ ప్రాంతంలో నెలకొన్న ఓ చిన్న బిలం. బెల్జియంకు చెందిన 17వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్త చార్లెస్ మాలా పెర్ట్ పేరును దానికి పెట్టారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి అతి సమీపంలో దిగిన వ్యోమనౌకగా చరిత్ర సృష్టించిన ‘ఒడిస్సియస్’ ఆ విషయంలో గత ఏడాది మన చంద్రయాన్-3 ‘విక్రమ్’ ల్యాండర్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టడం విశేషం. ‘ఒడిస్సియస్’ ల్యాండరుకు ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ సంస్థ ఉద్యోగులు పెట్టుకున్న ముద్దు పేరు ‘ఒడీ’. ఈ మానవరహిత చంద్రయాత్రకు మిషన్ ‘ఐఎం-1’గా నామకరణం చేశారు.

తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి - సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024
తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి – సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024

జీవితకాలం ఏడు రోజు! పూర్తిగా ఓ ప్రైవేటు కంపెనీ తయారీ-నిర్వహణలో ల్యాండర్ ఒకటి చంద్రుడి ఉపరితలంపై సజావుగా దిగడం ఇదే తొలిసారి. సాంకేతిక అవాంతరాలు ఎదుర్కొన్నప్పటికీ జపాన్ ‘స్లిమ్’ ల్యాండర్ మాదిరిగా తలకిందులుగా కాకుండా ‘ఒడిస్సియస్’ నిటారుగానే దిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. షడ్భుజి ఆకృతితో, సిలిండర్ ఆకారంలో టెలిఫోన్ బూత్ కంటే కాస్త పెద్ద పరిమాణంలో ఉన్న ఈ ల్యాండరులో 100 కిలోల బరువైన ఐదు ‘నాసా’ పరికరాలు, ఇతర వాణిజ్య సంస్థలకు చెందిన ఆరు శాస్త్రీయ పరికరాలు (పేలోడ్స్) ఉన్నాయి. అవి చంద్రుడిపై పరిశోధనలు నిర్వహిస్తాయి. వీటిలో లేజర్ రెట్రో రిఫ్లెక్టర్, ఐఎల్-ఎక్స్ అబ్జర్వేటరీ (టెలిస్కోప్) ఉన్నాయి.

జాబిలిపై ‘ఒడిస్సియస్’ జీవితకాలం కేవలం ఏడు రోజులు. మరో వారం రోజుల్లో అది దిగిన ప్రదేశంలో సూర్యాస్తమయం అవుతుంది. కనుక ల్యాండర్ పనిచేయడానికి సౌరశక్తి లభించదు. చంద్రుడి ఉపరితలంతో అంతరిక్ష వాతావరణం చర్యనొందే విధానం, రేడియో ఆస్ట్రానమీ, చంద్రావరణానికి సంబంధించిన డేటాను ‘నాసా’ పేలోడ్స్ సేకరించనున్నాయి. అమెరికా చివరిసారిగా 1972లో చేపట్టిన ‘అపోలో-17’ మానవసహిత యాత్రలో వ్యోమగాములు జీన్ సెర్నాన్, హారిసన్ షిట్ చంద్రుడి నేలపై నడయాడారు. ఆ తర్వాత అమెరికా వ్యోమనౌక ఒకటి నియంత్రిత విధానంలో చంద్రుడిపై దిగడం ఇదే మొదటిసారి. చైనా కంటే ముందుగా తమ ‘ఆర్టెమిస్’ యాత్రతో త్వరలో జాబిలిపైకి తమ వ్యోమగాములను పంపాలని అమెరికా భావిస్తోంది.

ఈ నేపథ్యంలో ‘ఒడిస్సియస్’ సేకరించే సమాచారం కీలకం కానుంది. చంద్రుడిపైకి ప్రైవేటు ల్యాండర్లను ప్రయోగించడానికి ఉద్దేశించిన తన కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ ప్రాజెక్టులో భాగంగా ‘నాసా’ వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఈ మిషన్ కాంట్రాక్టును ‘ఇంట్యూటివ్ మెషీన్స్’కు కట్టబెట్టింది. చంద్రుడి సూక్ష్మ శిల్పానికి గాంధీ పేరు! ఆరు కాళ్లపై నిలబడే ‘ఒడిస్సియస్’ ల్యాండర్ ఎత్తు 4 మీటర్లు కాగా, వెడల్పు సుమారు 2 మీటర్లు. ప్రయోగ సమయంలో ల్యాండర్ బరువు 1,908 కిలోలు.

ఈ నెల 15న ఫ్లోరిడాలోని కేప్ కెనెవరాల్ నుంచి కెన్నెడీ అంతరిక్ష కేంద్రం వేదికగా ఇలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్-ఎక్స్’కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో దాన్ని ప్రయోగించారు. భూమి నుంచి చూస్తే చంద్రుడిలో కనిపించే 62 దశలు, అంతరిక్షంలోని ఇతర ప్రాంతాల నుంచి చూస్తే చంద్రుడిలో అగుపించే మరో 62 దశలు, ఒక చంద్రగ్రహణం.. మొత్తం కలిపి చంద్రుడి 125 దశలను ప్రతిబింబించే సూక్ష్మ శిల్పాలను ఓ పెట్టెలో పెట్టి ల్యాండరులో అమర్చడం విశేషం. వీటిని అమెరికన్ కళాకారుడు జెఫ్ కూన్స్ రూపొందించారు. ఒక్కో బుల్లి శిల్పం వ్యాసం అంగుళం. ఈ శిల్పాలకు మానవ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమున్న అరిస్టాటిల్, లియోనార్డో డా విన్సీ, గాంధీ, డేవిడ్ బౌయీ, బిల్లీ హాలిడే తదితరుల పేర్లు పెట్టారు. భూమికి ‘ఒడిస్సియస్’ ల్యాండర్ పంపిన సంకేతం బలహీనంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఫలితంగా ల్యాండర్ భవితపై అనిశ్చితి నెలకొంది. దీంతో మిషన్ కంట్రోల్ కేంద్రంలో హర్షధ్వానాలు, విజయోత్సవాలను రద్దు చేశారు. ల్యాండర్ సంకేతాలను మెరుగుపరచేందుకు ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.

చైనాలో 24 కోట్ల ఏళ్ల  డ్రాగన్ శిలాజం

ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో శిలాజాలు బయటపడుతుంటాయి. వందల ల్లో శిలాజాలు ! సంవత్సరాల క్రితం భూమిలో కూరుకుపోయిన జీవులు క్రమంగా శిలాజంగా మారుతుంటాయి. చైనాలో 2003లో బయటపడిన భారీ డ్రాగన్ శిలాజం వయసు 24 కోట్ల సంవత్సరాలు ఉంటుందని సైంటిస్టులు తాజాగా నిర్ధారించారు. ఇంత వయసున్న డ్రాగన్ శిలాజం వెలుగుచూడడం ఇదే మొదటిసారి అని నేషనల్ మ్యూజియమ్స్ స్కాట్లాండ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. చైనాలో ట్రియాసిక్ కాలానికి చెందిన ఈ శిలాజం భాగాలను తొలుత 2003లో దక్షిణ చైనాలోని గిజౌ ప్రావిన్స్లో గుర్తించారు. గత పదేళ్లలో తవ్వకాల్లో మరిన్ని భాగాలు బయటపడ్డాయి. వాటన్నింటినీ ఒకేచోట అమర్చగా అది ఐదు మీటర్ల డ్రాగన్గా తేలింది. 24 కోట్ల ఏళ్ల క్రితమే అది శిలాజంగా మారిపోయిందని పరిశోధకులు కనిపెట్టారు.

తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి - సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024
తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి – సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024

దీనికి డైనోసెఫాలోసారస్ ఒరియంటలిస్ అని పేరుపెట్టారు. ముక్కు నుంచి తోక దాకా పూర్తి శిలాజాన్ని ఆవిష్కరించామని ఎన్ ఎంఎస్ సైంటిస్టు డాక్టర్ నిక్ ఫ్రాసెర్ చెప్పారు. ఇది 8 అంకె ఆకారంలో ఉందని, చైనా డ్రాగన్లను గుర్తుకు తెస్తోందని వివరించారు. డ్రాగన్ కాల్పనిక జీవి కాదని, నిజంగానే ఉండేదని చెప్పడానికి ఈ శిలాజం ఒక ఆధారమని సైంటిస్టులు అంటున్నారు. రాక్షస బల్లుల తరహాలో వాతావరణ మార్పుల కారణంగా కోట్ల సంవత్సరాల క్రితం అవి అంతరించిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, చైనాలో బయటపడిన డ్రాగన్ శిలాజం మెడ చాలా పొడవుగా ఉండడం ఆసక్తి కలిగిస్తోంది. నదులు, చెరువుల్లో చేపలు పట్టుకోవడానికి వీలుగా దాని మెడ పొడవుగా సాగి ఉండొచ్చని భావిస్తున్నారు.

భూమిని అధికంగా గ్రహించిన సోలార్ రేడియేషన్

అంతరిక్షం నుంచి వెలువడే ప్రమాదకర సౌర రేడియేషన్ ను భూమి అధికంగా శోషించుకుంటోందని దాంతో వాతావరణంలో మార్పులు. విపత్తులు సంభవిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. నాసా తాజా డేటాను విశ్లేషించి సౌర రేడియేషన్ గురించి వారు కీలక విషయాలు వెల్లడించారు. 2000 సంవత్సరం నుంచి 2023 డిసెంబర్ డేటాను వారు పరిగణనలోకి తీసుకున్నారు. రేడియేషన్ ను భూమి శోషించుకోవడం అనేది సంవత్సరమంతా ఒకేతీరుగా లేదని, కొన్నిసార్లు ఎక్కువ స్థాయి, మరికొన్నిసార్లు తక్కువ స్థాయిలో నమోదైనట్లు గుర్తించారు. 2023లో ఫిబ్రవరి, మార్చి, డిసెంబర్ లో అధికంగా సోలార్ రేడియేషన్ ను భూమి గ్రహించిందని వెల్లడించారు.

తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి - సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024
తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి – సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024

గత ఏడాది జనవరిలో స్వల్పంగా పెరిగిన రేడియేషన్ ఫిబ్రవరిలో చదరపు మీటర్కు 3.9 వాట్లు, మార్చిలో చదరపు మీటర్కు 6.2 వాట్లుగా నమోదైందని తెలియజేశారు. 2000 సంవత్సరం నాటి గణాంకాలతో పోలిస్తే 2023లో సౌర రేడియేషన్ ను భూమి శోషించుకోవడం ఎన్నో రెట్లు పెరిగినట్లు తేల్చారు. ఇది ఇంకా పెరగడమే తప్ప తగ్గే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భూగోళంపై శక్తి సమతుల్యతలో మార్పులు వస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇదంతా భూవాతావరణంలో ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, మంచు కరిగిపోవడం, సముద్ర మట్టాలు పెరగుదల వంటి పరిణామాలకు దారి తీస్తున్నట్లు స్పష్టం చేశారు.

పెంగ్విన్ పక్షులకు పెను ముప్పు.. హెచ్చరిస్తున్న సైంటిస్టులు

అంటార్కిటికాలోని అందమైన పెంగ్విన్ పక్షులకు పెను ముప్పు పొంచి ఉంది. అంటార్కిటికాలోని అర్జెంటీనా బేస్ ప్రైమావెరా సమీపంలో ఇటీవల మృతి చెందిన స్కువా సముద్ర పక్షుల్లో బన్ఫ్లూ వ్యాధికి కారణమయ్యే వైరస్ (ఏవియన్ ఇన్ఫ్లూయెంజా) హెచ్ 5ఎన్1 బయటపడినట్లు స్పెయిన్కు చెందిన హయ్యార్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్(సీఎస్ఐఐసీ) తాజాగా వెల్లడించింది. ఈ విషయమై స్పెయిన్ తో కలిసి అర్జెంటీనా సైంటిస్టులు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. దూరం, ప్రత్యేక వాతావరణ పరిస్థితులను అధిగమించి వైరస్ అంటార్కిటికా ఖండంలోని పక్షులకు కూడా సోకడంపై అర్జెంటీనా సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు.

తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి - సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024
తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి – సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024

అంటార్కిటికా మెయిన్ ల్యాండ్కు బర్డ్ ఫ్లూ వైరస్ చేరుకోవడంతో ఇక్కడ పెద్ద సంఖ్యలో నివసిస్తున్న పెంగ్విన్ జాతి పక్షులకు తీవ్రమైన ముప్ప పొంచి ఉందని వారు హెచ్చరిస్తున్నారు. తక్కువ ప్రదేశంలో ఎక్కువ పెంగ్విన్ పక్షులు నివసించే కాలనీలు ఈ ప్రాంతంలో ఉన్నందున వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

భారత్ జీపీటీ ‘హనుమాన్’ 

ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న నూతన సాంకేతికతల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఒకటి. ఈ టెక్నాలజీలో భారత్ కీలక పాత్ర పోషించేందుకు దోహదపడేలా ‘హనుమాన్’ పేరుతో సీతా మహలక్షిమ్ హెల్త్కర్(ఎస్ఎంఎల్) సంస్థ ఓ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం)ను ఆవిష్కరించింది. ఏకంగా 22 భారతీయ భాషల్లో ఆరోగ్య సంరక్షణ, పరిపాలన, విద్య, ఆర్థిక సేవలు తదితర రంగాలకు సంబంధించిన సేవలను అందించగలిగే ఈ ఎల్ఎల్ఎంను బాంబే ఐఐటీ నేతృత్వంలోని భారత్ జీపీటీ ఎకోసిస్టం భాగస్వామ్యంతో ఆవిష్కరించారు. బాంబే ఐఐటీతోపాటు మరో 7 ఇతర ఐఐటీల ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత్ జీపీటీ ఎకోసిస్టం వాస్తవానికి ఓ రిసెర్చ్ కన్సార్షియం.

తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి - సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024
తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి – సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024

రిలయన్స్ ఇండస్ట్రీస్ తోపాటు కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం, ఎస్ఎంఎల్ తోడ్పాటుతో ముందుకు సాగుతోంది ఈ కన్సార్షియం. స్పీచ్ టు-టెక్స్, టెక్స్ టు-స్పీచ్, టెక్స్ టు-వీడియో, వీడియో -టు-టెక్స్ జనరేటింగ్ లాంటి బహుళ సామర్థ్యాలను కలిగి ఉన్న ‘హనుమాన్’ ఎల్ఎల్ఎం.. ప్రస్తుతానికి హిందీ, తమిళ్, తెలుగు, మళయాళం, మరాఠీ తదితర 11 భారతీయ భాషల్లో ప్రతిస్పందిస్తోంది. మున్ముందు 22 భారతీయ భాషల్లో ప్రతిస్పందించగలిగేలా సామర్థ్యాన్ని పెంచాలని భావిస్తున్నారు.

పాము కాటుకు కొత్త విరుగుడు..

బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సీ) శాస్త్రవేత్తలు అద్భుతం సృష్టించారు. పాము కాటుకు కొత్త తరహా విరుగుడును కనుగొన్నారు. పాము విషాన్ని నిర్వీర్యం చేసే కృత్రిమ యాంటీబాడీలను తయారు చేశారు. దాదాపు అన్ని రకాల పాము విషాలకు ఆ యాంటీబాడీలు విరుగుడుగా పనిచేయనున్నట్లు తెలుస్తోంది. హెచ్ఐవీ, కోవిడ్ 19 రోగుల్లో యాంటీబాడీ స్క్రీనింగ్ కోసం వాడిన విధానాన్ని సింథటిక్ యాంటీబాడీలు తయారు చేసేందుకు అనుసరించారు. ఆ ప్రక్రియలోనే విషాన్ని నిర్వీర్యం చేసే కొత్త విధానాన్ని డెవలప్ చేశారు.తొలిసారి ఆ టెక్నిక్ ద్వారా పాము కాటుకు చికిత్స చేస్తున్నట్లు ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు తెలిపారు. ION అమెరికాకు చెందిన స్క్రీప్స్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు కూడా ఆ బృందంలో ఉన్నారు.

తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి - సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024
తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి – సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024

ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల విష సర్పాల నుంచి రక్షణ పొందే రీతిలో యూనివర్సల్ యాంటీబాడీని అభివృద్ధి చేస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. కోబ్రా, కింగ్ కోబ్రా, క్రెయిట్, మాంబా లాంటి ప్రమాదకర సర్పాలు ఆ లిస్టులో ఉన్నాయి.

వ్యాధులను గుర్తించే సరికొత్త సెన్సర్

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)–జోధ్పూర్ పరిశోధకులు తక్కువ ఖర్చుతో కూడిన హ్యూమన్ బ్రీత్ సెన్సర్ను అభివృద్ధి చేశారు. ఇది డ్రంక్ అంyŠ æడైవింగ్ కేసుల్లో ఆల్కహాల్ కంటెంట్ను కొలపటమేగాక, పలు రకాల వ్యాధులను నిర్ధారించటంలోనూ సహాయపడుతుంది. ‘ఆల్కహాల్ వాసనను పసిగట్టే సెన్సర్లతోబాటు, కొన్ని వ్యాధుల లక్షణాల్ని గుర్తించే సాంకేతికత ఇందులో ఉంది.

తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి - సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024
తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి – సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024

ఆస్తమా, డయాబెటిక్, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సమస్యల్ని పసిగడుతుంది’ అని ఐఐటీ జోధ్పూర్ పరిశోధకులు తెలిపారు. అత్యంత తక్కువ ధరలో, వెంటనే ఫలితాల్ని చూపగలిగే హెల్త్ మానిటరింగ్ పరికరం తెలిపారు. అకరం ఇప్పుడు శ చాలా అవసరమని గగన్యాన్

గగన్యాన్ ద్వారా అంతరిక్షంలోకి వ్యోమగాములను తీసుకెళలనున్న నలుగురు వీరే..

భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ మిషన్లో పాల్గొనబోతున్న వ్యోమగాములంతా నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థులే. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాను శుక్లా వృత్తిరీత్యా యుద్ధపైలెట్లు. వీరంతా గగన్యాన్ కోసం ఇప్పటికే రష్యాలో వ్యోమగాములుగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. భారత్లోనూ ఇస్రో వీరికి కొంతకాలంగా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. తమ నలుగురు యుద్ధవిమాన పైలెట్లు గగన్యాన్లో భాగస్వాములు కావడం తమకెంతో గర్వకారణమని భారత వాయుసేన పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ‘సూపర్ ఫోర్’ గురించి…

ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్..

భారత వాయుసేనలో యుద్ధవిమానాన్ని సుదీర్ఘకాలంపాటు నడిపిన అనుభవం ఉన్న పైలెట్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఈ నలుగురిలో ఒక్కడిగా ఎంపికయ్యారు. కేరళలోని తిరువజియాడ్లో 1976 ఆగస్ట్ 26న జన్మించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్ డీఏ)లో శిక్షణ పూర్తిచేసుకుని అక్కడే ‘స్క్వాడ్ ఆఫ్ హానర్’ను సాధించారు. తమిళనాడులోని వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్విసెస్ స్టాఫ్ కాలేజీలో, తాంబరం ఎఫ్ ఐఎస్ లో చదువుకున్నారు. తర్వాత ఈయన 1998 డిసెంబర్ 19న ఇండియన్ ఎయిర్ఫోర్స్లో యుద్ధవిమాన పైలెట్గా విధుల్లో చేరారు.

తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి - సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024
తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి – సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024

సుఖోయ్30ఎంకేఐ, మిగ్-21, మిగ్-29 ఇలా పలు రకాల యుద్ధవిమానాలు నడపడంలో ఈయన దిట్ట. మొత్తంగా 3,000 గంటలకుపైగా యుద్ధ విమానాలను నడిపారు. కీలకమైన సుఖోయ్–30 స్క్వాడ్రాన్కు కమాండింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ‘ఎ’ కేటగిరీ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా. టెస్ట్ పైలెట్గా అనుభవం గడించారు. గగన్యాన్లో ఈయన గ్రూప్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోనున్నారు. నాయర్ భార్య లీనా మలయాళ సినీపరిశ్రమలో నటిగా పేరొందారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లి. గత నెల 17వ తేదీన వీరి వివాహం జరిగింది. ‘ మా ఆయనకు తొలి ఇండియన్ ఆస్ట్రోనాట్ వింగ్స్ దక్కడం కేరళ రాష్ట్రానికే గర్వకారణం’ అని ఆమె ఆనందం వ్యక్తంచేశారు. వీళ్ల కుటుంబం కేరళలోని పాలక్కడ్ జిల్లా నెన మరలో నివసిస్తోంది. నాయర్ను ఆస్ట్రోనాట్గా ప్రధాని ప్రకటించగానే నెస్మరలో పండగ వాతావరణం నెలకొంది.

అజిత్ కృష్ణన్..

అజిత్ కృష్ణన్ 1982లో చెన్నైలో జన్మించారు. ఈయన సైతం ఎన్డీఏలో శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకుని స్వోర్డ్ ఆఫ్ ఆనర్ పొందారు. రాష్ట్రపతి బంగారు పతకాన్ని సాధించారు. ఈయన తమిళనాడులోని వెల్లింగ్టన్లోని డీఎస్ఎస్ సీలోనూ చదువుకున్నారు. 2003 జూన్లో భారత వాయుసేనలో పైలెట్ గా చేరారు. ఫ్లయింగ్ ఇన్స్టాక్టర్గా, టెస్ట్ పైలెట్గా ఉంటూ 2,900 గంటలపాటు యుద్ధ విమానాలను నడిపారు. సుఖోయ్, మిగ్, జాగ్వర్, డోర్నియర్. ఏఎన్-32 రకం విమానాలను నడిపారు. ఈ మిషన్లో అవసరం మేరకు గ్రూప్ కెప్టెన్గా ఉంటారు.

అంగద్ ప్రతాప్..

అంగద్ ప్రతాప్ 1982లో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జన్మించారు. ఈయన సైతం ఎన్డీఏ పూర్వ విద్యార్ధి. 2004 డిసెంబర్ లో భారత వాయుసేన దళాల్లో చేరారు. టెస్ట్ పైలెట్గా, ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా సేవలందించారు. దాదాపు 2,000 గంటలపాటు విమానాలు నడిపిన అనుభవం ఉంది. సుఖోయ్ 30 ఎంకేఐ. మిగ్-21, మిగ్-29, హాక్, డోర్నియర్. ఏఎన్- 32 సహా ఎన్నో రకాల విమానాలను సమర్థవంతంగా నడిపారు. గగన్యాన్ మిషన్ లో ఈయన గ్రూప్ కెప్టెన్ గా ఎంపికయ్యారు.

శుభాను శుక్లా..

వింగ్ కమాండర్ శుభాను శుక్లా ఉత్తరప్రదేశ్లోని లక్నోలో 1985లో జన్మించారు. ఎన్డీఏలో శిక్షణ ! ఉత్తరప్రదేశ్లోని లక్నోలా పూర్తిచేసుకుని 2006 జూన్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్లో పైలెట్గా చేరారు. ఫైటర్ కంబాట్ రీడర్గా, టెస్ట్ పైలెట్గా 2,000 గంటలపాటు యుద్ధవిమనాలు నడిపారు. భారత వాయుసేనలోని దాదాపు అన్నిరకాల యుద్ధవిమానాలు నడపడంలో ఈయన నైపుణ్యం సాధించారు. ఈ నలుగురికి రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ శిక్షణ సంస్థలో సమగ్రమైన శిక్షణ ఇచ్చారు. గగన్యాన్లో ఈయన వింగ్ కమాండర్ గా వ్యవహరిస్తారు.

మూడు ఇస్రో ప్రాజెక్టులు జాతికి అంకితం

సమీప భవిష్యత్తులో చేపట్టనున్న భారీ రాకెట్ ప్రయోగాల నిమిత్తం సుమారు రూ.1.800 కోట్లతో నిర్మించిన మూడు ఇస్రో సెంటర్లను పరధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబరవరి 27వ తేదీ తుంబా నుంచి వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ పీఎస్ఎల్ఎ ఇంటిగ్రేషన్ భవనం, ఇస్రో ప్రపొల్షన్ కాంప్లెక్సలో సెమీ క్రయోజనిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజన్ అండ్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ భవనం, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ట్రైనోసిక్ విండ్ టన్నెల్ భవనాలను అందుబాటులోకి తెచ్చారు.

తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి - సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024
తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి – సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024

వీటి ద్వారా ఏటా 8 నుంచి 15 పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలతో పాటు మొదటి ప్రయోగ వేదికపై ఒకేసారి రెండు రాకెట్లను అనుసంధానం చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.

Current Affairs Science and Technology News February-2024 #Current Affairs Science and Technology News February-2024 #Current Affairs Science and Technology News February-2024

2 thoughts on “తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి – సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.