క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్..కార్డుల్లో మార్పులివే.. | Credit Card New Rules-2024
Credit Card New Rules-2024: మీరు క్రెడిట్ కార్డులు వాడుతున్నారా? దిగ్గజ బ్యాంకులైన ఎస్‌బీఐ(SBI), ఐసీఐసీఐ(ICICI), యాక్సిస్ బ్యాంక్(Axis Bank) సహా హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) వంటివి కస్టమర్ల కోసం ఎన్నో క్రెడిట్ కార్డుల్ని విడుదల చేస్తున్నాయి. వీటిల్లో చాలా వరకు ఆదరణ పొందినవి ఉంటాయి. క్రెడిట్ కార్డులకు సంబంధించి ఇవి కొన్ని కొన్ని మార్పులు చేశాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Credit Card New Rules-2024
ప్రస్తుత రోజుల్లో చాలా మంది క్రెడిట్ కార్డుల్ని వాడుతుంటారు. ప్రముఖ బ్యాంకులు సహా ఇతర ఫైనాన్స్ కంపెనీలు కూడా క్రెడిట్ కార్డుల్ని ఆఫర్ చేస్తుంటాయి. క్రెడిట్ కార్డుల ద్వారా లోన్లు కూడా పొందొచ్చు. వాయిదాల్లో తిరిగి చెల్లించొచ్చు. ఉద్యోగం చేసే దాదాపు ప్రతి ఒక్కరి దగ్గరా ఇప్పుడు క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. ఇక ఎస్‌బీఐ కార్డు(SBI Card), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(HDFC Bank), ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank), యాక్సిస్ బ్యాంకు(Axis Bank) వంటివి పెద్ద సంఖ్యలో క్రెడిట్ కార్డుల్ని జారీ చేస్తుంటాయి. వీటిల్లో కొన్ని కార్డులకు కస్టమర్లు ఎక్కువగా ఉంటారు. అయితే ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డులు వాడే వారికి అలర్ట్. వీటికి సంబంధించి కొన్ని రూల్స్ మారాయి. కొన్ని ప్రొడక్ట్స్, పాలసీల్లో మార్పులు చేశాయి. అవేంటో కచ్చితంగా తెలుసుకోవాలి.
యాక్సిస్ బ్యాంక్ కార్డు-Axis Bank Card..
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్(Axis Bank Credit Card) కార్డులు వాడే వారికి అలర్ట్. ప్రతి రెంటల్ ట్రాన్సాక్షన్‌కు రూ. 1500 గరిష్ట పరిమితితో ఒక శాతం రెంట్ సర్‌ఛార్జ్ రుసుము పడుతుంది. అదనంగా టాక్స్‌లు వర్తిస్తాయి. భారత కరెన్సీతో విదేశీ చెల్లింపులు చేసే వారికి కూడా ఇది వర్తిస్తుంది. ఈ మారిన రూల్స్ మార్చి 5 నుంచి అమల్లోకి వస్తాయి.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు- SBI Credit Card..
ఎస్‌బీఐ కార్డ్ క్రెడిట్(SBI Credit Card) కార్డులకు సంబంధించి కూడా కొన్ని రూల్స్ మారాయి. ఇక్కడ వడ్డీ లెక్కింపులు మారాయి. క్రెడిట్ కార్డుల మినిమమ్ డ్యూ అమౌంట్ కాలిక్యులేషన్ ప్రక్రియలో మార్పులు చేసినట్లు చెప్పింది. ఇది మార్చి 15 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు- ICICI Credit Card..
ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Credit Card) వెబ్‌సైట్ ప్రకారం.. 2024, ఏప్రిల్ 1 నుంచి ముందటి త్రైమాసికంలో మీరు రూ. 35 వేలు క్రెడిట్ కార్డుతో ఖర్చు చేసినట్లయితే కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందొచ్చు. అంటే మీరు ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో లాంజ్ యాక్సెస్ అన్‌లాక్ పొందాలంటే .. జనవరి- మార్చి త్రైమాసికంలో రూ. 35 వేలు ఖర్చు చేసుండాలి. అన్నింటికీ ఇదే వర్తిస్తుంది.
HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు-HDFC Credit Card..
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు.. హెచ్‌డీఎఫ్‌సీ(HDFC Credit Card) తన ప్రముఖ క్రెడిట్ కార్డులైనటువంటి రెగాలియా, మిలీనియా క్రెడిట్ కార్డుల్లో మార్పులు చేసింది. క్రెడిట్ కార్డు స్పెండింగ్స్‌ను బట్టి లాంజ్ యాక్సెస్ ప్రోగ్రామ్ ఉంటుందని పేర్కొంది. ఇక్కడ ఒక త్రైమాసికంలో రూ. లక్ష అంతకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనిని చేరుకుంటే గనుక రెగాలియా కార్డు కస్టమర్లు 2 కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ వోచర్లు పొందొచ్చు. అదే మిలీనియా కార్డు కస్టమర్లు అయితే ఒక కాంప్లిమెంటరీ వోచర్ పొందొచ్చు.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
ఏపీ 10వ తరగతి హాల్‌టికెట్లు విడుదల | AP SSC Hall Tickets 2024 Download Now @bse.ap.gov.in