Congress Plans to give MP Tickets to Four Leaders Who Joined the Party From BRS | BRS నుంచి వచ్చిన ఆ నలుగురికి సీట్లు, త్వరలో అధికారిక ప్రకటన..!
Congress Plans to give MP Tickets to Four Leaders Who Joined the Party From BRS-2024: పార్లమెంట్ ఎన్నికల్లో మోజార్టీ సీట్లు సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని యోచిస్తోంది. ఇప్పటికే మహబూబ్‌నగర్ స్థానానికి వంశీ చందర్ రెడ్డి పేరును ఖరారు చేయగా.. మరో ఏడు స్థానాలకు కూడా దాదాపు అభ్యర్థులు ఖరారయ్యారు. వారిలో నలుగురు బీఆర్ఎస్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన నేతలు ఉన్నట్లు తెలిసింది.
ముఖ్యాంశాలు :
- లోక్‌సభ ఎన్నికలకు బలమైన అభ్యర్థులు
- వ్యుహాలు రచిస్తోన్న కాంగ్రెస్
- నలుగురు బీఆర్ఎస్ వలస నేతలకు సీట్లు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే రిజల్ట్ రిపీట్ చేయాలని అనుకుంటుంది. మెుత్తం 17 ఎంపీ సీట్లకు గాను 12 నుంచి 14 సీట్లు కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అందుకు తగ్గట్లుగా గెలుపు వ్యుహాలను రచిస్తోంది. సర్వేల ఆధారంగా విజయం సాధించే అభ్యర్థులకే సీట్లు కేటాయిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆ పేర్లను సెంట్రల్ కమిటీకి పంపించి అభ్యర్థులను సెలక్ట్ చేయనున్నారు. మెుత్తం 17 స్థానాల్లో సగం సీట్లకు అభ్యర్తులు ఖరారైనట్లు సమాచారం.
నలుగురికి సీట్లు కన్ఫార్మ్ అయినట్లు..
రెండ్రోజుల క్రితం కొడంగల్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. మహబూబ్‌నగర్ అభ్యర్థిగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డిని ప్రకటించారు. ఇక మిగిలిన 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా.. బీఆర్ఎస్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన నలుగురికి సీట్లు కన్ఫార్మ్ అయినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినవారిలో పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేతకు అదే స్థానం కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి, వికారాబాద్ జడ్పీ ఛైర్‌పర్సన్ పట్నం సనీతా మహేందర్ రెడ్డికి చేవెళ్ల, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు సికింద్రాబాద్, సినీ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టికెట్లు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్..
వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు జానా రెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి నిజామాబాద్, సురేష్ కుమార్ షెట్కర్‌కు జహీరాబాద్ ఎంపీ టికెట్లు కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. వీరి అభ్యర్థిత్వానికి పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వంశీచందర్ రెడ్డికి ఇప్పటికి టికెట్ కన్ఫార్మ్ కాగా.. ఈ ఏడు సీట్లకు కూడా అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లే. ఇక మిగిలిన 9 సీట్లకు అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరుగుతోంది.
పట్నం దంపతులకు వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో మంచి పట్టు ఉండటంతో సునీతకు చేవెళ్ల సీటు కేటాయించేందుకు సిద్ధమయ్యారు. వెంకటేష్ నేత సిట్టింగ్ ఎంపీ కావటంతో ఆయనకే మరోసారి అవకాశం కల్పించనున్నారు. ఇక దేశంలోనే పెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి నుంచి కంచర్ల బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. అల్లు అర్జున్ సినీ గ్లామర్ ఆయన గెలుపుకు పనికొస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది. బొంతు రామ్మోహన్ విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి వచ్చారు. హైదరాబాద్ మేయర్ గాను పని చేశారు. ఆయన భార్య ప్రస్తుతం చర్లపల్లి కార్పొరేటర్‌గా ఉన్నారు. బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన బొంతు టికెట్ కేటాయిస్తే ఈజీగా గెలుస్తామని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్‌లోకి అల్లు అర్జున్ మామ..
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి భావిస్తున్నారట. 2014 కంటే ముందు తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లుగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. తాను విద్యాభ్యాసం చేసే సమయంలో కాంగ్రెస్ యూత్ విభాగంలో పనిచేసినట్లు తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రావటం సొంత గూటికి వచ్చినట్లుగా ఉందని చెప్పారు. కంచర్ల చేరిక తమకు కూడా ఫ్లస్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో అల్లుడు అల్లు అర్జున్ సినీ గ్లామర్‌ను ఉపయోగించుకోవచ్చునని ఆ పార్టీ భావిస్తోంది.
కాగా.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి 2014లో టీఆర్ఎస్ తరపున ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికలకు దూరంగా ఉండగా.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు యాక్టివ్ అయ్యారు. ఆయన నాగార్జున సాగర్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవటంతో పాటు నియోజవర్గంలో విస్తృతంగా పర్యటించారు. అయితే అక్కడ సిట్టింగ్‌కే అవకాశం ఇవ్వటంతో కంచర్లకు ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు.
మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి కూడా నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే వీరు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కాగా.. పట్నం సునీతకు చేవెళ్ల ఎంపీ సీటు కన్ఫార్మ్ అనే టాక్ వినిపిస్తోంది. బొంతు, శ్రీలత సికింద్రాబాద్ ఎంపీ సీటు ఆశిస్తున్నట్లు సమాచారం.
Congress Plans to give MP Tickets to Four Leaders Who Joined the Party From BRS-2024
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
Congress Plans to give MP Tickets to Four Leaders Who Joined the Party From BRS-2024
Congress Plans to give MP Tickets to Four Leaders Who Joined the Party From BRS-2024