...

CM Reventh Reddy May Go For Extension of Telangana Cabinet for 2nd Deputy CM

Written by lsrupdates.com

Published on:

CM Reventh Reddy May Go For Extension of Telangana Cabinet for 2nd Deputy CM | తెలంగాణ కేబినెట్ విస్తరణ.. రెండో డిప్యూటీ సీఎం పదవి, ఆయనకేనా..?

CM Reventh Reddy May Go For Extension of Telangana Cabinet for 2nd Deputy CM | లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ రెడీ అయినట్లు తెలిసింది. ఫిబ్రవరి మెుదటి వారంలోనే కేబినెట్ విస్తరణ ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒకే డిప్యూటీ సీఎం పోస్టు ఉండగా.. మరొకరికి కూడా డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. సామాజిక వర్గాల సమీకరణల్లో భాగంగా ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

CM Reventh Reddy May Go For Extension of Telangana Cabinet for 2nd Deputy CM | తెలంగాణ కేబినెట్ విస్తరణ.. రెండో డిప్యూటీ సీఎం పదవి, ఆయనకేనా..?
CM Reventh Reddy May Go For Extension of Telangana Cabinet for 2nd Deputy CM | తెలంగాణ కేబినెట్ విస్తరణ.. రెండో డిప్యూటీ సీఎం పదవి, ఆయనకేనా..?

ప్రధానాంశాలు:

  • త్వరలో మంత్రివర్గ విస్తరణ
  • రేవంత్ టీంలో రెండో డిప్యూటీ సీఎం
  • త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగా..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగా.. సీఎంగా రేవంత్ సహా మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణలో మెుత్తం కేబినెట్ బెర్తుల సంఖ్య 18 కాగా.. ప్రస్తుతం సీఎంతో కలుపుకొని 12 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. కేబినెట్‌లో ప్రస్తుతం ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఫిబ్రవరి మెుదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉండనుందనే ప్రచారం జరుగుతోంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేబినెట్ విస్తరించి.. లోక్‌సభ బరిలో దిగాలని కాంగ్రెస్ భావిస్తోంది.

Also Read: 

TJS President Kodandaram Appointed as MLC In Governor Quota Telangana-2024| గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్ కు ఎమ్మెల్సీ పదవి !!!

ప్రస్తుతం…

ప్రస్తుతం ఎస్సీ వర్గానికి చెందిన భట్టి విక్రమార్క తెలంగాణ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితో రెండో డిప్యూటీ సీఎం పదవిని కూడా ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారట. సామాజిక సమీకరణాల్లో భాగంగా మరో వర్గానికి ఆ పదవిని కట్టబెట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది. బీసీ లేదా మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి రెండో ఉప ముఖ్యమంత్రిని పొందే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రెండో డిప్యూటీ సిఎంకు కీలకమైన హోంమంత్రితో పాటు మరో రెండు శాఖలను కేటాయించనున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ఒకే ఒక్క డిప్యూటీ సీఎం ఉన్నారు. అయితే.. పక్కరాష్ట్రం ఏపీలో సీఎం జగన్ దేశంలోనే అత్యధికంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించారు. బీజేపీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లోనూ ఇద్దరేసి డిప్యూటీ సీఎంలు ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సామాజిక, ఇతర సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని మంత్రులు, మరో డిప్యూటీ సీఎం పదవిని భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది.

ఇప్పుడున్న 12 మంది మంత్రుల్లో…

ఇప్పుడున్న 12 మంది మంత్రుల్లో (సీఎంతో సహా) నలుగురు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు. (రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి) ఎస్టీ వర్గానికి చెందిన ఒకరు ( సీతక్క), ఇద్దరు బీసీలు (పొన్నం ప్రభాకర్, గౌడ్, కొండా సురేఖ) ఇద్దరు ఎస్సీలు (మల్లు భట్టి విక్రమార్క, దామోదర్ రాజనరసింహ) ఉన్నారు. జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, డి శ్రీధర్ బాబులు (వరుసగా వెలమ, కమ్మ, బ్రాహ్మణ వర్గాలకు) చెందిన వారు ఉన్నారు.

మెనార్డీ వర్గానికి చెందిన వారు…

మెనార్డీ వర్గానికి చెందిన వారు ఒక్కరు కూడా మంత్రివర్గంలో లేరు. ఇటీవల ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్‌ పత్రిక జర్నిలిస్టు మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. వీరిలో కోదండరాంకు విద్యాశాఖ పోర్ట్‌ఫోలియో ఇచ్చి.. అమీర్ అలీఖాన్‌ను డిప్యూటీ సీఎం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి షబ్బీర్ అలీని ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి కట్టబెతారనే ప్రచారం జరిగినా.. ఇటీవల ఆయనకు కేబినెట్ ర్యాంకుతో కూడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సలహాదారు పదవిలో నియమించారు. దీంతో మైనార్టీ వర్గానికి చెందిన అమీర్‌ను డిప్యూటీ సీఎం చేసి హోంశాఖ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.

గత ప్రభుత్వంలోనూ…

గత ప్రభుత్వంలోనూ మైనార్టీ వర్గానికే చెందిన మహమూద్ అలీ డిప్యూటీ సీఎంగా, హోంమంత్రిగా పని చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే రిపీట్ చేయాలని భావిస్తున్నారట. ఇక మిగిలిన మంత్రి పదవులకు బీసీ కోటాలో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీహరి ముదిరాజ్ (మక్తల్), రెడ్డిలకు మరో పదవి ఇస్తే.. మల్‌రెడ్డి రంగారెడ్డి, టి. రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేసులో ఉన్నారు. వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేం సాగర్ రావు, మదన్ మోహన్ రావు పోటీలో ఉన్నారు. ఎస్సీ సామాజికవర్గం నుంచి జి. వివేక్‌, జి. వినోద్‌ పదవులు ఆశిస్తున్నారు.

CM Reventh Reddy May Go For Extension of Telangana Cabinet for 2nd Deputy CM | తెలంగాణ కేబినెట్ విస్తరణ.. రెండో డిప్యూటీ సీఎం పదవి, ఆయనకేనా..?

పదవులు ఆశిస్తున్నారు.

CM Reventh Reddy May Go For Extension of Telangana Cabinet for 2nd Deputy CM

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

Venkaiah Naidu History: From ABVP President To Vice President Of India-2024 | ఏబీవీపీ నుంచి పద్మవిభూషణ్ దాకా వెంకయ్య నాయుడి తిరుగులేని ప్రస్థానం

Announced Padma Awards-2024 Check Complete List Of Winners | పద్మ అవార్డుల ప్రకటన.. పూర్తి జాబితా ఇదే!!!

New Route Map For Hyderabad Metro Phase 2 | హైదరాబాద్‌లో నూతన మెట్రో రైలు రూట్ మ్యాప్ రెడీ.. 70కిలోమీటర్ల నిర్మాణంపై హెచ్ఎంఆర్ఎల్ నిర్ణయం

India vs England :Ravindra Jadeja Missed century-24 | సెంచరీ మిస్‌ చేసుకున్న జడేజా.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 436 ఆలౌట్‌

Indiramma Indlu Scheme Applications Filtering through Artificial Intelligence in Telangana-2024 | పేదలకు ఇందిరమ్మ ఇళ్లు.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో లేటెస్ట్ టెక్నాలజీ..! – Lsrallinonenews.com

DGP Mahender Reddy Appointed as TSPSC Chairman-2024 | TSPSC ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి – Lsrallinonenews.com

Exploring the Best Affiliate Marketing Strategies -2024 (lsrallinonenews.com)

2 thoughts on “CM Reventh Reddy May Go For Extension of Telangana Cabinet for 2nd Deputy CM”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.