...

కాంగ్రెస్‌ సర్కార్‌ మరో గుడ్‌న్యూస్‌..ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు | CM Revanth Reddy to launch Indiramma Housing Scheme on March 11th 2024

Written by lsrupdates.com

Published on:

కాంగ్రెస్‌ సర్కార్‌ మరో గుడ్‌న్యూస్‌..ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు | CM Revanth Reddy to launch Indiramma Housing Scheme on March 11th 2024

CM Revanth Reddy to launch Indiramma Housing Scheme on March 11th 2024: లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడు పెంచింది. ఇప్పటికే నాలుగు పథకాలను అమలు చేసిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు మరో కీలక హామీని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంపై సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ పథకానికి సంబంధించి గైడ్ లైన్స్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

CM Revanth Reddy to launch Indiramma Housing Scheme on March 11th 2024

ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని అన్నారు.

కాంగ్రెస్‌ సర్కార్‌ మరో గుడ్‌న్యూస్‌..ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు | CM Revanth Reddy to launch Indiramma Housing Scheme on March 11th 2024
                                                     CM Revanth Reddy to launch Indiramma Housing Scheme on March 11th 2024

రాష్ట్రంలో ఇల్లు లేని..

శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అందుకు అనుగుణంగా విధి విధానాలను తయారు చేయాలని చెప్పారు.

ప్రజా పాలనలో నమోదు చేసుకున్న అర్హులందరికీ ముందుగా ప్రాధాన్యమివ్వాలని అన్నారు. గత ప్రభుత్వం డబుల్ ఇళ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా, అసలైన అర్హులకు లబ్ధి జరిగేలా చూడాలని అధికారులను అప్రమత్తం చేశారు. ముందుగా ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేయాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. దశల వారీగా గూడు లేని నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చడం తమ ప్రభుత్వ సంకల్పమని సీఎం తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

ఇంటి స్థలంతో పాటు..

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్నవారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారు. ఏయే దశల్లో ఈ నిధులను విడుదల చేయాలనే నిబంధనలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు అందాల్సిన నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పారు.

కాంగ్రెస్‌ సర్కార్‌ మరో గుడ్‌న్యూస్‌..ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు | CM Revanth Reddy to launch Indiramma Housing Scheme on March 11th 2024
                                                        CM Revanth Reddy to launch Indiramma Housing Scheme on March 11th 2024

సొంత జాగాలో ఇల్లు కట్టుకునేవారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లను తయారు చేయించాలని సీఎం సూచించారు. లబ్ధిదారులు సొంత ఇల్లు తనకు అనుగుణంగా నిర్మాణం చేపట్టినప్పటికీ తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా చూడాలన్నారు. ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యతలను వివిధ శాఖల్లో ఉన్న ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగించాలని సీఎం సూచించారు. జిల్లా కలెక్టర్ల అధ్వర్యంలో ఇంజనీరింగ్ విభాగాలకు ఈ బాధ్యతలను ఇవ్వాలని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

CM Revanth Reddy to launch Indiramma Housing Scheme on March 11th 2024

వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్లు..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు | 5 % Reservation for Disabled Persons in Education and Job Opportunities

CM Revanth Reddy to launch Indiramma Housing Scheme on March 11th 2024

BEL Trainee Engineer (TE) Recruitment 2024 Apply Online For 517 Post @bel-india.in – Lsrallinonenews.com

1 thought on “కాంగ్రెస్‌ సర్కార్‌ మరో గుడ్‌న్యూస్‌..ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు | CM Revanth Reddy to launch Indiramma Housing Scheme on March 11th 2024”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.