CM Revanth Reddy-People should know the facts about Medigadda-2024 | ‘మేడిగడ్డ’ గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలి: సీఎం రేవంత్ రెడ్డి

Written by lsrupdates.com

Published on:

CM Revanth Reddy-People should know the facts about Medigadda | “మేడిగడ్డ” గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలి: సీఎం రేవంత్ రెడ్డి

సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని పెద్దలు చెప్పారని సీఎం రేవంత్ (Revanth Reddy) రెడ్డి తెలిపారు. దేవాలయాలు ఎంత పవిత్రమైనవో.. రైతులకు సాగునీటి ప్రాజెక్టులూ అంతే పవిత్రమైనవని చెప్పారు.

సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని పెద్దలు చెప్పారని సీఎం రేవంత్రెడ్డి ((Revanth Reddy) తెలిపారు. దేవాలయాలు ఎంత పవిత్రమైనవో.. రైతులకు ప్రాజెక్టులూ అంతేనని చెప్పారు. ఐదో రోజు. అసెంబ్లీ సమావేశాల్లో స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

తెలంగాణకు ప్రధానంగా..

“తెలంగాణకు ప్రధానంగా తాగు, సాగునీటి కోసం రెండు వనరులున్నాయి. అవి కృష్ణా. గోదావరి జలాలు. కృష్ణా జలాలపై ఇప్పటికే కొంత మేర శాసనసభలో చర్చించాం. వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు వివరించగలిగాం. ఇక రెండోది గోదావరి జలాలు తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టాలని గతంలో పాలకులు నిర్ణయం తీసుకున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. రూ.38,500 కోట్ల అంచనాతో 2008లో టెండర్ల ప్రక్రియ చేపట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యే నాటికే వేల కోట్ల రూపాయల విలువైన పనులు జరిగాయి.

భారాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల రీడిజైన్ అనే బ్రహ్మపదార్ధాన్ని కనిపెట్టారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టులో మార్పులు చేర్పులు చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల.. ఇలా బ్యారేజీలు కట్టుకుంటూపోయారు. చివరకు రూ.38,500 కోట్ల అంచనాతో ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రూ.1.47 లక్షల కోట్లకు పెంచారు. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. అంచనాలు ఎలా పెంచారు? రీడిజైనింగ్ ఎలా చేశారు? అందులో సాంకేతికపరమైన అంశాలు ఏమున్నాయి? రీడిజైనింగ్కు సంబంధించి నిపుణులు ఇచ్చిన డీపీఆర్ ఎక్కడ? ఆ తర్వాత జరిగిన నిర్మాణం, నిర్వహణ.. ఇవన్నీ ఇప్పటికీ ప్రశ్నల్లాగే మిగిలాయి.

CM Revanth Reddy-People should know the facts about Medigadda-2024 | 'మేడిగడ్డ' గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలి: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy-People should know the facts about Medigadda-2024 | ‘మేడిగడ్డ’ గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలి: సీఎం రేవంత్ రెడ్డి

మేడిగడ్డ బ్యారేజీ కింద ఇసుక కదలడం వల్లే కుంగిపోయిందని గత ప్రభుత్వంలో నేతలు అన్నారు. రూ.వేల కోట్లు ఖర్చు చేశారు. ఇంత జరిగితే.. బ్యారేజీ వద్దకు ఎవరూ వెళ్లకుండా.. చూడనీయకుండా పోలీసు పహారా పెట్టారు. భారత్-పాక్ సరిహద్దు వద్ద కూడా ఆ స్థాయిలో సెక్యూరిటీ ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఫిర్యాదులు అందడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రాజెక్టు పరిస్థితి ఏంటనే వివరాలతో కూడిన నివేదికను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది. చివరకు ఆ నివేదికనూ గత ప్రభుత్వం తప్పుబట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మేడిగడ్డ వద్ద జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది. అధికారులు కార్యాలయాల నుంచి ఫైళ్లు మాయం చేశారని పెద్ద ఎత్తున టీవీలు, పత్రికల్లో వచ్చింది. దీంతో తక్షణమే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్ద జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశించాం. విజిలెన్స్ కమిటీ ప్రాథమికంగా ఓ నివేదిక ఇచ్చింది. బ్యారేజీ నిర్మాణంలో తీసుకున్న నిర్ణయాలు, నిర్వహణలో నిర్లక్ష్యం సహా అనేక విషయాలను అందులో ప్రస్తావించింది.

ఇప్పటికీ బ్యారేజీ వద్ద ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కొంతమంది సీనియర్లు ఉన్నప్పటికీ వారికి పూర్తి అవగాహన ఉందో లేదో తెలియదు. అందుకే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ బ్యారేజీ సందర్శనకు రావాలని కోరాం. అదే జరిగితే అక్కడి వాస్తవ పరిస్థితులు ప్రతి ఒక్కరికీ తెలుస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో గొప్పది.. అద్భుతం.. అని ప్రచారం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు భారాస నేతలకు ఏటీఎంలా మారిందని.. వారి ఇళ్లల్లో కనకవర్షం కురిసిందని మేం అనడం లేదు. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాలి. అదొక్కటే మా ఉద్దేశం. ప్రాజెక్టుల వద్ద ఉన్న వాస్తవ పరిస్థితులను పరిశీలించి రెండు మూడు రోజుల్లో శ్వేత పత్రం విడుదల చేస్తాం” అని రేవంత్ రెడ్డి వివరించారు.

వాస్తవాలు తెలుసుకునేందుకే ‘మేడిగడ్డ’కు రమ్మంటున్నాం: శ్రీధర్ బాబు

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ సందర్శననకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా రావాలని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) కోరారు. శాసనసభ (ts Assembly) లో ఆయన మాట్లాడారు. తామే మాట్లాడితే రాజకీయ విమర్శలు అంటున్నందున వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతోనే అన్ని పార్టీల సభ్యులనూ ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.

CM Revanth Reddy-People should know the facts about Medigadda-2024: “మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలు సహా ఇతర అనేక అంశాల విషయంపై మా ప్రభుత్వం రాగానే సీఎం రేవంత్రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమీక్ష నిర్వహించారు. దీనిపై విచారణకు విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేశారు. పూర్తిస్తాయిలో అవినీతి జరిగిందని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. డ్యామ్ సేఫ్టీ విషయంలో తప్పిదాలు జరిగాయని కేంద్ర ప్రభుత్వ అధికారులూ చెప్పారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో 50 ఏళ్ల క్రితం కట్టిన ప్రాజెక్టులు, డ్యామ్లకూ ఈ స్థాయిలో నష్టం జరగలేదు.

మేడిగడ్డ విషయంలో రాష్ట్ర ప్రజల సంపద ఎలా వృథా అయిందో తెలుస్తోంది. భారాస ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఈ పరిస్థితి వచ్చింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ఖజానాను ఏ విధంగా దుర్వినియోగం చేశారనే విషయాలను సభ దృష్టికి తీసుకొస్తున్నాం. వాస్తవాలను చూసేందుకే సభ్యులను అక్కడికి రమ్మంటున్నాం. నా నియోజకవర్గం మంథని పరిధిలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రైతులు భూములు, ఇళ్లు ఇచ్చి త్యాగం చేసినా ప్రయోజనం లేకపోయింది” అని శ్రీధర్ బాబు అన్నారు.

2019లోనూ మరమ్మతులకు ముందుకురాని గుత్తేదారు

మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు తమ బాధ్యత కాదని, డిపెక్ట్ లయబిలిటీ గడువు ముగిసిందని చెప్తున్న గుత్తేదారు సంస్థ, 2019 నవంబరులో వరద వచ్చినపుడు దెబ్బతిన్న వాటికి కూడా మరమ్మతు చేయడానికి నిరాకరించినట్లు తెలిసింది. ఆప్రాన్ దెబ్బతినడం, సీసీ బ్లాకులు చెల్లాచెదురు కావడానికి కారణం డిజైన్ అని, నీటిపారుదల శాఖ ఇచ్చిన డిజైన్ ప్రకారం పని చేసినందున తమది బాధ్యత కాదని వివరించినట్లు తెలిసింది. ఆ పనుల విలువ రూ.83.33 కోట్లుగా నీటిపారుదల శాఖ తేల్చింది. 2019 నవంబరులో వరద వచ్చినపుడు గేట్లు ఎత్తి నీటిని వదిలారు. గేట్లు మూసిన తర్వాత సీసీ బ్లాకులు, సీసీ కర్టెన్ వా కొంతభాగం కొట్టుకుపోవడం, ఆర్సీసీ కోటింగ్ పోవడం, ఆప్రాన్ దెబ్బతినడం లాంటివి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో గుర్తించారు. ఇలా దెబ్బతిన్న పనుల విలువ మూడు బ్యారేజీల్లో కలిపి రూ.180 కోట్లు కాగా, మేడిగడ్డలోనే రూ.83.33 కోట్లని తెలిసింది.

Can Medigadda barrage withstand the flood? | మేడిగడ్డ బ్యారేజీ.. వరదను తట్టుకోగలదా?
CM Revanth Reddy-People should know the facts about Medigadda-2024 | ‘మేడిగడ్డ’ గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలి

నీటి ప్రవాహ వేగం, బ్యారేజీ నుంచి కిందికి నీటి పడే వేగంలో మార్పులు.. ఇలా పలు కారణాల వల్ల ఈ నష్టం జరిగినట్లు గుర్తించారు. మరమ్మతులు చేయాలని సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారు సంస్థను కోరగా, నిరాకరించినట్లు తెలిసింది. ‘ఇంజినీర్ల పర్యవేక్షణలోనే పనులు చేశాం. నాణ్యత సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు’ అని పేర్కొన్నట్లు సమాచారం. తర్వాత రివైజ్డ్ మోడల్ స్టడీస్ చేయించి బ్యారేజీలకు జరిగిన డ్యామేజెస్ను బాగు చేయడానికి రూ.470 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తం సవరించిన అంచనాలో పొందుపరిచినట్లు తెలిసింది. లాంచింగ్ ఆప్రాన్, సీసీ బ్లాక్స్ నీటి ప్రవాహ వేగానికి తట్టుకోలేదని అప్పట్లోనే తెలిసినా నాటి నుంచి పునరుద్ధరణ పనులు ఎందుకు చేయలేదు.

బ్యారేజీ కుంగేవరకు ఎందుకు పట్టించుకోలేదన్నది ప్రశ్నార్ధకంగా మారింది. 2015-16 ధరల ప్రకారం బ్యారేజీ నిర్మాణానికి అంచనా వేసి టెండర్ పిలిచి గుత్తేదారుతో చేసుకొన్న ఒప్పందం ప్రకారం షీట్ పైల్స్ ఫౌండేషన్ ఉండగా, పని ప్రారంభించిన తర్వాత బ్యారేజీ నిర్మాణ ప్రాంతంలో పరిస్థితిని బట్టి దానిని సీకెంట్ పైల్ మార్చినట్లు తెలిసింది. ఈ పని చేయడానికి గుత్తేదారుతో అనుబంధ ఒప్పందం కూడా జరిగినట్లు సంబంధిత వర్గాల సమాచారం. మేడిగడ్డ బ్యారేజీలోనే ఓవర్హెడ్ ఛార్జెస్, కాంట్రాక్టర్ బెనిఫిట్లో కూడా మార్పులు జరగడం వల్ల సుమారు రూ.35 కోట్లు అదనంగా చెల్లించినట్లు సమాచారం, డీవాటరింగ్ లోనూ, మెటల్ ఎక్కువ దూరం నుంచి తేవాల్సి వచ్చిందని సుమారు రూ.50 కోట్ల అదనపు చెల్లింపులు జరిగినట్లు తెలిసింది. ఈ పనులు అనధికార ఉప గుత్తేదారులు చేసినట్లు సమాచారం.

CM Revanth Reddy-People should know the facts about Medigadda-2024

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

During Lok Sabha Elections Transfers Of IPS and Excise Employees In Telangana-2024 | లోక్‌సభ ఎన్నికల ముందు భారీగా IPSల బదిలీలు.. ఎక్సైజ్ శాఖలో ఏకంగా 105 మంది..!

Can Medigadda barrage withstand the flood? | మేడిగడ్డ బ్యారేజీ.. వరదను తట్టుకోగలదా? 2024

CM Revanth Reddy-People should know the facts about Medigadda

CM Revanth Reddy-People should know the facts about Medigadda

 

CM Revanth Reddy-People should know the facts about Medigadda

CM Revanth Reddy-People should know the facts about Medigadda-2024

1 thought on “CM Revanth Reddy-People should know the facts about Medigadda-2024 | ‘మేడిగడ్డ’ గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలి: సీఎం రేవంత్ రెడ్డి”

Leave a Comment