Can Medigadda barrage withstand the flood? | మేడిగడ్డ బ్యారేజీ.. వరదను తట్టుకోగలదా?
మేడిగడ్డ బ్యారేజీ.. వరదను తట్టుకోగలదా? మేడిగడ్డలోని ఏడో బ్లాకును పరీక్షించి దానితో పాటు మొత్తం బ్యారేజీ వచ్చే వర్షాకాలం వరదకు తట్టుకోగలదా? సురక్షితమేనా? అనేది నిర్ధారించుకోవాలని గుత్తేదారు ఎల్అండ్ టీ సంస్థ నీటిపారుదల శాఖకు ఈ నెల 1న లేఖ రాసింది.
ముఖ్యాంశాలు :
- ప్రభుత్వానికి గుత్తేదారు ఎల్ అండ్ టీ లేఖ..
- తనిఖీచేసి నిర్ధారించాలని సూచన..
- డ్యాం యజమాని నీటిపారుదల శాఖే..
- మా నిర్వహణ గడువు 2022లోనే ముగిసింది..
- కొత్తగా ఒప్పందం చేసుకుంటేనే పనులు..
- లేఖలో స్పష్టీకరణ..
- చర్చనీయాంశమైన పరిణామాలు..
మేడిగడ్డలోని ఏడో బ్లాకును..
మేడిగడ్డలోని ఏడో బ్లాకును పరీక్షించి దానితో పాటు మొత్తం బ్యారేజీ వచ్చే వర్షాకాలం వరదకు తట్టుకోగలదా? సురక్షితమేనా? అనేది నిర్ధారించుకోవాలని గుత్తేదారు ఎల్అండ్ సంస్థ నీటిపారుదల శాఖకు ఈ నెల 1న లేఖ రాసింది. ఆ శాఖ ప్రతిపాదించినట్లుగా కాఫర్ డ్యాం నిర్మాణం బ్యారేజీకి భద్రత కల్పించగలదని భావిస్తే.. తాము అందజేసిన అంచనాకు ప్రభుత్వం (ఖర్చును భరించడం) ఆమోదం తెలిపితే కాఫర్ డ్యాం నిర్మాణం చేపడతామని పేర్కొంది. దీనిని బట్టి వచ్చే వర్షాకాలం వరదలో బ్యారేజీ మొత్తానికి నష్టం జరిగినా బాధ్యత తమది కాదని ఆ సంస్థ చెప్పకనే చెప్పిందని నిపుణులు పేర్కొంటున్నారు.
బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగిన తర్వాత పునరుద్ధరణ బాధ్యత మీదంటే మీదని నిర్మాణ సంస్థ, నీటిపారుదలశాఖ పరస్పరం ఆరోపించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 18, 22 తేదీల్లో కాళేశ్వరం ఎత్తిపోతల రామగుండం ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ రాసిన లేఖలకు సమాధానంగా నిర్మాణ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సురేశ్ కుమార్ ఈ లేఖ రాశారు. ఇందులోని ముఖ్యాంశాలు ఇవీ…
మేడిగడ్డ బ్యారేజీ కాఫర్ డ్యాం..
మేడిగడ్డ బ్యారేజీ కాఫర్ డ్యాం నిర్మాణానికి ఎంత వ్యయం అవుతుందో అంచనా వేసి దీంతోపాటు పునరుద్ధరణ పనులకు అదనంగా ఒప్పందం చేసుకోవాలని 2023 నవంబరు 24న లేఖ రాశాం. డిసెంబరు 2న మరో లేఖ రాశాం. కాఫర్ డ్యాంకు అయ్యే వ్యయంపైన, ఇన్వెస్టిగేషన్ పునరుద్ధరణ పనులకు వేరే ఒప్పందం, వర్క్ర్డర్కు సంబంధించి నీటిపారుదలశాఖ నుంచి ఎలాంటి స్పందన లేదు.
కాంట్రాక్టర్ బ్యారేజీ పనిని 2019 జూన్ 21 నాటికి పూర్తిచేశాం. దీనిని ప్రారంభించి ఆపరేషన్లోకి తెచ్చారు. నీటిపారుదలశాఖ 2021 మార్చి 15న పనిపూర్తయినట్లు సర్టిఫికెట్ జారీచేసింది. అందులో 2020 జూన్ 29 నాటికి పని పూర్తయినట్లు పేర్కొంది. 2020 జూన్ 29 నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమై 2022 జూన్ 28కి పూర్తయింది.
అయినప్పటికీ..
అయినప్పటికీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి, నీటిపారుదలశాఖకు అండగా ఉండేందుకు 5 రకాల పనులను ఎల్అండ్ చేసింది. ఏడో బ్లాక్ రాష్ట్రు ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ పరీక్ష చేసే పనిని ఎస్ఈ సూచన మేరకు ముంబయికి చెందిన డైనోసార్ కాంక్రీట్ ట్రీట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఇచ్చాం. ఈ ఏడాది జనవరి 4న ఆ సంస్థ పని ప్రారంభించి 9వ తేదీకి పూర్తి చేసింది. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) పరీక్షను నీటిపారుదలశాఖ సూచనమేరకు పార్సన్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించాం. ఈ పని పురోగతిలో ఉంది. ఏడో బ్లాక్ ఎడమగట్టువైపు అప్రోచ్ రోడ్, దెబ్బతిన్న బ్లాక్ నన్ను వేరు చేసేందుకు నీటి మళ్లింపు పని, డీవాటరింగ్, శుభ్రం చేసే పనులు చేశాం.
బ్యారేజీ డిజైన్ మొత్తం బాధ్యత నీటిపారుదల శాఖదే..
నేషనల్ డ్యాం సేప్టీ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల కమిటీ పరిశీలించి సూచించిన అంశాలకు సంబంధించి మా (ఎల్అండ్) స్పందన ఏటంటే..
- బ్యారేజీ మొత్తం డిజైన్ బాధ్యత నీటిపారుదలశాఖదే. జియలాజికల్, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ఫలితాలను ప్రాజెక్టు డిజైన్, డ్రాయింగులతో కలిపి నీటిపారుదలశాఖ సమీక్షించడం, పరీక్షించడం సరైన చర్య.
- గత అక్టోబరు 21న సంఘటన జరిగినప్పటి నుంచి ఆరు. ఏడు, ఎనిమిది బ్లాక్లను రెగ్యులర్ సర్వే చేస్తున్నాం. గత నవంబరు 28న జరిగిన సమావేశంలో ఈ వివరాలు అందజేశాం. పర్యవేక్షణ రికార్డులను కూడా జత చేస్తున్నాం.
- బ్యారేజీ ఎగువన, దిగువన ఆప్రాన్/ప్లింత్ కనెక్షన్ను కాఫర్యాం పూర్తయిన తర్వాత నీటిపారుదలశాఖ పరిశీలించాల్సి ఉంది. అయినప్పటికీ గ్లాస్ టేల్ మానిటరింగ్ జరుగుతుంది. ఈ వివరాలను ప్రాజెక్టు వద్ద ఇరిగేషన్ అధికారులకు అందజేశాం.
- డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2022 జూన్ 28న పూర్తయినందున రాష్ట్కు ఎంత నష్టం జరిగింది? ఎంతవరకు కదిలింది అన్నది నీటిపారుదలశాఖ అంచనా వేయాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు హైడ్రాలిక్ స్ట్రక్చర్ వైఫల్యం ఎలా ఉందో ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత డ్యాం యజమాని అయిన నీటిపారుదలశాఖ పరిధిలో ఉంది.
- ప్రాజెక్టు పూర్తి చేసి అప్పగించినందున దీని పని, నిర్వహణ తదితర అంశాలన్నీ ఆ శాఖ పరిధిలో ఉన్నాయి. కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకొని నీటిపారుదలశాఖకు అండగా నిలిచేందుకు తగిన కార్యాచరణను ఎల్అండ్ చేపట్టినట్లు పైన చెప్పిన అంశాలను బట్టి స్పష్టమవుతుంది.
- కాఫర్ డ్యాం పనిని వేగవంతం చేయాలని, పునరుద్ధరణ పనుల పూర్తికి వీలుగా జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేయాలని జనవరి 18న, జనవరి 22న ఈఈ, ఎస్ఈ లేఖలు రాశారు. అయితే ఈ పని చేయడానికి అయ్యే వ్యయానికి సంబంధించి మేం ఇచ్చిన అంచనా వ్యయం ప్రతిపాదన ఆమోదానికి ఇంకా ఎదురు చూస్తున్నాం.
- ఈ పనులు వేగవంతం చేయడానికి ప్రత్యేక ఒప్పందం, వర్క్ ఆర్డర్ ఇవ్వాలనిడిసెంబరు 2న రాసిన లేఖలో కోరాం. దీనిని గుర్తుచేస్తూ మీతో పాటు ఈఎన్సీ, ఈఈలకు జనవరి 23న మళ్లీ లేఖలు…
- జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి కాఫర్ డ్యాం ప్రాథమిక అవసరం. దీంతో తాత్కాలిక కాఫర్యాం ఏర్పాటు చేసి ఏడో బ్లాక్ లో జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ ను మేమే పూర్తి చేశాం. ఇతర బ్లాకులలో జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి తాత్కాలిక అప్రోచ్ రోడ్డు పనులు, తాత్కాలిక కాపర్ డ్యాం పనులు పురోగతిలో ఉన్నాయి.
- ఈ ఏడాది జూన్ నుంచి వచ్చే వరదలకు ఏడో బ్లాక్ తోపాటు మొత్తం బ్యారేజీ సురక్షితంగా ఉంటుందా? వరదకు తట్టుకోగలదా? అన్నది డ్యాం యజమానిగా నీటిపారుదలశాఖ పరీక్షించుకొని నిర్ధారించుకోవాలి. నీటిపారుదలశాఖ గత నవంబరు 14న రాసిన లేఖలో ప్రతిపాదించిన కాఫర్ డ్యాం.. బ్యారేజీ భద్రతకు సరిపోతుందని భావిస్తే, మేము ఇచ్చిన ఆర్థిక ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే ఎల్ అండ్ కాఫర్ డ్యాం పనిని చేపడుతుంది.
అంగీకరిస్తే..
అంగీకరిస్తే.. ఇక అన్ని ఖర్చులూ ప్రభుత్వంపైనే! నిర్మాణ సంస్థ బాధ్యత లేదని కాఫర్ డ్యాంకు అయ్యే వ్యయాన్ని నీటిపారుదలశాఖ భరిస్తే, దెబ్బతిన్న ఫియర్స్తో పాటు ఏడో బ్లాక్ పునరుద్ధరణ, ఇంకా ఏమైనా దెబ్బతిని ఉంటే వాటి మరమ్మతులకు అయ్యే వ్యయాన్ని కూడా ప్రభుత్వమే భరించాల్సి వస్తుందని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే.. దెబ్బతిన్న ఏడో బ్లాక్ మరమ్మతుల గురించి తాము లేఖ రాసినా నిర్మాణ సంస్థ చేయలేదని, దీని ప్రకారం డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పొడిగింపులో ఉన్నట్లేనని నీటిపారుదల శాఖ పేర్కొంటుండగా.. బ్యారేజీ యజమాని నీటిపారుదలశాఖేనని, వచ్చే వరదకు మరింత దెబ్బతింటే తాము బాధ్యులం కాదని ఎల్అండ్ స్పష్టం చేసినట్లయింది.
ఏప్రిల్ 28 నాటి లేఖను ప్రస్తావించని ఎల్అండ్ టీ
2022 జూన్ 28తో తమ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తయిందని పేర్కొన్న ఎల్అండ్ సంస్థ, ఏడో బ్లాకులోని 17, 18, 19, 20 వెంట్స్కి దిగువన ఏర్పడిన నీటిబుడగలను వెంటనే ఆపడంతోపాటు చెల్లాచెదురైన సీసీ బ్లాకులను ఓ పద్ధతికి తేవాలని, యుద్ధప్రాతిపదికన ఈ పనులు చేపట్టాలని ఆ ఏడాది ఏప్రిల్ 28న బ్యారేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తమకు రాసిన లేఖ గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించకుండా విస్మరించింది.
తాజాగా ఎల్అండ్ రాసిన లేఖ ప్రకారం కూడా.. ఏడో బ్లాక్ మరమ్మతులపై ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లేఖ రాసిన తేదీ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే ఉంది. ఒప్పందం ప్రకారం 2022లోనే ఏడో బ్లాక్ మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది. సంబంధిత ఇంజినీర్లు కూడా దీనిపై లేఖ రాసి చేతులు దులుపుకొన్నారు. తర్వాత 2023 అక్టోబరులో బ్యారేజీ కుంగి ఫియర్స్ దెబ్బతినగా, ఇప్పుడు మొత్తం బ్యారేజీ భద్రత గురించి నీటిపారుదలశాఖను హెచ్చరిస్తూ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
Can Medigadda barrage withstand the flood? | మేడిగడ్డ బ్యారేజీ.. వరదను తట్టుకోగలదా? 2024
Can Medigadda barrage withstand the flood?
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....
CM Revanth Reddy Tweet About Changing The Name Of TS To TG-2024 | అందుకే TSను TGగా మార్చాం
Can Medigadda barrage withstand the flood? | మేడిగడ్డ బ్యారేజీ.. వరదను తట్టుకోగలదా? 2024
Can Medigadda barrage withstand the flood?
Union Budget 2024 Live Updates | బడ్జెట్ 2024 ప్రధానాంశాలు – LSR Updates
Multibagger Stocks of GG Engineering & Akshar Spintex Ltd-24 (lsrupdates.com)
Stock Market Rally-స్టాక్ మార్కెట్ ర్యాలీ -Jan-2024 (lsrupdates.com)
Stock Market: భారీ నష్టాలతో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు..ఇవే టాప్ 5 స్టాక్స్ – LSR Updates
Paytm shares plunges another 20% to hit lower circuit
Can Medigadda barrage withstand the flood? | మేడిగడ్డ బ్యారేజీ.. వరదను తట్టుకోగలదా? 2024
3 thoughts on “Can Medigadda barrage withstand the flood? | మేడిగడ్డ బ్యారేజీ.. వరదను తట్టుకోగలదా? 2024”